అంతర్జాతీయ వర్తకంపై ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం టారిఫ్‌లు, ఇత ర రూపాల్లో ఆయుధాలు గా మారుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్ కేవలం టారిఫ్‌లను ఎలా ఎదుర్కోవాలన్న దానికే పరిమితం కాకుండా, ఈ విషయమై జాగ్రత్తగా సంప్రదింపులు కొనసాగించాల్సి ఉంటుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం మనకు అనుకూలమని ఒక జాతీయ దినపత్రిక నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు.
‘‘స్వీయ ప్రయోజనాల ధోరణితో ఉందంటూ భారత్‌కు పాఠాలు బోధించొచ్చు. సుంకాల రాజుగా అభివరి్ణ ంచొచ్చు. కానీ, టారిఫ్ ఆయుధంగా మారిపోయింది. వీటిని ఆయుధాలుగా మార్చు కోకూడదన్నది భారత్ ఉద్దేశం. పోటీ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తులు వరుస∙కట్టినప్పుడే దేశీ పరిశ్రమను కాపాడుకునేందుకు భారత్ రక్షణాత్మక చర్యలను అనుసరిస్తుంది’’అని మంత్రి స్పష్టం చేశారు.


