breaking news
Soori
-
మండాడికి కమల్‌హాసన్ అభినందనలు
సుహాస్, సూరి, మహిమా నంబియార్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మండాడి’. మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ఈ నెల 10న రిలీజ్ చేసింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. వంద కోట్ల వసూళ్లు సాధించి, ఇంకా దూసుకుపోతున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ యూనిట్‌ని నటుడు కమల్‌హాసన్ అభినందించారు. కమల్ని కలిసిన వారిలో సూరి, సుహాస్, రవీంద్ర విజయ్, దర్శక, నిర్మాతలున్నారు. -
ఆ ఒక్క సినిమా నా కెరీర్‌నే మార్చేసింది : సూరి
ఒక్క సినిమా చాలు.. ఓ నటుడి కెరీర్‌నే మార్చేయడానికి. మంచి బొమ్మ పడాలే కానీ.. అప్పటివరకు ఉన్న ఇమేజ్ను పక్కనపెట్టి రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోవచ్చు. అందుకు తమిళ నటుడు సూరి ప్రయాణమే ఓ చక్కటి ఉదాహరణ. కమెడియన్‌గా ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించిన సూరి.. ‘విడుదలై’తో ఒక్కసారిగా తనలోని సీరియస్ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘గరుడన్’, ‘కొట్టుక్కాళి’, ‘మామన్’ వంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ‘మండాడి’తోనూ మరోసారి తన సత్తా చాటుతున్నాడు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 65 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూరి..తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.నేను కమెడియన్‌గా చాలా సినిమాలు చేశాను. చాలా మంది దర్శకులు నాతో రకరకాల కామెడీ చేయించారు. కానీ నాలో ఉన్న భిన్నమైన నటుడిని గుర్తించింది మాత్రం వెట్రిమారన్. ఆయన దర్శకత్వం వహించిన ‘విడుదలై’(తెలుగులో ‘విడుదల) చిత్రం నా కెరీర్‌నే మార్చేసింది. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం నేను ఆయన దగ్గరకు వెళ్లాను. కానీ ఆయన నన్నే హీరోగా తీసుకొని సినిమా చేశాడు. హీరోగా మారిన తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులను నేను ఎంతో గౌరవిస్తాను. వారి అంచనాలకు తగ్గట్లుగా కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను. మన గతాన్ని మర్చిపోకుండా, అహంకారానికి పోకుండా ఉంటే.. సినిమా మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. కొత్త, పాత దర్శకులతో కలిసి పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను’ అని సూరి అన్నారు. -
సుహాస్ మండాడి.. బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లు..!
టాలీవుడ్ హీరో సుహాస్, కోలీవుడ్ నటుడు సూరి ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ మండాడి. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ మూవీకి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా అదరగొడుతోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. కేవలం మౌత్ టాక్‌తో మండాడి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సెప్టెంబర్ 10న తెలుగులో రిలీజ్ చేశారు. మండాడి కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సాట్టా పులి(సుహాస్) ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటాడు. పడవల తయారీ వ్యాపారం చేస్తూనే.. సునామీ రైడర్స్ జట్టుతో ప్రతిసారి పడవ పోటీలకు దిగుతూ విజేతగా నిలుస్తుంటాడు. ఈ సారి టీమ్‌లోకి తీసుకోమని మండాడి వర్గానికి చెందిన మల్లేష్ అనే కుర్రాడు అడుగుతాడు. అందుకు పులి కొడుకు కిశోర్ ఒప్పుకోకపోవడంతో గంగాలమ్మ జాతరలో అతనిపై దాడి చేస్తాడు. దీంతో పులి..తన మనుషులతో మల్లేష్‌ని చంపించేందుకు ప్రయత్నిస్తాడు. ప్రాణాలను దక్కించుకునేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న కాళి(సూరి) దగ్గరకు వస్తాడు. #Mandadi crossed 65cr+ world wide gross 🔥Marching towards 100cr 💥@sooriofficial consistency 👌🏻 pic.twitter.com/MFsptPdvn1— Quality Pixels (@Quality_Pixels) September 15, 2026 -
’మండాడి‘పై రజినీకాంత్ రివ్యూ.. నటుడు ఎమోషనల్
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ మూవీ అంచనాలకు మించి విజయాన్ని మూటగట్టుకుంది. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్తో పాటు సముద్రంలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాను చూసిన రజినీకాంత్ చిత్రబృందానికి మెచ్చుకున్నారు. ముఖ్యంగా సూరి నటనను ప్రశంసించారు. ఈ క్రమంలో రజినీకాంత్ స్వయంగా సూరికి ఫోన్ చేసి అభినందించారు.ఇదీ చదవండి: అంబానీ ఇంట గణపతి పూజ.. సినీ తారల సందడి రజినీ కాంత్ నుంచి ఫోన్ కోలీవుడ్ నటుడు సూరి హీరోగా నటించిన ‘మండాడి’ సినిమాను చూసిన రజినీకాంత్.. ఆయన నటనను మెచ్చుకుంటూ స్వయంగా ఫోన్ చేశారు. దీంతో సూరి భావోద్వేగానికి గురయ్యారు. రజినీకాంత్ నుంచి వచ్చిన ఈ కాల్ తనకు ఎంతో ప్రత్యేకమని సూరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌తో జరిగిన సంభాషణకు సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు.ఈ చిత్రంలో సూరితో పాటు సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, మిథున్ జై శంకర్, రవీంద్ర విజయ్, బాల శరవణన్ తదితరులు నటించారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తమిళం, తెలుగులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబెడుతోంది. ఇది చదవండి: ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక.. అధికారిక ప్రకటనకథ ఏంటంటే..శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సాట్టా పులి(సుహాస్) ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటాడు. పడవల తయారీ వ్యాపారం చేస్తూనే.. సునామీ రైడర్స్ జట్టుతో ప్రతిసారి పడవ పోటీలకు దిగుతూ విజేతగా నిలుస్తుంటాడు. ఈ సారి టీమ్‌లోకి తీసుకోమని మండాడి వర్గానికి చెందిన మల్లేష్ అనే కుర్రాడు అడుగుతాడు. అందుకు పులి కొడుకు కిశోర్ ఒప్పుకోకపోవడంతో గంగాలమ్మ జాతరలో అతనిపై దాడి చేస్తాడు. దీంతో పులి..తన మనుషులతో మల్లేష్‌ని చంపించేందుకు ప్రయత్నిస్తాడు. ప్రాణాలను దక్కించుకునేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న కాళి(సూరి) దగ్గరకు వస్తాడు.పూర్తి రివ్యూ కోసం ఇది చదవండి: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: మండాడినటీనటులు: సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులునిర్మాణ సంస్థ: ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్నిర్మాత:ఎల్రెడ్ కుమార్దర్శకుడు: మతిమారన్ పుగళేందిసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్సినిమాటోగ్రఫీ:ఎస్.ఆర్. కథిర్ఎడిటింగ్: ప్రదీప్ ఇ.రాఘవ్విడుదల తేది: సెప్టెంబర్ 10, 2024వైవిధ్యమైన పాత్రలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తెలుగు నటుడు సుహాస్ నటించిన తొలి తమిళ సినిమా మండాడి. ఇందులో ఆయన విలన్ పాత్రను పోషించగా.. కోలీవుడ్ యాక్టర్ సూరి హీరోగా నటించాడు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో టాలీవుడ్‌లోనూ ‘మండాడి’పై హైప్ క్రియేట్ అయింది. మరి మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేటంటంటే.. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సాట్టా పులి(సుహాస్) ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటాడు. పడవల తయారీ వ్యాపారం చేస్తూనే.. సునామీ రైడర్స్ జట్టుతో ప్రతిసారి పడవ పోటీలకు దిగుతూ విజేతగా నిలుస్తుంటాడు. ఈ సారి టీమ్‌లోకి తీసుకోమని మండాడి వర్గానికి చెందిన మల్లేష్ అనే కుర్రాడు అడుగుతాడు. అందుకు పులి కొడుకు కిశోర్ ఒప్పుకోకపోవడంతో గంగాలమ్మ జాతరలో అతనిపై దాడి చేస్తాడు. దీంతో పులి..తన మనుషులతో మల్లేష్‌ని చంపించేందుకు ప్రయత్నిస్తాడు. ప్రాణాలను దక్కించుకునేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న కాళి(సూరి) దగ్గరకు వస్తాడు. రాజీ కోసం మల్లేష్‌ని తీసుకొని కళింగపట్నం వస్తాడు కాళి. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆయన ఆ ఊరిలోకి అడుగుపెడతాడు. రాజీలో భాగంగా పడవ పోటీలకు దిగుతారు. అందులో ఎవరు గెలిస్తే వాళ్లు కళింగపట్నానికి అధికారిక జట్టు, ఓడిపోయిన వాళ్లు పోర్ట్ ని వదిలివెళ్లిపోవాల్సి ఉంటుందని కండీషన్ పెడతారు. మరి ఈ పోటీలో కాళి తన కళింగ వారియర్స్ టీమ్‌ని ఎలా గెలిపించాడు? కాళిని ఓడించేందుకు పులి చేసిన కుట్రలు ఏంటి? అసలు కాళి ఊరి వదిలివెళ్లిపోవడానికి గల కారణం ఏంటి? ఎప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న కాళి, పులి ఇప్పుడు బద్ద శత్రువులుగా ఎలా మారారు? ఈ కథలో ఏంజిల్(మహిమా నంబియార్), మునయ్య(సత్యరాజ్)పాత్రలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పడవ పోటీల నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఇది. దానికి స్నేహబంధాన్ని, పల్లెటూరి ఎమోషన్ని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. సముద్రంలో పడవల పోటీ అనే పాయింట్ కొత్తగా ఉన్నా.. దాని చుట్టు అల్లుకున్న కథ, సన్నివేశాలన్నీ రొటీన్‌గానే ఉన్నాయి. హీరో, విలన్ ఒకప్పుడు స్నేహితులుగా ఉండడం.. ఓ కారణంగా విడిపోయి బద్ద శత్రువులుగా మారడం.. చివరకు ఇద్దరి మధ్య పోటీ జరగడం..హీరో గెలవడం.. ఇలాంటి నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ చిత్రం నేపథ్యం కూడా ఇలానే సాగుతుంది. ముగింపులో వచ్చే పడవ పోటీ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. అయితే సినిమా ప్రారంభం అయిన కాసేపటికే ప్లాష్‌బ్యాక్ స్టోరీతో పాటు క్లైమాక్స్ కూడా ఊహించొచ్చు. అయినప్పటికీ ఒకటి రెండు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కానీ కథనం చాలా వరకు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో అసలు కథ ప్రారంభించడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. హీరో హైదరాబాద్ నుంచి కళింగపట్నం వచ్చిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. పంచాయితీ పెట్టడం.. పడవల పోటీకి రెడీ అవ్వడం ఇవన్నీ రొటీన్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ సీన్‌తో సెకండాఫ్ పూర్తిగా ఊహించొచ్చు. అయితే కథను ఊహించినా..కొన్ని సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే పడవల పోటీ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అలాగే ప్లాష్‌బ్యాక్‌లో సాగే కాళీ, ఏంజల్ ప్రేమ సన్నివేశాలు, కోచ్ ముని జట్టుని నడిపించే తీరు.. ఎమోషన్ కూడా ఆకట్టుకుంటుంది. ఫస్టాప్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్. ముఖ్యంగా పడవ పోటీలకు సంబంధించిన సన్నివేశాలే ఈ సినిమాకు ప్రధానబలం అని చెప్పొచ్చు. ఎవరెలా చేశారంటే.. కాళి పాత్రకి సూరి పూర్తి న్యాయం చేశాడు. ఎలాంటి ఎలివేషన్స్, హంగులు లేకుండా చాలా సింపుల్‌గా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. దానికి తగ్గట్లుగానే సూరి నటించాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక సుహాస్ విలన్‌గా మెప్పించాడు. తెరపై కొత్త గెటప్‌లో కనిపిస్తూనే.. మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఏంజల్గా మహిమా నంబియార్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. చక్కగా నటించింది. ఇక సత్యరాజ్ కూడా మంచి పాత్రను పోషించాడు. కోచ్ మునయ్య పాత్రలో ఒదిగిపోయాడు. మల్లేష్ పాత్ర పోషించిన నటుడితో పాటు మిగిలినవారంతా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం కథను ఎలివేట్ చేసేలా ఉంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రపీ బాగుంది. సముద్రపు సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో చాలా వరకు సాగదీత సీన్లు ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
చాలాసార్లు చావు నుంచి తప్పించుకున్నా: హీరో సుహాస్
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మండాడి’. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 10న రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సుహాస్ ఓ ఇంటర్వ్యులో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అనుకున్న దానికంటే ఎక్కువగానే సంపాదించా..‘మంచి మంచి అవకాశాలు రావడం వల్ల సంతోషంగా ఉంది. డబ్బులు కూడా అనుకున్నదాని కంటే ఎక్కువగానే సంపాదించా. మండాడిలో పూర్తిస్థాయిలో విలన్‌గా నటించా. పాత్ర కూడా భయపెట్టే విధంగా ఉంటుంది. సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. షూటింగ్ సముద్రం మధ్యలో చేశాం. కొన్ని సందర్భాల్లో చావు నుంచి కూడా తప్పించుకున్నాం. సముద్రం లోపల షూటింగ్ అంటే కొంచం కష్టంగానే ఉంటుంది’ అని తెలిపారు.కాగా ఈ సినిమాలో మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మణికందన్ సహ–నిర్మాతగా వ్యవహరించారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ రిలీజ్ చేస్తోంది. ఇదీ చదవండి: ఎయిర్‌హోస్ట్ నుంచి హీరోయిన్గా.. ఇదే రాశీ సింగ్ సక్సెస్ జర్నీ -
'నన్ను ఘోరంగా అవమానించారు'.. కోలీవుడ్ హీరో ఆవేదన
కోలీవుడ్ హీరోలు ఇప్పటికే చాలామంది తెలుగులోనూ ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో సూర్య ముందు వరుసలో ఉంటారు. ఆ తర్వాత విజయ్, ధనుశ్, కార్తీ, విశాల్, అజిత్ లాంటి స్టార్స్‌కు సైతం టాలీవుడ్లో ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం మరో కోలీవుడ్ హీరో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్నాడు. అతను మరెవరో కాదు.. మండాడి మూవీతో అలరించేందుకు వస్తోన్న సూరి. ఈ మూవీ వచ్చే శుక్రవారం తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది.ప్రస్తుతం మండాడి మూవీ ప్రమోషన్లతో బిడీగా ఉన్న సూరి.. ఇండస్ట్రీలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తనను ఘోరంగా అవమానించిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన చొక్కా విప్పేసి వేరే వ్యక్తికి ఇచ్చారని సూరి వెల్లడించారు.సూరి మాట్లాడుతూ..'నన్ను ఒక పెద్ద హీరో మూవీ షూటింగ్ కోసం పిలిచారు. అందులో ఒక టాప్ కమెడియన్‌తో కలిసి నటించే సీన్. షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ పెద్ద హీరో.. దర్శకుడు కలిసి మానిటర్లో సీన్ చూసుకున్నారు. ఆ తర్వాత వారు నా చొక్కా విప్పేసి.. రికమండేషన్‌తో వచ్చిన వేరే వ్యక్తికి ఇవ్వమని చెప్పారు. అది నా సొంత చొక్కా అయినా కూడా లాక్కొని కాస్ట్యూమ్ వెహికల్‌పైకి విసిరేశారు. ఒంటిపై కేవలం ఒక టవల్ మాత్రమే కప్పుకుని, తీవ్ర అవమాన భారంతో నా చొక్కా కోసం అక్కడ వెతుక్కున్నా. నా సినీ ప్రయాణంలో నన్ను అత్యంత మానసిక వేదనకు గురిచేసిన సంఘటన ఇదే. ఇది ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన' అని పంచుకున్నారు.కాగా.. వెన్నెలా కబడ్డికుళు సినిమాతో వెండితెరకు పరిచయమైన సూరి.. తర్వాత పలు చిత్రాల్లో హాస్య నటుడిగా నటించి పేరు తెచ్చుకున్నారు. అలాంటి సమయంలో దర్శకుడు వెట్రిమారన్ తీసిన 'విడుదలై'తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలో ఇది సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'విడుదలై 2, మామన్, గరుడన్ తదితర మూవీస్‌లో సూరి హీరోగా చేసి సక్సెస్ అందుకున్నాడు. -
నేను ఈ స్థాయిలో ఉండటానికి వెట్రిమారనే కారణం
తాను ఈ స్థాయిలో ఉండటానికి దర్శకుడు వెట్రిమారనే కారణమని తమిళ హీరో సూరి పేర్కొన్నాడు. 'వెన్నెలా కబడ్డికుళు' సినిమాతో నటుడిగా పరిచయమైన సూరి.. తర్వాత పలు చిత్రాల్లో హాస్య నటుడిగా నటించి పేరు తెచ్చుకున్నారు. అలాంటి సమయంలో దర్శకుడు వెట్రిమారన్ తీసిన 'విడుదలై'తో హీరోగా మారాడు. తమిళంలో ఇది హిట్ అయింది. తర్వాత 'విడుదలై 2, మామన్, గరుడన్ తదితర మూవీస్‌లో సూరి హీరోగా చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇతడు చేసిన 'మండాడి' వచ్చే శుక్రవారం తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: తమిళ హీరో సూరి కాళ్లు మొక్కిన తెలుగు హీరో సుహాస్)సముద్ర నేపథ్యంగా తీసిన ఈ భారీ సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకుడు. తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్ర చేశాడు. మహిమా నంబియార్ హీరోయిన్. మత్స్యకారుల జీవిత ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఇటీవల చైన్నెలో నిర్వహించారు. ఇందులో దర్శకుడు వెట్రిమారన్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటుడు సూరి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.నేనీ స్థాయికి చేరుకోవడానికి ముఖ్య కారణం దర్శకుడు వెట్రిమారనే. ఆయన నాటిన విత్తనం ఇప్పుడు చెట్టుగా మారింది. బోటు పోటీల్లో బోటులో ఉండే ఆరుగురికి మార్గదర్శి మండాడి. ఈ చిత్రం కోసం రిస్క్ తీసుకోలేదు. రిస్క్‌నే చిత్రంగా చేశాం. రెండు నెలలు సముద్రంలో షూటింగ్ చేశాం. ఈ కార్యక్రమానికి మా అమ్మ వచ్చారు.ఆమె నాకు దేవతలాంటిది అని సూరి చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: నెలలు గడిచినా నన్ను పంపించలేదు.. నా భార్య భయపడిపోయి: సూరి) -
నెలలు గడిచినా నన్ను పంపించలేదు.. నా భార్య భయపడిపోయి
సినిమా చూస్తున్నప్పుడు సరదాగా ఉంటుంది. కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడో ఓసారి సదరు చిత్రాల్లో నటించిన వాళ్లు చెబితే తప్పితే ఆ సంగతులు బయటపడవు. ఇప్పుడు అలానే తమిళ హీరో సూరి.. 'మండాడి' చిత్రం విషయంలో తనకెదురైన చిత్రమైన ఫన్నీ అనుభవాన్ని పంచుకున్నాడు. చెన్నైలో శుక్రవారం జరిగిన ఆడియో లాంచ్ సందర్భంగా ఇదంతా చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: తమిళ హీరో కాళ్లు మొక్కిన తెలుగు హీరో సుహాస్)'మండాడి సినిమా కమిట్ అయినప్పుడు 80 శాతం చిత్రీకరణ స్విమ్మింగ్ పూల్‌లో, 20 శాతం నిజమైన సముద్రంలో చేస్తామని దర్శకుడు చెప్పారు. వెట్రిమారన్ కూడా.. టైటానిక్ సహా ఎన్నో సముద్ర నేపథ్య సినిమాలు స్విమ్మింగ్ పూల్‌లోనే తీశారని చెప్పారు. దీంతో నేను ఓకే అనేశా. కానీ షూటింగ్ మొదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది''10 రోజులు గడిచాయి. నెలరోజులు గడిచాయి. రెండు నెలలు అయిపోయాయి. అయినా షూటింగ్ మాత్రం నిజమైన సముద్రంలో చేస్తున్నారు. నన్ను ఇక్కడి నుంచి పంపించకపోయేసరికి నా భార్య తెగ భయపడిపోయి ప్రతిరోజూ ఫోనే చేసేసేది. కానీ నేను ఎత్తలేకపోయేవాడిని. దీంతో రెండురోజులకు ఓసారి నేనే ఆమెకు ఫోన్ చేసి 'నేను బతికే ఉన్నాను' అని చెప్పేవాడిని' అని సూరి నవ్వుతూ ఈ సినిమా అనుభవాన్ని పంచుకున్నాడు.తెలుగు హీరో సుహాస్ ఈ మూవీలో విలన్‌గా చేశాడు. వచ్చే నెల 10వ తేదీన తెలుగు, తమిళంలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. పూర్తిగా సముద్రం బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. అయితే సముద్రంలో తీస్తున్న టైంలో ఒకటిరెండుసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి.(ఇదీ చదవండి: 40 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులకు కారణం నేనే: 'జైలర్' విలన్)#Soori's Fun speech 😁:"While committing #Mandaadi director told 80% of the film we will shoot in Swimming pool & 20% only in actual sea. Even VetriMaaran sir told, #Titanic & many other sea films was shoot on Swimming pool😂. 10 days gone...1 month gone...2 months gone shooting… pic.twitter.com/vSeVTged2v— AmuthaBharathi (@CinemaWithAB) August 28, 2026 -
తమిళ హీరో కాళ్లు మొక్కిన తెలుగు హీరో సుహాస్
తెలుగు హీరో సుహాస్ ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించాడు. గత రెండేళ్లలో దాదాపు 10కి పైగా సినిమాల్లో కనిపించిన ఇతడు.. ఈ ఏడాది మాత్రం 'హే బల్వంత్' అని ఒకే మూవీతో వచ్చాడు. కామెడీగా ఉన్న ఈ చిత్రం పర్లేదనిపించింది. ఇక ఇదే ఏడాది తమిళంలోకి 'మండాడి'తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సెప్టెంబరు 10న ఇది తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో శుక్రవారం జరగ్గా.. ఇందులో సుహాస్.. హీరో సూరి కాళ్లు మొక్కాడు.(ఇదీ చదవండి: ఊపేస్తున్న 'ప్యారడైజ్' కొత్త పాట.. లిరికల్ వీడియో రిలీజ్)'మండాడి' సినిమా విషయంలో తనకు అన్ని విధాల సూరి అన్న అండగా నిలిచాడని చెబుతూ సుహాస్ భావోద్వేగానికి గురయ్యాడు. స్టేజీపైనే అందరి ముందు కాళ్లు మొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇకపోతే ఈ మూవీని భిన్నమైన స్క్రీన్ ప్లేతో పూర్తిగా సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీగా తెరకెక్కించారు. తమిళం వరకు సూరి హీరో, సుహాస్ విలన్‌గా కనిపించనుండగా.. తెలుగులోకి వచ్చేసరికి సుహాస్ హీరోగా, సూరి విలన్‌గా కనిపించనున్నారట. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు మతిమారన్ పుళగెంది దర్శకుడిగా వ్యవహరించాడు.(ఇదీ చదవండి: అమ్మ జ్ఞాపకార్థం.. కొత్తింట్లోకి తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా)#Suhas:"Soori Anna is my strength, my backbone & my piller of #Mandaadi. This is from the bottom of my heart. I also came from Junior Artist to Hero. Thank you for inspiring me & many. Love you Anna♥️" pic.twitter.com/aiWTEVhnyj— AmuthaBharathi (@CinemaWithAB) August 28, 2026 -
యాక్షన్ మండాడి
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మండాడి’. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న రిలీజ్ కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ రిలీజ్ చేస్తోంది.‘‘ఈ సినిమా కోసం సుహాస్, సూరి బాగా మేకోవర్ అయ్యారు. ఈ చిత్రంలోని బోట్ సీక్వెన్స్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మణికందన్ సహ–నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. -
'మండాడి' మేకింగ్ వీడియో.. రా అండ్ రస్టిక్ లుక్‌లో సుహాస్
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'మండాడి'. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తీస్తుండగా ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది దర్శకుడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా)దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో యాక్షన్, బోట్ సీక్వెన్స్ హైలెట్ అవుతాయని సమాచారం. సుహాస్, సూరి మధ్య వచ్చే సీన్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయని టీం చెబుతోంది. తాజాగా సుహాస్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని షేర్ చేశారు. అందులో సుహాస్ మేకోవర్, సీన్స్‌ను షూట్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. కత్తి పట్టుకుని కనిపించాడు. ఈ మూవీలో సాట్ట పులి పాత్రని సుహాస్ చేశాడు.(ఇదీ చదవండి: అలాంటి సమాజంలో మనం ఉన్నాం.. సింగర్ సునీత క్లారిటీ) -
సూరి సినిమాలో హీరోయిన్గా 'డ్యూడ్' బ్యూటీ!
సినిమా ఎవరిని ఎప్పుడు? ఏ స్థాయిలో నిలబెడుతుందో చెప్పలేం. అప్పటివరకు ప్రయత్నలోపం లేకుండా శ్రమిస్తూనే ఉండాలి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సహాయనటుడి నుంచి హాస్యనటుడిగా ఎదిగి ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు నటుడు సూరి. విడుదలై మూవీతో హీరోగా ట్రాక్ ఎక్కిన ఈయన ఇటీవల విడుదలైన మామన్ మూవీ వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.కమెడియన్ నుంచి హీరోగా..ప్రస్తుతం ఇతడు మండాడి సినిమా చేస్తున్నాడు. సముద్రతీరంలో జాలర్ల పడవల పోటీ నేపథ్యంలో రూపొందుతున్న కథా చిత్రమిది. మదిమారన్ పుహళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఇది నిర్మాణంలో ఉండగా మరో సినిమాకు కమిటయ్యాడు సూరి.రియల్ స్టోరీ ఆధారంగా మూవీరవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మించనుంది. 2015లో చెన్నైలో బీభత్సం సృష్టించిన వరదల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం. ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో సూరికి జంటగా మమిత బైజు హీరోయిన్గా నటించనున్నట్లు వినికిడి. ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ డ్యూడ్ సినిమాతో మరో హిట్ అందుకుంది. హీరోయిన్ ఎవరంటే?విజయ్ హీరోగా నటించిన జననాయకన్లోనూ కీలక పాత్ర పోషించింది. సూర్యకు జంటగా విశ్వనాథ్ అండ్ సన్స్, ధనుష్‌తో కర సినిమాలు చేసింది. ఇవన్నీ త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సూరితో మమిత బైజు జోడీ కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! -
ఈ హీరోకు తొలిసారి రూ.75 కోట్ల బడ్జెట్!
హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి, కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు సూరి. ఈయన హీరోగా నటించి విడుదలైన గరుడన్, మామన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా సూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మండాడి. ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మదిమారన్ పుహళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సముద్ర తీరంలో జరిగే జాలర్ల బోటు పందేల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న సినిమా. ఇందులో సూరి జాలరిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చాలా వర్కౌట్ చేసి పూర్తిగా మారిపోయారు. రూ.75 కోట్లతో రూపొందుతున్న మండాడి సూరి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ స్టంట్ నిపుణులతో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ 40 రోజులపాటు చిత్రికరించినట్లు చెప్పారు. చిత్రంలోని బోటు ఫైట్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయన్నారు. దీనికి ప్రకాష్‌కుమార్ సంగీతం మరింత బలాన్ని చేకూర్చిందన్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. -
'సూరి'కి బర్త్‌డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
తమిళ నటుడు సూరి ఒకప్పుడు రోజుకూలీగా పని చేశారు. ఇదే విషయాన్ని గతంలో ఆయన చెప్పారు. కేవలం రూ. 20 కోసం రోజంతా కష్టపడేవాడినని ఆయన తెలిపారు. హాస్యనటుడిగా ఉన్న సూరిని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు వెట్రిమారన్ 'విడుదలై' సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ భారీ విజయం అందుకోవడం కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సూరి మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఆగష్టు 27న సూరి పుట్టినరోజు కావడంతో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ శుభాకాంక్షలు చెబుతూ ఒక ఫోటో పంచుకుంది.'సూరి'కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కీర్తి సురేష్ పంచుకున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. 'లవ్ యూ డా తంగాచ్చి (సోదరి)' అంటూ సూరి కూడా ఆమెకు కృతజ్ఞతలు తెలిపాడు. గతంలో వారిద్దరూ కలిసి కొన్ని సినిమాలకు పనిచేశారు. మామన్నన్ (2023)లో విడుదలైన ఈ మూవీలో నటించారు. కీర్తి సురేష్ తనకు దేవుడు ఇచ్చిన చెల్లెలు అంటూ సూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.1998లో తమిళ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సూరికి మొదట పెద్దగా గుర్తింపు లేని పాత్రలే దక్కాయి. అయితే, 2009లో విడుదలైన 'వెన్నిల కబాడి కుజు' చిత్రం తనకు గుర్తింపు తెచ్చింది. సుమారు పదేళ్ల పాటు తన కష్టానికి ఫలితం దక్కింది. ఈ మూవీతోనే తనకు 'పరోట్ట సూరి' అనే గుర్తింపు వచ్చింది. ఇక దర్శకుడు వెట్రిమారన్ సినిమా వల్ల తన జీవితమే మారిపోయింది. ఆ తర్వాత గరుడన్, మామన్ వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం 'మందాడి' అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో తెలుగు నటుడు సుహాస్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.என் அன்பு அண்ணனுக்கு இனிய பிறந்தநாள் நல்வாழ்த்துக்கள் 🤗❤️@sooriofficial pic.twitter.com/NOvQIC4EKH— Keerthy Suresh (@KeerthyOfficial) August 27, 2025 -
ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ
ఓటీటీలోకి మరో హిట్ సినిమా వచ్చేసింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని కొన్నిరోజుల క్రితం ఒరిజినల్ వెర్షన్ మాత్రమే డిజిటల్ రిలీజ్ చేశారు. దీంతో చాలామంది తెలుగు ఆడియెన్స్.. మన భాషలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు వినాయక చవితి కానుకగా తెలుగు, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.కమెడియన్ నుంచి హీరోగా మారిన తమిళ నటుడు సూరి.. ఈ ఏడాది 'మామన్' అనే సినిమా చేశాడు. మే నెలలో థియేటర్లలో రిలీజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రశాంత్ పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. కుటుంబ బంధాల్ని, మేనమామ రిలేషన్ గొప్పదనాన్ని చూపించిన ఈ చిత్రం జీ5 ఓటీటీలో ఆగస్టు తొలివారం రిలీజ్ చేశారు. అయితే అప్పుడు తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: బాలీవుడ్ స్టార్స్ 'భగ్న' ప్రేమకథ!)ఇప్పుడు తెలుగు, కన్నడ డబ్బింగ్ కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు. అక్కా తమ్ముడు బంధాన్ని చాలా ఎమోషనల్‌గా ఈ చిత్రంలో చూపించారు. అక్క బిడ్డల కోసం మేనమామగా చేయాల్సిన బాధ్యతలను నేటి సమాజానికి గుర్తుచేసేలా మూవీని తెరకెక్కించారు. తెలుగు, కన్నడ కూడా జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఓ లుక్కేయండి.'మామన్' విషయానికొస్తే.. తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో ఇన్బా, గిరిజ అక్కా తమ్ముడు. ఇన్బాకు అక్కంటే ప్రాణం. అక్కకు పెళ్ళైన చాలా కాలం తరువాత అతి కష్టం మీద ఓ బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరు లడ్డూ. అక్క బిడ్డను ఇన్బా అపురూపంగా చూసుకుంటుంటాడు. ఎంతలా అంటే తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి రేఖకన్నా లడ్డూ మీదే మమకారం పెంచుకునేంతలా. అదే సమయంలో ఇన్బా తండ్రి అవుతాడు. ఇక అక్కడి నుండి అసలు సిసలైన కథ మొదలవుతుంది. అదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ) -
మరో ఓటీటీకి సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ కమెడియన్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం గరుడన్. విడుదలై మూవీతో హీరోగా ఆకట్టుకున్న కమెడియన్ సూరి లీడ్ రోల్లో నటించారు. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ రాసిన స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. అక్కడ హిట్ కావడంతో తెలుగులోనూ భైరవం పేరుతో రీమేక్ చేసి ఇటీవలే విడుదల చేశారు. తెలుగు వర్షన్లో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే గరుడన్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని మరో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సన్ నెక్ట్స్ వేదికగా గరుడన్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో సూరితో పాటు శశి కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాకు ఆర్ఎస్ దురైసెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. Power, loyalty, betrayal – when friends turn foes, the fight becomes deadly.Garudan is coming to SunNXT on August 1. Are you ready for the storm?#GarudanOnSunNXT #Garudan #TamilCinema #PowerAndBetrayal #SunNXT #ActionDrama pic.twitter.com/wrcLo57YRF— SUN NXT (@sunnxt) July 28, 2025 -
ఇది పనికిమాలిన చర్య.. మరోసారి చేయకండి: సూరి
తమిళ నటుడు సూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మామన్. నటి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రం తాజాగా తమిళ్లో విడుదలైంది. మేనమామ, మేనల్లుడు అనుబంధం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఇదిలా ఉంటే మామన్ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ సూరి అభిమానులు దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయిస్తున్నారు. అలా తిరుప్పాంగుడ్రంలో కుమారస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన సూరి అభిమానులు కొందరు మామన్ చిత్రం విజయం సాధించాలని మొక్కుకుని నేలపై భోజనం చేశారు. ఆపై వారు వందల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టారు. సినిమా కటౌట్లకు పాలతో అభిషేకం చేశారు. టపాసులు పేలుస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించారు. ఈ విషయం తెలుకున్న సూరి తన అభిమానులపై ఫైర్ అయ్యారు. కథ, కథనం బాగుంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్నారు. సినిమా చూసి కాస్త ప్రేమ చూపుతే చాలన్నారు. అంతే కానీ నేలపై భోజనం చేయడం పనికిమాలిన చర్య అని, సినిమా విడుదల సమయంలో ఇలా వృధాగా ఖర్చు చేయడం చాలా వేదన కలిగిస్తోందని అన్నారు. ఆ డబ్బుతో నలుగురికి భోజనం పెట్టించవచ్చని, నీళ్లు, మజ్జిగ వంటివి ఇచ్చి దాహం తీర్చవచ్చని అన్నారు. ఇలాంటి చెత్త పనులు చేసే వారు తన అభిమానులని చెప్పుకునే అర్హతే లేదని పేర్కొన్నారు. సూరి అభిప్రాయాన్ని ప్రముఖ గీత రచయిత వైరముత్తు ప్రశంసించారు. అభిమానుల అనైతిక చర్యలను ప్రతి నటుడు ఖండించాలని, తమ అభిమానులకు హిత వ్యాఖ్యలు చేయాలన్నారు. అప్పుడే సంస్కృతి సంప్రదాయాలు ఇంకా మెరుగు పడతాయనే అభిప్రాయాన్ని వైరముత్తు వ్యక్తం చేశారు. ( వీడియో సన్ న్యూస్ సౌజన్యంతో) -
రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో
వారసత్వంతో వచ్చి హీరోలు, నటులు అయినవాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు. కానీ కొందరు యాక్టర్స్ మాత్రం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక్కో సినిమా చేసుకుంటా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో తమిళ నటుడు సూరి ఒకడు. ఇప్పుడు తన కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు.1998లో తమిళ ఇండస్ట్రీలోకి వచ్చిన సూరి.. దాదాపు ఆరేళ్ల పాటు గుర్తింపు దక్కని చాలా పాత్రలు చేశాడు. 2004 నుంచి ఆడపాదడపా పాత్రలు వచ్చాయి. అలా కమెడియన్ గా స్టార్ హీరోలందరితో చాలా సినిమాలు చేశాడు. 2022 వరకు అంటే దాదాపు 18 ఏళ్ల పాటు కామెడీ పాత్రలు చేశాడు. (ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు) అందరూ సూరిలో కమెడియన్ ని చూస్తే తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రం అద్భుతమైన నటుడిని చూశాడు. అలా 'విడుదల పార్ట్ 1' మూవీతో సూరిని హీరోగా లాంచ్ చేశాడు. తర్వాత గరుడన్, కొట్టుక్కళి, విడుదల పార్ట్ 2, బడవ సినిమాలతో సూరి ఆకట్టుకున్నాడు. 'మామన్' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన తొలి పని-జీతం, దాని ద్వారా నేర్చుకున్న జీవిత పాఠాల్ని చెప్పుకొచ్చాడు.'తిరుప్పుర్ లో నేను రోజు కూలీగా రూ.20 జీతానికి పనిచేశాను. వారమంతా కష్టపడితే రూ.140 వచ్చేది. అందులో సగం ఖర్చు పెట్టి, మిగతాది ఇంటికి పంపేవాడిని. జీవిత పాఠాల్ని నేను అప్పుడే నేర్చుకున్నాను' అని సూరి చెప్పుకొచ్చాడు. అప్పుడు రూ.20 జీతానికి పనిచేసిన ఇతడు.. ఇప్పుడు కష్టపడి నటుడిగా ఎదిగి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.(ఇదీ చదవండి: సాహసం చేసిన టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ.. వీడియో వైరల్) "I stated as a daily Wager in Tiruppur & my wages was ₹20 per day. Weekly I get ₹140, I will spend ₹70 & send back ₹70 to my home. I got to learn about the life lessons there🫶"Growth of #Soori🫡♥️pic.twitter.com/2PflFhYz4o— AmuthaBharathi (@CinemaWithAB) May 14, 2025 -
తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
కోలీవుడ్ నటుడు సూరి హీరోగా నటిస్తున్న పలు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం మామన్ చిత్రంతో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు మండాడి మూవీలో కూడా నటిస్తున్నాడు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎల్రెడ్ కుమార్ తన ఆర్ఎస్.ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. కాగా ఆయన శిష్యుడు, సెల్షి చిత్రం ఫేమ్ మణిమారన్ పుగళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి మహిమా నంబియార్ నాయకిగా నటిస్తుంది. అదేవిధంగా మండాడి చిత్రం ద్వారా తెలుగు నటుడు సుహాస్ ముఖ్య పాత్రతో కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, ఎస్ఆర్.కదీర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు సూరి మాట్లాడుతూ.. తాను హీరోగా నటిస్తున్న మండాడి చిత్రం ప్రారంభ కార్యక్రమాన్నే ఇంత బ్రహ్మండంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు అన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం దర్శకుడు వెట్రిమారన్‌నే అన్నారు. తాను ఏమీ లేకుండా వచ్చాననీ, ఇప్పుడు శక్తికి మించే సంపాదించినట్లు చెప్పారు. అందువల్ల ఇకపై నచ్చిన చిత్రాలు చేస్తే చాలన్నారు. సర్వైవల్ అవ్వడానికి భగవంతుడి భాగ్యంతో కళామతల్లి చూసుకుంటుందన్నారు. ఇప్పటి వరకు సంపాదించింది చాలు.. ఇకనుంచి తన విజయానికి కారణమైన అభిమానులకు తనవంతుగా సాయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నానని ఆయన అన్నారు. -
విజయ్ సేతుపతి 'విడుదల 2' సాంగ్ రిలీజ్
విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రధారులుగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విడుదల2. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సాంగ్ ' పావురమా పావురమా' మేకర్స్ విడుదల చేశారు. గతేడాదిలో రిలీజైన విడుదల చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత , శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు.ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. 'సంగీత మాంత్రికుడు ఇళయరాజా స్వరపరిచిన 'విడుదల 2' చిత్రంలోని తొలిపాటను తాజాగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. కాసర్ల శ్యామ్ కలం నుంచి వెలువడిన ఈ పాటను తెలుగు ప్రేక్షకులు ఇంత స్పీడుగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్‌గా విడుదల2 ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది.ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రిమారన్, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్ర హక్కులను మేము దక్కించుకున్నందుకు సంతోష పడుతున్నాం. డిసెంబర్ 20న ఇండియన్ సెల్యూలాయిడ్ పై ప్రేక్షకులంతా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.' అని ఆయన తెలిపారు.విజయ్ సేతుపతి, మంజు వారియర్ విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్,రాజీవ్ మీనన్, ఇలవరసు , బాలాజీ శక్తివేల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు. -
మ్యూజిక్ డైరెక్టర్ లేని సినిమా.. అంతా కోడి అరుపుతోనే
తెలుగులో కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి. ఏదో అప్పుడప్పుడు ఒకటి అరా కంటెంట్ ఓరియెంట్ మూవీస్ వస్తుంటాయి. కానీ తమిళ, మలయాళంలో మాత్రం దర్శకులు ఎప్పుడో ఏదో కొత్తదనం ట్రై చేస్తుంటారు. అలా తీసిన తమిళ సినిమా 'కొట్టుకళి'. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవసరమే లేకుండా ఈ చిత్రాన్ని తీయడం విశేషం. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్)'కల్కి'లో కైరా పాత్రలో నటించింది మలయాళ నటి అన్నాబెన్. 'కొట్టుకళి'లో ఈమె ప్రధాన పాత్రధారి. సూరి హీరోగా చేశాడు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మించాడు. గతంలో 'పెబ్బల్స్' అనే అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన పీఎస్ వినోద్ రాజ్ దీనికి దర్శకుడు. ఆగస్టు 23న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.కోడి పుంజు సీన్‌తో ట్రైలర్ మొదలవుతుంది. చుట్టూ ఉన్న సౌండ్స్‌తో పాటు కోడీ అరుపుతోనే ట్రైలర్ అంతా చూపించారు. దెయ్యం పట్టిన ఓ అమ్మాయిని దాన్ని వదిలించడానికి హీరో అండ్ గ్యాంగ్ తీసుకుపోవడం.. పల్లెటూరిలో జరిగే చిన్న చిన్న గొడవలు.. ఇలా ఏదో ఉంది అనేలా ట్రైలర్ చూపించారు. డిఫరెంట్ మూవీస్ చూద్దామనుకునే వాళ్లకు బహుశా ఇది నచ్చొచ్చేమో!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన వెరైటీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ) -
కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా పేరు తెచ్చుకునేంత వరకు వెళ్లిన నటుడు సూరి. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఇతడు గతేడాది 'విడుదలై' మూవీతో హీరోగా మారి హిట్ కొట్టాడు. ఇప్పుడు 'గరుడన్'గా రాబోతున్నాడు. ఉన్ని ముకుందన్, సముద్రఖని, రేవతీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మే 31న థియేటర్లలోకి రాబోతుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కథ అందించిన ఈ సినిమాకు దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. 'గరుడన్' ఆడియో ఈవెంట్ తాజాగా జరగ్గా దీనికి తమిళ స్టార్ హీరోలు విజయసేతుపతి, శివకార్తీకేయన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే శివకార్తికేయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.'హాస్య నటులని చులకనగా చూడొద్దు. ఓ టైంలో హీరోగా చేయమని సూరికి సలహా ఇచ్చాను. కానీ ఆయన కాస్త భయపడ్డాడు. కొన్నాళ్ల తర్వాత ఫోన్ చేసి.. వెట్రిమారన్ తనని హీరోగా పెట్టి మూవీ చేస్తున్నానని, కానీ కాస్త దడ పుడుతోందని అన్నాడు. అయితే కామెడీ నటులు సీరియస్ పాత్రల్లో నటించగలరు గానీ సీరియస్ నటులు కామెడీ పాత్రలు చేయలేరు. అందుకు సూరినే ఓ ఉదాహరణ' అని శివకార్తికేయన్ చెప్పాడు. తనని హీరోగా మార్చిన వెట్రిమారన్‌కి జీవితాంతం రుణపడి ఉంటానని సూరి ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్) -
నాలుగేళ్ల గొడవ క్లియర్.. హీరో-కమెడియన్ కలిసిపోయారు!
ఆ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లే, కలిసి 7 సినిమాలు చేశారు. ఆ తరువాత ఓ విషయంలో ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. అలాంటిది తాజాగా ఒకే ఫొటోలో నవ్వుతూ కనిపించారు. పైన చెప్పిన నటులెవరో కాదు. తమిళ ఇండస్ట్రీకి చెందిన విష్ణువిశాల్, హాస్య నటుడు సూరి. (ఇదీ చదవండి: సమంత, శ్రుతి హాసన్.. ఇద్దరూ ఆ ప్రాజెక్ట్ నుంచి ఔట్!) విష్ణువిశాల్ హీరోగా, సూరి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కలిసి 7 సినిమాలు చేశారు. కానీ ఓ స్థలం విషయంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. విష్ణువిశాల్, అతడి తండ్రి తనను మోసం చేశారని 2020లో నటుడు సూరి తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఈ వివాదం చాలాకాలం కొనసాగింది. నటుడు విష్ణువిశాల్ తండ్రి రమేష్.. మాజీ డీజీపీ. ఇటీవల లాల్ సలామ్ చిత్ర ప్రచార వేదికపై కూడా తమ మధ్య నెలకొన్న సమస్య గురించి తానూ, నటుడు సూరి చర్చించుకుంటున్నామని విష్ణు విశాల్ పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా నటుడు విష్ణువిశాల్ ఆయన తండ్రి రమేష్, సూరితో కలిసి ఉన్న ఫొటోను తన ఎక్స్మీడియాలో పోస్ట్ చేశారు. అందులో టైమ్ అన్నింటికీ, అందరికీ బదులిస్తుంది. ఐలవ్ యూ నాన్న హీరో విష్ణు విశాల్ పేర్కొన్నారు. అలాగే నటుడు సూరి కూడా జరిగేవన్నీ మంచికే అని తన ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో వీరి మధ్య సమస్య పరిష్కారం అయ్యిందని అందరూ అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!) TIME is the answer to everything and everyone.. Let the positivity flow @sooriofficial na.. Love u appa ..... pic.twitter.com/Yvn28SR31B — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) April 9, 2024 -
హీరోగా స్టార్ కమెడియన్.. మరో మాస్ చిత్రం రెడీ
తెలుగులో తక్కువ గానీ తమిళంలో పలువురు కమెడియన్స్ కూడా హీరోలుగా రాణిస్తున్నారు. సంతానం.. ఇలా ఇప్పటికే పలు చిత్రాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. తాజాగా కమెడియన్ సూరి కూడా డిఫరెంట్ మూవీస్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైపోతున్నాడు. గతేడాది 'విడుదలై' మూవీతో హీరోగా ఆకట్టుకున్న ఇతడు.. ఇప్పుడు 'గరుడన్'గా వచ్చేందుకు రెడీ అయిపోయాడు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ రాసిన స్టోరీతో 'గరుడన్' మూవీ తీశారు. ఇందులో సూరితో పాటు శశి కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. అలానే హీరోని కుక్కతో పోల్చుతూ చెప్పిన డైలాగ్స్, విజువల్స్ కూడా సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. త్వరలో విడుదల తేదీతో పాటు ఇతర వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) -
విడుదల సినిమా టీమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
Vidudhala Movie Review: వెట్రిమారన్ ‘విడుదల పార్ట్-1’ రివ్యూ
టైటిల్: విడుదల పార్ట్-1 నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి,భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇళవరసు తదితరులు నిర్మాత : ఎల్రెడ్ కుమార్ దర్శకత్వం: వెట్రిమారన్ సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్ రాజ్ విడుదల తేది: ఏప్రిల్ 15, 2023 కథేంటంటే.. పోలీసులకు, ప్రజా దళం అనే ఒక రివల్యూషనరీ గ్రూప్ కి మధ్య నడిచే కథ ఇది. కుమరేశన్ (సూరి) పోలీస్ డిపార్ట్మెంట్లో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ప్రజాదళం సభ్యులకు, పోలీసులకు నిత్యం ఎన్కౌంటర్ జరుగుతుంటాయి. ప్రజాదళం లీడర్ పెరుమాళ్(విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకుప్రైవేట్ కంపెనీతో కలిసి క్యాంపుని నిర్వహిస్తుంది పోలీసు శాఖ. ఇక డ్రైవర్ కుమరేశన్ అడవిప్రాంతంలో డ్యూటీ చేసే పోలీసులకు నిత్యం ఆహారం సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో అడవిలో నివసించే యువతి తమిళరసి అలియాస్ పాప(భవాని శ్రీ)తో ప్రేమలో పడతాడు. మరోవైపు తనపై అధికారికి తెలియకుండా కొండ ప్రాంతానికి చెందిన మహిళను కాపాడి అతని ఆగ్రహానికి గురవుతాడు. ఓసారి పెరుమాళ్ ఆచూకి కోసం కొండప్రాంతంలో నివసించేవారందరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతుంటారు. అందులో కుమరేశన్ ఇష్టపడిన యువతి తమిళరసి కూడా ఉంటుంది. పోలీసులు పెట్టే చిత్ర హింసలు చూడలేక కుమరేశన్ ఏం చేశాడు? పెరుమాళ్ కోసం సాగించే వేటలో కుమరేశన్ ఎలాంటి పాత్ర పోషించాడు? డీఎస్పీ సునీల్ మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? చివరకు పెరుమాళన్ దొరికాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కల్ట్ కంటెంట్ తో సామాజిక మూలలలోకి వెళ్లి కథలని తెర పై ఆవిష్కరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే దర్శకుడు వెట్రిమారన్. ఆయన సినిమాల్లో అంతర్లీనంగా సమాజంలో అణచివేయబడుతున్న ఒక వర్గం వేదన కనిపిస్తుంది. మనం ఎక్కడో విన్న, చూసిన సంఘటలనే ఆయన సినిమాగా తెరకెక్కిస్తుంటాడు. విడుదల పార్ట్ 1 కూడా ఆ తరహా సినిమానే. 1987 ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రం లోని ఒక ప్రాంతం లో జరిగే కథ. పోలీసులకు, ప్రజాదళం అనే ఒక విప్లవ పార్టీ కి మధ్య జరిగే సంఘర్షణ ఇది. ట్రైన్ యాక్సిడెంట్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. రైలు ప్రమాదపు దృశ్యాలను చాలా సహజంగా చూపించాడు. ఆ తర్వాత కథ మొత్తం కుమరేశన్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. నిజాయితీగా ఉండే పోలీసులకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? పై అధికారులు కిందిస్థాయి అధికారులతో ఎలా ప్రవర్తిస్తారనేది కుమరేశన్ పాత్ర ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే ఈ తరహా చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. పోలీసులు, నక్సలైట్ల మధ్య పోరు కారణంగా సామాన్య ప్రజలు ఎలా నలిగిపోయారనే కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇందులో ఉన్న లవ్‌స్టోరీలో కూడా కొత్తదనం లేదు. తమిళ నెటివిటీ మరీ ఎక్కువైంది. కాకపోతే ప్రతి సన్నివేశాన్ని చాలా సహజంగా తీర్చిదిద్దారు. కొన్ని సన్నివేశాలు హృదయాలను కలిచివేస్తాయి. ముఖ్యంగా పెరుమాళ్ కోసం ఊర్లోని ఆడవాళ్లను పోలీసులు హింసించే సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. అదే సమయంలో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. పార్ట్ 2 కోసం కొన్ని అనవసరపు సన్నివేశాలను జోడించారనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఆట్టుకోవడంతో పాటు పార్ట్ 2పై ఆసక్తిని పెంచేస్తుంది. ఎవరెలా చేశారంటే.. కమెడియన్‌గా ఇన్నాళ్లు నవ్వించిన సూరి.. ఇందులో కొత్త పాత్రను పోషించాడు. కుమరేశన్ పాత్రలో సూరి జీవించేశాడు. అసలు ఈ పాత్ర కోసం వెట్రిమారన్.. సూరిని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కమెడియన్లో ఈ యాంగిల్ ఎలా పసిగట్టాడనిపిస్తుంది. ఈ చిత్రంతో సూరి కేరీర్ చేంజ్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ప్రజాదళం నాయకుడు పెరుమాళ్‌గా విజయ్ సేతుపతి అదరగొట్టేశాడు. ఆయన తెరపై కనిపించేంది కొన్ని నిమిషాలే అయితే.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పార్ట్ 2లో విజయ్ సేతుపతి పాత్ర నిడివి ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కొండప్రాంతానికి చెందిన యువతి పాప అలియాస్ తమిళరసిగా భవాని శ్రీ అద్భుతంగా నటించింది. గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఇళయరాజా నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. కెమెరామెన్ పనితీరు అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్ : 2.75/5 -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తమిళ సూపర్ హిట్ మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
విజయ్‌సేతుపతి, సూరి కీలక పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'విడుతలై పార్ట్ 1'. ఈ సినిమాను వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ 'విడుదల పార్ట్1' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 15వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. విచారణ పేరుతో మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్న పోలీసులపై పెరుమాళ్ మాస్టర్ (విజయ్ సేతుపతి ) పోరాటం, అతని కోసం పోలీసు బలగాలు వెతకడం గురించి ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవవుతుంది. సూరి ఈ చిత్రంలో కానిస్టేబుల్ కుమరేశన్‌గా నటిస్తున్నారు. అన్యాయం గురించి అతను పడే నిరాశ, అసమర్థతను కూడా ట్రైలర్లో చూపించారు. పెరుమాళ్‌కు ఏం జరుగుతుంది? చివరకు అతన్ని ఎవరు పట్టుకుంటారు? అనేది అసలు కథ. కాగా.. ఈ చిత్రంలో భవానీ శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ ప్రధానపాత్రల్లో నటించారు, రజినీకాంత్ ప్రశంసలు ఇప్పటికే ఈ సినిమాపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. చిత్రబృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇళయరాజా సంగీతం అద్భుతంగా ఉందని కొనియాడారు. పార్ట్-2 సినిమా కోసం ఎదురు చూస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. తమిళంలో సూపర్ హిట్ అయిన విడుదల పార్ట్1 టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. pic.twitter.com/FawO7l1oqA — Rajinikanth (@rajinikanth) April 8, 2023 -
హీరోగా మారిన కమెడియన్.. రెండు భాగాలుగా సినిమా
వెన్నెలా కబడి కుళు చిత్రం ద్వారా చిన్న పాత్రలో పరిచయమైన నటుడు సూరి. ఆ చిత్రంలో సూరి కామెడీ అందరినీ ఆకర్షించింది. దీంతో ఆయనకు వరుసగా అవకాశాలు లభించాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రముఖ హాస్యనటుడి స్థాయికి ఎదిగాడు. ఇంకేముంది ఆ క్రేజ్ సూరిని కథానాయకుడిని చేసేసింది. ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై ఎల్ రెడ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రంలో సూరి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. వెట్రిమాన్ దర్శకత్వంలో విడుదలై పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సూరి హీరోగా నటిస్తున్న తొలి చిత్రమే రెండు భాగాలుగా రూపొందించడం విశేషం. ఇందులో నటుడు ప్రధాన పాత్రలో నటించడం మరో విశేషం. కాగా ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే ఈయనకు హీరోగా అవకాశాలు వరుస కడుతున్నాయి. మదయానై చిత్రం ఫేమ్ విక్రమ్ సుకుమార్ నటుడు సూరి హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు మరో చిత్రంలోనూ సూరి హీరోగా నటించడానికి సిద్ధమవుతున్నారు. దీంతో విడుదలై చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా దర్శకుడు వెట్రిమారన్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా హాస్యనటులుగా పేరుతెచ్చుకుని హీరోల అవతారమెత్తిన వడివేలు, సంతానం వంటి వాళ్లు ఇప్పుడు మళ్లీ మొదటికే వస్తున్నారు. మరి హీరోగా సూరి భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. -
సీఎం సహాయనిధికి హాస్యనటుడు సూరి విరాళం
సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రముఖ హాస్యనటుడు సూరి సీఎం రిలీఫ్ ఫండ్ నిధికి తన వంతుగా రూ.10 లక్షలు, తన కొడుకు సర్వాన్, కూతురు వెన్నెల పేరుతో మరో రూ.25వేలను విరాళంగా అందించారు. ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ను కలిసిన సూరి రూ.10 లక్షలు చెక్కు రూపంలోనూ, రూ.25వేలు నగదును అందించారు. ప్రజలకు కోవిడ్ వైద్యం, ఆక్సిజన్, వ్యాక్సిన్ సదుపాయాలను సమకూర్చడానికి దాతలు సీఎం సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు తమ వంతు విరాళాలను అందించారు. -
క్యాన్సర్‌తో కమెడియన్.. చేయూతనిచ్చిన హీరోలు
తమిళనాడు: తన కామెడితో తమిళ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు తవసి కొంతకాలంగా మాయదారి మహమ్మారితో బాధపడుతున్నారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయనకు క్యాన్సర్ నాలుగో స్టేజ్‌లో ఉంది. ఈ క్రమంలో ఆయన బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనందగా మారిపోయారు. దీంతో ఆయన చికిత్సకు ఆర్థిక సాయం చేయాలంటూ తవసి కుమారుడు అరుముగన్ కోలీవుడ్ పెద్దలను ఆర్జించాడు. దీంతో ఆయనను ఆర్థికంగా ఆదుకునేందుకు తమిళ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, సూరిలతో పాటు మరికొంత మంది పరిశ్రమ పెద్దలు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. హీరో శివకార్తికేయన్ తన ఫ్యాన్స్ అసోయేషన్తో రూ. 25వేల చెక్‌ను తవసి కుటుంబానికి అందించినట్లు సమాచారం. (చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్) అంతేగాక విజయ్ సేతుపతి, తన స్నేహితుడైన సుందర్ రాజ్‌తో కలిసి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. అయితే ఇందులో సుందర్ రాజ్ తన వంతుగా పది వేలు ఇవ్వగా.. నటుడు సూరి నిత్యవసర సరుకులు అందించారు. ఇక ఎమ్మెల్యే డాక్టర్ శరవణన్ ఇప్పటి తవసికి వైద్య ఖర్చులను చూసుకున్నట్లు సమాచారం. అయితే స్టేజ్ 4 క్యాన్సర్‌తో బాధపడుతున్న తవసి ప్రస్తుతం ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో అయనకు పైపు ద్వారా పళ్ల రసాలను ఆహారంగా ఇస్తున్నారు. కాగా తవసి ‘సువరాపాండియన్’, ‘వరుతాపాధ వాలిబార్ సంగం’, ‘రజిని మురుగన్’ తదితర చిత్రాల్లో సహా నటుడిగా నటించి నటుడిగా గుర్తింపు పొందారు. (చదవండి: ఆ హీరో ఫ్యాన్స్‌తో నాకు ప్రమాదం..) -
హీరో తండ్రిపై ప్రముఖ కమెడియన్ ఫిర్యాదు
చెన్నై: తమిళ హీరో విష్ణు విశాల్ తండ్రి రమేశ్ కడవ్లా మీద ప్రముఖ హాస్య నటుడు సూరి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ప్లాట్ అమ్మకానికి ఉందంటూ తన దగ్గర 2.70 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని పేర్కొన్నాడు. తన డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా ఎన్నోసార్లు అడిగానని, అయినా ఐదేళ్లుగా వారి నుంచి సమాధానం రాలేదని తెలిపాడు. రమేశ్‌తో పాటు ఫినాన్షియర్ అంబువేల్ రాజన్‌కు కూడా ఇందులో ప్రమేయం ఉందని, అంతేగాకుండా వీర ధీర సూరన్ సినిమాకు గానూ తనకు ఇవ్వాల్సిన రూ. 40 లక్షల పారితోషికాన్ని ఎగ్గొట్టారని ఆరోపించాడు. సూరి ఫిర్యాదు మేరకు అడయార్ పోలీసులు రమేశ్‌తో పాటు అంబువేల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా రమేశ్ గతంలో పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. (చదవండి: అబ్బే... ఆ ఉద్దేశం లేదు) షాకింగ్‌గా ఉంది: విష్ణు విశాల్ ఇక ఈ విషయంపై స్పందించిన విష్ణు విశాల్.. తమ కుటుంబంపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశాడు. ‘‘ఇది చాలా షాకింగ్‌గానూ, బాధ కలిగించేది గానూ ఉంది. నాపై, మా నాన్నపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి వెనుక ఏదో దురుద్దేశం ఉంది. నిజానికి సూరి, విష్ణు విశాల్ స్టూడియో నుంచి 2017లో కవరిమాన్ పరాంబరై సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ తిరిగి చెల్లించాల్సి ఉంది. ఆ సినిమా నుంచి అతడు తప్పుకొన్నాడు’’ అని పేర్కొన్నాడు. ఇతరులపై నిందలు వేయడం సులభమే కానీ, అంతకంటే ముందు తమ గురించి తాము పరిశీలన చేసుకోవాలన్న కోట్‌ను ఉటంకిస్తూ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు. ITS EASY TO ACCUSE OTHERS HARDER TO CHECK ON YOURSELF - BLESS#MOMENTOFTRUTH#உண்மைஒருநாள்வெல்லும் pic.twitter.com/nXaV7bLM9E — VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) October 9, 2020 -
కావాలనే విమర్శిస్తున్నారు : హాస్య నటుడు
సినిమా సమీక్షల విషయంలో భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. పెద్ద సినిమాల నిర్మాతలు రివ్యూల కారణంగా తమ సినిమాలకు నష్టం జరుగుతుందంటే.. చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం రివ్యూల కారణంగానే తమ సినిమాలకు గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు. అయితే తాజాగా ఓ తమిళ కమెడియన్ రివ్యూలపై ఫైర్ అయ్యాడు. కోలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న కమెడియన్ సూరి ఇటీవల సామి స్క్వేర్, సీమ రాజ సినిమాల్లో కనిపించారు. ఈ రెండు సినిమాల్లో సూరి నటనపై విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా సీమరాజ సినిమా కు రివ్యూలు నెగెటివ్‌గా రావటంతో.. కావాలనే తమ సినిమా మీద దాడి చేస్తున్నారంటూ ఆరోపించారు సూరి. అంతేకాదు విమర్శకులు తమిళ సినిమాలపై దాడి చేయటం ఆపి సినిమాలను కాపాడేందుకు ప్రయత్నించాలన్నారు. -
నాన్న నటనలో 5 శాతం చేయలేను!
చెన్నై: తనకు హీరో అవ్వాలని లేదని కమెడియన్ సూరి అంటున్నాడు. విశాల్ హీరోగా నటించిన రాయుడు తెలుగులో ఇటీవల విడుదలైంది. ఆ మూవీలో విశాల్ ఫ్రెండ్ గా సూరీ నటించాడు. అయితే కొన్ని మూవీలతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. కమెడీయన్లలో త్వరగా పేరు తెచ్చుకుని, ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న వ్యక్తి సూరీ. ప్రస్తుతం తన ఖాతాలో ఏడు సినిమాలు ఉన్నాయని గర్వంగా చెబుతున్నాడు. కోలీవుడ్ ప్రేక్షకులను పదేళ్లకు పైగా తనదైన కామెడీతో నవ్వించిన సూరీ, ఇప్పుడు రాయుడుతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కామెడీనే తనకు లైఫ్ ఇచ్చిందని, తాను కమెడియన్ గానే ఉంటానని పేర్కొన్నాడు. తన సినిమాలు చూసిన వారు ఎవరైనా తనను ఓ మంచి గుర్తుంచుకుంటారని చెప్పాడు. కొన్ని సీన్లలో తనదైన టైమింగ్ తో అదనంగా డైలాగ్ లు చెప్పినా హీరోలు, డైరెక్టర్లు తనను ఒక్కమాట కూడా పోవడంతో పాటు మెచ్చుకున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఫ్రెండ్స్ తో కలిసి స్టేజీ నాటకాలు వేసిన వాడిని ఈ రోజు ఓ స్థాయికి చేరుకున్నాను. క్షణాల్లో సీన్ పండించడం తన తండ్రి నుంచి నేర్చుకున్నానని, మా ఊరిలో నాన్నే అందరికంటే ఫన్నీ మ్యాన్ అంటున్నాడు. మా నాన్న నటనలో నేను 5 శాతం చేయలేనని సూరి చెప్పుకొచ్చాడు. కామెడీ చాలా సీరియస్ అంశమని, విశాల్ నుంచి మొదలుకుని కార్తీ వరకూ అందరితో తాను ఫ్రెండ్లీగా ఉంటానని వివరించాడు. ప్రస్తుతం సూర్య మూవీ ఎస్3 లో నటిస్తున్నట్లు కమెడియన్ సూరి చెప్పాడు.


