breaking news
BlackRock
-
మార్చి నుంచి మార్కెట్ల అప్‌ట్రెండ్
దేశ ఈక్విటీ మార్కెట్లలో మరికొన్ని త్రైమాసికాల పాటు ఆటుపోట్లు కొనసాగుతాయని జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐవో) రిషి కోహ్లి పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి స్థిరమైన అప్‌ట్రెండ్‌లో కొనసాగొచ్చని అంచనా వేశారు. ఆర్థిక మూలాలు, స్థూల ఆర్థిక, సైక్లికల్ అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ణయిస్తాయన్నారు. జూన్ త్రైమాసికం ఫలితాలు వివిధ రంగాల మధ్య అసహజంగా ఉన్నాయంటూ, రానున్న నెలల్లో ఇవి స్థిరపడతాయని చెప్పారు.అంతర్జాతీయ అస్సెట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన బ్లాక్‌రాక్‌తో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏర్పాటు చేసిన 50:50 జాయింట్ వెంచర్ కంపెనీయే జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్. ఇటీవలే ఈ సంస్థ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌ను ప్రారంభించడం గమనార్హం. ఈ పథకం కింద సమీకరించే పెట్టుబడుల్లో అధిక శాతాన్ని లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయనున్నట్టు రిషి కోహ్లీ తెలిపారు.బ్లాక్‌రాక్‌కు చెందిన సిస్టమ్యాటిక్ యాక్టివ్ ఈక్విటీస్ ప్లాట్‌ఫామ్ ఆధారితంగా ఈ పథకం పెట్టుబడులు పెట్టనుంది. డేటా విశ్లేషణ, నిపుణుల పరిశీలనతో పోర్ట్‌ఫోలియోను నిర్మించనుంది. ‘ఫ్లెక్సీక్యాప్ మా మొదటి యాక్టివ్ ఫండ్. చురుకైన, భిన్నమైన, తక్కువ వ్యయాలతో కూడిన పరిష్కారాలు అందించడమే మా లక్ష్యం. అన్ని మార్కెట్ సైకిల్స్‌లో రిస్క్ నియంత్రణ దృష్టిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించాలన్న లక్ష్యం పెట్టుకున్నాం’ అని వివరించారు.ఇదీ చదవండి: జొమాటోలో ‘హెల్దీ మోడ్’ ఫీచర్ -
పేటీఎం మనీపై జియో బ్లాక్‌రాక్ ఫండ్
పేటీఎం మనీ తన ప్లాట్‌ఫామ్‌పై సిస్టమ్యాటిక్ యాక్టివ్ ఈక్విటీ (ఎస్‌ఏఈ) ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇది దేశంలోనే మొదటిగా పేర్కొంది. జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్‌తో కలసి జియో బ్లాక్‌రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌లో పెట్టుబడులకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపింది.జియో బ్లాక్‌రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ బ్లాక్‌రాక్ ఎస్‌ఏఈ విధానం ఆధారంగా పెట్టుబడులు పెడుతుంది. ఈ కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 23న ప్రారంభం కాగా, అక్టోబర్ 7న ముగుస్తుంది. పేటీఎం మనీ యాప్‌పై ఎక్స్‌క్లూజివ్‌గా ఇది అందుబాటులో ఉంటుందని.. ఇన్వెస్టర్లు కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.ఎలాంటి కమీషన్ తీసుకోవడం లేదని తెలిపింది. జియో బ్లాక్‌రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో 1,000 కంపెనీలను.. డేటా విశ్లేషణ ఆధారంగా ఎంపిక చేసి పెట్టుబడులు పెడుతుంది. పరిశ్రమలోనే అతి తక్కువగా 0.50 శాతం ఎక్స్పెన్స్ రేషియోని ఈ ఫండ్‌లో వసూలు చేస్తుండడం గమనార్హం. -
ఇన్వెస్టర్ల నాడి మాకు తెలుసు
అస్సెట్ మేనేజ్మెంట్ విభాగంలో జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ ప్రవేశించిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్ల అవసరాలను తాము మెరుగ్గా అర్థం చేసుకోగలమని, పోటీ ధరలపైనే ఉత్పత్తులను అందించగలమని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. కొత్త సంస్థల రాకతో మార్కెట్ మరింత విస్తరిస్తుందన్న అభిప్రాయాన్ని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ జాయింట్ సీఈవో డీపీ సింగ్ వ్యక్తం చేశారు. దీంతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సైతం లబ్ధి పొందుతుందన్నారు.‘వారు విజయవంతం కావాలనుకుంటారు. వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. అదే సమయంలో మాకు అనుభవం ఉంది. ఇన్వెస్టర్ల స్పందన, నాడి మాకు తెలుసు. ఇవన్నీ కొత్త సంస్థకు తెలియాలంటే కొంత సమయం పడుతుంది’అని సింగ్ పేర్కొన్నారు. జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ మొదటిసారి ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌ను, కేవలం 0.50 శాతం ఎక్స్పెన్స్ రేషియోకి తీసుకురావడంపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సైతం ఇదే మాదిరి లేదా ఇంతకంటే తక్కువ ధరపైనే ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పథకాల డైరెక్ట్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియోని పరిశీలిస్తే ఇది తెలుస్తుందన్నారు.మాగ్నం సిఫ్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్) విభాగంలో ‘మాగ్నం సిఫ్’ పేరుతో ఎస్బీఐ తొలి పథకాన్ని ప్రారంభించింది. ఇందులో కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనీసం 15,000 మంది ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడులు పెడతారని అంచనా వేస్తున్నట్టు సింగ్ తెలిపారు. రిటైర్మెంట్ తీసుకున్నవారు, దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టే వారికి దీన్ని ఆఫర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మాగ్నం సిఫ్ అక్టోబర్ 1న ప్రారంభం అవుతుందని, అదే నెల 15న ముగుస్తుందని తెలిపారు. కనీసం రెండేళ్ల పాటు పెట్టుబడులు కొనసాగిస్తే మెరుగైన రాబడులు వస్తాయన్నారు.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
జియో బ్లాక్‌రాక్ తొలి ఫండ్..
జియోబ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ తొలి యాక్టివ్ ఈక్విటీ ఫండ్ ‘జియోబ్లాక్‌రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్’ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 23న ప్రారంభం కానుంది. ‘‘ఇది మాకు తొలి యాక్టివ్ ఫండ్ అవుతుంది. మరో మూడు నాలుగు యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్ కూడా త్వరలో రానున్నాయి. ఈటీఎఫ్‌లను సైతం తీసుకొస్తాం’’అని జియోబ్లాక్‌రాక్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ రిషి కోహ్లీ ప్రకటించారు.అంతర్జాతీయంగా నిరూపితమైన ఎస్‌ఏఈ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని నిర్మించామని, 400 సంకేతాల ఆధారంగా, టెక్నాలజీ సాయంతో పెట్టుబడులు పెట్టనున్నట్టు, దీనివల్ల వ్యక్తుల ప్రమేయానికి సంబంధించి రిస్క్ తగ్గుతుందని జియోబ్లాక్‌రాక్ తెలిపింది.నష్టాల రిస్క్‌ను పరిమితం చేయడం, స్థిరమైన రాబడిని తెచ్చిపెట్టడం జియోబ్లాక్‌రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ లక్ష్యమని పేర్కొంది. జియోబ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ అన్నది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్‌రాక్ ఆధ్వర్యంలోని జాయింట్ వెంచర్ కంపెనీ కావడం గమనార్హం. -
జియో బ్లాక్ రాక్ నుంచి ఐదు కొత్త ఫండ్స్
జియో బ్లార్రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్తగా ఐదు మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఎన్‌ఎఫ్‌వోలను చేపట్టేందుకు సెబీ అనుమతి మంజూరు చేసింది. జియో బ్లాక్‌రాక్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్‌రాక్ నిఫ్టీ 8–13 జీ–సెక్ ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్‌రాక్ నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్‌రాక్ నిఫ్టీనెక్ట్స్ 50 ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్‌రాక్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్‌కు అనుమతి లభించింది.ఇదీ చదవండి: ఐపీవోకు ఐవీఎఫ్ హాస్పటల్వీటిల్లో నాలుగు ఈక్విటీ ఆధారిత ఇండెక్స్ పథకాలు కాగా, ఒక్కటి డెట్ ఆధారిత ఇండెక్స్ ఫండ్. జియో బ్లాక్‌రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ మొదటిసారి 3 డెట్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోల (లిక్విడ్ ఫండ్, ఓవర్‌నైట్ ఫండ్, మనీ మార్కెట్ ఫండ్) రూపంలో రూ.17,800 కోట్లను సమీకరించినట్టు ఈ నెల 7న ప్రకటించడం తెలిసిందే. -
జియో బ్లాక్‌రాక్ కొత్త ప్లాట్‌ఫామ్ ‘అలాదీన్’
జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ‘అలాదీన్’ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. దీంతో బ్లాక్‌రాక్‌కు చెందిన పెట్టుబడుల విశ్లేషణ, రిస్క్ నిర్వహణ ప్లాట్‌ఫామ్ మొదటిసారి భారత ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చినట్టు సంస్థ ప్రకటించింది.‘‘పెట్టుబడులు ఇక ఎంతో సులభం. జియో ఫైనాన్షియల్, బ్లాక్‌రాక్ సంయుక్తంగా ఇదే నమ్మకాన్ని ఇన్వెస్టర్ల ముందుకు తీసుకొచ్చాయి. జియో డిజిటల్ ఫస్ట్ విధానానికి, బ్లాక్‌రాక్ సంస్థకు అంతర్జాతీయంగా పెట్టుబడుల్లో ఉన్న నైపుణ్యం కలగలసి ఇన్వెస్టర్లకు అనుకూలమైన సొల్యూషన్లను అందించనున్నాం’’అని జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ట్వీట్ చేసింది.ఇది ఆరంభం మాత్రమేనంటూ.. అందరికీ అందుబాటు ధరలకే పెట్టుబడుల సేవలను అందించనున్నట్టు పేర్కొంది. జియో బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎఫ్ఎస్ఎల్), యూఎస్ ఆధారిత బ్లాక్ రాక్ మధ్య 50:50 జాయింట్ వెంచర్. -
జియో బ్లాక్‌రాక్ అడ్వైజరీ సేవలకు అనుమతి
జియో బ్లాక్‌రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్.. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (పెట్టుబడి సలహా) సేవలు అందించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతోపాటు స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్ఈ నుంచి అనుమతి లభించినట్టు ప్రకటించింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్ఎల్), అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్ 50:50 జాయింట్ వెంచర్ కంపెనీయే జియో బ్లాక్‌రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్.ఇదీ చదవండి: జీవిత బీమా ప్రీమియంలో మెరుగైన వృద్ధిమార్క్ పిల్గ్రెమ్ను ఎండీ, సీఈవోగా నియమించినట్టు జియో బ్లాక్‌రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రకటించింది. ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన ప్రత్యేక ఆర్థిక పరిష్కారాలు కోరుకుంటున్న నేపథ్యంలో తమ జాయింట్ వెంచర్ సంస్థ ప్రపంచస్థాయి సలహా సేవలు అందించనుందని జేఎఫ్ఎస్ఎల్ ఎండీ, సీఈవో హితేష్ సేతియా తెలిపారు. మరోవైపు జియో బ్లాక్‌రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ మ్యూచువల్ ఫండ్స్ సేవలు అందించేందుకు గత నెల 27న సెబీ నుంచి అనుమతి లభించడం గమనార్హం. -
ఇక జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్స్
న్యూఢిల్లీ: జియో బ్లాక్‌రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ మ్యూచువల్ ఫండ్స్ సేవలు ప్రారంభించేందుకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, యూఎస్‌కు చెందిన బ్లాక్‌రాక్‌కు చెరో 50 శాతం వాటా కలిగిన జాయింట్ వెంచర్ (జేవీ) కంపెనీ ఇది.‘జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్’కు సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తోపాటు.. జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్‌కు అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీగా వ్యవహరించేందుకు జియో బ్లాక్ రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్‌కు సెబీ ఈ నెల 26న అనుమతి మంజూరు చేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు జియో ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్లడించింది. మరోవైపు జియోబ్లాక్‌రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సిద్ స్వామినాథన్‌ను ఎండీ, సీఈవోగా నియమించుకున్నట్టు ప్రకటించింది. ఈ వార్తలతో జియో ఫైనాన్షియల్ షేరు 3.50% పెరిగి రూ.292 వద్ద స్థిరపడింది. ఒకదశలో 4% లాభపడింది. -
అదానీ గ్రూప్‌లో రూ. 2,165 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ చేపట్టిన బాండ్ల జారీలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్‌రాక్ భారీగా ఇన్వెస్ట్ చేసింది. అదానీ గ్రూప్ 75 కోట్ల డాలర్ల(రూ. 6,500 కోట్లు) విలువైన బాండ్ల జారీని చేపట్టగా.. 25 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,165 కోట్లు)తో సబ్స్క్రయిబ్ చేసినట్లు తెలుస్తోంది.సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 3–5ఏళ్ల కాలపరిమితితో అదానీ గ్రూప్ ఈ బాండ్లు విడుదల చేసింది. కాగా.. గతేడాది నవంబర్‌లో లంచం ఆఫర్ చేసిన కేసు నమోదుకావడంతో అదానీ గ్రూప్‌పై యూఎస్ న్యాయశాఖ పరిశోధనకు తెరతీసింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ బాండ్లలో బ్లాక్‌రాక్ పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
భారత్‌లో బ్లాక్‌రాక్ కొత్తగా 1,200 ఉద్యోగాలు
ప్రపంచంలోనే ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్ ఇంక్.(BlackRock) భారత్‌లో సుమారు 1,200 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది. దీని ద్వారా దేశంలో తన ఉద్యోగుల సంఖ్యను విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలను పెంచడం, ముంబై, గుర్గావ్లో ఐహబ్స్గా పిలువబడే దాని సపోర్ట్ హబ్‌లను పెంచేందుకు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది.వ్యూహాత్మక విస్తరణమెరుగైన అసెట్ మేనేజ్మెంట్ సేవల కోసం ఏఐను ఉపయోగించుకోవాలనే బ్లాక్‌రాక్ విస్తృత వ్యూహంలో భాగంగా ఈ ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇంజినీర్లు, డేటా నిపుణులతో సహా కృత్రిమ మేధ సాంకేతికతల అభివృద్ధి, వాటిని అమలు చేసే విభాగాల్లో రిక్రూట్మెంట్ ఉంటుందని కంపెనీ అధికారులు తెలిపారు. ముంబై, గుర్గావ్లోని బ్లాక్‌రాక్ ఐహబ్‌లు ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్, రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఇంజినీరింగ్, బిజినెస్ ఆపరేషన్స్, డేటా అనలిటిక్స్ వంటి విలువ ఆధారిత సేవలకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఉద్యోగులతో మొత్తం భారత్‌లో వీరి సంఖ్య 3,500కు చేరుతుంది.ఇదీ చదవండి: గరిష్ట వడ్డీరేట్లను బహిర్గతం చేయాలని ఆదేశాలుప్రికిన్ కొనుగోలుబ్లాక్రాక్ సంస్థ ప్రికిన్ అనే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీను కూడా కొనుగోలు చేయనుంది. దాంతో బెంగళూరులో 1,500 మంది ఉద్యోగులతో గ్లోబల్ సామర్థ్యాల కేంద్రాన్ని బ్లాక్‌రాక్ సొంతం చేసుకోనుంది. ఈ కొనుగోలు సంస్థ డేటా ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుందని నమ్ముతున్నారు. సంస్థకు కీలకమైన కార్యకలాపాల స్థావరంగా ఈ బెంగళూరు కార్యాలయం ఉంటుందని కంపెనీ తెలిపింది. పెరుగుతున్న శ్రామిక శక్తికి అనుగుణంగా ముంబై శివారులోని గోరేగావ్‌లో అదనపు కార్యాలయ స్థలాన్ని ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్ నుంచి బ్లాక్‌రాక్ లీజుకు తీసుకుంది. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య దాదాపు రూ.400 కోట్లు (45.9 మిలియన్ డాలర్లు) విలువైన డీల్ కుదిరింది. -
స్టాక్ బ్రోకింగ్‌లోకి జియో అడుగు.. ఇక దూకుడే!
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (Jio Financial Services), యూఎస్ కంపెనీ బ్లాక్ రాక్ (BlackRock) తమ మ్యూచువల్ ఫండ్ వ్యాపారంపై రూ.117 కోట్లను తాజాగా ఇన్వెస్ట్ చేసినట్టు ప్రకటించాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్ రాక్ చెరో 50 శాతం వాటాతో ‘జియో బ్లాక్‌రాక్ అస్సెట్ మేనేజర్స్ ప్రైవేటు లిమిటెడ్’ను ఏర్పాటు చేయడం తెలిసిందే.జియో బ్లాక్ రాక్ అస్సెట్ మేనేజర్స్‌కు సంబంధించి రూ.117 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను (రూ.10 ముఖ విలువ) జియో ఫైనాన్షియల్, బ్లాక్‌రాక్‌కు (చెరో 5.85 కోట్ల షేర్లు) కేటాయించినట్టు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. ఇరు సంస్థలు ఇప్పటికే చెరో రూ.82.5 కోట్ల చొప్పున ఆరంభ పెట్టుబడి పెట్టడం గమనార్హం. అలాగే, ఇరు సంస్థలూ కలసి తమ జాయింట్ వెంచర్ కంపెనీ జియో బ్లాక్‌రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా ‘జియో బ్లాక్‌రాక్ బ్రోకింగ్ ప్రైవేటు లిమిటెడ్’ను ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ ద్వారా స్టాక్ బ్రోకింగ్ వ్యాపారం నిర్వహించనున్నాయి. వృద్ధిలో స్టాక్ బ్రోకరేజ్ పరిశ్రమభారతీయ స్టాక్ బ్రోకరేజ్ పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధించింది. ముఖ్యంగా కోవిడ్ అనంతరం డిజిటల్ స్వీకరణలో పెరుగుదల నేపథ్యంలో ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు తరలివస్తున్నారు. మార్కెట్లు, పెట్టుబడి అవకాశాలను సులభంగా అందుకునేందుకు ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల ఇన్వెస్టర్లు మళ్లుతున్నారు. దీంతో జెరోధా (Zerodha), ఏంజిల్ వన్ (Angel One), అప్‌స్టాక్స్ (Upstox), ఫైవ్‌పైసా (5Paisa) వంటి ప్రముఖ సంస్థల వృద్ధికి దారితీసింది.ఈ ప్లాట్‌ఫామ్‌లు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌లు, పోటీ ధర, అధునాతన సాధనాలను అందించడం ద్వారా పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చాయి. స్టాక్ ట్రేడింగ్‌ను ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చాయి. పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యత, ఈక్విటీ మార్కెట్లలో పెరుగుతున్న ఆసక్తి, డిజిటల్ ఫైనాన్స్‌ను ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమాలతో భారతీయ బ్రోకరేజ్ పరిశ్రమ అపారమైన వృద్ధి సామర్థ్యంతో బలమైన భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంది.జియో ఫైనాన్స్ క్యూ3 ఫలితాలుజియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 2024 డిసెంబర్‌కి అమ్మకాలలో స్వల్ప పెరుగుదలను నివేదించింది. 2023 డిసెంబర్ నాటి రూ. 414 కోట్ల నుంచి 5.8% వృద్ధిని నమోదు చేసి రూ. 438 కోట్లకు పెరిగాయి. అయితే ఎబిటా (EBITDA) 2.2% స్వల్ప క్షీణతను చూసింది. రూ.320 కోట్ల నుంచి రూ. 313 కోట్లకు తగ్గింది. నిర్వహణ లాభాల మార్జిన్ (OPM) కూడా క్షీణిచించింది. 2023 డిసెంబర్లో ఉన్న 77% నుండి 2024 డిసెంబర్లో 71%కి పడిపోయింది. మార్జిన్లలో క్షీణత ఉన్నప్పటికీ, నికర లాభం స్థిరంగా ఉంది. స్వల్పంగా 0.3% రూ. 294 కోట్ల నుంచి రూ. 295 కోట్లకు పెరిగింది. కార్యాచరణ సామర్థ్యం, మార్జిన్ కంప్రెషన్‌లో సవాళ్లు ఉన్నప్పటికీ ఇది స్థిరమైన లాభదాయకతను సూచిస్తోంది. -
కొత్త బిజినెస్‌లోకి అంబానీ.. రూ.1200 కోట్ల పెట్టుబడి!
భారతదేశంలోని సంపన్నుల జాబితాలో అగ్రగణ్యుడుగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) మ్యూచువల్ ఫండ్ రంగంలోకి ప్రవేశిస్తారంటూ కొన్ని వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్లాక్‌రాక్ భాగస్వామ్యంతో మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అప్లికేషన్ 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాయింట్ వెంచర్ మార్కెట్ కలిగి ఉంది. తాజాగా ఈ రెండు సంస్థలు కలిసి మ్యూచువల్ ఫండ్ విభాగంలో ప్రవేశించడానికి 50:50 ప్రాతిపదికన ఒక్కొక్కరు 150 మిలియన్ డాలర్లు (రూ. 12,48,63,52,500) పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుపై కొత్త సబ్సిడీ.. మహిళలకు అదనపు రాయితీ! జియో, బ్లాక్‌రాక్ రెండూ కలిసి భారతదేశంలో పెట్టుబడిదారులకు సరసమైన, వినూత్న పెట్టుబడి పరిష్కారాలను అందించే దిశగా అడుగేస్తున్నట్లు రిలయన్స్ గ్రూప్ వెల్లడించింది. మ్యూచువల్ ఫండ్స్ విభాగం జోరుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో జియో ఫైనాన్షియల్ దీనిపై ద్రుష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. -
బ్లాక్‌రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం
ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాపార విస్తరణలో దూసుకుపోతున్నారు. దేశంలో ఫైనాన్స్ వ్యాపారానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఆ రంగంలోని ప్రత్యర్థులను ఢికొట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మ్యానేజ్మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇటీవల డీమెర్జ్ అయిన జియో ఫైనాన్సియల్స్తో కలిసి ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇరు సంస్థల సమ భాగస్వామ్యంతో జియో బ్లాక్‌రాక్ అనే జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మొత్తం 300 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చట్టపరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాతమ జాయింట్ వెంచర్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. రిలయన్స్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విడిపోయిన కొద్ది రోజులకే ఈ డీల్ కుదుర్చుకోవడం విశేషంగా నిలుస్తోంది. జూన్ చివరి నాటికి 9.4 ట్రిలియన్ డాలర్లు ఆస్తుల నిర్వహణలో ఉన్న బ్లాక్‌రాక్‌తో దాదాపు 20 బిలియన్ డాలర్లు మార్కెట్ క్యాప్‌తో ఉన్న జియో ఫైనాన్సియల్స్ డీల్ కీలకమైన, వ్యూహాత్మకమైన వ్యాపార నిర్ణయంగా మార్కెట్ నిపుణుల అంచనా. (షాకిస్తున్న వెండి, బంగారం ధరలు, ఏకంగా రూ. 1100 జంప్) జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కలిసి భారతదేశంలో రాబోయే జాయింట్ వెంచర్ ద్వారా ఇండియాలో తమ ఉనికిని మరింత విస్తరణకు కృషి చేయడం చాలా ఆనందంగా ఉందని, బ్లాక్‌రాక్‌కు ఇది కీలక అడుగు అని బ్లాక్‌రాక్ చైర్మన్, సీఈవో లారీ ఫింక్ లింక్డ్ఇన్ పోస్ట్‌లో తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులు, రిస్క్ మేనేజ్ మెంట్లో బ్లాక్‌రాక్ లోతైన నైపుణ్యంతో, సాంకేతిక సామర్థ్యం జియో ఫైనాన్షియల్స్ లోతైన మార్కెట్ నైపుణ్యం కలగలిసి తమ డిజిటల్ ప్రొడక్ట్స్ డెలివరీ బాటలు వేస్తుందని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో హితేష్ సేథియా చెప్పారు. (Maruti Jimny Into Camping Setup: మారుతి జిమ్నీని సింగిల్ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో)