యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) బ్యాంకింగ్ లావాదేవీలు ఇకపై మరింత సురక్షితం కానున్నాయి. SMS ద్వారా వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) విధానాన్ని దశలవారీగా రద్దు చేసి, బ్యాంక్ మొబైల్ యాప్‌లోనే నేరుగా అనుమతి ఇచ్చే స్మార్ట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఈ కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో ఆన్‌లైన్ కొనుగోళ్ల సమయంలో OTP బదులు బ్యాంక్ యాప్‌లో పుష్ నోటిఫికేషన్ వస్తుంది.
వినియోగదారులు యాప్‌లో లాగిన్ చేసి బయోమెట్రిక్ లేదా స్మార్ట్ పాస్ పిన్ ద్వారా లావాదేవీకి అనుమతి ఇవ్వాలి. యాప్‌లోనే వెరిఫికేషన్ జరుగుతుండటంతో ఫిషింగ్, సిమ్ స్వాప్ వంటి మోసాలు నివారించబడతాయి. ఎమిరేట్స్ NBD సహా ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే ఈ మార్పు ప్రారంభించాయి.
కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఎలా పని చేస్తుందంటే..?
కార్డ్ వివరాలు ఇచ్చిన వెంటనే యాప్‌లో లాగిన్ చేయమని సందేశం వస్తుంది.
యాక్టివిటీస్ విభాగంలో లావాదేవీ వివరాలు చూసి, రెండు నిమిషాల్లో అనుమతి ఇవ్వాలి.
స్మార్ట్ పాస్ పిన్ నమోదు చేసిన వెంటనే లావాదేవీ పూర్తవుతుంది.
దశలవారీగా అమలు
ప్రస్తుతం కొన్ని లావాదేవీలకు మాత్రమే ఈ సిస్టమ్ అమల్లో ఉంది.
2026 మార్చి నాటికి SMS, ఈమెయిల్ OTP విధానాలు పూర్తిగా రద్దవుతాయి.
అప్పటి వరకు పాత విధానం మరియు కొత్త విధానం రెండూ కలిపి కొనసాగుతాయి.
కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌తో యుఏఈలో డిజిటల్ బ్యాంకింగ్ మరింత వేగవంతం, సురక్షితం కానుంది.


