బిగ్‌బాస్ సీజన్10 మరి కొద్ది గంటల్లో బుల్లితెర ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. రేపు (సెప్టెంబర్ 6) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి తొలి కంటెస్టెంట్ ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా పెద్దపీట వేశారు. ఈ నేపథ్యంలో ‘అగ్నిపరీక్ష’ నుంచి మెయిన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే తొలి కంటెస్టెంట్‌గా రైతుబిడ్డ, జానపద గాయని ఝాన్సీ ఎంపికైంది.
అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి..
బిగ్‌బాస్ తెలుగు-10లో సామాన్యులకు అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ సీజన్-2ను నిర్వహించారు. ఇందులో 15 మంది సామాన్యులు పోటీపడ్డారు. వారిలో సింగర్ ఝాన్సీ తన ఆటతీరు, పాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అగ్నిపరీక్షలో ఆమె చూపిన ప్రతిభ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఆమెనే మెయిన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే తొలి కంటెస్టెంట్‌గా ఎంపికైంది.
‘తొలి అడుగు పడింది. ఇప్పుడు బిగ్‌బాస్ 10 వేదికపైకి అడుగు పెట్టబోతున్నాను. ఈ ప్రయాణంలో ఇంతవరకు నన్ను ముందుకు నడిపించిన మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలే నా అసలైన బలం. మీ ఆశీస్సులు నాకు కొండంత బలం. ఇక నా ఆటతో… మన పాటతో… మిమ్మల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాను. మీ ప్రేమ, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నా ప్రతి అడుగులో మీ ప్రోత్సాహం కావాలి’ అని ఇన్‌స్టా వేదికగా ఝాన్సీ పోస్ట్ చేసింది.


