breaking news
Khushboo Patani
-
అమ్మాయిలూ.. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం నేర్చుకోండి..!
నటి దిశా పటానీ సోదరి మాజీ సైనికాధికారిణి ఖుష్బూ పటానీ భదత్ర విషయంలో మరింత ఆత్మవిశ్వాసంగా ఉండాలంటే ఇలా చేయండి అంటూ అమ్మాయిలకు ఆసక్తికర సూచనలందించింది. మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలో నేర్చుకోమని అమ్మాయిల కోరుతూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోని పంచుకుంది. ఆ వీడియోలో ఆత్మరక్షణ కోసం ఎయిర్పిస్టల్ను ఉపయోగించడం గురించి సంభాషించింది. ఎయిర్‌పిస్టల్ గన్‌పౌడర్ లేదా సాంప్రదాయ కార్ట్రిడ్జ్కు బదులుగా ఒక గుళికను నెట్టడానికి CO₂ను ఉపయోగించే ఎయిర్ పిస్టల్ని కొనుగోలు చేయమని సూచిస్తోంది. తొలిసారిగా కొనాలనుకునే అమ్మాయిలు ముందుగా దీన్ని ఎలా వాడాలో నేర్చుకోవాలని కోరింది. అంతేగాదు దాని ధర ఎంత ఉంటుందో కూడా పంచుకుంది. ఎరిపైన ఆధారపడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకునే యోధుల్లా ఉండమని చెబుతోంది. సమీపంలో ఉన్న షూటింగ్ రేంజ్లో శిక్షణ తీసుకుని మరి ఎయిర్పిస్టల్ని ఉపయోగించమని కోరుతోంది. దీని ధర వచ్చేసి రూ. 60 వేల నుంచి రూ. 70 వేల మధ్యలో ఉంటుందని తెలిపింది. అలాగే ఈ ఎయిర్ పిస్టల్ని కొనుగోలు చేసే ముందుకు ప్రజలు కొన్ని విషయాలు గుర్తించుకోవాలంటూ తొమ్మిది నియమాలను వివరించింది. దీన్ని ఆన్లైన్లో కొనుగోలు చేయొద్దని, బదులుగా స్థానికి జిల్లా డీలర్‌ని సందర్శించమని సూచించింది. సౌకర్యవంతంగా పట్టుకోగలిగే మోడల్ని ఎంచుకోమని కోరింది. ముఖ్యంగా దాని బరువు అత్యంత కీలకమైన అంశం అని అంటోంది. అది నిజమైనది కాకపోయినా..డీలర్ల వావద్ద అనేక రకాల CO₂ ఎయిర్ పిస్టల్స్ ఉంటాయి. దీన్ని ఆత్మరక్షణ అనే బాధ్యతాయుతమైన విభాగానికే ఉపయోగించాలని నొక్కి చెప్పింది. దీన్ని అత్యంత వివేకంతో బాధ్యతయుతంగా ఉపయోగించాలని కోరింది. ఈ 177 ఎయిర్ పిస్టల్ గ్లాక్ 17 జెన్ 4 అనేది కేవలం విద్యాప్రయోజనాల కోసం మాత్రమేనని హెచ్చిరిస్తోంది. ప్రజలు తమ బడ్జెట్‌కి అనుగుణంగా ఈ ఎయిర్పిస్టల్ని ఎంచుకోవాలని చెప్పింది. అలాగే ఆర్టికల్ 21ని ప్రస్తావస్తూ..జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛల రక్షణకు సంబంధించిన హక్కు గురించి మాట్లాడింది. కాబట్టి దీన్ని "చావో బ్రతుకో తేల్చుకోవాల్సిన పరిస్థితి"లోనే వాడాలని నొక్కి చెప్పింది. అలాగే అమ్మాయిలను ఎల్లప్పుడూ తమను తాము బలహీనులుగా భావించుకోవద్దని, కాలం తోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే విషయం గుర్తురెగాలని అంటోంది. చివరగా కేవలం ఆత్మరక్షణ కోసం, అలాగే బాధ్యతాయుతంగా ఉపయోగించాలని వక్కాణిస్తూ తన సంభాషణను ముగించింది. View this post on Instagram A post shared by Major Khushboo Patani (@khushboo_patani) ఇదీ చదవండి: గుండెను అరగంట పాటు ఆపి.. పది గంటల పాటు శస్త్ర చికిత్స! -
కేబుల్ వైర్ చాలు ముఖం పచ్చడే... ఖుష్బూ స్ట్రాంగ్ రిప్లై
బరేలీలోని తన కుటుంబ నివాసం వెలుపల జరిగిన దిగ్భ్రాంతికరమైన కాల్పుల సంఘటన తర్వాత కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న, రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మేజర్ కుమార్తె, బాలీవుడ్ నటి దిశా పటానీ(Disha Patani) సోదరి ఖుష్బూ పటానీ వీటికి తనదైన శైలిలో బలంగా బదులిచ్చారు. తన ఇన్ స్ట్రాగామ్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియోలో ఆమె తనను తాను రక్షించుకోవడానికి కేవలం ఒక డేటా కేబుల్ వంటి సాధారణ రోజువారీ వస్తువు కూడా సరిపోతుందంటూ తనను చంపుతామని బెదిరిస్తూన్న వర్గాలకు ఆమె పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. మహిళలు ప్రమాద క్షణాల్లో తమను తాము రక్షించుకోవడానికి ఇంట్లోని సాధారణ వస్తువులనే ఎలా సృజనాత్మకంగా ఉపయోగించవచ్చో ఖుష్బూ ఈ వీడియోలో వివరంగా ప్రదర్శించింది. బెదిరింపు పరిస్థితులలో ప్రతిస్పందించడానికి ఎల్లప్పుడూ ఆయుధాలు లేదా యుద్ధ కళల్లో శిక్షణ వంటివి అవసరం లేదని ఈ వీడియోలో ఆమె హైలైట్ చేస్తుంది. బదులుగా, కొంత సమయస్ఫూర్తి, తెగింపు, చురుకుగా ప్రతిస్పందించడం వంటివి సరిపోతాయంటూ ఆమె సాటి మహిళలకు సందేశాన్ని అందించింది. ఒక డేటా కేబుల్ వైర్‌ను దానిలో పొదిగిన కొన్ని ఇనుప వస్తువులను ఆమె ఒక బలమైన ఆయుధంగా మార్చింది. ఆ వైర్ చూడడానికి సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ ఆత్మరక్షణ సమయంలో ఎదుటి వ్యక్తి ముఖం పగలగొట్టడానికి సరిగ్గా సరిపోతుందని ఆమె స్పష్టం చేసింది. కాల్పుల అనంతరం ధైర్యంగా స్పందిస్తూ, ఖుష్బూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, తెగువను ప్రశంసించారు. ఆమె ఫాలోయర్స్ ఆమెను ఒక ఆధునిక యోథురాలుగా కొనియాడారు. ‘‘మేము ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాం మేడమ్’’ అంటూ మరికొందరు ప్రోత్సహించారు. ‘‘మేడమ్, మీరు అద్భుతంగా స్పందించారు. ఈ పరిస్థితుల్లో ఇలా బలంగా ఉండటానికి ధైర్యంతో పాటు సంకల్ప శక్తి అవసరం’’ అంటూ కొందరు ఆమెను పొగిడారు. ‘‘నిజంగా మేడమ్, మీరు మాకు చాలా స్ఫూర్తినిస్తున్నారు’’అంటూ మరికొందరు యువతులు ఆమెను కొనియాడారు. కొందరు ఆమె క్షేమంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సహజంగానే కొందరు మాత్రం ఆమెను రకరకాలుగా హేళన చేస్తూ ట్రోల్ చేశారు.మొత్తం మీద ఈ ఉదంతం ఇప్పటిదాకా ఎవరికీ పెద్దగా తెలియని ఒక ప్రముఖ నటి సోదరిగా మాత్రమే గుర్తింపు పొందిన ఒక సాధారణ యువతిని సెలబ్రిటీగామార్చేసింది.బాలీవుడ్‌ని కుదిపేసిన ఈ కలకలానికి మూలం శుక్రవారం ఉదయం, బరేలీలోని సివిల్ లైన్‌లోని విల్లా నంబర్ 40 వెలుపల మోటారుబైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులుతో మొదలైంది, అక్కడ పఠానీ కుటుంబం నివసిస్తుంది. ఈ కాల్పులకు కారణం తామేనని ఓ అతివాద వర్గం ప్రకటించుకోవడంతో పాటు ఇకపై తమ మనోభావాలు దెబ్బతీస్తే పఠానీ కుటుంబంతో పాటు ఎవరినీ ఉపేక్షించమని హెచ్చరికలు జారీ చేసింది. View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) -
అందానికి మించి అద్భుతమైన మనసు, ఎవరీ సాహసి! (ఫోటోలు)
-
సైన్యంలోనే కాదు ఇక్కడా హీరోనే.. అక్కపై హీరోయిన్ ప్రశంసలు
పాడుబడ్డ ఇంట్లో చంటిపాప ఏడుపు.. ఆకలిదప్పికలతో ఎంతసేపటినుంచి అలమటిస్తుందో.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) అక్క ఖుష్బూకు ఆమె ఆకలికేకలు, ఆర్తనాదాలు వినిపించాయి. వెంటనే సగానికి పైగా కూలిపోయి ఉన్న ఇంట్లోకి వెళ్లి చూసింది. అక్కడ ఓ చిన్నారి ఒంటరిగా కనిపించింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. ఆకలేస్తే మట్టి తిన్నదో ఏమో.. ముఖమంతా మట్టికొట్టుకుపోయి ఉంది. చిన్నారిని కాపాడిన మేజర్ఆ చిన్నారిని ఖుష్బూ (Major Khushbu Patani) జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి అధికారులకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన జరిగింది. ఇది జరిగిన మరుసటి రోజు ఖుష్బూ.. ఆస్పత్రికి వెళ్లి చిన్నారి పరిస్థితిని సమీక్షించారు. పాపను ఎత్తుకుని ఆడించారు. అలాగే ఓ శుభవార్త కూడా చెప్పారు. పోలీసులు.. ఆ చిన్నారి పేరెంట్స్‌ను కనుగొన్నారని వెల్లడించారు. పేరెంట్స్ చెంతకు పాపఅయితే ఎవరో దుండగులు పాపను కిడ్నాప్ చేశారని, వాళ్లే ఇలా వదిలేసి పోయారని వివరణ ఇచ్చారు. ఇకపై పాపను మిస్ అవుతానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు మీరు చాలా గ్రేట్, పాపను పేరెంట్స్ చెంతకు చేర్చారు అని కామెంట్లు చేస్తున్నారు. ఖుష్బూ సోదరి సైతం.. అక్కా, నువ్వు నిజమైన హీరో అని కామెంట్ చేసింది.అక్క మేజర్, చెల్లెలు హీరోయిన్ఖుష్బూ గతంలో ఇండియన్ ఆర్మీలో పని చేశారు. మేజర్‌గానూ సేవలందించారు. సైన్యంలో తన సేవలకు రిటైర్మైంట్ ప్రకటించిన ఆమె ప్రస్తుతం ఫిట్నెస్ కోచ్‌గా పని చేస్తున్నారు. ఖుష్బూ చెల్లెలు దిశా పటానీ విషయానికి వస్తే.. ఈమె 'లోఫర్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. గతేడాది వచ్చిన ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీలోనూ యాక్ట్ చేసింది. 'ఎంఎస్ ధోని: ద అన్‌టోల్డ్ స్టోరీ', 'ఏక్ విలన్ రిటర్న్స్', 'భాగీ 2', 'భరత్', 'మలంగ్', 'రాధే', 'యోధ' సినిమాలతో పాపులర్ అయింది. ప్రస్తుతం 'వెల్కమ్ టు ద జంగిల్' మూవీలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani)చదవండి: మమ్మల్నే కాదు, మా అమ్మను కూడా.. చాలా డిస్టర్బ్ అయ్యా: విష్ణుప్రియ -
పాడుబడ్డ ఇంట్లో అనాథగా చిన్నారి.. కాపాడిన హీరోయిన్ సోదరి
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) సోదరి ఖుష్బూ (Khushboo Patani) ఆర్మీలో మేజర్‌గా సేవలందించారు. 12 ఏళ్లపాటు దేశానికి సేవ చేసిన ఆమె రెండేళ్ల క్రితం స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఫిట్నెస్ కోచ్‌గా పని చేస్తున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో జనాల హృదయాలను కదిలిస్తోంది.పాడుబడ్డ ఇంట్లో చిన్నారిఉత్తరప్రదేశ్ బరేలీలో నివసిస్తున్న ఖుష్బూ.. ఆదివారం ఉదయం అలా బయటకు నడుచుకుంటూ వెళ్లారు. పాడుబడ్డ ఇంట్లో ఏవో శబ్దాలు వినిపించడంతో లోనికి వెళ్లి చూడగా అక్కడ ఓ చిన్నారి కనిపించింది. నేలపై ఒళ్లంతా మట్టితో ఉన్న ఆ చిన్నారిని చూడగానే ఖుష్బూ మనసు తరుక్కుపోయింది. పసిపాపను ఇలా అనాథను చేసి వదిలేశారేంటని ఆమె బాధపడ్డారు. మీరేం తల్లిదండ్రులు?ఆ పాపాయిని జాగ్రత్తగా తన ఒడిలోకి తీసుకున్నారు. చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుంటే ఆమెను లాలించారు. చివర్లో పాప ముఖాన్ని దగ్గరి నుంచి చూపిస్తూ.. ఈ చిన్నారి గురించి తెలిసినవారు తనను సంప్రదించమని కోరారు. ఈ పసిపాపను పాడుబడ్డ ఇంట్లో వదిలేసిన తల్లిదండ్రులపై ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేం తల్లిదండ్రులు? పాప భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసినందుకు సిగ్గుపడండి అని మండిపడ్డారు.ఇంకా ఎన్నాళ్లీ దారుణాలు..'దేవుడే రక్షణగా నిలబడే వ్యక్తికి ఎవరూ హాని తలపెట్టలేరు. ఈ చిన్నారిని అధికారులకు అప్పగించాం. తను మంచి చేతుల్లోకి వెళ్లేలా చూసుకుంటాను. కచ్చితంగా తన భవిష్యత్తు బాగుంటుంది. మన దేశంలో ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతాయి? దయచేసి ఆడపిల్లల్ని కాపాడండి' అని ఖుష్బూ కోరారు.ప్రభాస్‌తో నటించిన దిశా..ఖుష్బూ చెల్లెలు దిశా పటానీ విషయానికి వస్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో జన్మించిన ఈ బ్యూటీ 'లోఫర్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. గతేడాది వచ్చిన ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీలోనూ యాక్ట్ చేసింది. ఎక్కువగా హిందీ సినిమాలే చేసింది. 'ఎంఎస్ ధోని: ద అన్‌టోల్డ్ స్టోరీ', 'భాగీ 2', 'భరత్', 'మలంగ్', 'రాధే', 'ఏక్ విలన్ రిటర్న్స్', 'యోధ' సినిమాలతో పాపులర్ అయింది. ప్రస్తుతం 'వెల్కమ్ టు ద జంగిల్' మూవీలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) చదవండి: నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి


