ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడను కూడా భారీ వర్షం ముంచెత్తింది.
విజయవాడ నగరంలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి.


