జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ అధికారికంగా మార్కెట్లో భారీ విజయంతో ప్రారంభమైన సంగతి తెలిసింది.ఈ సందర్భంగా అంబానీ కుటుంబం నిన్న రాత్రి ముంబైలోని తమ విలాసవంతమైన నివాసం 'అంటిలియా'లో ఘనంగా విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులంతా సాంప్రదాయ దుస్తులలో మెరిశారు. ముఖ్యంగా నీతా అంబానీ, ఇషా అంబానీ తమ దుస్తులలో మరింత ఆకర్షణీయంగా కనిపించారు. నీతా ఆకుపచ్చ పట్టు చీర ధరించగా, ఇషా తన తల్లికి తగ్గట్టుగా ఐవరీ అనార్కలీలో మెరిసింది.
నీతా అంబానీ లుక్..
నీతా అంబానీ మరోసారి సాంప్రదాయ భారతీయ సందర్భోచిత వస్త్రధారణ ఆవిష్కరించింది. ఆమె ముదురు ఆకుపచ్చ చీరను కళ్లు చెదిరే ఆభరణాలతో జత చేశారు. వెండి అంచుతో పూలతో అత్యద్భుతంగా ఉన్న ముదురు ఆకుపచ్చ చీరలో తళుక్కుమంది. ఈ లుక్‌లో ఆమె ఆభరణాలే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మధ్యలో ప్రత్యేకమైన ఆభరణం ఉండే భారీ వజ్రాల నెక్లెస్, అలాగే మ్యాచింగ్ డైమండ్ చెవిపోగులు నీతాని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేశాయి. ముదురు ఆకుపచ్చ రంగు గొప్పతనాన్ని పెంచేలా ధరించిన ఆభరణాలు ఫ్యాషన్‌కే సరికొత్త అర్థాన్ని ఇచ్చాయి.
ఇక ఇషా అంబానీ ఏకవర్ణ వస్త్రధారణ చైనీస్ లుక్‌ని ఎంచుకుంది. చైనా దుస్తుల మాదిరిగా కాలర్లు, పూర్తి చేతులు కలిగిన ఫోర్ లెంగ్త్ సూట్ ఉంది. వీటన్నింటిపై క్లిష్టమైన టోన్ ఆన్ టోన్ ఎంబ్రాయిడరీ ఉంది. దీని మ్యాచింగ్ ప్యాంట్‌ను అదే ఫాబ్రిక్‌తో చేసిన దుపట్టాతో జత చేశారు. అలాగే అమ్మలానే వజ్రాల చెవిపోగులతో మెరిసింది.
ఇదీ చదవండి: చే‘నేత’కు ‘వజ్ర’కాంతులు ..! తొలిసారిగా తెలంగాణ మహిళకు..


