కేపీఎస్‌సీ స్కాంలో డైరీ లభ్యం | - | Sakshi
Sakshi News home page

కేపీఎస్‌సీ స్కాంలో డైరీ లభ్యం

Sep 29 2026 7:18 AM | Updated on Sep 29 2026 7:18 AM

బనశంకరి: కేపీఎస్‌సీ పశువైద్యాధికారుల ఉద్యోగాల కుంభకోణంలో ఈడీ అధికారులు దళారీ బసవరాజ్‌ కన్నాళే డైరీలో డబ్బు వివరాలను కనుగొన్నారు. పరీక్షార్థులతో డబ్బు లావాదేవీలను కన్నాళే డైరీలో రాసిపెట్టాడు. కొందరు అభ్యర్థుల పేర్లు, పక్కనే డబ్బు వివరాలు స్పష్టంగా ఉన్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. డైరీలో ఒకపేజీలో 8 మంది అభ్యర్థుల నుంచి రావలసిన బాకీ సంగతులున్నాయి. మంజునాథ్‌ నుంచి రూ.10 లక్షలు, పూజా– రూ.10 లక్షలు, అశ్వినికుమార్‌– రూ.10 లక్షలు, మోహన్‌కుమార్‌– రూ.5 లక్షలు, సంగమేశ్‌– రూ.10 లక్షలు, పద్మావతి– రూ.10 లక్షలు, హరీశ్‌– రూ.10 లక్షలు బాకీ ఉన్నారని రాసుకున్నాడు. దీంతో పాటు బ్యాంకు అకౌంట్‌ నంబర్లు, నగదు మొత్తం, జలవనరుల శాఖ అని రాసినట్లు డైరీలో ఉంది. 20 మందికిపైగా అభ్యర్థులకు ప్రశ్నాపత్రం ఇచ్చి బాగా రాయడానికి సాధనకు మూడు విల్లాలను బుక్‌ చేసినట్లు తేలింది. డైరీలో రాసిన పరీక్షార్థులను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది.

ఉత్తీర్ణ అభ్యర్థుల ధర్నా

మరోవైపు తాము కష్టపడి చదువుకుని పశువైద్యాధికారుల పోస్టుల పరీక్షలు రాశామని, ఉత్తమ మార్కులతో ఎంపికయ్యామని కొందరు అభ్యర్థులు సోమవారం బెంగళూరు స్వతంత్ర పార్కులో ధర్నా చేశారు. తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కుంభకోణం జరిగిందని ఏకంగా పరీక్షనే రద్దు చేసి తమ పొట్ట కొట్టవద్దని వాపోయారు.

వివరాలు రాసుకున్న బ్రోకరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement