breaking news
Bigboss Season10
-
BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?
-
బుద్ధిలేని గేమ్.. హౌస్ లో మరో బిగ్ ట్విస్ట్
-
వీధి రౌడీలా కొట్లాట.! ఈ వీక్ నామినేషన్ లో ఉంది వీళ్లే
-
షాలిని పైనే రోహిత్ ఫోకస్ ఫైర్ అవుతోన్న ఫ్యాన్స్
-
కెప్టెన్ రేసులో త్రిగుణ్ మరో 3 వైల్డ్ కార్డు ఎంట్రీలు?
-
టాప్‌లో ఉంది ఎవరంటే? గుక్కపెట్టి ఏడ్చిన అపూర్వ
-
బిగ్‌బాస్ చరిత్రలోనే భారీ రెమ్యునరేషన్..! రోజుకు రూ.7లక్షల పైమాటే..
బిగ్‌బాస్.. రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. హౌస్‌లో ఎవరి ప్లాన్‌తో వాళ్లు కొత్త పంజాలనే విసురుతున్నారు. ఆట శైతం రసవత్తరంగా మారుతోంది. అయితే ఇప్పుడు వాళ్ల రెమ్యునరేషన్‌పై ప్రేక్షకుల కన్ను పడింది. దీంతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో సెలబ్రిటీలతో పాటు కామనర్ల రెమ్యునరేషన్‌పై కూడా ఆసక్తి నెలకొంది. ఈ సీజన్లో కామనర్లకు వారానికి సుమారు రూ.70 వేల వరకు పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా కామనర్ మిథిలేష్ విషయంలో జరిగిన పరిణామం మాత్రం ఈ లెక్కలన్నింటినీ తలకిందులు చేసేసింది. అది ఎలా అంటారా...?ఇదీ చదవండి: ‘రామాయణ’.. తెలుగు ట్రైలర్ వచ్చేసిందివైల్డ్కార్డ్ ఎంట్రీగా..వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్.. కేవలం రెండు రోజులకే బయటకు వచ్చేశాడు. బిగ్‌బాస్ ఇచ్చిన క్యాష్ టెంప్టేషన్‌లో భాగంగా తొలుత రూ.5 లక్షలు, ఆ తర్వాత రూ.10 లక్షలు.. చివరకు రూ.15 లక్షలకు ఆఫర్ పెంచారు. మిథిలేష్ చివరకు రూ.15 లక్షలతో బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు.ప్రైజ్ మనీ మాట పక్కన పెడితే..ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మిథిలేష్ రెండు రోజులకే తీసుకున్న భారీ మొత్తం రూ.15 లక్షలుగా కనిపిస్తోంది.మిథిలేష్ కామనర్ కంటెస్టెంట్..మిథిలేష్ కామనర్ కంటెస్టెంట్ కావడంతో వారానికి రూ.70 వేలు చొప్పున ఇవ్వడానికి అంగీకరించారట. ఇలా చూసుకుంటే రెండు రోజులకు రూ.20 వేలతోపాటు ఈ రూ.15 లక్షలూ ఆయన సొంతం. రెండు రోజులకు లెక్కిస్తే.. రోజుకు రూ.7.5 లక్షలు మొత్తంగా. 7.7 లక్షలు అందుకున్నట్లే. ఇలా అనుకుంటే కేవలం రెండు రోజుల్లోనే ఇంత డబ్బును సంపాదించుకున్న మొదటి కామనర్ మిథిలేష్ కావడం విశేషమనే చెప్పాలి. అయితే ఈ రూ.15 లక్షలు మిథిలేష్ రెగ్యులర్ రెమ్యునరేషన్ కాదు. హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు బిగ్‌బాస్ ఇచ్చిన ప్రత్యేక క్యాష్ ఆఫర్. అయితే కేవలం రెండు రోజుల్లోనే మనోడు రూ.15 లక్షల సొంతం చేసుకోవడంతో ప్రేక్షకుల్లో ఇంతటి ఆసక్తి నెలకొంది. ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్’ డే3 కలెక్షన్స్.. టాక్ ఎలా ఉన్నా తగ్గేదేలే! -
బిగ్‌బాస్ నటి బరితెగింపు.. వైద్యునిపై దాడి, కారు అపహరణ
పూణే: మహారాష్ట్రలోని పుణేలో మాజీ వైద్యాధికారి డాక్టర్ విద్యాధర్ గైక్వాడ్‌పై దాడి, బెదిరింపుల కేసులో ‘బిగ్‌బాస్ మరాఠీ’ నటి, రీల్ స్టార్ దివ్యా షిండేపై ఫిర్యాదు నమోదైంది. రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తనను బెదిరించారని, అనంతరం 10 మంది తన ఇంట్లోకి చొరబడి దాడి చేశారని వైద్యుడు ఆరోపించారు. పుణే కంటోన్మెంట్ బోర్డు మాజీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విద్యాధర్ గైక్వాడ్ ఫిర్యాదు ప్రకారం.. ఆగస్టు నుంచి కొందరు వ్యక్తులు ఆయనకు ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడానికి ఆ మొత్తాన్ని చెల్లించాలని కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.సెప్టెంబర్ 17న దివ్యా షిండే కొందరితో కలిసి తన ఇంటికి వచ్చిందని గైక్వాడ్ ఆరోపించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 23న తనను ఓ హోటల్‌కు పిలిపించి మరోసారి డబ్బులు డిమాండ్ చేశారని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి గూండాలను పంపి కొడతామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్ 24 రాత్రి దివ్యా షిండేతో పాటు 10 మంది బలవంతంగా తన ఇంట్లోకి ప్రవేశించారని వైద్యుడు ఆరోపించారు. అనంతరం తనపై దాడి చేశారని తెలిపారు. ముఖం, పొట్ట, వీపుపై పిడిగుద్దులు కొడుతూ, కాళ్లతో తన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.దాడి సమయంలో పదునైన ఆయుధాలు, కర్రలు, బెల్టులు, ఇనుప వస్తువులను కూడా ఉపయోగించారని గైక్వాడ్ ఆరోపించారు. తాను పక్షవాతంతో బాధపడుతున్నానని చెప్పి, వదిలేయాలని వేడుకున్నప్పటికీ దాడి ఆపలేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయం కాగా కుట్లు వేయాల్సి వచ్చిందని సమాచారం. వైద్యుడిపై దాడి చేసిన అనంతరం ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారని, రూ.5 లక్షలు వసూలు చేయడంలో విఫలమైన తర్వాత ఆయన కారును తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దివ్యా షిండే, అన్నా ధమ్ధేరేతో పాటు మరో ఏడుగురిపై కాలేపాడల్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దివ్యా షిండే ఈ ఏడాది ‘బిగ్‌బాస్ మరాఠీ 6’లో పాల్గొన్నారు. రెల్స్ ద్వారా ఆమెకు గుర్తింపు వచ్చింది.ఇదీ చదవండి: అగాధం అంచున ప్రపంచం: జైశంకర్ హెచ్చరిక! -
Bigg Boss 10: ఓటీంగ్ కోసం స్కూల్లో ప్రచారం.. కంటెస్టెంట్‌పై ఫిర్యాదు
బిగ్‌బాస్ తెలుగు10 రియాలిటీ షోకు సంబంధించిన ఓటు ప్రచారంపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య ఓ కంటెస్టెంట్‌కు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారంటూ ప్రధానమంత్రి కార్యాలయం, తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డికి, కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రికి, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.18 ఏళ్లు నిండిన వారికే..‘నల్గొండ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మమేకమైనట్లు కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ పాఠశాలలు విద్య కోసమే తప్పా రియాలిటీ షోల ఓటింగ్ ప్రచారం కోసం కాదు. ఇది విద్యా వాతావరణాన్ని భంగపరచడం, పిల్లల భద్రతకు ప్రశ్నార్థకం చేయడమే. భవిష్యత్తులో పాఠశాలల్లో ఇలాంటి ప్రచారాలు జరగకుండా కఠిన ఆదేశాలు జారీ చేయాలి’ అని ఆయన తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారికే బిగ్ బాస్ రియాలిటీ షో ఓటింగ్ కి అర్హులను చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: వర్షిణికి వాష్‌రూమ్ కడిగే పని.. ఎందుకింత శిక్ష? -
బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?
-
మిడ్ నైట్ గుస గుసలు.. ఆటను రామ్ ప్రసాద్ మారుస్తున్నాడా?
-
బిగ్‌బాస్ హౌస్‌లోకి బాక్సింగ్ దిగ్గజం.. వణికిపోతున్న పోటీదారులు!
బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ‘బిగ్‌బాస్ 20’(హిందీ)లోకి అడుగుపెట్టారు. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో కొత్త సీజన్లో ఆమె పాల్గొనడం అత్యంత ఆసక్తికరంగా మారింది. మేరీ కోమ్ బిగ్‌బాస్ ప్రయాణం ప్రారంభించిన అనంతరం నటి ప్రియాంక చోప్రా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. షోలో మేరీ కోమ్ తన ఆటను ఎలా కొనసాగిస్తారో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు.మేరీ కోమ్, ప్రియాంక చోప్రాల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. 2014లో తెరకెక్కిన చిత్రం ‘మేరీ కోమ్’లో ప్రియాంక చోప్రా.. మేరీ కోమ్ పాత్రను పోషించారు. ఆమె క్రీడా ప్రయాణంలోని కీలక ఘట్టాలను ఈ చిత్రం అందరికీ తెలియజెప్పింది. మేరీ కోమ్ కథను వెండితెరపై ఆవిష్కరించిన కొన్నేళ్ల తర్వాత.. ఇప్పుడు ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడుతున్నారు. దీనిలో ఆమె విభిన్న టాస్క్‌లను ఎదుర్కొనబోతున్నారు.బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు అలవాటుపడిన మేరీకి బిగ్‌బాస్ హౌస్ పూర్తిగా భిన్నమైన పరీక్షలను పెట్టనుంది. కెమెరాల నిరంతర నిఘాలో ఇతర కంటెస్టెంట్లతో కలిసి జీవిస్తూ, టాస్కులు, నామినేషన్లు, స్నేహాలు, విభేదాలు మొదలైనవాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒత్తిడిని ఎదుర్కొంటూ క్రమశిక్షణతో పోటీపడిన మేరీ కోమ్ క్రీడా నేపథ్యం ఆమె బిగ్‌బాస్ ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మార్చనుంది. బిగ్‌బాస్ 20 ప్రారంభానికి ముందు నుంచే మేరీ కోమ్ పాల్గొంటారనే ఊహాగానాలు సాగాయి. పలువురు కంటెస్టెంట్ల పేర్లతో పాటు ఆమె పేరు కూడా వినిపించింది.పలుమార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి, ఒలింపిక్ పతక విజేత అయిన మేరీ కోమ్.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ల జాబితాలో భిన్నమైన నేపథ్యంతో నిలిచారు. రింగ్‌లో సాధించిన విజయాలకు అతీతంగా ఆమె వ్యక్తిగత కోణాన్ని తెలుసుకునే అవకాశం ఇప్పుడు ప్రేక్షకులకు లభించనుంది. మేరీ ఆటను చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రియాంక వెల్లడించడంతో.. బిగ్‌బాస్ ఇంట్లో ఆమె ఎలా కలిసిపోతారన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.ఇది కూడా చదవండి: చెరకు తోటల్లోనే పుట్టి, చెరుకు తోటల్లోనే పెరిగి.. -
బిగ్‌బాస్ తొలి కంటెస్టెంట్.. రైతుబిడ్డ ఝాన్సీ
బిగ్‌బాస్ సీజన్10 మరి కొద్ది గంటల్లో బుల్లితెర ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. రేపు (సెప్టెంబర్ 6) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి తొలి కంటెస్టెంట్ ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా పెద్దపీట వేశారు. ఇలా ఇప్పుడు ‘అగ్నిపరీక్ష’ నుంచి మెయిన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే తొలి కంటెస్టెంట్‌గా రైతుబిడ్డ, జానపద గాయని ఝాన్సీ ఎంపికై ఛాన్స్ కొట్టేసింది.ఎక్కువ మంది చదివింది: కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియోఅగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి..బిగ్‌బాస్ తెలుగు-10లో సామాన్యులకు అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ సీజన్-2ను నిర్వహించారు. ఇందులో 15 మంది సామాన్యులు పోటీపడ్డారు. వారిలో సింగర్ ఝాన్సీ తన ఆటతీరు, పాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అగ్నిపరీక్షలో ఆమె చూపిన ప్రతిభ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఆమెనే మెయిన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే తొలి కంటెస్టెంట్‌గా ఎంపికైంది. ‘తొలి అడుగు పడింది. ఇప్పుడు బిగ్‌బాస్ 10 వేదికపైకి అడుగు పెట్టబోతున్నాను. ఈ ప్రయాణంలో ఇంతవరకు నన్ను ముందుకు నడిపించిన మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలే నా అసలైన బలం. మీ ఆశీస్సులు నాకు కొండంత బలం. ఇక నా ఆటతో… మన పాటతో… మిమ్మల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాను. మీ ప్రేమ, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నా ప్రతి అడుగులో మీ ప్రోత్సాహం కావాలి’ అని ఇన్‌స్టా వేదికగా ఝాన్సీ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Gundeboina jhansi (@singer_jhansi) -
‘సీజేపీ’ మహిళా కార్యకర్తకు ‘బిగ్‌బాస్’లో చాన్స్
ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఉద్యమంతో పాల్గొన్న నటి, మోడల్ రియా అహిర్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 20’ పోటీదారుల రేసులో నిలిచారు. ‘ఫ్యాన్స్ కా ఫైస్లా’ ప్రక్రియ ద్వారా ఆమెతో పాటు లవ్ గిల్ ప్రవేశం కోసం పోటీపడుతున్నారు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా వీరిలో ఒకరు షోలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో రియా మాట్లాడుతూ.. తాను నాలుగేళ్ల వయసు నుంచే నాటకరంగంలో ఉన్నానని, ఆరేళ్లుగా మోడలింగ్‌తో పాటు 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చానని తెలిపారు.ఆందోళనల సమయంలో పోలీసు వ్యానుకు ఎదురుగా నిలబడిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆ వాహనంలో మహిళా పోలీసులు లేకపోవడం చట్టవిరుద్ధమని తనకు తెలుసని, రాజ్యాంగం తన వెంటే ఉందన్న ధైర్యంతోనే బాధ్యత గల పౌరురాలిగా నిలబడ్డానని పేర్కొన్నారు. ఆ ఘటన తనను ఎంతోమందికి చేరువ చేసిందని, ప్రముఖ నటి షబానా అజ్మీ సైతం తనను ప్రశంసించారని చెప్పారు.బిగ్ బాస్ ఆఫర్‌పై స్పందిస్తూ.. ‘ప్రారంభంలో ఈ షోకి వెళ్లేందుకు కాస్త సంకోచించాను. నాకు సమాజంలో ఒక బాధ్యత ఏర్పడింది. ఎవరినీ నిరాశపరచకూడదనే ఉద్దేశంతో మొదట వెనుకాడాను. అయితే అక్కడ ఎవరూ నిన్ను దుర్భాషలాడాలని ఒత్తిడి చేయరని, మన ప్రవర్తన మన చేతుల్లోనే ఉంటుందని నిర్వాహకులు చెప్పడంతో నా నిర్ణయం మార్చుకున్నాను’ అని వివరించారు. కేవలం ప్రచారం కోసమే తాను ఉద్యమంలో పాల్గొన్నాననే విమర్శలను ఆమె కొట్టిపారేశారు. సల్మాన్ ఖాన్ పుట్టినరోజే తన జన్మదినం కావడం విశేషమని, కోపంలోనూ హుందాతనం ప్రదర్శించే వ్యక్తిత్వం విషయంలో ఆయనతో తనకు పోలికలున్నాయని ఆమె పేర్కొన్నారు. సెప్టెంబర్ 6న జియోహాట్‌స్టార్, కలర్స్ టీవీ వేదికలుగా ప్రారంభమయ్యే గ్రాండ్ ప్రీమియర్‌లో రియా భవితవ్యం తేలనుంది.ఇది కూడా చదవండి: ‘వితంతువులా చూడలేను’.. పాక్ భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు -
బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈమెదే.. ఎంతంటే..?
బిగ్‌బాస్ తెలుగు మరో కొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇప్పుడు పదో సీజన్ ప్రారంభం అయ్యేందుకు సర్వం సిద్ధమైంది. ఈ ఆదివారం సెప్టెంబర్ 06న సాయంత్రం ఈ పదో సీజన్ ప్రారంభం కానుంది. దీనికీ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సారి ఎవరు ఎంట్రీ ఇస్తారనో అని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురు పేర్లు వినిపించాయి. సినీ సెలబ్రిటీలు, బుల్లితెర సెలబ్రిటీల పేర్లు ఈ కంటెంస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఎవరా? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఎక్కువమంది చదివింది: ‘బిగ్‌బాస్ 10’ డేట్ వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్లే!రన్నరప్‌గా నిలిచినప్పటికీ..బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి అని తెలుస్తోంది. బిగ్‌బాస్ సీజన్ 3లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి శ్రీముఖి.. తన ఆటతీరుతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. చివరి వరకు ఆమే విన్నర్ అనుకున్న ప్రేక్షకులకు ఆ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచి అందరికి షాక్ ఇచ్చాడు. శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. అయితే విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ కంటే శ్రీముఖి ఎక్కువగా పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. రాహుల్ 100 రోజులకు గాను రూ.20 లక్షల రెమ్యునరేషన్‌తో పాటు విన్నర్ గా ప్రైజ్ మని రూ.50 లక్షలు తీసుకున్నాడట. అయితే శ్రీముఖి ఒక్క రెమ్యునరేషనే రూ.80 లక్షల వరకు తీసుకుందట. 100 రోజులకు గాను రోజుకు రూ.80 వేలు వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన విన్నర్‌తో పోల్చుకుంటే శ్రీముఖి 10లక్షలు ఎక్కువగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది బిగ్‌బాస్ తెలుగు చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ అని సమాచారం.ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?బిగ్‌బాస్ సీజన్ 10 విషయానికి వస్తే..ఈ బిగ్ రియాల్టీ షో 10వ సీజన్ ఈ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సారి దశావతారం కాన్సెప్ట్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది. కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ పేర్లు దాదాపు కన్ఫామ్ అయ్యాయని సమాచారం. ఇక జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేశ్, నూకరాజుతో పాటు ఎక్స్‌ప్రెస్ హరి పేరు కూడా ఈ సారి బలంగా వినబడుతుంది. వీరితో పాటు యాంకర్ వర్షిణి, పల్లవి గౌడ, తేజస్వీని గౌడ, యూట్యూబర్ నందు, కడలి సత్యనారాయణ, యాంకర్ సుధీర్ రెడ్డి, టెంపర్ వంశీ, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రోమాంచకం మూవీ రివ్యూ -
బిగ్‌బాస్ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అత్యంత పాపులర్ రియాలిటీ షోల్లో ‘బిగ్‌బాస్ తెలుగు’ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తొలి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు టైటిల్ గెలిచిన విజేతలు ఎవరు? బిగ్‌బాస్ హౌస్‌లో 100 రోజులు గడిపిన తర్వాత వారి జీవితాలు, కెరీర్లు ఎలా మారాయి? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఓసారి చూద్దాం.శివ బాలాజీ‘బిగ్‌బాస్ తెలుగు’ తొలి సీజన్ విజేత శివ బాలాజీ. షోకు ముందు నుంచే సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. టైటిల్ గెలిచిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు. ‘సింధూరం’, ‘కాలింగ్ సహస్ర’ వంటి చిత్రాల్లో నటించిన శివ బాలాజీ.. ఇటీవల ‘కన్నప్ప’లోనూ కీలక పాత్రలో కనిపించారు. తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ నటించిన ఆయన.. ఇప్పటికీ సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు.కౌశల్ మండారెండో సీజన్ విజేత కౌశల్ మండా. బిగ్‌బాస్ హౌస్‌లో తన ఆటతీరుతో భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతమైన సందడి కనిపించింది. అయితే టైటిల్ గెలిచిన తర్వాత ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు దక్కలేదని కౌశల్ స్వయంగా వెల్లడించారు. సినిమాలు, టెలివిజన్‌లో కొనసాగుతూనే వ్యక్తిగత జీవితం, కుటుంబంపై కూడా దృష్టి సారించారు.ఇదీ చదవండి: ఒకేసారి ఐదు భాషల్లో ‘బిగ్‌బాస్’.. ఎవరు ఎక్కడ హోస్ట్!రాహుల్ సిప్లిగంజ్:మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్. బిగ్‌బాస్ టైటిల్ తర్వాత ఆయన కెరీర్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటను పాడిన గాయకుల్లో రాహుల్ కూడా ఉన్నారు. ఈ పాటకు ఆస్కార్ రావడంతో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కాగా ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో తనపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వార్తలు వచ్చిన సమయంలో రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ తన వాదనను వెల్లడించారు.అభిజీత్ దుద్దాల: నాలుగో సీజన్ విజేత అభిజీత్ దుద్దాల. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో సినిమాల్లోకి వచ్చిన ఆయన.. బిగ్‌బాస్ విజయంతో మరింత పాపులర్ అయ్యారు. అనంతరం సినిమాలు, డిజిటల్ ప్రాజెక్టుల్లో నటిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. నటుడిగా మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.వీజే సన్నీ: ఐదో సీజన్ టైటిల్‌ను వీజే సన్నీ సొంతం చేసుకున్నారు. టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. బిగ్‌బాస్ తర్వాత నటుడిగానూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలు, ఇతర ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టులతో కెరీర్‌ను మార్చుకున్నారు. ఎల్.వీ. రేవంత్ : ఆరో సీజన్ విజేత ఎల్.వీ. రేవంత్. అప్పటికే ప్రముఖ గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ‘ఇండియన్ ఐడల్’ విజేతగానూ నిలిచారు. బిగ్‌బాస్ టైటిల్ తర్వాత కూడా సంగీతానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో పలు పాటలు పాడుతూ.. సినిమాలు, మ్యూజికల్ ఈవెంట్లతో బిజీగా కొనసాగుతున్నారు.ఎక్కువమంది చదివింది: ‘అప్పట్లో నాకు చాలా గర్వం.. ఇలా ఉంటే ఇండస్ట్రీలో కష్టమన్నారు’పల్లవి ప్రశాంత్ : ఏడో సీజన్లో ‘రైతు బిడ్డ’గా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకున్నారు. అయితే విజయం తర్వాత జరిగిన పరిణామాలు ఆయనను వివాదాల్లోకి నెట్టాయి. బిగ్‌బాస్ ఫినాలే అనంతరం జరిగిన గొడవలు, వాహనాల ధ్వంసానికి సంబంధించి పల్లవి ప్రశాంత్, ఆయన సోదరుడిపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేయగా.. అనంతరం పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ లభించింది. బిగ్‌బాస్‌కు ముందు రైతుగా, యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన ఆయనకు టైటిల్ తర్వాత మరింత పాపులారిటీ వచ్చింది.నిఖిల్ మలియక్కల్: ఎనిమిదో సీజన్ విజేత నిఖిల్ మలియక్కల్. టెలివిజన్ సీరియళ్ల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. ‘గోరింటాకు’ వంటి సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్‌బాస్ విజయం ఆయన పాపులారిటీని మరింత పెంచింది. ప్రస్తుతం టెలివిజన్‌తో పాటు డిజిటల్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.కల్యాణ్ పడాల: తొమ్మిదో సీజన్లో ‘సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్’ థీమ్‌తో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కల్యాణ్ పడాల విజేతగా నిలిచారు. దీంతో బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో టైటిల్ గెలిచిన తొలి కామనర్‌గా రికార్డు సృష్టించారు. ఫైనల్లో తనూజ పుట్టస్వామిపై విజయం సాధించిన కల్యాణ్‌కు రూ.40 లక్షల నగదు బహుమతితో పాటు ఓ ఎస్యూవీ లభించింది. మాజీ భారత సైనికుడైన కల్యాణ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ మద్దతు లభించింది. అయితే విజయం తర్వాత ఓటింగ్ ప్రక్రియపై సోషల్ మీడియాలో జరిగిన చర్చ కూడా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు పదో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కొత్త విజేత ఎవరవుతారనేది బుల్లితెర అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్ 10’ డేట్ వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్లే!


