breaking news
S J Surya
-
ఒకప్పుడు క్లాసిక్ డైరెక్టర్.. ఇప్పుడో అద్భుతమైన యాక్టర్.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
కోలీవుడ్‌కి ఓకే చెప్పిన ‘బిగ్ బీ’
బాలీవుడ్ ‘బిగ్ బీ’ అమితాబ్‌బచ్చన్‌ను ఒకప్పుడు దక్షిణాది చిత్రాల్లో నటింపజేయడానికి చాలా మంది ప్రయత్నించారు. కానీ అవేవీ సక్సెస్ కాలేదు. అలాంటిది లేట్ వయసులో ఆయనిప్పుడు దక్షిణాదిపై దృష్టి సారించడం విశేషం. ప్రస్తుతం అమితాబ్ తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్‌లో కూడా ఆయన ఎంట్రీ ఖరారైనట్లు సమాచారం. విలక్షణ దర్శకుడు, నటుడు ఎస్జే.సూర్య కథానాయకుడిగా నటించబోతున్న ‘ఉయర్నద మణిదన్’ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ ఒక ప్రధాన పాత్రను పోషించడానికి అంగీకరించారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఆ చిత్రం కోసం ఆయన ఏకంగా 40 రోజులు కాల్షీట్స్ కేటాయించినట్లు సమాచారం. గతంలో ఎస్జే.సూర్య హీరోగా నటించిన ‘కల్వనిన్ కాదలి’ చిత్రాన్ని తెరకెక్కించిన తమిళ్వాననే ఈ క్రేజీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. -
కోలీవుడ్‌కు బిగ్‌బీ?
సినిమా అభిమానులందరూ అభిమానంగా బిగ్‌బీ అని పిలుచుకునే ది గ్రేట్ బాలీవుడ్ స్టార్ అమితాబ్‌బచ్చన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన హిందీ చిత్రాలు తమిళనాట విశేష ప్రేక్షకాదరణ పొందాయి. కానీ అమితాబ్ ఇప్పటి వరకూ తమిళ చిత్రంలో నటించలేదు. అయితే తమిళ చిత్రాల్లో నటించాలన్న ఆసక్తిని మాత్రం బిగ్‌బీ చాలా సార్లు వ్యక్తం చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అమితాబ్‌కు మధ్య స్నేహసంబంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు హిందీ చిత్రాల్లో నటించారు. ఇటీవల తమిళంలో రజనీకాంత్ నటించే చిత్రంలో చిన్న పాత్ర అయినా పోషించడానికి తాను రెడీ అని బిగ్‌బీ పేర్కొన్నారు. అలాంటి అమితాబ్‌కు ఇప్పుడు కోలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇంతకు ముందు కల్వనిన్ కాదలి, మచ్చక్కారన్, నంది చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తమిళ్‌వానన్ తాజాగా ఎస్జే.సూర్య హీరోగా ఉయిర్నిద మనిదన్ అనే చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధం అవుతున్నారు. ఇదే టైటిల్‌తో గతంలో శివాజీగణేశన్ హీరోగా ఏవీఎం సంస్థ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పుడా సంస్థ నుంచి ఆ టైటిల్ పొంది ఎస్జే.సూర్య కథానాయకుడిగా చిత్రం చేయనున్నట్లు ఆ చిత్ర వర్గాలంటున్నాయి. ఇందులో ఒక ప్రధాన పాత్రలో అమితాబ్‌బచ్చన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. దర్శకుడు చెప్పిన కథ విన్న బిగ్‌బీ ఈ స్క్రి ప్ట్‌ను హింది, ఇంగ్లిష్ భాషల్లో తనకు ఇవ్వవలసిందిగా కోరినట్లు యూనిట్ వర్గాల సమాచారం.అయితే ఈ చిత్రం ద్వారా బిగ్‌బీ కోలీవుడ్‌కు వస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.