40 ఏళ్లకే పక్షవాతం : ఎయిర్టెల్‌ మాజీ సీఓఓ సంచలన వ్యాఖ్యలు | work stress and health Ex Airtel COO shares how he was paralysed at 40 | Sakshi
Sakshi News home page

40 ఏళ్లకే పక్షవాతం : ఎయిర్టెల్‌ మాజీ సీఓఓ సంచలన వ్యాఖ్యలు

Nov 9 2026 6:30 PM | Updated on Nov 9 2026 6:42 PM

work stress and health Ex Airtel COO shares  how he was paralysed at 40

ప్రముఖ కంపెనీకి సీఈఓ కావాలని కలలు కన్న ఒక మాజీ టెలికాం ఎగ్జిక్యూటివ్, సంవత్సరాల తరబడి అధిక ఒత్తిడితో కూడిన లీడర్‌షిప్‌ బాధ్యతలు,  టార్గెట్స్‌ కారణంగా తన ఆరోగ్యం చాలా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.  అంతేకాదు  భరించలేని ఆ ఒత్తిడే  ఆటో ఇమ్యూన్ రుగ్మతకు ఈ రుగ్మత దారి తీసిందని,   ఫలితంగా 40 ఏళ్లకే  దాదాపు పక్షవాతానికి గురయ్యానని తాజాగా వెల్లడించారు.  ఆయన మరెవ్వరో కాదు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ (Bharti Airtel) మాజీ సీఓఓ రామ్‌జీ వల్లత్ (RamG Vallath). కార్పొరేట్ ఒత్తిళ్ల కారణంగా ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మనీకంట్రోల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఫార్చ్యూన్ 500 కంపెనీకి సీఈఓ కావాలన్న లక్ష్యంతో అంచెలంచెలుగా ఎదిగిన రామ్‌జీ 3Com, భారతి ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ సంస్థల్లో అత్యున్నత పదవుల్లో పనిచేశారు. తమిళనాడులో ఎయిర్‌టెల్ సర్వీసులను కొత్తగా ప్రారంభించే సమయంలో నిరంతరం 'వార్ రూమ్‌లు',  భారీ  టార్గెట్లు, వ్యాపార ఒత్తిళ్ల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యానని, అంతిమంగా అది తన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసిందని చెప్పుకొచ్చారు.

అలాగే విపరీతమైన ఒత్తిడి , అలసట కారణంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. నడకలో తడబాటు, తీవ్రమైన వెన్నునొప్పి, చేతులు వణకడం వంటి లక్షణాలు మొదలయ్యాయి. ఏడేళ్ల సుదీర్ఘ పరీక్షల తర్వాత ఆయనకు 'క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ డిమైలినేటింగ్ పాలిన్యూరోపతి' (CIDP) అనే అరుదైన నరాల వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది.
అనారోగ్యం క్రమంగా ముదరడంతో 40 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఆయన శరీరం పూర్తిగా పక్షవాతానికి గురైనట్లుగా మారింది. తరచూ ఆసుపత్రిపాలవడం, పడిపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరికి 2011లో పూర్తి స్థాయి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నారు.

తోడు నీడగా భార్య  
ఈ కష్టకాలంలో ఆయన భార్య జయశ్రీ రామమూర్తి తనకు అత్యంత బలమైన ఆసరాగా నిలిచారని  చెప్పారు. గూగుల్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఆమె, కుటుంబ బాధ్యతలను మోస్తూ ఆర్థికంగా, మానసికంగా కుటుంబానికి అండగా నిలిచారు.

సంతోషమే ముఖ్యం

కార్పొరేట్ పరుగులను విడిచిపెట్టిన రామ్‌జి వల్లత్, యోగా, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకున్నారు. ప్రస్తుతం ఆయన ఒక రచయితగా, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్‌లో ఆన్‌లైన్ హెల్త్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పిల్లల కోసం సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు రాయడంతో పాటు, పాఠశాలల్లో విద్యార్థులకు, యువతకు ఆనందం, జీవిత పాఠాలపై మార్గదర్శనం చేస్తున్నారు.

"డబ్బు, హోదా కంటే జీవితంలో మానసిక ప్రశాంతత, ఇతరుల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంతోషం" అంటూ  అనుభవ సారాంశాన్ని వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement