గ్లోబల్‌ ఈక్విటీల్లోకి జియో బ్లాక్‌రాక్‌ ఫండ్‌ | JioBlackRock Launches Global Equity Fund Minimum Investment 5000 | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ ఈక్విటీల్లోకి జియో బ్లాక్‌రాక్‌ ఫండ్‌

Oct 29 2026 5:54 PM | Updated on Oct 29 2026 6:19 PM

JioBlackRock Launches Global Equity Fund Minimum Investment 5000

జియో బ్లాక్‌రాక్‌ ఇంటర్నేషనల్‌ ఏఎంసీ (ఐఎఫ్‌ఎస్‌సీ) ‘జియో బ్లాక్‌రాక్‌ అడ్వాంటేజ్‌ వరల్డ్‌ ఈక్విటీ ఫండ్‌’ను ప్రారంభించింది. ఇన్వెస్టర్లకు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి అవకాశాలను కల్పించడంతో పాటు, తమ పోర్ట్‌ఫోలియోను విదేశీ మార్కెట్లకు విస్తరించుకునేందుకు (వైవిధ్యీకరణకు) ఈ ఫండ్‌ దోహదపడుతుంది. గుజరాత్‌లోని అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రమైన ‘గిఫ్ట్‌ సిటీ’ వేదికగా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ జియో బ్లాక్‌రాక్‌ ఇంటర్నేషనల్‌ ఏఎంసీ అనేది జియో బ్లాక్‌రాక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌కు పూర్తి అనుబంధ సంస్థ.

ఫండ్‌ పెట్టుబడి విధానం  
ఇది ఒక ఓపెన్‌–ఎండెడ్‌ ఫండ్‌–ఆఫ్‌–ఫండ్స్‌ రిటైల్‌ పథకం. ఇది ఫీడర్‌ ఫండ్‌గా పనిచేస్తూ, ప్రధానంగా గ్లోబల్‌ డైవర్సిఫైడ్‌ విధానాన్ని అనుసరించే ‘బ్లాక్‌రాక్‌ అడ్వాంటేజ్‌ వరల్డ్‌ ఈక్విటీ ఫండ్‌’లో పెట్టుబడులు పెడుతుంది. సమీకరించిన నిధుల్లో దాదాపు 90% నుండి 100% వరకు ఈ ‘బ్లాక్‌రాక్‌ అడ్వాంటేజ్‌ వరల్డ్‌ ఈక్విటీ ఫండ్‌’ యూనిట్లలోనే పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ ఫండ్‌లో ప్రారంభ కనీస పెట్టుబడి 5,000 అమెరికన్‌ డాలర్లు కాగా, అదనపు పెట్టుబడికి కనీస పరిమితి 1,000 డాలర్లుగా నిర్ణయించారు.

‘‘దేశీయ మార్కెట్లలో పెట్టుబడులతో పాటు ప్రపంచ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ ఫండ్‌ దోహదపడుతుంది. అంతర్జాతీయ వైవిధ్యీకరణ, దీర్ఘకాలిక సంపద సృష్టిలో మరింత కీలకంగా మారుతుందని భావిస్తున్నాం. గిఫ్ట్‌ సిటీ కేంద్రంగా ప్రపంచ స్థాయి పెట్టుబడి వేదికను నిర్మించాలన్న మా లక్ష్యంలో జియో బ్లాక్‌రాక్‌ అడ్వాంటేజ్‌ వరల్డ్‌ ఈక్విటీ ఫండ్‌ ప్రారంభం ఒక కీలకమైన ముందడుగు’’ అని జియో బ్లాక్‌రాక్‌ అసెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో సిద్‌ స్వామినాథన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement