సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం కేసుపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈసీ నియామక ప్రక్రియపై సందేహం వ్యక్తం చేసింది. ఈసీ స్వతంత్రంగా ఉండడమే కాదు స్వతంత్రంగా కనిపించాలి కూడా అని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. ప్రధాని నామినేట్ చేసిన క్యాబినెట్ మంత్రి, ప్రధానిమంత్రి కి వ్యతిరేకంగా ఓటు వేయలేరు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ల చట్టం 2023ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది.


