బ్లాక్ కాఫీ వర్సెస్ గ్రీన్ టీ: బరువు తగ్గడానికి ఏది మంచిది? | Health Tips: Black Coffee vs Green Tea: For Diabetes And Weight Loss | Sakshi
Sakshi News home page

బ్లాక్ కాఫీ వర్సెస్ గ్రీన్ టీ: బరువు, షుగర్‌ రెండూ నియంత్రణలో ఉండాలంటే ఏది మంచిది?

Oct 1 2026 3:27 PM | Updated on Oct 1 2026 3:33 PM

Health Tips: Black Coffee vs Green Tea: For Diabetes And Weight Loss

బ్లాక్‌ కాఫీ, గ్రీన్‌ టీ రెండు ఆరోగ్యానికి మంచివే. ఈ రెండింటిని పాలు, క్రీమ్‌ లేదా ఫ్లేవర్డ్‌ సిరప్‌లు, చక్కెర వంటి కలిపి తాగితే ప్రయోజనాలన్నీ శూన్యం అని చెబుతుంటారు నిపుణులు. ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి.. ఈ రెండు కీలకపాత్రే పోషించే పానియాలే. అయితే మధుమేహం, బరువు రెండింటిని నియంత్రణలో ఉంచడానికి ఈ రెండిటిలో ఏది బెస్ట్‌ అని అంటే మాత్రం..!.

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా, కేలరీలు తక్కువగా ఉండే బ్లాక్‌ కాఫీ ఇన్సులిన్‌ పనితీరుని మెరుగుపరిచి, టైప్‌2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మరోవైపు గ్రీన్‌ టీ కాటెచిన్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇది కూడా కొవ్వును తగ్గించి బరువు నిర్వహణకు ఉపయోగపడుతుంది. మరి అలాంటప్పుడు బరువు, షుగర్‌ రెండింటిని తగ్గించడాని ఏది సహాయపడుతుందంటే..

బ్లాక్ కాఫీ వల్ల కలిగే లాభాలు:

కాఫీలోని కెఫీన్ డోపమైన్, నోర్‌పినెఫ్రిన్‌లను పెంచుతుంది. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మానసికంగా చురుగ్గా ఉంటారు.  

దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపుని తగ్గించి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి.

కాఫీలోని కెఫీన్ జీవక్రియ రేటును పెంచుతుంది. దీనివల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. తద్వారా బరువు తగ్గడానికి లేదా నియంత్రణకు సహాయపడుతుంది.

కెఫీన్ అడ్రినలిన్ స్థాయిలను పెంచడం ద్వారా శారీరక పనితీరును, ఓర్పును మెరుగుపరుస్తుంది.

అంతేగాదు కొన్ని పరిశోధనల ప్రకారం.. క్రమం తప్పకుండా కాఫీ తాగడం వల్ల టైప్ 2 మధుమేహం, పార్కిన్సన్స్ వ్యాధి, కాలేయ వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశం ఉంది.

గ్రీన్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు:

గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే ఒక రకమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వాపు తోపాటు మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

ఇది జీవక్రియను పెంచుతుంది, కొవ్వు ఆక్సీకరణను ప్రోత్సహిస్తుందని పరిశోధనల్లో తేలింది. అంటే బరవు తగ్గేందుకు చక్కగా ఉపకరిస్తుందని అర్థం. 

గ్రీన్ టీలోని కెఫీన్, ఎల్-థియానైన్ అనే అమైనో ఆమ్లం డిమెన్షియా బారిన పడకుండా చేసి ఏకాగ్రతను పెంచడమే కాకుండా మానసిక స్థితిని ఉత్తేజంగా ఉంచుతాయి.

ఇది కూడా కొన్ని పరిశోధనల ప్రకారం,  ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరిచి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

గ్రీన్ టీ మొత్తం కొలెస్ట్రాల్‌ తోపాటు ముఖ్యంగా LDL (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో LDL కణాలను ఆక్సీకరణం నుంచి కాపాడుతుంది.

రెండిటిలో ఏది మంచిదంటే..

మధుమేహం కోసం..
షుగర్‌ని తగ్గించడంలో రెండు మంచి పాత్రే పోషిస్తాయని అంటున్నారు నిపుణులు. బ్లాక్‌ కాఫీ తాగితే టైప్‌2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గితే..గ్రీన్‌ టీ వల్ల ఇన్సులిన్‌ పనితీరు మెరుగుపడుతుంది, అలాగే ఇన్సులిన్‌ నిరోధకతను తగ్గిస్తుంది.

బరువు తగ్గడం కోసం
బ్లాక్‌ కాఫీ, గ్రీన్‌ టీ బరువుని తగ్గిచడంలో రెండు సమర్థవంతంగానే ఉంటాయట. బ్లాక్‌ కాఫీ స్వల్పకాలంలో ఆకలిని అణిచివేసి, కేలరీలను గరిష్టంగా దహించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. మరోవైపు గ్రీన్‌ టీ ఉదరంలోని అంతర్గత కొవ్వుని లక్ష్యంగా చేసుకుని కొవ్వు ఆక్సీకరణను మెరుగుపరుస్తుందట. 

ఏది తీసుకోవాలంటే..
వ్యక్తుల ప్రాధాన్యత అనుసరించి.. తీవ్రమైన వ్యాయామాలు చేసే వాళ్ల అయితే తక్షణ శక్తి పెరుగుదల కోసం బ్లాక్‌ కాఫీ తీసుకుంటే మేలని అంటున్నారు నిపుణులు.

అలాకాదు రోజంత తేలికపాటి కొవ్వుని కరిగించేలా.. రక్తంలోని చక్కెర నిర్వహణకు ప్రభావంతంగా ఉండేది కావాలంటే..గ్రీన్‌ టీ ఎంచుకుంటే సరి అని చెబుతున్నారు నిపుణులు. 

చాలామటుకు వ్యక్తిగత ప్రాధాన్యతలు, ఆరోగ్య సమస్యలను అనుసరించి సమతుల్య ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాకలు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

ఇదీ చదవండి:

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement