అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ప్రేమకథా చిత్రం 'డకాయిట్'. ఈ మూవీకి షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అడివి శేష్ చిత్రాలైన క్షణం, గూఢచారి లాంటి సినిమాలకు కెమెరామెన్‌గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా డకాయిట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. డకాయిట్ టీజర్‌ను ఈనెల 18న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓకేసారి రెండు భాషల్లో టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండు భాషలు, రెండు నగరాలు, రెండు టీజర్స్ అంటూ ప్రత్యేక పోస్టర్స్‌ను పంచుకుంది.
ఈనెల 18న గురువారం ఉదయం 11 గంటలకు ముంబయిలో జరిగే ఈవెంట్‌లో హిందీ టీజర్ రిలీజ్ చేయనున్నారు. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో జరిగే ఈవెంట్‌లో టీజర్ లాంఛ్ చేయనున్నట్వు ప్రకటించారు. కాగా.. ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19, 2026న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
2 LANGUAGES.
2 TEASERS.
2 CITIES.
Gear up for the #DacoitTeaser on December 18th ❤🔥
Grand launch event at Gaiety Galaxy, Mumbai from 11 AM onwards on Dec 18th 🤩
Media Meet & Greet event at AAA Cinemas, Hyderabad from 6.30 PM onwards on Dec 18th 💥#DACOIT GRAND RELEASE… pic.twitter.com/KuHsIamvIs— Annapurna Studios (@AnnapurnaStdios) December 15, 2025


