‘మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి’ | Hearty Ganesh Chaturthi Wishes to Telangana Gadwal Vijayalakshmi | Sakshi
Sakshi News home page

‘మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి’

Sep 13 2026 6:34 PM | Updated on Sep 13 2026 6:34 PM

Hearty Ganesh Chaturthi Wishes to Telangana Gadwal Vijayalakshmi
  • మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలి
  • ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌, సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్  గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్‌: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌, సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ గద్వాల విజయలక్ష్మి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

విఘ్నాలను తొలగించి, ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

వినాయక చవితిని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె కోరారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పండుగను పర్యావరణహితంగా నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గణేష్ మండపాల వద్ద భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.

గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐకమత్యంతో జీవించాలని గద్వాల విజయలక్ష్మి ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement