ఎయిర్‌టెల్‌ రూ.299 ప్లాన్‌ రీఎంట్రీ | Airtel Rs 299 Plan Re Entry | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ రూ.299 ప్లాన్‌ రీఎంట్రీ

Nov 7 2026 7:59 AM | Updated on Nov 7 2026 8:03 AM

Airtel Rs 299 Plan Re Entry

యూజర్లు ఇతర నెట్‌వర్క్‌ల వైపు చూస్తున్న నేపథ్యంలో భారతి ఎయిర్‌టెల్‌ తమ రూ. 299 ఎంట్రీ లెవెల్‌ ప్లాన్‌ని మళ్లీ ప్రవేశపెట్టింది. అయితే, డేటా ప్రయోజనాలను 1.5 జీబీ (రోజుకు) నుంచి 1 జీబీకి తగ్గించింది. ఎయిర్‌టెల్‌ యాప్, వెబ్‌సైట్లలో పొందుపర్చిన సమాచారం ప్రకారం 28 రోజుల వేలిడిటీతో ఈ ప్లాన్‌ లభిస్తుంది.

ప్రీమియం ప్లాన్ల వైపు వెళ్లే దిశగా కంపెనీ వ్యూహాలు అమలు చేస్తుండటంతో సెప్టెంబర్ త్రైమాసికంలో భారతి ఎయిర్‌టెల్‌ కొత్త యూజర్ల సంఖ్య నికరంగా తగ్గినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రూ. 299తో పాటు ఇతరత్రా మరో నాలుగు ప్లాన్లను కూడా నిలిపివేయడంతో యూజర్లు అధిక రేటు ప్లాన్లకు మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement