నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది? | Epic, Sardar 2, Mandaadi And Mahendragiri Varahi Review In Telugu | Sakshi
Sakshi News home page

Latest Telugu Movie Reviews: లేటెస్ట్ రిలీజ్ మూవీస్.. ఎలా ఉన్నాయంటే?

Sep 12 2026 12:59 PM | Updated on Sep 12 2026 1:02 PM

Epic, Sardar 2, Mandaadi And Mahendragiri Varahi Review In Telugu

ప్రతివారాంతంలో కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజవుతూనే ఉంటాయి. ఈ వారం అలా స్ట్రెయిట్, డబ్బింగ్ రూపంలో నాలుగైదు మూవీస్ విడుదలయ్యాయి. వీటిలో కార్తీ 'సర్దార్ 2', ఆనంద్-వైష్ణవి 'ఎపిక్', సుహాస్ 'మండాడి', సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' చిత్రాలున్నాయి. ఇంతకీ ఇవెలా ఉన్నాయి? వీటి రివ్యూలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ

'బేబి' తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'ఎపిక్'. 90స్ వెబ్ సిరీస్‌లోని చిన్న పిల్లాడి పాత్రని తీసుకుని వాడి పెరిగి పెద్దయి.. పై చదువుల కోసం లండన్ వెళ్లి ఓ అమ్మాయితో ప్రేమలో పడితే ఏమైంది అనే కాన్సెప్ట్‌తో తీశారు. బోల్డ్ సీన్స్, రొమాన్స్ కాస్త ఎక్కువగానే దట్టించారు. అయితే స్టోరీ పెద్దగా లేకపోవడంతో చాలామంది ప్రేక్షకులకు ఈ మూవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కొన్నిచోట్ల ఎమోషన్ పర్లేదనిపించింది.

పూర్తి రివ్యూ: ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌ మూవీ రివ్యూ

2022లో వచ్చిన 'సర్దార్' సినిమాకు సీక్వెల్ 'సర్దార్ 2'ని స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తీశారు. కార్తీ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నప్పటికీ మిగిలిన విషయాలు పెద్దగా అలరించలేదు. ఎస్జే సూర్య విలనిజం కాస్త బోర్ కొట్టించగా.. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ గ్లామర్ సరిపోలేదు. పీఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి భాగాన్ని తీసినంత ఎంగేజింగ్‌గా దీనిని తీయలేకపోయారు.

పూర్తి రివ్యూ: ‘సర్దార్‌ 2’ మూవీ రివ్యూ

తెలుగు నటుడు సుహాస్ చేసిన తమిళ చిత్రం 'మండాడి'. సూరి హీరో కాగా సుహాస్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించాడు. సముద్రంలోని బోట్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఇది తీశారు. తెరపై కష్టం బాగా కనిపించింది. కథాకథనాలు పర్లేదనిపించాయి. ప్రస్తుతానికైతే తెలుగులో ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ కనిపిస్తున్నాయి.

పూర్తి రివ్యూ: మండాడి మూవీ రివ్యూ

సుమంత్ హీరోగా చేసిన డివోషనల్ థ్రిల్లర్ సినిమా 'మహేంద్ర గిరి వారాహి'. సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్యా రాజేశ్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. ఓ ఊరు, రాజకుటుంబం, ఓ శాపం, 33 ఏళ్ల వయసొచ్చేసరికి రాజకుటుంబంలోని పురుషులు చనిపోవడం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తీశారు. ఈ రహస్యం వెనకున్న నిజాన్ని బయటకు తీసే యూట్యూబర్‌గా సుమంత్ చేశాడు. ఈ మూవీ కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

పూర్తి రివ్యూ: ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement