ఎయిర్‌టెల్ రూ.200 రీఛార్జ్‌.. ప్రయోజనాలెన్నో.. | Airtel Launches Rs 200 Entertainment Top-Up With YouTube Premium, 30GB Extra Data and Access to 20+ OTT Platforms for 28 Days | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్ రూ.200 రీఛార్జ్‌.. ప్రయోజనాలెన్నో..

Oct 24 2026 11:41 AM | Updated on Oct 24 2026 12:18 PM

Airtel Rs 200 Recharge Plan Know The Benefits

సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు.. యూట్యూబ్ వీడియోలు ఎక్కువగా చూసే వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్‌ తీసుకొచ్చింది. రూ.200 ఎంటర్‌టైన్‌మెంట్ టాప్-అప్‌తో యూట్యూబ్ ప్రీమియం, 30జీబీ అదనపు డేటా, 28 రోజుల పాటు పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రయోజనాలు కూడా పొందవచ్చు. కాబట్టి యూట్యూబ్‌తో పాటు, ఇతర స్ట్రీమింగ్ యాప్‌లను ఉపయోగించే వారికి ఈ ప్యాక్ ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ ప్యాక్‌లో యూట్యూబ్ ప్రీమియం ద్వారా.. వీడియోలను ప్రకటనలు లేకుండా చూడవచ్చు. అంతే కాకుండా.. పాటలను యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియంలో వినడానికి అవకాశం ఉంటుంది. వీడియోలను బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేసుకోవడంతో పాటు, నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని తర్వాత చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5 ప్రీమియం, సోనిలివ్ వంటి ఓటీటీ సేవలతో పాటు మొత్తం 20కి పైగా ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ లభిస్తుందని సమాచారం.

అయితే.. వినియోగదారులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రూ.200 ప్యాక్ అనేది సాధారణ ప్రీపెయిడ్ రీఛార్జ్ కాదు. కాబట్టి ఇందులో మీరు కాలింగ్, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు పొందలేరు. ఈ టాప్-అప్‌ను ఉపయోగించాలంటే మీ ఎయిర్‌టెల్ నంబర్‌పై ఇప్పటికే యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉండాలి. అదనంగా లభించే 30GB డేటాను 28 రోజుల వ్యవధిలో ఉపయోగించుకోవచ్చు.

యూట్యూబ్ ప్రీమియం ప్రయోజనాన్ని పొందడానికి రీఛార్జ్ చేసిన తర్వాత ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను ఓపెన్ చేసి, రివార్డ్ & ఓటీటీ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ యూట్యూబ్ ప్రీమియం ఆఫర్‌ను ఎంచుకుని క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: అంతలోనే ఆశలు ఆవిరి.. తిరగబడిన పసిడి ధరలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement