కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్దార్2. ఇటేవలే వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా విడుదల కావడంతో కార్తీ కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్తి చదువుకున్న స్కూల్ డేస్ కోసం ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ఇద్దరూ చెన్నైలో..
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కార్తి.. ఇద్దరూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలు . వీరికి కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల పరంగా వీరిద్దరి ప్రయాణం వేర్వేరు అయినా స్కూల్ డేస్ లో వీరిద్దరికీ మంచి అనుభందం ఉందని మీకు తెలుసా.. మహేశ్‌బాబు, కార్తీ ఇద్దరూ చెన్నైలోని సెయింట బేడ్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ టైంలో మహేశ్‌బాబుకి కార్తి రెండు సంవత్సరాల జూనియర్. ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్‌మీడియాలో వార్తను తెగ వైరల్ చేస్తున్నారు. ( ‘హనుమాన్ అంశ్2’లో కోహ్లీ,అనుష్క శర్మ.. నిజమెంత?)
కలిసి నటిస్తారా..
ఇద్దరు స్టార్ హీరోలకు ఉన్న ఈ కామన్ కనెక్షన్ అభిమానులకు ఆసక్తికరంగా మారింది. సినిమాల పరంగా కాకుండా బయట కూడా మంచి స్నేహితులు కావడంతో వీళ్లకాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..
మహేశ్‌బాబు విషయానికి వస్తే..
దర్శకధీరుడు రాజమౌళి , సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుత్ను చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. . ప్రియంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా మహేశ్ బాబు.. రుద్ర, శ్రీరాముడిగా కనిపించనున్నాడు. 2027 ఏప్రిల్ 7 నాటికి థియేటర్లలతో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


