అంబానీల కుటుంబంలో గణేష్ చతుర్థి వేడుకలు అత్యంత ప్రత్యేకం. అంబానీల నివాసంలో కొలువై ఉండే ఆ వినాయకుడు 'యాంటిలియా చా రాజా'గా విశిష్టమైన అలంకరణతో పూజలందుకుంటున్నాడు. ఈ ఏడాది అంతే అట్టహాసంగా అంబానీలు ముంబైలో ఉన్న తమ అంటిలియా ఇంటికి గణపతి బప్పాను ఘనంగా స్వాగతించారు. ఈ వేడుకలను అంబానీ కుటుంబ సభ్యులు సంప్రదాయ దుస్తుల ఫ్యాషన్‌తో మరింత వైబ్‌ని తెప్పిస్తారు. ముఖ్యంగా నీతా అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ఆమె నారింజరంగు ఎత్నిక్ దుస్తులతో అక్కడున్న వారందరి దృష్టిని అమితంగా ఆకర్షించారు. అత్యంత నిరాడంబరమైన స్టైలిష్ లుక్‌తో పండుగ శోభను తెచ్చారామె. ఆమె దుస్తులపై ఉన్న క్లిష్టమైన ఎంబ్రాయిడరీలో ఉన్న సాంప్రదాయ వివరాలు మరింత కళను తెచ్చిపెట్టాయి. తన రూపానికి అనుగుణంగా స్టేమెంట్ చెవిపోగులు, గాజులను ధరించారు. పండుగ వాతావరణానికి అనుగుణంగా చక్కగా జడ వేసుకుని తన రూపంతోనే కళకళలాడే వాతావరణాన్ని సృష్టించిందామె.
ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ నీతా అంబానీ ఎరుపు రంగు సాంప్రదాయ దుస్తుల్లో హుందాగా కనిపించారు. బంగారు ఆభరణాలు, లేయర్డ్ నెక్లెస్, స్టేట్‌మెంట్ చెవిపోగులతో సందర్భానుసారంగా స్టైలిష్‌గా కనిపించడంలో ఆమెకు సాటి లేరెవెవ్వరూ. ఈ పండుగ శోభలో అంబానీ మహిళలు ధరించే దుస్తులు, జ్యువెలరీ ప్రధాన ఆకర్షణగా నిలవడమే గాక మన భారతీయ హస్త కళా వైభవాన్ని చాటుతాయి.
ఇదీ చదవండి: బ్రిక్స్ సదస్సులో ప్రధాన ఆకర్షణగా ఆ యువకుడు..!)


