
జియోబ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ తొలి యాక్టివ్ ఈక్విటీ ఫండ్ ‘జియోబ్లాక్‌రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్’ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) ఈ నెల 23న ప్రారంభం కానుంది. ‘‘ఇది మాకు తొలి యాక్టివ్ ఫండ్ అవుతుంది. మరో మూడు నాలుగు యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్ కూడా త్వరలో రానున్నాయి. ఈటీఎఫ్‌లను సైతం తీసుకొస్తాం’’అని జియోబ్లాక్‌రాక్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ రిషి కోహ్లీ ప్రకటించారు.
అంతర్జాతీయంగా నిరూపితమైన ఎస్‌ఏఈ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని నిర్మించామని, 400 సంకేతాల ఆధారంగా, టెక్నాలజీ సాయంతో పెట్టుబడులు పెట్టనున్నట్టు, దీనివల్ల వ్యక్తుల ప్రమేయానికి సంబంధించి రిస్క్ తగ్గుతుందని జియోబ్లాక్‌రాక్ తెలిపింది.
నష్టాల రిస్క్‌ను పరిమితం చేయడం, స్థిరమైన రాబడిని తెచ్చిపెట్టడం జియోబ్లాక్‌రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ లక్ష్యమని పేర్కొంది. జియోబ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ అన్నది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్‌రాక్ ఆధ్వర్యంలోని జాయింట్ వెంచర్ కంపెనీ కావడం గమనార్హం.