సాక్షి, నూఢిల్లీ: దీపావళి వేడుకల తర్వాత ఢిల్లీ, ముంబై నగరాలు తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సోమవారం ఉదయం రెండు నగరాలనూ దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రజలపై సెటైర్లు వేశారు.
‘తమ జీవితాలను తామే ఇంతగా దుర్భరం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న ప్రజలను నేను ఎప్పుడూ చూడలేదు’ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆదివారం కూడా స్పందించిన ఆయన.. పండుగలు ప్రేమ, సంతోషాలను పంచుకోవడానికి ఉండాలని, విద్వేషాలు, విభజనలకు కాదని పేర్కొన్నారు.
Never seen people so determined to make their own lives miserable. #AQI #Mumbai #Delhi
— Abhijeet Dipke (@abhijeet_dipke) November 9, 2026
ఢిల్లీలో 370కి చేరిన AQI
దీపావళి సందర్భంగా అనుమతించిన సమయం దాటిన తర్వాత కూడా పలుచోట్ల బాణసంచా కాల్చడంతో ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా పెరిగింది. సోమవారం ఉదయం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 370గా నమోదై 'వెరీ పూర్' కేటగిరీలోకి చేరింది. బవానా, బురారీ, జహంగీర్‌పురి, సోనియా విహార్, పంజాబీ బాగ్, ఓఖ్లా, రోహిణి ప్రాంతాల్లో గాలి నాణ్యత సివియర్ స్థాయికి చేరింది.
ఇదీ చదవండి: మోదీకి రాహుల్ గాంధీ సవాల్


