బిగ్‌బాస్ ఇంట్లో మరోసారి హైరిస్క్ టెన్షన్ మొదలైంది. మహాపరీక్షలో భాగంగా రోహిత్, టెంపర్ వంశీ, ముకేశ్, త్రిగుణ్‌లకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో విజయం సాధించిన ఇద్దరికి హౌస్‌మేట్‌గా మారే అవకాశం కల్పించడంతో పాటు.. హైరిస్క్ జోన్‌లోకి ఒకరిని పంపాల్సి ఉంటుందని చెప్పాడు.
విజయం కోసం ఒకరిని హైరిస్క్‌లోకి పంపే వ్యక్తి పేరును ఇచ్చిన స్లాట్‌లో సరిగ్గా అమర్చాలని బిగ్‌బాస్ సూచించాడు. ఈ టాస్క్‌లో ముకేశ్, త్రిగుణ్ విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ కృష్ణుడిని హైరిస్క్‌లో పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే కృష్ణుడు పేరును అసంపూర్తిగా అమర్చడంతో.. ఆ పేరును పరిగణనలోకి తీసుకోబోమని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు.
ఇదీ చదవండి: విత్తన గణపతిని పూజిద్దాం.. మొక్కలు పెంచేద్దాం..!
మరోవైపు రోహిత్, వంశీలు చైత్ర పేరును హైరిస్క్ కోసం సూచించారు. ఇదే సమయంలో షాలినీ డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం హౌస్‌లో కొత్త వివాదానికి దారితీసింది. చైత్రను హైరిస్క్‌లోకి నెట్టినందుకే షాలినీ ఇలా సంబరాలు చేసుకుంటోందంటూ బ్లూ టీమ్ సభ్యులు ఆమెతో వాదించారు.
దీంతో చైత్ర, షాలినీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా స్పందించడంతో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ గొడవ ఎక్కడివరకు వెళ్లిందనేది ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్


