చెన్నై: కరూర్ తొక్కిసలాట ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ మృతులకు నివాళులర్పించారు. 2025 సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన ఈ విషాద ఘటన తమ జీవితాల్లో ఎప్పటికీ మానని గాయంగా మిగిలిపోయిందని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు, తన మద్దతుదారులు, టీవీకే కుటుంబం ఈ విషాదాన్ని ఇప్పటికీ మరవలేకపోతున్నారని తెలిపారు.
గతేడాది ఇదే రోజు.. సెప్టెంబర్ 27, 2025న కరూర్‌లో టీవీకే నిర్వహించిన సభలో భారీగా జనం తరలివచ్చారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విషాదం తమ హృదయాల్లో మోస్తున్న బంధువుల జ్ఞాపకాలను మరింత బాధాకరంగా మార్చిందని విజయ్ అన్నారు. మృతుల కుటుంబాలు అనుభవిస్తున్న వేదనను మాటల్లో చెప్పలేమని పేర్కొన్నారు. ఒకరికొకరం ఓదార్పుగా, అండగా, ఆశ్రయంగా నిలుద్దామని తెలిపారు.
కరూర్ ఘటనపై దర్యాప్తు కూడా కొనసాగుతోంది. తొలుత తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఈ కేసు దర్యాప్తును స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ ఘటనకు సంబంధించి కార్యక్రమానికి అనుమతులు, జన సమూహ నియంత్రణ, పోలీసుల మోహరింపు, అత్యవసర స్పందన వంటి అంశాలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
என் நெஞ்சில் குடியிருக்கும் அனைவருக்கும் வணக்கம்.
கடந்த வருடம்.
இதே நாள்.
அதாவது 2025 செப்டம்பர் 27.
என் வாழ்நாளில், நம் கரூர் சொந்தங்களின் வாழ்வில், நம் தமிழ்நாட்டு உறவுகளின் மனத்தில் ஆறாத ரணமாக, தீராத வலியாக, வேதனையான நிகழ்வு நடந்த நாள்.
சொல்ல முடியாத சோகத்தைச் சுமந்து…— TVK Vijay (@TVKVijayHQ) September 27, 2026
ఈ కేసులో టీవీకేకు చెందిన పలువురు నేతలను కూడా సీబీఐ విచారించింది. పార్టీ అధినేత విజయ్‌ను సైతం విచారణకు హాజరు కావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది. కరూర్ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన 41 మందిని గుర్తుచేసుకుంటూ విజయ్ వారికి ఘన నివాళి అర్పించారు. వారి జ్ఞాపకాలు ఎప్పటికీ తమతోనే ఉంటాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు..


