కర్ణాటక: ప్రేమించాలని వేధించడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సూళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. సూళగిరి తాలూకా ఏనుసోణ సమీపంలోని ఎం.దొడ్డి గ్రామానికి చెందిన వీరేంద్రన్ కూతురు పవిత్ర (17) సూళగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్టూ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన నితీష్ కుమార్, శ్రీధర్ బాలిక వెంటపడి ప్రేమించాలని ఒత్తిడి చేశారు.
ఇటీవల పవిత్ర ఇంటి వద్దకు వెళ్లిన నితీష్ కుమార్.. రహస్యంగా మాట్లాడాలని ఒత్తిడి చేశాడు. విషయాన్ని పసిగట్టిన పవిత్ర తల్లి బయటకు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన పవిత్ర ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు చికిత్స కోసం సూళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది.
గమనిక..
మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com
ఇదీ చదవండి: ఏనుగు ఎంత పని చేసిందీ..


