వాహనాలకు ధన్‌తేరాస్‌ కళ!  | India are counting on record deliveries between Dhanteras | Sakshi
Sakshi News home page

వాహనాలకు ధన్‌తేరాస్‌ కళ! 

Nov 7 2026 4:59 AM | Updated on Nov 7 2026 4:59 AM

India are counting on record deliveries between Dhanteras

నవరాత్రుల జోరుకు కొనసాగింపుగా భారీ డెలివరీలు 

ద్విచక్ర, కార్లు, వాణిజ్య వాహనాలకు పెరిగిన డిమాండ్‌ 

దీపావళి వరకూ ఇదే ఊపు ఉంటుందని పరిశ్రమ వర్గాల ధీమా  

న్యూఢిల్లీ: నవరాత్రుల వేళ నమోదైన వాహన విక్రయాల జోరు ధన్‌తేరాస్‌ రోజునా కొనసాగింది. వాహన తయారీ సంస్థలు, డీలర్లు భారీ సంఖ్యలో వాహనాలను వినియోగదారులకు అందించారు. టూ వీలర్లు, ప్రయాణికులు (కార్లు), వాణిజ్య వాహన విభాగాలన్నింటిలోనూ కస్టమర్ల నుంచి అనూహ్య డిమాండ్‌ లభించిందని వాహన తయారీ సంస్థలు, డీలర్లు వెల్లడించారు. పావళి వరకు ఇదే జోరు కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ధన్‌తేరస్‌ ఒక్కరోజే మారుతి సుజుకీ ఏకంగా 30,000 యూనిట్లకు పైగా వాహనాలను డెలివరీ చేసినట్లు అంచనా వేసింది. గతేడాది ధన్‌తేరాస్‌ వేడుకలు రెండు రోజుల పాటు జరగడంతో 50 వేల డెలివరీలు నమోదయ్యాయి. టాటా మోటార్స్‌ 12 వేల వాహనాల డెలివరీలను లక్ష్యంగా పెట్టుకుంది. ‘‘ఈ ఏడాది ధన్‌తేరాస్, దీపావళి సందర్భంగా 16 వేల వాహనాలను డెలివరీ చేయాలని భావిస్తున్నాము. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 14% వృద్ధి’’ అని హ్యుందాయ్‌ ఇండియా సీవోఈ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు.   

వినాయక చవితి నుంచి 4 లక్షల విక్రయాలు  
వినాయక చవితి సెప్టెంబర్‌ 14 నుంచి నవంబర్‌ 6 వరకు ఇప్పటికే 4 లక్షలకు పైగా వాహనాల రిటైల్‌ విక్రయాలను సాధించాం. గతేడాది ఇదే సమయంలో నమోదైన 3.46 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది భారీ వృద్ధి. ఒక్క ధన్‌తేరాస్‌ రోజుకే పరిమితం కాకుండా పండుగ సీజన్‌ మొత్తం డిమాండ్‌ బలంగా ఉండటం శుభపరిణామం’’ అని  అని మారుతీ మార్కెటింగ్, సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు. ధన్‌తేరాస్‌లో అద్భుత స్పందన లభించిందని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అమిత్‌ కామత్‌ పేర్కొన్నారు. ‘‘దీపావళి ముహూర్త డెలివరీలు బుధవారం వరకు కొనసాగుతాయి. రానున్న రోజుల్లోనూ ఇదే ఊపు కొనసాగుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.  

‘‘ఎంఅంఎం డీలర్‌íÙప్‌లలో చాలా మోడళ్ల వాహన నిల్వలు(ఇన్వెంటరీ) దాదాపు సున్నాకు చేరాయి. రవాణాలో ఉన్న వాహనాలను మినహాయిస్తే, మిగిలిన నిల్వలు 8–9 రోజుల అవసరాలకు సరిపడే స్థాయిలోనే ఉన్నాయి’’ అని మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, సీఈవో రాజేష్‌ జేజూరికర్‌  తెలిపారు. 

అన్ని విభాగాల్లనూ డిమాండ్‌: ఫాడా అధ్యక్షుడు  
అక్టోబర్‌లో రిటైల్‌ అమ్మకాలు తగ్గినప్పటికీ, డీలర్లు నవంబర్‌లోకి ఆశావహ దృక్పథంతో అడుగుపెట్టారని ఫాడా అధ్యక్షుడు సాయి గిరిధర్‌ తెలిపారు. అన్ని వాహన విభాగాల్లోనూ డిమాండ్‌ బలంగా ఉందన్నారు. అయితే ఎలక్ట్రిక్‌ ద్విచక్ర, వాణిజ్య విభాగాల్లో కొన్ని సరఫరా అంతరాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ‘‘మార్కెట్‌ సెంటిమెంట్‌ సానుకూలంగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ బలంగా ఉంది. ధన్‌తేరస్‌ రోజున తమ డీలర్‌íÙప్‌లో సాధారణ రోజులతో పోలిస్తే రెండున్నర రెట్లు అధికంగా వాహనాలను డెలివరీ చేసింది’’ అని జబల్‌పూర్‌లోని ప్లాటినం నిస్సాన్‌ డీలర్‌íÙప్‌ డైరెక్టర్‌ శుభం సిద్ధా తెలిపారు.

సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు డిమాండ్‌  
సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌లోనూ పండుగ కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీపావళి వరకు ఈ డిమాండ్‌ కొనసాగుతుందని విక్రేతలు భావిస్తున్నారు. చాలా మంది పాత కార్ల విక్రేతల అభిప్రాయం ప్రకారం.. డిమాండ్‌ సరఫరాను మించిపోయింది. ‘‘నవరాత్రుల సమయంలో తమ వాహన డెలివరీలు 58 శాతం పెరిగాయని తెలిపారు. ధన్‌తేరస్‌ రోజున 630 కార్లను విక్రయించినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 45 శాతం వృద్ధి’’ అని కార్స్‌24 ఇండియా సీఎఫ్‌వో శివాంశు మక్కర్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement