జైలులో అవే వెంటాడాయి.. కోడలు ఏం చెప్పిందంటే..! | Father In Law Case: Kanpur Woman Reveals What Haunted Her In Jail | Sakshi
Sakshi News home page

జైలులో అవే వెంటాడాయి.. కోడలు ఏం చెప్పిందంటే..!

Sep 29 2026 7:40 PM | Updated on Sep 29 2026 8:05 PM

Father In Law Case: Kanpur Woman Reveals What Haunted Her In Jail

సంచలనం సృష్టించిన కాన్పూర్‌ ప్రముఖ వ్యాపారి వినీత్‌ మనోచా హత్య కేసుఅనూహ్య మలుపు తిరిగింది. మామ హత్య కేలో అరెస్టయిన ప్రధాన సూత్రధారి షాలూ మనోచా.. 21 రోజుల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చారు. అయితే జైలులో గడిపిన రోజుల్లో ఆమెను వెంటాడింది హత్య కేసు కాదు.. తన కుమారుడి జ్ఞాపకాలే. నా బిడ్డ లేకుండా నిద్రపట్టేది కాదు.. ప్రతి క్షణం అతని రూపమే కళ్ల ముందు కనిపించేది” అంటూ షాలు కన్నీటి పర్యంతమయ్యారు.

ఆ 21 రోజులు నా జీవితంలోనే అత్యంత దారుణమైన రోజులు. నేను బతికున్నంత కాలం వాటిని ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు చాలా కష్టమైన సమయం. అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. క్షణాల్లోనే అంతా తలకిందులైంది. నా ఇల్లు, నా కుటుంబం, నా జీవితం.. అంతా నాశనమైంది. ప్రతి క్షణం కుమారుడి గురించే ఆలోచనలు నన్ను వెంటాడేవి. బిడ్డ లేకుండా నాకు నిద్ర పట్టేది కాదు. నా కుమారుడి రూపమే ఎప్పుడూ నా కళ్ల ముందు కనిపించేది” అని ఆమె పేర్కొన్నారు.

60 ఏళ్ల వినీత్‌ను సెప్టెంబర్ 5న కాన్పూర్‌లోని కల్యాణ్‌పూర్ ప్రాంతంలోని రతన్ ఆర్బిట్ అపార్ట్‌మెంట్‌లో కత్తితో పొడిచి హత్య చేశారు  కోడలు షాలూనే ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా తేల్చిన పోలీసులు అమెను అరెస్ట్‌  చేశారు. ఆమెతో పాటు వినీత్‌ దగ్గర గతంలో పని చేసిన విశాల్ గౌతమ్, రాజ్‌కిషోర్‌ను అరెస్ట్‌ చేశారు.

విశాల్‌ వాంగ్మూలంలో మరో కీలక అంశం బయటపడినట్లు పోలీసులు తెలిపారు. తాను పోలీసులకు చిక్కితే సుబ్రత్‌ భార్య షాలూ పేరును చెప్పాలని సుబ్రత్‌ సూచించినట్లు తేలింది. దీంతో ఈ కేసులో షాలూ ప్రమేయం లేదని.. ఆమెను భర్తే ఉద్దేశపూర్వకంగా ఇరికించాడని తేలింది. ఆ నంబర్‌ నుంచి అతను చేసిన తొలి కాల్‌ సుబ్రత్‌కే వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ముందు ఇద్దరి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలను కూడా పోలీసులు పరిశీలించారు. షాలూ భర్త సుబ్రత్‌కు ఆరు ఫోన్ కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సెప్టెంబర్ 23న సుబ్రత్‌ను అరెస్టు చేశారు.

విచారణలో సుబ్రత్ తన తండ్రి పలువురు మహిళలతో సంబంధాలు కలిగి ఉండేవారని.. ఆయన మరో మహిళతో కలిసి ఉండి తన ఆస్తి మొత్తాన్ని ఆమె పేరుపై బదిలీ చేస్తారనే భయంతో హత్యకు కుట్ర పన్నినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ‘‘సుబ్రత్ పాత్ర గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. దాని గురించి చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. పోలీసులు, అధికారులు తమ పని తాము చేస్తున్నారు. న్యాయం జరిగేలా.. నిజం వెలుగులోకి వచ్చేలా వారు చూస్తారు. అంతకుమించి నేను ఎలాంటి వ్యాఖ్య చేయదలుచుకోలేదు’’ అంటూ షాలు చెప్పుకొచ్చారు.

చదవండి: ఇంద్రుడిపైనే కలెక్టర్‌కు ఫిర్యాదు.. ఎందుకంటే?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement