చాలాసార్లు చావు నుంచి తప్పించుకున్నా: హీరో సుహాస్‌ | Hero Suhas Spoke Mandaadi Shooting In Movie Promotions | Sakshi
Sakshi News home page

చాలాసార్లు చావు నుంచి తప్పించుకున్నా: హీరో సుహాస్‌

Sep 4 2026 1:22 PM | Updated on Sep 4 2026 1:22 PM

Hero Suhas Spoke Mandaadi Shooting In Movie Promotions

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మండాడి’. ఆర్‌ఎస్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ పతాకంపై మదిమారన్‌ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్‌ కుమార్‌ నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 10న రిలీజ్‌ కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సుహాస్‌ ఓ ఇంటర్వ్యులో చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

అనుకున్న దానికంటే ఎక్కువగానే సంపాదించా..
‘మంచి మంచి అవకాశాలు రావడం వల్ల సంతోషంగా ఉంది. డబ్బులు కూడా అనుకున్నదాని కంటే ఎక్కువగానే సంపాదించా. మండాడిలో పూర్తిస్థాయిలో విలన్‌గా నటించా. పాత్ర కూడా భయపెట్టే విధంగా ఉంటుంది. సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. షూటింగ్‌ సముద్రం మధ్యలో చేశాం. కొన్ని సందర్భాల్లో చావు నుంచి కూడా తప్పించుకున్నాం. సముద్రం లోపల షూటింగ్‌ అంటే కొంచం కష్టంగానే ఉంటుంది’ అని తెలిపారు.

కాగా ఈ సినిమాలో మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మణికందన్‌ సహ–నిర్మాతగా వ్యవహరించారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఎల్‌ఎల్‌పీ రిలీజ్‌ చేస్తోంది. 

ఇదీ చదవండి: ఎయిర్‌హోస్ట్‌ నుంచి హీరోయిన్‌గా.. ఇదే రాశీ సింగ్‌ సక్సెస్‌ జర్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement