విజయవాడలో ఉద్రిక్తత.. పోలీసుల ఓవరాక్షన్‌ | Secretariat Employees Arrest At Vijayawada Updates | Sakshi
Sakshi News home page

విజయవాడలో ఉద్రిక్తత.. పోలీసుల ఓవరాక్షన్‌

Sep 27 2026 9:33 AM | Updated on Sep 27 2026 10:37 AM

Secretariat Employees Arrest At Vijayawada Updates

సచివాలయ ఉద్యోగుల ధర్నా అప్‌డేట్స్‌.. 

దద్దరిల్లిన విజయవాడ..

  • సచివాలయ ఉద్యోగుల నిరసనతో దద్దరిల్లిన బెజవాడ
  • లెనిన్ సెంటర్ జంక్షన్‌కు పోటెత్తిన సచివాలయ ఉద్యోగులు
  • లెనిన్ సెంటర్‌కు వచ్చే అన్ని దారులను మూసేసిన పోలీసులు
  • పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడే బైఠాయించి నిరసన చేస్తున్న సచివాలయ ఉద్యోగులు
  • ఆందోళన చేస్తున్న సచివాలయ  ఉద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
  • పోలీసులు, ప్రభుత్వం తీరుపై సచివాలయ ఉద్యోగులు ఫైర్

పోలీసుల ఓవరాక్షన్‌..

  • ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు.
  • సచివాలయ ఉద్యోగులను ఈ‍డ్చిపడేసిన పోలీసులు.
  • పోలీసుల తీరుపై సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం
  • పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు.
  • విజయవాడలో ఉద్రిక్తత..
  • రోడ్డుపై బైఠాయించి గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆందోళన.

 

పోలీసుల దిగ్బంధంలో ధర్నా చౌక్

  • రణరంగంగా మారిన విజయవాడ
  • ధర్నా చౌక్ రాకుండా అన్ని వైపుల బారికేడ్లతో మూసేసిన పోలీసులు
  • ఎక్కడికి అక్కడ సచివాలయ ఉద్యోగులను అరెస్టు చేస్తున్న పోలీసులు
  • పోలీసుల వలయాన్ని ఛేదించి లెనిన్ సెంటర్ వరకు చేరుకున్న సచివాలయ ఉద్యోగులు
  • లెనిన్ సెంటర్‌కు వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు
  • లెనిన్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసనలు
  • విజయవాడలో సచివాలయ ఉద్యోగుల  ఆందోళన
  • రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న సచివాలయ ఉద్యోగులు
  • ఉద్యోగులను ఈడ్చిపడేస్తున్న పోలీసులు
  • పోలీసుల తీరుపై సచివాలయ ఉద్యోగులు ఫైర్

విజయవాడలో ఉద్రిక్తత..

  • విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద ఉద్రిక్తత.
  • ఛలో విజయవాడకు రాకుండా ఎక్కడికక్కడ ఉద్యోగుల అరెస్ట్‌. 
  • వియ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ సచివాలయ ఉద్యోగుల నినాదాలు. 

👉చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అర్ధరాత్రి నుంచే బస్సులు, రైళ్ల నుంచి ఉద్యోగులను దించి.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్దే అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నాయి.

👉విజయవాడలోనే దాదాపు 600 మంది సచివాలయ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అదుపులోకి తీసుకున్న వారిని నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విజయవాడకు బయలుదేరిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నట్లు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొందరిని బస్సుల నుంచి, మరికొందరిని రైళ్ల నుంచి దించి అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నాయి.

👉చలో విజయవాడకు హాజరుకాకుండా ఉద్యోగులను అడ్డుకోవడం, అరెస్టులు చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం నిర్బంధ చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement