బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది. ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్స్‌గా రానున్న ‘హనుమాన్ అంశ్2’, ‘హనుమాన్ అంశ్3’పై ఆసక్తి పెరిగింది. పార్ట్2లో పలువురు ప్రముఖులు నటించనున్నారని వస్తున్న వార్తలపై ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ పేర్లు తెరపైకి వచ్చాయి.
నిర్మాత ఏమన్నారంటే..
‘హనుమాన్ అంశ్2’లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అతిథి పాత్రల్లో కనిపిస్తారా? అనే ప్రశ్నకు నిర్మాత నమ్రతా సింగ్ ఆసక్తికరంగా స్పందించారు. కొందరు సెలబ్రిటీలను ఇప్పటికే సంప్రదించినట్లు ఆమె వెల్లడించారు. ఇప్పటికే పార్ట్2 కథ పలువరి సెలబ్రిటీలకు తెలుసునని తెలిపారు. అయితే విరాట్, అనుష్క ఇద్దరూ సినిమాలో నటించేందుకు అంగీకరించారా లేదా అని మాత్రం ఆమె స్పష్టంగా తెలపలేదు.
చదవండి: సమంత ఎంగేజ్‌మెంట్ రింగ్ ఇంత ఖరీదా..? డిజైనర్ ఎవరంటే.?
కాగా విరాట్-అనుష్కలకు నీమ్ కరోలి బాబాపై ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట పలు సందర్భాల్లో కైంచీ ధామ్‌ను సందర్శించింది. ఈ నేపథ్యంలోనే ‘హనుమాన్ అంశ్’లో వీరిద్దరినీ భాగం చేయాలనే ఆలోచన ఆసక్తిని కలిగిస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మూడు భాగాలుగా..
ఇక ‘హనుమాన్ అంశ్’ను మొదటి నుంచే మూడు భాగాలుగా తెరకెక్కించాలని భావించినట్లు నిర్మాత తెలిపారు. ‘తొలి భాగంలో నీమ్ కరోలి బాబా ప్రారంభ జీవితం నుంచి కైంచీ ధామ్( ఆధ్యాత్మిక ఆశ్రమం) వరకు చూపించాం. రెండో భాగం కైంచీ ధామ్, అక్కడి భారతీయ భక్తుల కథలపై తెరకెక్కిస్తాం. మూడో భాగంలో బాబా ఆధ్యాత్మిక ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందనే అంశాన్ని చూపించబోతున్నాం’ అని తెలిపారు. అయితే విరాట్-అనుష్కలు ఇందులో కనిపిస్తారా? లేదా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.
ఇదీ చదవండి: బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?


