మెగా హీరో వరుణ్ తేజ్ తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు. ఇవాళ తన భార్య, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే బేబీ.. అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా తన భార్యతో ఉన్న క్యూట్ మూమెంట్స్ ఫోటోలను షేర్ చేశారు. ఇవీ చూసిన అభిమానులు లావణ్య త్రిపాఠికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోస్ట్ చూసిన రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల బర్త్ డే విషెస్ తెలిపింది.
కాగా.. నాగబాబు కుమారుడిగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాడు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కుమారుడు జన్మించారు. వరుణ్-లావణ్య దంపతులు తమ వారసుడికి హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు. కాగా.. మట్కా మూవీ తర్వాత.. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు.


