బిగ్‌బాస్ తెలుగు10 రియాలిటీ షోకు సంబంధించిన ఓటు ప్రచారంపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య ఓ కంటెస్టెంట్‌కు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారంటూ ప్రధానమంత్రి కార్యాలయం, తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డికి, కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రికి, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
18 ఏళ్లు నిండిన వారికే..
‘నల్గొండ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మమేకమైనట్లు కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ పాఠశాలలు విద్య కోసమే తప్పా రియాలిటీ షోల ఓటింగ్ ప్రచారం కోసం కాదు. ఇది విద్యా వాతావరణాన్ని భంగపరచడం, పిల్లల భద్రతకు ప్రశ్నార్థకం చేయడమే. భవిష్యత్తులో పాఠశాలల్లో ఇలాంటి ప్రచారాలు జరగకుండా కఠిన ఆదేశాలు జారీ చేయాలి’ అని ఆయన తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారికే బిగ్ బాస్ రియాలిటీ షో ఓటింగ్ కి అర్హులను చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు జగదీశ్వరరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: వర్షిణికి వాష్‌రూమ్ కడిగే పని.. ఎందుకింత శిక్ష?


