మహిళల కోసం మాత్రమే ఉద్దేశించిన రాపిడో పింక్ రైడ్ సర్వీస్‌పై ఒక ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ చేసిన విమర్శ వైరల్ అయ్యింది. తన బుకింగ్‌కు మహిళా ప్రయాణికురాలికి బదులుగా ఒక పురుష డ్రైవర్‌ను కేటాయించారని ఆమె ఆరోపించారు.
రాపిడో పింక్' (Rapido Pink) సర్వీస్ అనేది పూర్తిగా మహిళల భద్రత కోసం, మహిళా డ్రైవర్లతో మాత్రమే నడిచే సర్వీస్. అయితే ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ శాలిని చతుర్వేది చేసిన విమర్శ వైరల్ అయ్యింది. తన బుకింగ్‌కు మహిళకు బదులుగా పురుష డ్రైవర్‌ను కేటాయించారని ఆమె ఆరోపించడంతో వివాదం ప్రారంభ మైంది. మహిళలకోసం మహిళా కెప్టెన్ అని చెప్పుకుంటూ, మహిళల భద్రతను కేవలం లాభసాటి వ్యాపారంగా మార్చేశారని, ఇదొక జోక్, పింక్ ట్యాక్స్, విలాసవంతమైన ధరలు, అయినా భద్రతకు హామీ లేదు అని ఆమె విమర్శించారు. దీనిపై ర్యాపిడో కూడా స్పందించింది.
ప్రత్యేకంగా పింక్ సర్వీస్‌నే బుక్ చేసుకుంటే రైడ్‌కుపురుష డ్రైవర్ రావడంపై శాలిని చతుర్వేది ప్రశ్నించింది. దీనికి సమాధానంగా అతను "మేడమ్, నేను గే (gay)" అని చెప్పాడు. పైగా యాప్‌లో మహిళ ప్రొఫైల్ ఫోటో ఉండగా, రియల్‌లో పురుషుడు రావడంతో తన సేఫ్టీపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు రైడ్‌ను రద్దు చేయాలని చూసింది. ఇక్కడ ఆమెకు ఇంకో షాక్ తగిలింది. కేవలం రూ. 25 ట్రిప్‌కు రూ. 15 క్యాన్సిలేషన్ ఫీజు చూపించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. చివరికి ఆమె రైడ్‌ను రద్దు చేసి, తనకెదురైన అనుభవాన్ని సోషల్‌మీడియాలో పంచుకున్నారు. అంతేకాదు ఆ డ్రైవర్ కూడాపై అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: మోనాలిసా భోస్లేకు భారీ ఊరట : తండ్రికి మొట్టికాయలు
రాపిడో స్పందన
ఈ పోస్ట్ వైరల్ కావడంతో రాపిడో స్పందించి క్షమాపణలు తెలిపింది. పింక్ రైడ్స్ కేవలం మహిళా డ్రైవర్లనే కేటాయించాలని,ఈ తప్పింది ఇది ఎలా జరిగిందో విచారిస్తామని తెలిపింది. మొదట డ్రైవర్‌కు కేవలం హెచ్చరిక మాత్రమే ఇస్తామని చెప్పినప్పటికీ, క్రియేటర్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ డ్రైవర్ ఐడీని శాశ్వతంగా రద్దు (terminate) చేసినట్లు రాపిడో ధృవీకరించింది.
ఇదీ చదవండి: హెలికాప్టర్ క్రాష్ : ప్రముఖ వ్యాపారవేత్త, భార్య దుర్మరణం
నెటిజన్ల విమర్శలు
ఈ ఘటన రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో భద్రతా తనిఖీలు, నాణ్యతా నియంత్రణ మరియు ప్లాట్‌ఫారమ్ జవాబుదారీతనంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ‘‘నాకు కూడా ఇలాగే జరిగింది, నేను ఒక రైడ్ బుక్ చేస్తే డ్రైవర్ వేరే వాహనంలో వచ్చాడు," అని ఒక వినియోగదారుడు వ్యాఖ్యానిస్తూ, ఈ సమస్యను పరిష్కరించాలని కంపెనీని కోరారు.
ఇదీ చదవండి: మీరట్ బ్లూ డ్రమ్ కేసు : కోర్టు సంచలన తీర్పు


