ఇండక్షన్‌ స్టవ్‌తో జాగ్రత్త.. | Induction Stove Safety Tips Essential Precautions to Prevent Accidents | Sakshi
Sakshi News home page

ఇండక్షన్‌ స్టవ్‌తో జాగ్రత్త..

May 9 2026 4:25 PM | Updated on May 9 2026 5:08 PM

Induction Stove Safety Tips Essential Precautions to Prevent Accidents

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇళ్లలోనే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా గ్యాస్‌ సమస్య ఏర్పడింది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల వినియోగంపై అప్రమత్తత పెరిగింది. ఎలక్ట్రిక్‌ కుక్కర్లు, ఇండక్షన్‌ స్టవ్‌ల వినియోగం పెరిగింది. అయితే ఇండక్షన్‌ స్టవ్‌ వినియోగంలో జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఏమరపాటుగా ఉంటే భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. విద్యుత్‌ శక్తిని ఉష్ణశక్తిగా మారుస్తూ వంటింటి చికాకులకు ఇండక్షన్‌ స్టవ్‌తో ఫుల్‌స్టాప్‌ పెట్టొచ్చు. అయితే ఈ కరెంట్‌ పొయ్యి వాడకంలో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి.  

కొన్ని టిప్స్‌ పాటిస్తే సేఫ్‌..

  •     మెటల్‌ ప్యానెల్‌ ఉన్న పాత్రలనే వాడాలి. వంట పూర్తయిన తర్వాత స్టవ్‌ పైనుంచి పాత్రలను తీసేటప్పుడు స్విచ్ఛాఫ్‌ చేయడం మరిచిపోవద్దు. 

  •     ఇండక్షన్‌ స్టవ్‌ నుంచి తీవ్రమైన వేడి వెలువడుతుంది. స్టవ్‌ దగ్గర్లో ప్లాస్టిక్‌ వస్తువులు, దుస్తులు ఉంటే ప్రమాదకరం. 

  •     వండే సమయంలో స్టవ్‌పై నీళ్లు, ఇతర ద్రవ పదార్థాలు పడకుండా చూసుకోవాలి. లేకపోతే స్టవ్‌ మన్నిక తగ్గడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 

  •     క్లీన్‌ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మెత్తటి పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. నీరు లేదా తడిబట్టతో క్లీన్‌ చేయవద్దు. 

  •     మన్నికైన స్వీచ్‌బోర్డ్‌ ద్వారా కరెంట్‌ సరఫరా అయ్యేలా చూసుకోవాలి. ఎక్స్‌టెన్షన్‌ బాక్స్‌ల వాడటం ఏమాత్రం మంచిది కాదు. 

  •     వంట పూర్తయిన తర్వాత కేవలం స్విచ్ఛాఫ్‌ చేసేసి ఊరుకోవద్దు. పిన్‌ నుంచి ప్లగ్‌ను తొలగించడం కూడా తప్పనిసరి. 

Advertisement
 
Advertisement
Advertisement