హీరోయిన్‌ను బాడీ షేమింగ్‌ చేసిన తేజ్‌.. లాలూను గుర్తుచేసిన నటి! | Tej Pratap Yadav called Swara Bhasker moti | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ను బాడీ షేమింగ్‌ చేసిన తేజ్‌.. లాలూను గుర్తుచేసిన నటి!

Sep 27 2026 9:19 AM | Updated on Sep 27 2026 9:19 AM

Tej Pratap Yadav called Swara Bhasker moti

ముంబై: ‘రైజ్ అండ్ ఫాల్’ రియాలిటీ షో తొలి ఎపిసోడ్‌లో బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డిజైనర్ చీర, బ్లౌజ్‌తో షోలోకి వచ్చిన ఆమె.. బాడీ షేమింగ్, ట్రోలింగ్‌పై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆమె ధరించిన బ్లౌజ్‌పై ‘మోటీ’ అని రాసి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది.

షోలో బీహార్‌ రాజకీయ నేత తేజ్ ప్రతాప్ యాదవ్‌.. స్వరా భాస్కర్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ క్రమంలో తేజ్ ప్రతాప్ ఆమెను ‘మోటీ’ అని సంబోధించారు. దీనిపై స్వరా కూడా తనదైన శైలిలో స్పందిస్తూ మాటలతో చమత్కరించారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ షోలో నవ్వులు పూయించింది.

బాడీ షేమింగ్ గురించి స్వరా భాస్కర్ మాట్లాడుతూ.. తన శరీరాకృతిపై గతంలో వచ్చిన విమర్శలు, ట్రోలింగ్‌ను ప్రస్తావించారు. తనపై ఎలాంటి వ్యాఖ్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటానని ఆమె అన్నారు. షోలో ఆమె మాట్లాడిన తీరు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

ఇదే సమయంలో తేజ్ ప్రతాప్‌తో జరిగిన సంభాషణలో స్వరా భాస్కర్ ఆసక్తికరంగా స్పందించారు. తనను లాలూ ప్రసాద్ యాదవ్‌కు పరిచయం చేయాలని ఆమె కోరారు. దీంతో షోలో తేజ్ ప్రతాప్, స్వరా మధ్య జరిగిన సరదా మాటామంతీ చర్చనీయాంశంగా మారింది. 

ఇదీ చదవండి: మారిన మందు.. ఐదుగురు చిన్నారులు ఐసీయూలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement