దిగ్గ‌జ ఫ్యాషన్‌ డిజైన‌ర్ బాబ్ మాకీ క‌న్నుమూత‌ | Legendary Costume Designer Bob Mackie Demise At-Age-87-America | Sakshi
Sakshi News home page

దిగ్గ‌జ ఫ్యాషన్‌ డిజైన‌ర్ బాబ్ మాకీ క‌న్నుమూత‌

Sep 15 2026 3:39 AM | Updated on Sep 15 2026 4:24 AM

Legendary Costume Designer Bob Mackie Demise At-Age-87-America

Photo Credit: Twitter

దిగ్గ‌జ‌ ఫ్యాషన్, కాస్ట్యూమ్ డిజైనర్ బాబ్ మాకీ (87) తుదిశ్వాస విడిచారు. ఆయన సోమవారం మరణించారు.  కాగా బాబ్ మాకీ మరణ వార్తను ఆయన బృందం ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ధృవీకరించింది. 1939లో లాస్ ఏంజిల్స్ శివారు ప్రాంతంలో జన్మించిన బాబ్ మాకీకి చిన్నతనంలోనే కళల పట్ల ఆసక్తి ఏర్ప‌డింది. 

బాబ్ మాకీకి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే అత‌డి తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో జాబ్ మాకీ త‌న తాత‌య్య‌, నాన‌మ్మ వ‌ద్ద పెరిగాడు. ఈ స‌మ‌యంలోనే వాళ్లిద్ద‌రు బాబ్ మాకీని కళల ప‌ట్ల ఆస‌క్తి చూపేలా ప్రోత్స‌హించారు. తాను ఏ వృత్తిని కోరుకుంటాన‌నేది త‌న‌కు ముందే తెలుస‌ని బాబ్ మాకీ చాలా ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మాకీకి లభించిన తొలి ప్రధాన అవకాశాల్లో చెప్పుకోవాల్సింది మాత్రం న‌టి, గాయ‌ని మిట్జీ గేనార్‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా పనిచేయ‌డ‌మే. లాస్ వేగాస్ రెవ్యూకు మిట్జీకి అంద‌మైన కాస్ట్యూమ్స్ త‌యారు చేయ‌డం ద్వారా బాబ్ మాకీ పేరు తొలిసారి మార్మోగిపోయింది. ఆ తర్వాత అతను ఆమె టెలివిజన్ స్పెషల్స్ కోసం దుస్తులను రూపొందించాడు. మాకీ త‌న కెరీర్‌లో తొమ్మిది ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు అందుకోవ‌డంతో పాటు ఆస్కార్ విభాగంలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డుకు మూడుసార్లు నామినేట్ అవ్వ‌డం విశేషం.

బాబ్ మాకీ మ‌ర‌ణ‌వార్త‌ను అతడి బృందం ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా విడుద‌ల చేసింది. ‘‘బాబ్ మాకీ ఈ రోజు కన్నుమూశారనే వార్తను చాలా బాధతో తెలియజేస్తున్నాము. ఆయన తన 87 ఏళ్ల జీవితాన్ని సంపూర్ణంగా గడిపారు. ఫ్యాషన్‌, కాస్ట్యూమ్ డిజైనర్ కావాలనే తన కలను నెరవేర్చుకున్నారు, ఆయన జీవితమంతా అదే చేయాలని కోరుకున్నారు. ఆయన ప్రతిభ అసాధార‌ణం. ఆయ‌న రూపొందించిన డిజైన్‌లు ఈ ప్రపంచానికి అందాన్ని పంచుతూ శాశ్వతంగా నిలిచి ఉంటాయి.’’అని పేర్కొంది.

ఇదీ చ‌ద‌వండి: కేంద్ర మంత్రి నివాసంలో ప్రధాని మోదీ ప్ర‌త్యేక‌ పూజ‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement