అపరిచితుల ప్రయాణంతో... | Yezhu Kadal Yezhu Malai Telugu Title Sanchari | Sakshi
Sakshi News home page

అపరిచితుల ప్రయాణంతో...

Sep 28 2026 4:48 AM | Updated on Sep 28 2026 4:48 AM

Yezhu Kadal Yezhu Malai Telugu Title Sanchari

నివిన్‌ పౌలి, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా ‘ఏళు కడళ్‌ ఏళు మలై’. ఈ రొమాంటిక్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమాకు రామ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో ‘సంచారి’ టైటిల్‌తో రిలీజ్‌ కానుంది. ‘సప్తగిరులు... సప్త సాగరాలు’ అనేది ఈ సినిమా క్యాప్షన్‌. కలర్స్‌ అండ్‌ క్లాప్స్‌ ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై ఎం. సుబ్బారెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. రైలు ప్రయాణం నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఈ ప్రయాణంలో 32 ఏళ్ల వ్యక్తి (సూరి), తనకు 8,000 ఏళ్లు ఉంటాయని చెప్పుకునే వ్యక్తి (నివిన్‌ పాలీ) మధ్య జరిగే పరిచయం ప్రధానాంశంగా ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement