తక్కువ ధరకు ఇండక్షన్ స్టవ్‌.. ప్రభుత్వ కంపెనీ ప్రత్యేక ఆఫర్‌ | EESL Special Public Offer Induction Cooktop with Utensils Just Rs 6990 | Sakshi
Sakshi News home page

తక్కువ ధరకు ఇండక్షన్ స్టవ్‌.. ప్రభుత్వ కంపెనీ ప్రత్యేక ఆఫర్‌

Nov 6 2026 10:07 PM | Updated on Nov 6 2026 10:07 PM

EESL Special Public Offer Induction Cooktop with Utensils Just Rs 6990

దేశవ్యాప్తంగా విద్యుత్‌తో వంట (ఈ-కుకింగ్‌) విధానాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 1,200 వాట్ల ఇండక్షన్ స్టవ్‌తో పాటు దానికి అనువైన వంట పాత్రను రూ.6,990కే అందించనున్నట్లు ప్రకటించింది. దీపావళి సందర్భంగా ఈఈఎస్ఎల్ సీఈవో అఖిలేష్ కుమార్ దీక్షిత్ ఈ ప్రత్యేక ఆఫర్‌తో పాటు ఈ-కుకింగ్‌ విస్తరణపై రూపొందించిన నివేదికను విడుదల చేశారు.

కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ప్రారంభించిన జాతీయ సమర్థ వంట కార్యక్రమం (ఎన్‌ఈసీపీ)లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. ఇండక్షన్ స్టవ్‌ల వినియోగంతో వంటగదిలో మంటలు, గ్యాస్ లీకేజీల ప్రమాదాలను తగ్గించడంతో పాటు విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చని ఈఈఎస్ఎల్ తెలిపింది. సంప్రదాయ ఎల్‌పీజీ వంటలో సుమారు 40 శాతం మాత్రమే శక్తి వినియోగం కాగా, ఇండక్షన్ విధానంలో ఇది 85 శాతం వరకు ఉంటుందని పేర్కొంది.

ఇప్పటికే బిహార్‌, అసోం, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇండక్షన్ ఆధారిత వంట విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం విశేషం. ఎలక్ట్రిక్ వంటతో ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, దేశ ఇంధన భద్రతకు దోహదం చేయవచ్చని ఈఈఎస్ఎల్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement