టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు మా ఇంటి బంగారం మూవీతో మంచి హిట్‌ని అందుకోవడమే గాక ఆ సినిమా సక్సెస్ మీట్‌లోనే తను ప్రెగ్నెంట్‌నని ప్రకటించి అభిమానులను ఖుషీ చేసింది. ఆ నేపథ్యంలో కొన్నాళ్లపాటు షూటింగ్ విరామం తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించింది. ఎప్పటికప్పుడూ తన గర్భధారణకు సంబంధించిన ప్రతి ఫోటోని షేర్ చేస్తూ మాతృత్వ మధురిమ గురించ పంచుకుంటుంటుంది. అందులో భాగంగానే తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంది.
కాబోయే తల్లి సమంత తనకు సంప్రదాయల పట్ల చాలా గౌరవం ఉందంటూ భావోద్వేగంగా పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రతి మంత్ర ధ్వని, ఆయా జపాల ద్వారా వచ్చే శక్తిలో ఏతో లోతైన ప్రభావం ఉందని నమ్ముతాను. ఆ ఆచారాల వెనుకున్న ఉన్న అర్థం నాకు తెలియకపోవచ్చు కానీ ఏదో తెలియని అనుభూతి, శక్తి మనలో వస్తుందని నమ్ముతానని పేర్కొంది. ఈ వేడుక కోసం ఆమె సాంప్రదాయ భారతీయ మగ్గాల బ్రాండ్ ‘సుత్రాని’ కలెక్షన్ నుంచి పసుపు రంగు కంచివరం చీరను ఎంచుకుంది. కంచివరం చీరలో పుత్తడి బొమ్మలా మెరిసిపోయింది సమంత.
ఆ చీర పైన న్న వింటేజ్ ప్రేరేపిత హెర్రింగ్‌బోన్ బంగారు అంచు, పాత కాంచీపురం నేత నిశబ్ద వైభవాన్ని చాటుతోంది. ఇది చాలా సూక్ష్మంగా కనిపిస్తున్నా ఈ కళ చాలా క్లిష్టమైనదని ఆ బ్రాండ్ పేర్కొంది. ఇక సమంత ఈ వేడుక కోసం 'వర్ణం - ఫైన్ జ్యువెల్స్ లాంజ్' నుంచి ఆభరణాలను ఎంచుకున్నారు. తను జుట్టును ముడి వేసుకుని, తెల్లటి గజ్రా పువ్వులతో అలంకరించుకున్నారు. మేకప్ కోసం సమంత గులాబీ రంగు లిప్‌స్టిక్, బ్లష్, ఐషాడోతో మోనోక్రోమాటిక్ లుక్‌ను ఎంచుకున్నారు.
ఈ వేడుకలో భాగంగా చేయించే మంగళ స్నానంలో సైతం ఆమె మస్టర్డ్ పసుపు(ఆవాల పసుపు రంగు) రంగు అనార్కలీ ధరించింది. ఇక సమంత ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శ్రీకల్పం గురించి కూడా ఇలా వివరించింది. శ్రీవిద్య సంప్రదాయానికి చెందిన ఈ ప్రత్యేక ఆచారంలో దేవి 94 కళలను స్మరిస్తూ.. తల్లి శరీరంలోని ఏడు చక్రాలను మంత్రాలు, పవిత్ర జలంతో శుద్ధి చేసి శక్తివంతం చేసే విధానం గురించి తెలిపింది.
ఈ ఆచారంలో భాగంగా తనను కాబోయే తల్లిగా కాకుండా దేవి స్వరూపంగా మరో ప్రాణికి జన్మనిచ్చే పవిత్ర సృష్టికర్తగా గౌరవించడం తనను ఎంతగానో కదిలించిందన సమంత పేర్కొంది. శ్రీచక్ర యంత్రం, తొమ్మిది ఆవరణలు, బిందువు, లలితా త్రిపురసుందరి భావన, దేవి ఖడ్గమాల పఠనం వంటి అంశాలను కూడా ఆమె ప్రస్తావించింది. గర్భంలో ఉండగా శిశువుకు ఈ మంత్రాల ధ్వని ద్వార రక్షణ, ఆశీర్వాదం అందుతుని నమ్ముతాను అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
(చదవండి: సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్)


