నటి దిశా పటానీ సోదరి మాజీ సైనికాధికారిణి ఖుష్బూ పటానీ భదత్ర విషయంలో మరింత ఆత్మవిశ్వాసంగా ఉండాలంటే ఇలా చేయండి అంటూ అమ్మాయిలకు ఆసక్తికర సూచనలందించింది. మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలో నేర్చుకోమని అమ్మాయిల కోరుతూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోని పంచుకుంది. ఆ వీడియోలో ఆత్మరక్షణ కోసం ఎయిర్‌పిస్టల్‌ను ఉపయోగించడం గురించి సంభాషించింది.
ఎయిర్‌పిస్టల్ గన్‌పౌడర్ లేదా సాంప్రదాయ కార్ట్రిడ్జ్‌కు బదులుగా ఒక గుళికను నెట్టడానికి CO₂ను ఉపయోగించే ఎయిర్ పిస్టల్‌ని కొనుగోలు చేయమని సూచిస్తోంది. తొలిసారిగా కొనాలనుకునే అమ్మాయిలు ముందుగా దీన్ని ఎలా వాడాలో నేర్చుకోవాలని కోరింది. అంతేగాదు దాని ధర ఎంత ఉంటుందో కూడా పంచుకుంది. ఎరిపైన ఆధారపడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకునే యోధుల్లా ఉండమని చెబుతోంది. సమీపంలో ఉన్న షూటింగ్ రేంజ్‌లో శిక్షణ తీసుకుని మరి ఎయిర్‌పిస్టల్‌ని ఉపయోగించమని కోరుతోంది.
దీని ధర వచ్చేసి రూ. 60 వేల నుంచి రూ. 70 వేల మధ్యలో ఉంటుందని తెలిపింది. అలాగే ఈ ఎయిర్ పిస్టల్‌ని కొనుగోలు చేసే ముందుకు ప్రజలు కొన్ని విషయాలు గుర్తించుకోవాలంటూ తొమ్మిది నియమాలను వివరించింది. దీన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొద్దని, బదులుగా స్థానికి జిల్లా డీలర్‌ని సందర్శించమని సూచించింది. సౌకర్యవంతంగా పట్టుకోగలిగే మోడల్‌ని ఎంచుకోమని కోరింది. ముఖ్యంగా దాని బరువు అత్యంత కీలకమైన అంశం అని అంటోంది. అది నిజమైనది కాకపోయినా..డీలర్ల వావద్ద అనేక రకాల CO₂ ఎయిర్ పిస్టల్స్ ఉంటాయి.
దీన్ని ఆత్మరక్షణ అనే బాధ్యతాయుతమైన విభాగానికే ఉపయోగించాలని నొక్కి చెప్పింది. దీన్ని అత్యంత వివేకంతో బాధ్యతయుతంగా ఉపయోగించాలని కోరింది. ఈ 177 ఎయిర్ పిస్టల్ గ్లాక్ 17 జెన్ 4 అనేది కేవలం విద్యాప్రయోజనాల కోసం మాత్రమేనని హెచ్చిరిస్తోంది. ప్రజలు తమ బడ్జెట్‌కి అనుగుణంగా ఈ ఎయిర్‌పిస్టల్‌ని ఎంచుకోవాలని చెప్పింది. అలాగే ఆర్టికల్ 21ని ప్రస్తావస్తూ..జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛల రక్షణకు సంబంధించిన హక్కు గురించి మాట్లాడింది.
కాబట్టి దీన్ని "చావో బ్రతుకో తేల్చుకోవాల్సిన పరిస్థితి"లోనే వాడాలని నొక్కి చెప్పింది. అలాగే అమ్మాయిలను ఎల్లప్పుడూ తమను తాము బలహీనులుగా భావించుకోవద్దని, కాలం తోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే విషయం గుర్తురెగాలని అంటోంది. చివరగా కేవలం ఆత్మరక్షణ కోసం, అలాగే బాధ్యతాయుతంగా ఉపయోగించాలని వక్కాణిస్తూ తన సంభాషణను ముగించింది.
ఇదీ చదవండి: గుండెను అరగంట పాటు ఆపి.. పది గంటల పాటు శస్త్ర చికిత్స!


