మెగా కోడలికి ప్రతిష్టాత్మక అవార్డ్.. సోషల్ మీడియాలో పోస్ట్ | Ram Charan wife Upasana Kinidela Gets Award | Sakshi
Sakshi News home page

Upasana: ఉపాసనకు ప్రతిష్టాత్మక అవార్డ్.. సోషల్ మీడియాలో పోస్ట్

Dec 15 2025 9:44 PM | Updated on Dec 15 2025 9:44 PM

Ram Charan wife Upasana Kinidela Gets Award

మెగా హీరో రామ్ చరణ్ సతీమణికి అవార్డ్ వరించింది. మోస్ట్ పవర్‌పుల్‌ వుమెన్ ఇన్ బిజినెస్‌ అనే అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఉపాసన. అయితే తాను ప్రెగ్నెన్సీతో ఉన్నందువల్ల అవార్డ్‌ తీసుకునేందుకు వెళ్లలేకపోయానని తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన మెగా అభిమానులు ఉపాసనకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి పాటకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్‌ పరంగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement