రూ.40 లక్షల చికిత్స.. గాందీలో ఉచితం | Safe delivery for a woman with a rare disease in Gandhi Hospital | Sakshi
Sakshi News home page

రూ.40 లక్షల చికిత్స.. గాందీలో ఉచితం

Sep 13 2026 12:00 PM | Updated on Sep 13 2026 12:28 PM

Safe delivery for a woman with a rare disease in Gandhi Hospital

హైదరాబాద్‌:  రక్తం గడ్డకట్టే అరుదైన రుగ్మతతో బాధపడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం విజయవంతంగా నిర్వహించారు సికింద్రాబాద్‌ గాందీఆస్పత్రి వైద్యులు. గాందీఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొ. ఉషారాణి తెలిపిన మేరకు.. సూర్యాపేట జిల్లా  ధర్మాపూర్‌ గ్రామానికి చెందిన యడ్ల లక్ష్మి(21) ప్రసవం కోసం గతనెల 21న గాం«దీఆస్పత్రిలో అడ్మిట్‌ అయింది.  అలెగ్జాండర్స్‌ కన్జ్‌నిటల్‌ ఫ్యాక్టర్‌ 7 డెఫిసియన్సీ వ్యాధి కారణంగా రక్తం గడ్డ కట్టే అరుదైన రుగ్మత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రసవం సమయంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వైద్యులు నిరంతరం పర్యవేక్షించారు. లక్షలాది రూపాయల విలువైన రికాంబినెంట్‌ ఫ్యాక్టర్‌–7 ఔషధాన్ని తెలంగాణ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం ప్రత్యేకంగా అందించింది. 

పండంటి ఆడబిడ్డకు జన్మ
ఈనెల 11న వైద్యుల పర్యవేక్షణలో లక్ష్మి ఆడ శిశువుకు జన్మనిచి్చంది. ఐదు లక్షల మందిలో ఒకరికి అత్యంత అరుదైన అలెగ్జాండర్స్‌ కన్జ్‌నిటల్‌ ఫ్యాక్టర్‌–7 డెఫిసియాన్సీ వ్యాధి ఉంటుందని, ప్రసవ సమయంలో రక్తం గడ్డకడితే తల్లిబిడ్డల ప్రాణాలకే ప్రమాదమని సూపరింటెండెంట్‌ ప్రొ. ఉషారాణి తెలిపారు.  ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఇటువంటి ప్రసవానికి సుమారు రూ.40 లక్షలు తీసుకుంటారని, గాం«దీఆస్పత్రిలో పూర్తి ఉచితంగా నిర్వహించామన్నారు.  గాంధీ గైనకాలజీ వైద్యులు ప్రొ. జానకీ, ప్రొ.శకుంతల, లేబర్‌రూమ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్వేత తదితరులు వైద్య సేవలందించారు.  

చదవండి: భర్త కళ్ళముందే ప్రాణం విడిచిన నవ వధువు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement