‘సర్దార్‌ 2’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Sardar 2 Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Sardar 2 Review: ‘సర్దార్‌ 2’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Sep 10 2026 2:47 PM | Updated on Sep 10 2026 4:03 PM

Sardar 2 Movie Review And Rating In Telugu

టైటిల్‌: సర్దార్‌  2
నటీనటులు: కార్తి, ఎస్‌.జే. సూర్య, మాళవిక మోహన్‌, ఆశికా రంగనాథ్‌, యోగిబాబు, రజిషా విజయన్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: ప్రిన్స్ పిక్చర్స్
నిర్మాత: ఎస్. లక్ష్మణ్ కుమార్
దర్శకత్వం: పీఎస్ మిత్రన్
సంగీతం: సామ్‌  సి.ఎస్‌
ఎడిటింగ్‌: విజయ్‌ వేలుకుట్టి
విడుదల తేది: సెప్టెంబర్‌  10, 2026

కార్తి..పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం మనవాడిగానే చూస్తారు. ఊపిరి, సత్యం సుందరం లాంటి చిత్రాలతో ఆయనకు ఇక్కడ మంచి ఫాలోయింగ్‌  పెరిగింది. అందుకే ఆయన చిత్రాలన్నీ ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్‌ చేస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం సర్దార్‌  2. 2022లో వచ్చిన బ్లాక్‌ బస్టక్‌ మూవీ ‘సర్దార్’కి కొనసాగింపు ఇది.నేడు(సెప్టెంబర్ 10) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అయింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
‘సర్దార్’ముంగింపే ఈ చిత్రానికి  ప్రారంభం. ఇన్‌స్పెక్టర్‌ నుంచి రా ఏజెంట్‌గా మారిన విజయ్‌ ప్రకాశ్‌(కార్తి).. రా చీఫ్‌ మనోజ్‌ బొమ్మై (ఆశిష్‌ విద్యార్థి)కి తెలియకుండా ఓ రహస్య ఆపరేషన్‌  చేపడతాడు. అందులో భాగంగా మాజీ రా ఏజెంట్‌ వాల్‌రస్‌ (అచ్యుత్‌ కుమార్‌)ని కలుస్తారు. అయితే అప్పటికే ఇంటర్నేషనల్ అండర్ వరల్డ్ డాన్ బ్లాక్‌ డగ్గర్ (ఎస్.జె.సూర్య) మనుషులను అతనిపై దాడి చేస్తారు. చనిపోయే ముందు , విజయ్‌ కు తన దగ్గర ఉన్న ఓ 'కీ'ని ఇస్తాడు. అలాంటి మరో కీని మరో రా ఏజెంట్‌ (మాళవిక మోహనన్) తన కూతురు ఫైజా (ఆషిష్‌ రంగనాథ్‌)కు ఇస్తుంది. డి.ఆర్.డి.వో. ఛీఫ్‌ టైగర్ హరిశ్చంద్ర (బాబు ఆంటోనీ) దగ్గర ఇంకో కీ ఉందదే విషయం తెలుస్తుంది. దానిని సంపాదిస్తే.. ఓ భారీ ప్రమాదం నుంచి ఈ దేశాన్ని రక్షించొచ్చు అని విజయ్‌  భావిస్తాడు.

(చదవండి: మండాడి మూవీ రివ్యూ)

అయితే విజయ్‌ కంటే ముందే బ్లాక్‌ డగ్గర్ ఆ 'కీ'ని సొంతం చేసుకుని, ఈ దేశాన్ని నాశనం చేయడానికి సిద్థమవుతాడు. సరిగ్గా అదే సమయంలో రంగంలోకి దిగుతాడు సర్దార్(కార్తి). ప్రభుత్వం దృష్టిలో చైనాలో చనిపోయిన సర్ధార్ తిరిగి ఎలా వచ్చాడు? బ్లాక్‌ డగ్గర్‌  మిషన్‌ ఏంటి? మూడు ‘కీ’ల వెనుక ఉన్న రహస్య కథేంటి? బ్లాక్‌ దగ్గర్‌ మిషన్‌ని అడ్డుకునేందుకు తన కొడుకు విజయ్‌తో కలిసి సర్దార్‌ చేసిన సాహసాలేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 



ఎలా ఉందంటే.. 
‘సర్దార్‌’లో నీటి సమస్యను, వన్‌లైన్‌  పైప్‌లైన్‌  ప్రాజెక్ట్‌ ద్వారా జరిగే కుట్రను చూపించిన దర్శకుడు.. సీక్వెల్‌లో యాంటి బయాటిక్‌ మందుల్ని మితిమీరి వాడటం వల్ల జరగబోయే అనర్థాల్ని చూపించాడు. అయితే పార్ట్‌  1 మాదిరి ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడంలో మాత్రం దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. కథ, కథనం రొటీన్‌గా ఉంటూ.. చాలా వరకు సర్దార్‌ సినిమాతో పాటు పలు స్పె యాక్షన్‌ సినిమాలను గుర్తుకు చేస్తాయి. తర్వాత ఏ జరుగుతుందన్న ఉత్కంఠ కూడా రేకెత్తించదు. ఎమోషనల్‌ సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. కథను పక్కకు పెట్టి ఎక్కువగా స్టైలీష్‌ మీదే దృష్టిపెట్టాడు దర్శకుడు .   

ఫస్టాఫ్‌ అంతా డోకు బయోవెపన్‌  చుట్టే తిరుగుతుంది. దాన్ని తెరిచేందుకు మూడు తాళాలు అవసరం..వాటి కోసం హీరో ఒకవైపు.. విలన్‌ మరోవైపు ప్రయత్నాలు చేస్తారు. ఆయా సీన్లను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దితే బాగుండేది. కానీ చాలా సింపుల్‌గా, సాగదీతగా ఆ సన్నివేశాలు సాగుతాయి. ఒకానొక దశలో చిరాకు కలిగిస్తాయి కూడా. అలాగే సర్దార్‌  ప్లాష్‌ బ్యాక్‌  ఎపిసోడ్‌ సిల్లీగా అనిపిస్తుంది. 

ఇంటర్వెల్‌ సీన్‌  సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో అయినా కథనం ఉత్కంఠభరితంగా సాగుతుందా అని ఆశించిన ప్రేక్షకుడికి.. కాసేపటికే నిరాశ తప్పదు.  కోటలో ఉన్న ప్రమాద కర ఆయుదాన్ని వెతికిపట్టుకునేందుకు తండ్రి,కొడుకులు ప్రయత్నించడం.. బ్లాక్‌ డగ్గర్‌ దాన్ని స్వాధీనం చేసుకొని దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించడం.. చివరిలో తండ్రి కొడుకులు కలిసి ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడం.. సెకండాఫ్‌ అంతా ఇలానే సాగుతుంది. చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉండడం.. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఏమీ లేకపోవడంతో సెకండాఫ్‌ మరింత చిరాకు పెట్టిస్తుంది. ఇక చివరిలో పార్ట్‌ 3 కి లీడ్‌ ఇస్తూ కథను ముగించారు. అయితే అది తెరపైకి వస్తుందా లేదా అనేది చూడాలి. 



ఎవరెలా చేశారంటే.. 
కార్తి నటన గురించి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడు. ఇందులో కూడా తండ్రి కొడుకులుగా రెండు వేరియేషన్స్‌ ఉన్న పాత్రలను పోషించి మెప్పించాడు. అయితే కథ, కథనం బలంగా లేకపోవడంతో కార్తి పడిన కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అయిపోయింది. ఇక విలన్‌గా ఎస్‌.జే సూర్య నటన చాలావరకు అతిగా అనిపించింది. అయితే తెరపై మాత్రం స్టైలీష్‌గా కనిపించాడు. 

మాళవిక మోహన్‌, ఆశికా రంగనాథ్‌, నాజర్, అచ్యుత్‌ కుమార్, ఆషిష్‌ విద్యార్థి యోగిబాబుతో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు.  సాంకేతికంగా సినిమా ఓకే. సామ్‌ సీఎస్‌ బీజీఎం పర్వాలేదు. చాలా వరకు హలీవుడ్‌ సినిమాలను ఇమిటేట్‌ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇందులో ఒకే ఒక పాట ఉంది. అది కూడా అంతగా ఆకట్టుకోదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ బాగోలేదు. చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. వాటికి ఇంకాస్త క్రిస్పీగా కట్‌ చేయాల్సిందే. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement