న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రతినిధి : భార్య టార్చర్‌, అత్తమామలు చంపేశారు | New York Times Tech Executive Jonathan McKinsey Shot Dead In California, Elderly In-Laws Arrested, Watch Video Inside | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రతినిధి : భార్య టార్చర్‌, అత్తమామలు చంపేశారు

Sep 29 2026 1:16 PM | Updated on Sep 29 2026 2:31 PM

NY Times Executive Beaten By Wife assassinated By In-Laws Over Trans Identity

న్యూయార్క్ టైమ్స్ (The New York Times) టెక్ ఎగ్జిక్యూటివ్  40 ఏళ్ల  జొనాథన్ మెక్‌కిన్సే (Jonathan McKinsey) దారుణ హత్య కలకలం రేపింది. కాలిఫోర్నియాలోని ఒక స్పోర్ట్స్ పార్క్‌లో తన వృద్ధ అత్తమామల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. న్యూయార్క్ టైమ్స్ సంస్థలో గేమర్ ఎక్స్‌పీరియన్స్ హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్‌గా పనిచేస్తున్న మెక్‌కిన్సే, తాను ట్రాన్స్‌జెండర్ కావడంతో భార్యనుండి విడిపోయారు. ఇదే భార్య , అత్తమామలతో తీవ్రమైన వివాదానికి తీసినట్టు తెలుస్తోంది.

కాలిఫోర్నియాలోని డబ్లిన్ స్పోర్ట్స్ గ్రౌండ్స్ పార్కింగ్ స్థలంలో జరిగిన ఈ హత్యకు సంబంధించి పోలీసులు  జొనాథన్‌ అత్తమామలైన 76 ఏళ్ల షౌయాంగ్ జాంగ్ (Shouyong Zhang), షిలి చెన్ (Shili Chen) లను అరెస్టు చేశారు. ఆ దంపతులు  ఒకరి తరువాత అతనిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత ప్రశాంతంగా అక్కడి నుండి వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.అయితే ఈ హత్య వెనుక అసలు ఉద్దేశం ఏమిటనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు.జాంగ్  చెన్ బుధవారం కోర్టులో హాజరుకానున్నారు, అక్కడ వారిపై ఉన్న ఆరోపణలను అధికారికంగా ప్రస్తావించే అవకాశం ఉంది.

2023 నుండి ఈ వార్తాపత్రికలో పనిచేస్తున్న మెక్‌కిన్సే శనివారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో మరణించినట్లు టైమ్స్ ప్రతినిధి ధృవీకరించారు. అతని లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. మెక్‌కిన్సే దాదాపు రెండు దశాబ్దాల టెక్ కెరీర్‌ను కలిగి ఉన్నారు. స్ప్లంగ్ (Splunk), కోర్సెరా (Coursera), ఒరాకిల్ (Oracle) వంటి అనేక ప్రముఖ టెక్ కంపెనీలలో ఆయన పనిచేశారు.

ఇదీ చదవండి: యూనివర్శిటీ విద్యార్థిని మృతి, లవ్‌ జిహాద్‌ ఆరోపణలు కలకలం

 

కోర్టు రికార్డులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం, జొనాథన్ అతని భార్య కాండిస్ జాంగ్ (Candice Jang) వేర్వేరుగా నివసిస్తున్నారు. గత ఏడాది అలమెడా కౌంటీలో ఇద్దరూ ఒకరిపై ఒకరు గృహహింస నిరోధక ఉత్తర్వుల (restraining orders) కోసం దరఖాస్తు చేసుకున్నారు.

మెక్‌కిన్సే దాఖలు చేసిన రికార్డుల ప్రకారం.. తన ట్రాన్స్ గుర్తింపు కారణంగా భార్య, అత్తమామలు తనను వేధించారని ఆయన ఆరోపించారు. పిల్లల దుస్తుల ఎంపికను బట్టి తన అత్తగారు తనను, తన కుమారులలో ఒకరిని LGBTQ అనీ, రాక్షసుడు అని పిలిచారని ఆయన పేర్కొన్నారు. అలాగే 2010లో తాను డబుల్ మాస్టెక్టమీ (రొమ్ము తొలగింపు) శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్న సమయంలో తన మామగారు తన ఛాతిపై పిడికిలితో గుద్దారని  కూడా ఆరోపించారు. భార్యకూడా తనతో హింసాత్మకంగా ప్రవర్తించేదని చెప్పారు.

2010లో మెకిన్సీ స్త్రీ నుండి పురుషుడిగా మారాడు.  2011లో  జాంగ్‌ను వివాహం చేసుకున్నారు. 2013లో జరిగిన మరో గొడవలో తన భార్య తనను ఫ్రైయింగ్ పాన్‌తో కొట్టిందని ఆయన ఆరోపించారు. పిల్లల్ని కూడా జాంగ్ మాటలతో వేధించేవారని కూడా మెక్‌కిన్సే ఆరోపించారు.

మరోవైపు, 2025 అక్టోబర్‌లో జాంగ్ దాఖలు చేసిన పిటిషన్‌లో.. ఒక వాదన సందర్భంగా తన భర్త తన ముంజేతులను పట్టుకుని టేబుల్ మూలకు నెట్టడంతో తన పై వీపులో వెన్నుపూస విరిగిపోయిందని ఆరోపించారు. అలాగే మెక్‌కిన్సే తన తల్లిని మానసికంగా వేధించారని కూడా  పేర్కొంది. దీంతో 2025లో మెక్‌కిన్సేపై రెండు నేరపూరిత బాలల వేధింపుల కేసులు నమోదయ్యాయి. తన ఆరేళ్ల కొడుకు ముఖంపై ఆయన చేతితో కొట్టాడని, 2018లో జరిగిన గొడవలో ఆమె చేతికి గాయాలు చేశాడని కూడా ఆమె ఆరోపించారు. మెక్‌కిన్సే ఈ నేరాలపై నిర్దోషి అని వాదించారని, పేరెంటింగ్ క్లాసులకు హాజరవ్వాలనే షరతుపై ఆయన జైలు నుండి విడుదలైనట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
 

ఇదీ చదవండి: రూ. 336 కోట్ల స్కామ్‌ : భారతీయుడికి 11 ఏళ్ల శిక్ష

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement