ఉమ్మి వేయాలంటే ఇక్కడికి రండి.. మెట్రోలో షాకింగ్ ఏర్పాట్లు | Mumbai Metro touchless spit bin sparks discussion | Sakshi
Sakshi News home page

ఉమ్మి వేయాలంటే ఇక్కడికి రండి.. మెట్రోలో షాకింగ్ ఏర్పాట్లు

Sep 29 2026 7:52 PM | Updated on Sep 29 2026 7:53 PM

Mumbai Metro touchless spit bin sparks discussion

ముంబై మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక “ఉమ్మి డబ్బా” సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఉమ్మివేయడాన్ని నియంత్రించేందుకు ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. దీన్ని కొందరు ప్రయాణికులు ఆచరణాత్మక పరిష్కారం అంటూ స్వాగతించగా, మరికొందరు ఉమ్మివేయడాన్నే అరికట్టాలని అభిప్రాయపడ్డారు.
 
సామాజిక మాధ్యమ యూజర్‌ జోరు భాథేనా ఈ ఫొటోను పంచుకోవడంతో అది వైరల్ అయింది. మహా ముంబై మెట్రో నిర్వహిస్తున్న ఓ స్టేషన్‌లో టచ్‌ చేయడం అవసరం లేని ఉమ్మి డబ్బా కనిపించింది. దాని పైన ముంబై మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ, మహా ముంబై మెట్రో గుర్తులు ఉన్నాయి. “బాధ్యతగా వ్యవహరించండి” అని సూచిస్తూ, ఈ సౌకర్యాన్ని “ప్రపంచంలోనే తొలి నిర్దిష్ట ఉమ్మివేత ప్రదేశం”గా పేర్కొన్నారు. దీనిపై సూచనలు మరాఠీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉన్నాయి.  

ఈ చిత్రంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఇలాంటి సౌకర్యం అవసరమా? అని ప్రశ్నించగా, మరికొందరు కొందరిలో ఉండే ఒక రకమైన ప్రవర్తనకు సంబంధించిన సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా ఉపయోగపడొచ్చని అన్నారు. “భారత్‌కు ఆధునిక సమస్యలు ఉన్నాయి, అందుకే ఉమ్మివేయడానికి తొలి నిర్దిష్ట ప్రదేశం” అని ఓ యూజర్‌ వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి బహిరంగంగా ఉమ్మివేయడం వంటి అలవాటే ఉండకూడదని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు దీర్ఘకాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ప్రధాన అంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement