జల ప్రాజెక్టులకు అనుమతివ్వండి | - | Sakshi
Sakshi News home page

జల ప్రాజెక్టులకు అనుమతివ్వండి

Sep 29 2026 7:18 AM | Updated on Sep 29 2026 7:18 AM

బనశంకరి: ప్రపంచంలో బెంగళూరు శరవేగంగా పురోగమిస్తోంది, నగరంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి పథకాల కోసం అనుమతులు, రక్షణశాఖ భూమి కేటాయింపులను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం డీకే.శివకుమార్‌, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి బెంగళూరు అభివృద్ధికి పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు మోక్షం కల్పించాలని కోరారు.

ఆ 730 ఎకరాలూ ఇస్తారా?

● రక్షణ శాఖ భూముల విషయంలో సహకారానికి ధన్యవాదాలని రక్షణమంత్రికి సీఎం తెలిపారు.

● బెంగళూరులో కనెక్టివిటీ వ్యవస్థ, ట్రాఫిక్‌ నిర్వహణ, నగరావృద్ధిపై 7 డిమాండ్లను ప్రస్తావించారు. ఇబ్బలూరు ఫైరింగ్‌ రేంజ్‌ వద్ద సుమారు 730 ఎకరాల రక్షణశాఖ భూమి నిరుపయోగంగా ఉంది, ఈ స్థలంలో తమ ప్రభుత్వం ఉద్యానవనం, గ్రీన్‌ జోన్‌గా అభివృద్ధి చేయడానికి ప్లాన్‌ రూపొందించినట్లు సీఎం వివరించారు. ఆ స్థలంపై యాజమాన్యం కోరడం లేదని, వినియోగానికి అనుమతి ఇవ్వాలని తెలిపారు.

● బెంగళూరులో రక్షణశాఖ స్థలాల్లో 10 మురికివాడలు ఉన్నాయని, ఈ అంశంపై పరస్పర సమ్మతి మేరకు పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

● విమానాశ్రయాల వద్ద కట్టడాల నిర్మాణాలపై ఉన్న నిబంధనలను సడలించాలని కోరారు. హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయ అధికారులు విధిస్తున్న ఆంక్షలు చుట్టుపక్కల ప్రదేశాల అభివృద్ధికి అడ్డంకిగా మారిందని సీఎం ఫిర్యాదు చేశారు. దీంతో నగరాభివృద్ధి, రహదారి పథకాలకు ఆటంకంగా ఉందన్నారు.

● అగర–సర్జాపుర రోడ్డు విస్తరణ, ఉత్తర బెంగళూరు ట్రాఫిక్‌ రద్దీ నివారణకు సొరంగమార్గం, లింక్‌రోడ్డు నిర్మాణానికి సాయంతో పాటు అనుమతులు ఇవ్వాలని తెలిపారు.

● మేక్రీ సర్కిల్‌ రోడ్డు విస్తరణకు రక్షణ శాఖ భూమిని అప్పగించాలని మనవిచేశారు.

అన్ని ప్రాంతాలకూ ప్రగతి విస్తరణ

శివాజీనగర: ఇటీవలి సంవత్సరాలలో కేవలం బెంగళూరులోనే అభివృద్ధి జరుగుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి రాజధానికే పరిమితం కాకుండా కర్ణాటకలోని ప్రతి మూలకూ చేరాలనే ఆకాంక్షతో ‘బియాండ్‌ బెంగళూరు’ ద్వారా కొత్త పెట్టుబడులు, ఉపాధి, ఆర్థిక అవకాశాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కోస్తా, మలెనాడులో పర్యాటకాన్ని పునరుజ్జీవింపజేస్తున్నారని, కల్బుర్గి, బెళగావి, హుబ్లీ– ధార్వాడ, మంగళూరు, మైసూరులలో ప్రపంచ టెక్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.

భూములు, అనుమతులు ఇవ్వండి

కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం డీకే వినతులు

పలు అభివృద్ధి పథకాలపై చర్చ

బనశంకరి: పెండింగ్‌లో ఉన్న కర్ణాటక తాగు, సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత మేరకు పరిశీలించి పరిష్కరించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌.పాటిల్‌కు సీఎం డీకే విన్నవించారు. ఢిల్లీలో ఆయనను కలిసి సాగునీటి, తాగునీరు పథకాలపై చర్చించారు. రూ.16,745 కోట్ల వ్యయంతో మేకెదాటు జలాశయం నిర్మాణానికి సర్వే, ఆమోదం త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. కేడబ్ల్యూడీటీ –2 తీర్పును గెజిట్‌లో ప్రకటించాలని తద్వారా కర్ణాటక తన వాటా కావేరి జలాల వినియోగం, ప్రాజెక్టులను కొనసాగించడానికి అవకాశమివ్వాలి. 2023–24 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించినట్లుగా అప్పర్‌ భద్రా ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని, కర్ణాటక అందజేసిన ప్రాజెక్టులు, జల వనరుల సౌకర్యాల ప్రతిపాదనలను త్వరగా ఆమోదించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కృష్ణా, కావేరి జలాశయాల్లో న్యాయమైన వాటాలు ధృవీకరించాలన్నారు. గోదావరి, కావేరి నది అనుసంధానం, బేడ్తి–వరద (హిరేవడట్టి) నది అనుసంధాన పథకంలో కర్ణాటకకు సమానంగా నీటి పంపకం జరగాలని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement