ఒకేసారి 3 ఏళ్ల రీచార్జ్‌ ప్లాన్‌.. జియో సెన్సేషన్‌! | Reliance Jio Launches 3 Year Unlimited Rs 10000 Plan | Sakshi
Sakshi News home page

ఒకేసారి 3 ఏళ్ల రీచార్జ్‌ ప్లాన్‌.. జియో సెన్సేషన్‌!

Nov 6 2026 8:26 PM | Updated on Nov 6 2026 8:35 PM

Reliance Jio Launches 3 Year Unlimited Rs 10000 Plan

దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. ఏకంగా మూడేళ్ల వ్యాలిడిటీతో అందుబాటులోకి తెచ్చిన ఈ ప్లాన్‌ ధరను రూ.10,000గా నిర్ణయించింది. సాధారణంగా నెలవారీ లేదా మూడు నెలలకోసారి రీఛార్జ్‌ చేసుకునే వినియోగదారులకు భిన్నంగా, దీర్ఘకాలం పాటు రీఛార్జ్‌ అవసరం లేకుండా ఉండాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని జియో ఈ ప్లాన్‌ను రూపొందించింది. దేశంలోని మరేతర టెలికాం ఆపరేటర్లు ప్రస్తుతం ఇలాంటి ధరతో మూడేళ్ల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌ను అందించడం లేదు.

జియో రూ.10,000 ప్లాన్‌ బెనిఫిట్స్‌ ఇవే

జియో తీసుకొచ్చిన ఈ దీర్ఘకాలిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో మొత్తం 36 నెలల సర్వీస్‌ వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో వినియోగదారులు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 2.5 జీబీ హైస్పీడ్‌ డేటా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అపరిమిత 5జీ డేటా ప్రయోజనాన్ని కూడా జియో అందిస్తోంది. అదనంగా జియో హాట్‌స్టార్‌ మొబైల్‌ ప్లస్‌ హాలీవుడ్‌ సబ్‌స్క్రిప్షన్‌, 12 నెలల పాటు కాన్వా ప్రో లైట్‌ యాక్సెస్‌, 50 జీబీ ఉచిత క్లౌడ్‌ స్టోరేజ్‌తో కూడిన జియో ఏఐ క్లౌడ్‌ ప్రయోజనాలు లభిస్తాయి.

టారిఫ్‌లు పెరిగినా నో టెన్షన్‌!

ఈ ప్లాన్‌లో ప్రధాన ఆకర్షణ మూడేళ్ల వ్యాలిడిటీ. సాధారణంగా వినియోగదారులు తమ ప్లాన్‌ గడువు ముగిసిన ప్రతిసారీ రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌ తీసుకుంటే ఏకంగా 36 నెలల పాటు ఆ ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా టెలికాం టారిఫ్‌లు భవిష్యత్తులో పెరిగినా, ఇప్పటికే రీఛార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు ప్రస్తుత ప్లాన్‌ ప్రయోజనాలు కొనసాగుతాయి.

నవంబర్‌ 7 నుంచి అందుబాటులోకి..

ఈ రూ.10,000 ప్లాన్‌ నవంబర్‌ 7 నుంచి అందుబాటులోకి రానుంది. మైజియో యాప్‌, జియో అధికారిక వెబ్‌సైట్‌, జియో స్టోర్లు, రిటైల్‌ అవుట్‌లెట్లు, ఇతర రీఛార్జ్‌ కేంద్రాల ద్వారా వినియోగదారులు ఈ ప్లాన్‌ను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో జియో అదనపు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను పెద్దగా చేర్చలేదు. దీర్ఘకాలిక వ్యాలిడిటీ, డేటా, కాలింగ్‌ ప్రయోజనాలే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇదీ చదవండి: జియో కొత్త చౌక రీచార్జ్‌ ప్లాన్లు వచ్చేశాయ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement