breaking news
business news
-
ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఇచ్చే క్రెడిట్ కార్డులు
క్రెడిట్ కార్డులు అనేవి ప్రస్తుతం ప్రతిఒక్కరికి దైనందిన జీవితంలో కనీస అవసరాలుగా మారిపోయాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అనేక రకాల క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డులు ఇప్పుడు పెద్దలకు మాత్రమే ఆర్థిక సాధనాలు కాదు.. విద్యార్థులలో కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. సాధారణంగా చాలా బ్యాంకులు నిరుద్యోగులు, సరైన క్రెడిట్ హిస్టరీ లేని వారికి క్రెడిట్ కార్డులు ఇవ్వవు. అయితే, విద్యార్థులు ఇందుకు మినహాయింపు.చదువుల కోసం కుటుంబాలకు దూరంగా ఉంటున్న యువత కోసం పలు బ్యాంకులు స్టూడెంట్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వివిధ బిల్లులు, కిరాణా సరుకులు లేదా రూం అద్దెలు వంటి చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది విద్యార్థులు రోజువారీ ఖర్చులను నిర్వహించడానికి సహాయపడటమే కాకుండా మంచి క్రెడిట్ హిస్టరీని నిర్మించడానికి కూడా సహాయపడుతుంది. ప్రస్తుతం ఏయే బ్యాంకులు విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి.. వీటిలో టాప్ ఐదు ఉత్తమ క్రెడిట్ కార్డుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఎస్బీఐ స్టూడెంట్ ప్లస్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. కార్డుపై ఖర్చు చేసిన ప్రతి రూ.100కు 1 రివార్డ్ పాయింట్, రూ.500 నుంచి రూ.3,000 మధ్య లావాదేవీలపై 2.5% ఫ్యూయల్ సర్‌చార్జ్ మినహాయింపు లభిస్తుంది. దీనితో పాటు, మీరు మీ ఇతర క్రెడిట్ కార్డుల బకాయి బిల్లులను ఈ ఎస్బీఐ స్టూడెంట్ ప్లస్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డుకు తక్కువ వడ్డీ రేటుతో బదిలీ చేయవచ్చు.ఐడీఎఫ్సీ ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ ఈ కార్డుకు ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు కాబట్టి ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ చెక్ కూడా ఉండదు. విద్యార్థులు ఎలాంటి ఆదాయ రుజువు లేకుండా ఈ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు 1,500 రెస్టారెంట్లలో 20% వరకు తగ్గింపును ఆస్వాదించవచ్చు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఖర్చులపై 4 రెట్ల వరకు రివార్డులను పొందవచ్చు.కోటక్ 811 డ్రీమ్ డిఫరెంట్ క్రెడిట్ కార్డు ఈ కార్డులో జాయినింగ్ లేదా వార్షిక రుసుము ఉండదు. ఇది ఆల్-ఇన్-వన్ క్రెడిట్ కార్డు. ఇది 48 రోజుల వరకు వడ్డీ లేని నగదు ఉపసంహరణలు, అన్ని కొనుగోళ్లపై రివార్డులు, మీ టర్మ్ డిపాజిట్ మొత్తంలో 90% వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తుంది. ఇది జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డు. ఇది విద్యార్థులకు ఖర్చు లేని ఎంపిక.యాక్సిస్ బ్యాంక్ స్టూడెంట్స్ ఫారెక్స్ కార్డు ఇది విదేశీ కరెన్సీతో లోడ్ చేసిన ఫారెక్స్ కార్డు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం దీన్ని రూపొందించారు. మీరు సందర్శించే దేశం స్థానిక కరెన్సీలో సౌకర్యవంతంగా నగదును ఉపసంహరించుకోవచ్చు. ఒకే కార్డుపై 16 కరెన్సీలను లోడ్ చేయవచ్చు. లాక్-ఇన్ ఎక్స్ఛేంజ్ రేటు నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇది కరెన్సీ హెచ్చుతగ్గులపై ఎక్కువ ఖర్చు చేయకుండా నిరోధిస్తుంది.ఐసీఐసీఐ కోరల్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు ఈ కార్డుతో బుక్ మైషో బుకింగ్స్, డైనింగ్, రైల్వే, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఇంధనం నింపిన ప్రతిసారీ ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌పై 1% పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఇది చిప్, పిన్ సెక్యూరిటీతో వస్తుంది. ఇక్కడ మీరు మర్చంట్ అవుట్లెట్లలో లావాదేవీల కోసం టెర్మినల్‌పై మీ పిన్ నంబర్ నమోదు చేయాలి. -
గూగుల్ క్రోమ్‌కు సవాల్.. ఎన్విడియా ఏఐ వచ్చేస్తోంది!
ప్రపంచవ్యాప్తంగా వెబ్ బ్రౌజర్ల మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ క్రోమ్‌కు సవాల్ విసిరేందుకు టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఎన్విడియాకు చెందిన పర్పెక్స్సిటీ ఏఐ సిద్ధమవుతోంది. త్వరలోనే కామెట్ పేరుతో ఏఐ ఆధారిత సామర్థ్యంగల వెబ్ బ్రౌజర్‌ను తీసుకురానుంది. – సాక్షి, సెంట్రల్డెస్క్మార్కెట్.యూఎస్ అనే సంస్థ నివేదిక ప్రకారం 2024లో 4.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్ల మార్కెట్.. 2034 నాటికి 76.8 బిలియన్ డాలర్లకు చేరుకొనే అవకాశం ఉంది. స్టాట్‌కౌంటర్ అనే సంస్థ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి ప్రపంచ వెబ్ బ్రౌజర్ల మార్కెట్లో క్రోమ్ 68 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికం మంది యూజర్లు ఉపయోగిస్తున్న వెబ్ బ్రౌజర్‌గా మార్కెట్‌ను సుస్థిరం చేసుకొని ఇతర ప్రముఖ వెబ్ బ్రౌజర్లయిన సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఫైర్ఫాక్స్కు అందనంత ఎత్తులో ఉంది.యూజర్లకు లభించేవి ఇవీ..సాధారణ బ్రౌజర్లతో పోలిస్తే ఏఐ ఆధారిత బ్రౌజర్లు యూజర్లు కోరిన కంటెంట్‌ను సంక్షిప్తంగా అందించగలవు. అలాగే టాస్క్‌లను ఆటోమేట్ చేయగలవు. ఉదాహరణకు ఈ–మెయిళ్లకు ఆటోమెటిక్‌గా రిప్లైలు పంపడం, సోషల్ మీడియా పోస్ట్‌లను షెడ్యూల్ చేయడం, దరఖాస్తుల్లోని డేటాను సంగ్రహించడం లాంటివి అన్నమాట.ముఖ్యంగా సందర్భానుసారంగా జవాబులు అందించగలవు. అంటే యూజర్లు అందించే ఇన్పుట్లు, డేటా హిస్టరీని పరిగణనలోకి తీసుకొని, వాటిని విశ్లేషించి జవాబులను అందించడం, వివిధ డేటా సోర్స్‌ల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి నేరుగా సమాధానాలు ఇవ్వ డం చేయగలవు. అపాయింట్మెంట్ల బుకింగ్‌లు, ఉత్పత్తులను పోల్చడం వంటి సంక్లిష్ట పనులను కూడా చక్కబెట్టగలవు. -
రూ.75 లక్షల జాబ్ ఆఫర్.. తీసుకోవాలా.. వద్దా?
ఎక్కువ జీతం వచ్చే జాబ్ ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏడాదికి రూ.75 లక్షల జీతంతో జాబ్ ఆఫర్ వచ్చింది.. తీసుకోవాలా.. వద్దా అని సందిగ్ధంలో ఉన్నానని ఇటీవల ఓ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారతదేశంలో అధిక పన్ను కారణంగా ఈ ఆఫర్‌ను తాను స్వీకరిస్తానని ఖచ్చితంగా చెప్పలేనన్నారు.తాను ఇప్పటికే దాదాపు రూ.12 లక్షల పన్నులు చెల్లిస్తున్నానని, కొత్త జాబ్ ఆఫర్ స్వీకరిస్తే ఆ పన్ను మొత్తం దాదాపు రెట్టింపు అయి రూ.22 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. ‘20 ఏళ్ల అనుభవంతో ప్రస్తుతం భారత్ లో ఏటా రూ.48 లక్షలు సంపాదిస్తున్నాను. ఈ మధ్యనే రూ.75 లక్షలకు ఆఫర్ వచ్చింది. ఇది గణనీయమైన పెరుగుదల అయినప్పటికీ, ప్రధానంగా పన్ను బాధ్యతలో విపరీతమైన పెరుగుదల కారణంగా దానిని అంగీకరించాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ప్రస్తుతం రూ.12 లక్షల వరకు పన్నులు చెల్లిస్తున్నాను. రూ .50 లక్షలకు పైగా ఆదాయంపై వర్తించే అదనపు 10% సర్ఛార్జ్ కారణంగా కొత్త ఆఫర్‌తో ఆ మొత్తం దాదాపు రెట్టింపు అయి రూ .22 లక్షలకు చేరుకుంటుంది" అని యూజర్ రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు.ట్యాక్స్ ఎక్కువ కట్టేందుకు పనిచేయాలా?కొత్త వేతన నిర్మాణంలో పన్ను ఆదా చేసే అంశాలను చేర్చే వెసులుబాటు లేదని ఆయన అన్నారు. ‘కాబట్టి, నా టేక్-హోమ్ వేతనం సుమారు 50% పెరగవచ్చు, పన్ను భారం దాదాపు రెట్టింపు అవుతుంది. తక్కువ పన్ను లేదా అస్సలు చెల్లించని వారితో పోలిస్తే ఎటువంటి అదనపు స్పష్టమైన ప్రయోజనాలను పొందకుండా, ప్రభుత్వానికి ఎక్కువ పన్ను చెల్లించడానికి నేను ఎందుకు ఎక్కువగా కష్టపడాలి?" అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సదరు వ్యక్తికి వచ్చిన సందిగ్ధ పరిస్థితిపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తూనే అభిప్రాయాలనూ వ్యక్తీకరించారు. నేరుగా ఉద్యోగంలో చేరకుండా కన్సల్టెంట్ గా పరిహారం అందుకుంటే పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేసుకోవచ్చని, కానీ ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ చెల్లించడం ఇష్టం లేక వేతన పెంపు తీసుకోకపోవడం సరికాదంటూ ఓ యూజర్ సలహా ఇచ్చారు. ఇప్పుడొస్తున్న దానికంటే 50% ఎక్కువ జీతం వస్తున్నా కూడా ట్యాక్స్ పెరుగుతుంది కాబట్టి జాబ్ ఆఫర్‌ను వదులుకుంటాననడం మూర్ఖత్వం అని మరో వ్యక్తి పేర్కొన్నారు.దేశంలో ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ .4 లక్షల వరకు ఆదాయంపై సున్నా పన్ను ఆ తర్వాత 5% నుండి 30% వరకు పన్ను రేట్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు (వేతన జీవులకు రూ.12.75 లక్షలు) అధిక రిబేట్, స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక పాత విధానం ఎంచుకునేవారికి 80సీ, హెచ్ఆర్ఏ వంటి సెక్షన్ల కింద మినహాయింపులు ఉన్నాయి. అధిక ఆదాయం ఉన్న వ్యక్తులకు సర్ ఛార్జీలు వర్తిస్తాయి.👉 ఇదీ చదవండి: ఐటీ రిటర్న్ కొత్త డెడ్‌లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే! -
రియల్టీ కంపెనీలలో వాటా విక్రయం.. 2 కోట్ల షేర్లు అమ్మేసిన ఇన్వెస్కో
దేశీ రియల్టీ రంగ కంపెనీలు ఒబెరాయ్ రియల్టీ, లోధా డెవలపర్స్‌లో యూఎస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఇన్వెస్కో తాజాగా 2 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఒబెరాయ్ రియల్టీలో 2.95 శాతం వాటాకు సమానమైన కోటికిపైగా షేర్లను అమ్మివేసింది.బీఎస్ఈ బల్క్‌డీల్ వివరాల ప్రకారం అనుబంధ సంస్థ ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ షేరుకి రూ. 1,754.26 ధరలో వీటిని విక్రయించింది. తద్వారా రూ. 1,883 కోట్లకు అందుకుంది. 2025 జూన్‌కల్లా ఇన్వెస్కో ఫండ్‌కు ఒబెరాయ్ రియల్టీలో 3.01 శాతం వాటా ఉంది. కాగా.. ఈ బాటలో లోధా డెవలపర్స్‌లోనూ 1 శాతం వాటాకు సమానమైన 95.25 లక్షల షేర్లను విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్‌డీల్ ప్రకారం షేరుకి రూ. 1384.93 ధరలో అమ్మివేయడం ద్వారా రూ. 1,319 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఎస్బీఐ ఫండ్ కొనుగోలు ఒబెరాయ్ రియల్టీలో 1.13% వాటాకు సమానమైన 40.94 లక్షల షేర్లను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సొంతం చేసుకుంది. షేరుకి రూ. 1,754.10 సగటు ధరలో రూ. 718.2 కోట్లకు కొనుగోలు చేసింది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. ఇదేవిధంగా ఎన్ఎస్ ఈ గణాంకాల ప్రకారం లోధా డెవలపర్స్ షేర్ల కొనుగోలుదారుల వివరాలు సైతం వెల్లడికాలేదు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పడేసిన ఐటీ, రియల్టీ షేర్లు
ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐఈఎక్స్, కోఫోర్జ్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ జూన్ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు స్పందించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 542.47 పాయింట్లు (0.66 శాతం) క్షీణించి 82,184.17 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 157.8 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 25,062.1 వద్ద ముగిశాయి.ఎటర్నల్ (జొమాటో), టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, టైటాన్ షేర్లు టాప్ గెయినర్స్‌గా లాభపడగా, ట్రెంట్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) టాప్ లూజర్స్‌గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ వరుసగా 0.58 శాతం, 1.09 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 2.21 శాతం, నిఫ్టీ రియల్టీ 1.04 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.12 శాతం నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 1.24 శాతం, నిఫ్టీ ఫార్మా 0.55 శాతం లాభపడ్డాయి. -
సరికొత్తగా రెనో ట్రైబర్...
ఫ్రెంచ్ వాహన తయారీ దిగ్గజం రెనో సరికొత్త ‘ఆల్–న్యూ రెనో ట్రైబర్’ను లాంచ్ చేసింది. ఈ కొత్త ట్రైబర్‌లో దాని ప్రత్యేకమైన 7 సీటర్ కెపాసిటీని, సీట్లను మార్చుకునే వెసులుబాటును అలాగే ఉంచుతూ డిజైన్, ఫీచర్లలో పలు మార్పులు తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.6.29 లక్షలుగా ఉంది.ఈ సందర్భంగా రెనో ఇండియా ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి మాట్లాడుతూ.. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థ మెరుగైన వృద్ధి సాధించిన తర్వాతే మార్కెట్లోకి ఈవీ ఉత్పత్తులను విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్, నిబంధనలు, ఎకో సిస్టమ్ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. సరైన సమయంలో ఈవీలను ఆవిష్కరిస్తామన్నారు.డిజైన్‌లో చేసిన మార్పులు ఎక్స్టీరియర్ నుంచే కనిపిస్తున్నాయి. ఫేస్‌లిఫ్టెడ్ ట్రైబర్ పూర్తిగా పునరుద్ధరించిన ఫ్రంట్ ఫేస్‌ను కలిగి ఉంది. వర్టికల్ స్లాట్లను కలిగి ఉన్న గ్లాస్ బ్లాక్ గ్రిల్ ఎల్ఈడీ డీఆర్ఎల్తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్ల్యాంప్లలోకి అనుసంధానమై ఉంటుంది.ఫ్రంట్ బంపర్‌ను కూడా పూర్తీగా మార్చేశారు. సిల్వర్ యాక్సెంట్లతో పెద్ద ఎయిర్ డ్యామ్, రీపోజిషన్ చేసిన ఫాగ్ ల్యాంప్‌లు, వర్టికల్ ఎయిర్ ఇన్లెట్లను కలిగి ఉంటుంది.కొత్త ట్రైబర్‌లో రెనాల్ట్ సొగసైన 2డీ డైమండ్ లోగోను తీసుకొచ్చారు. స్టైలిష్ 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, గ్లాస్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్, పూర్తిగా నల్లటి రూఫ్‌ను పొందుతుంది. వెనుక భాగంలో, టెయిల్‌గేట్‌లో స్లీకర్ ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్‌లు, గ్లాస్ బ్లాక్ ట్రిమ్ ప్యానెల్, 'TRIBER' లెటరింగ్, రీడిజైన్ చేసిన బంపర్ ఉన్నాయి.లోపల, క్యాబిన్ పాత బ్లాక్ అండ్ సిల్వర్ లేఅవుట్ స్థానంలో ఇప్పుడు ఫ్రెష్ గ్రే అండ్ బీజ్ థీమ్‌ను కలిగి ఉంది. నవీకరించిన డాష్‌బోర్డ్ డిజైన్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ఉంది. ఏసీ వెంట్స్ కింద ఇచ్చారు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్లైట్లు, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ఫేస్‌లిఫ్టెడ్ ట్రైబర్ ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందిస్తుంది. -
‘గుడ్ న్యూస్.. పెద్ద క్రాష్ రాబోతోంది’
రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ద్వారా ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి ఏదో క్రాష్ రాబోతోందని హెచ్చరించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ సహా అసెట్ క్లాసుల్లో బుడగలు పేలబోతున్నాయంటూ ఈ 78 ఏళ్ల ఇన్వెస్టర్, ఎంట్రాప్రెన్యూర్ సంకేతాలిచ్చారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో రాబర్ట్ కియోసాకి ఒక పోస్ట్ చేశారు. "బుడగలు పేలడం ప్రారంభించాయి.. బుడగలు పేలినప్పుడు బంగారం, వెండి, బిట్ కాయిన్ కూడా పతనమవుతాయి. గుడ్ న్యూస్’ అంటూ రాసుకొచ్చారు.క్రాష్ అంటూ హెచ్చరిస్తున్నప్పటికీ రానున్న పతనాన్ని కొనుగోలు అవకాశంగా కియోసాకి పేర్కొన్నారు. ధరలు పడిపోతే తాను బంగారం, వెండి, బిట్ కాయిన్లలో ఎక్కువ పెట్టుబడి పెడతానని చెప్పుకొచ్చారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్తమ సమయం ధరలు తక్కువగా ఉన్నప్పుడు, భయం ఎక్కువగా ఉన్నప్పుడు అని ఆయన వివరించారు.BUBBLES are about to start BUSTING.When bubbles bust odds are gold, silver, and Bitcoin will bust too.Good news.If prices of gold, silver, and Bitcoin crash…. I will be buying.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) July 21, 2025 -
ఐటీ రిటర్న్ కొత్త డెడ్‌లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే!
దేశంలో ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) సీజన్ నడుస్తోంది. ఐటీ రిటర్నులు దాఖలు చేయడం భారతీయ పన్ను చెల్లింపుదారులందరికీ కీలకమైన బాధ్యత. అన్ని ఆదాయ మార్గాలను ప్రకటించడం, అర్హత వ్యయాలను మినహాయించడం, పన్ను బాధ్యతలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించడంతో పాటు పన్ను చట్టాలను పాటించడం అవసరం.ఐటీఆర్ దాఖలుకు కొత్త డెడ్‌లైన్2024–25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2025–26) నాన్ ఆడిట్ పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ దాఖలు చేయడానికి సాధారణంగా జూలై 31 వరకూ గుడువు ఉంటుంది. అయితే ఈసారి గడువును 2025 సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. ఒకవేళ గడువు దాటితే ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించి 2025 డిసెంబర్ 31లోగా లేట్ రిటర్న్ దాఖలు చేయవచ్చు.గడువు దాటిపోతే పర్యవసానాలుఐటీఆర్ దాఖలు చేయకుండా గడువు దాటిపోతే సెక్షన్ 234ఏ కింద తీవ్రమైన జరిమానాలు, అభియోగాలు, సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.వడ్డీ: గడువు తర్వాత మీరు మీ రిటర్న్ సబ్మిట్ చేస్తే, సెక్షన్ 234ఎ కింద చెల్లించని పన్ను మొత్తంపై నెలకు 1% లేదా ఒక నెలలో కొంత భాగం వడ్డీ చెల్లించాలి.ఆలస్య రుసుము: సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుము వసూలు చేస్తారు. రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉంటే రూ.5,000, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే రూ.1,000 ఆలస్య రుసుము వసూలు చేస్తారు.నష్టాల సర్దుబాటు: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇళ్లు లేదా మీ వ్యాపారాల నుండి మీకు నష్టాలు వచ్చి ఉంటే వాటిని మరుసటి సంవత్సరం మీ ఆదాయానికి వ్యతిరేకంగా సర్దుబాటు చేసుకోవచ్చు. దీనివల్ల తరువాతి సంవత్సరాలలో మీరు చెల్లించాల్సిన పన్ను గణనీయంగా తగ్గుతుంది. అయితే గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఈ నష్టాలను సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉండదు.👉 ఇదీ చదవండి: రూ.75 లక్షల జాబ్ ఆఫర్.. అంత ట్యాక్స్ కట్టి అవసరమా? -
2 రోజుల్లో రూ.2 వేల కోట్లు.. ‘క్విక్’ కుబేరుడు!
ఎటర్నల్ (జొమాటో) వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) నికర సంపద అమాంతం పెరిగిపోయింది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ.2,000 కోట్లు పెరిగింది. ఎటర్నల్ క్విక్ కామర్స్ విభాగమైన బ్లింకిట్ లో కనిపించిన గణనీయమైన వృద్ధిని ఇన్వెస్టర్లు స్వాగతించడంతో, ఎటర్నల్ షేర్లు రెండు రోజుల్లో 21 శాతానికి పైగా పెరిగాయి. ఎన్ఎస్ఈలో తాజా ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ .311.60 ను కూడా తాకాయి.సెల్ఫ్ మేడ్ బిలియనీర్ అయిన 42 ఏళ్ల దీపిందర్ గోయల్ ఎటర్నల్ కంపెనీలో తనకున్న 3.83 శాతం వాటా కారణంగా కొత్తతరం కంపెనీలో తన వాటా విలువ రూ.11,515 కోట్లకు పెరిగింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం ఈ ఐఐటీయన్ నికర సంపద 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది.విప్రో, టాటా మోటార్స్, నెస్లే, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల కంటే ఎటర్నల్ షేర్లు రూ.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును దాటాయి. ఎటర్నల్ షేర్ల జోరు ప్రత్యర్థి స్విగ్గీపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపింది. దీంతో ఆరోజు ఆ కంపెనీ షేరు 7 శాతానికి పైగా పెరిగింది.నెట్ ఆర్డర్ వ్యాల్యూ (ఎన్ఓవీ) పరంగా బ్లింకిట్ ఇప్పుడు జొమాటో కంటే పెద్దది కావడంతో టాప్ బ్రోకరేజీ సంస్థలు ఇప్పుడు రూ.400పై దృష్టి సారించాయి. రూ.400 టార్గెట్ ధరతో ఎటర్నల్‌ను బైకి అప్ గ్రేడ్ చేస్తూ జెఫరీస్ అత్యంత దూకుడుగా వ్యవహరించింది. పోటీ ముప్పును అతిగా అంచనా వేసినట్లు కూడా అంగీకరించింది.దీపిందర్ గురించి..పంజాబ్‌లోని ముక్త్సర్లో 1983 జనవరి 26న జన్మించిన దీపిందర్ గోయల్.. ఐఐటీ ఢిల్లీ నుంచి మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. 2008లో ఫుడీబే (Foodiebay) అనే వెబ్‌సైట్‌తో ప్రారంభమైన ఆయన వ్యాపార ప్రయాణం, తర్వాత జొమాటోగా (Zomato)గా మారింది. దీపిందర్ వ్యూహాత్మక నిర్ణయాలతో జొమాటో దేశ విదేశాల్లో విస్తరించింది. 2022లో బ్లింకిట్ (Blinkit) అనే క్విక్ కామర్స్ సంస్థను కొనుగోలు చేసి, ఆ రంగంలోనూ తన ఆధిపత్యాన్ని చూపించారు. 2025లో జొమాటో పేరును ఎటర్నల్ లిమిటెడ్ (Eternal Limited)గా మార్చారు. -
2032 నాటికి 226 విమానాలు..
విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ భారీ విస్తరణ ప్రణాళికల్లో ఉంది. 2032 నాటికి 226 విమానాలను సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్షికంగా సర్వీసుల సామర్థ్యాన్ని 25–30 శాతం మేర పెంచుకోవాలని నిర్దేశించుకుంది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకుర్ గోయల్ ఈ విషయాలు తెలిపారు.2022 ఆగస్టులో ప్రారంభమైన ఆకాశ ఎయిర్ దేశీయంగా 23, అంతర్జాతీయంగా 5 గమ్యస్థానాలకు ఫ్లైట్లు నడుపుతోంది. కంపెనీ దగ్గర ప్రస్తుతం 30 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో అయిదు కొత్త విమానాలు జత కానున్నాయి. త్వరలోనే వ్యయాలను మరింతగా తగ్గించుకుని, లాభాల్లోకి మళ్లగలమని అంకుర్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎయిర్‌లైన్ మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆదాయంలో 49% పెరుగుదలను నమోదు చేసింది . పరిశ్రమ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆకాశ ఎయిర్ ఏఎస్కే (అవెలబుల్ సీట్ కిలోమీటర్స్)కి యూనిట్ ఖర్చును (ఇంధనం మినహా) 7% తగ్గించగలిగింది. అయితే ఎబిటార్ (Ebitdar) మార్జిన్లు 50% పెరిగాయి. వడ్డీ, పన్నులు , తరుగుదల, రుణ విమోచన, అద్దె ఖర్చులు మినహాయించక ముందు ఆదాయాలను ఎబిటార్ సూచిస్తుంది. విమానయాన పరిశ్రమలో కార్యాచరణ పనితీరుకు కీలకమైన కొలమానంగా దీన్ని చూస్తారు. -
టీసీఎస్ కూడా అంతేనా? కేంద్రానికి ఉద్యోగుల ఫిర్యాదు
ఉద్యోగులకు ఆఫర్ లెటర్లు ఇచ్చి ఉద్యోగంలోకి చేర్చుకోకుండా తిప్పలు పెడుతోందంటూ దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం ఆ మధ్య కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కూడా ఇలాగే చేస్తోందని ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.600 మందికి పైగా అనుభవజ్ఞులైన ఉద్యోగుల లేటరల్ నియామకాల్లో టీసీఎస్ జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది. ఈ ఆన్‌బోర్డింగ్ టైమ్‌లైన్‌పై ఎటువంటి కమ్యూనికేషన్ లేదని, దీంతో చాలా మంది టెక్కీలు ఇబ్బంది పడుతున్నారని మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొంది.ఆన్ బోర్డింగ్ ప్రక్రియల్లో ఈ 'నిరవధిక జాప్యం' ప్రభావాన్ని ఎత్తిచూపుతూ కార్మిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని ఎన్ఐటీఈఎస్ కోరింది. అధికారిక ఆఫర్ లెటర్ ఉన్నప్పటికీ ఉద్యోగంలో చేర్చుకోకపోవడం ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వివరించింది. ప్రభావితమైనవారిలో రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల అనుభవం ఉన్న వారు ఉన్నారని లేఖలో తెలిపింది. ఈ ఉద్యోగులు తమ మునుపటి సంస్థకు అధికారికంగా రాజీనామా చేశారని, ప్రస్తుతం వీరు ఇటు టీసీఎస్ ఉద్యోగంలో చేర్చుకోకపోవడం, వేరే ఉద్యోగమూ లేకపోవడంతో ఈఎంఐలు, అద్దెలు, వాయిదాలు చెల్లించడం కష్టమవుతోంది. దీనిపై టీసీఎస్ ఏమంటోందంటే..ఆఫర్ లెటర్ అందుకున్న ప్రతి ఒక్కరినీ ఆన్‌బోర్డ్ చేస్తామని టీసీఎస్ పునరుద్ఘాటిస్తోంది. ‘ఫ్రెషర్స్ లేదా అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ ఇచ్చిన అన్ని ఆఫర్లను గౌరవించడానికి టీసీఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మేము ధృవీకరించగలము. టీసీఎస్ నుంచి ఆఫర్ వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆన్‌బోర్డ్ చేస్తాం. వ్యాపార డిమాండ్ ప్రకారం జాయినింగ్ తేదీలు నిర్ణయించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో, అవి వ్యాపార అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంటాం. ఈ సందర్భాల్లో అభ్యర్థులందరితో నిరంతరం టచ్ లో ఉంటామని, వారిని త్వరలోనే సంస్థలో చేర్చుకునేందుకు చూస్తుంటాం’ అని కంపెనీ తెలిపింది.ఆలస్యమైన అభ్యర్థుల ఆన్‌బోర్డింగ్‌కు సంబంధించి స్పష్టమైన కాలపరిమితి కోసం టీసీఎస్‌పై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ఎన్ఐటీఈఎస్ అధికారికంగా కార్మిక మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. వెయిటింగ్ పీరియడ్ కు ఆర్థిక పరిహారం, టీసీఎస్ ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఈఏపీ) ద్వారా మానసిక ఆరోగ్య మద్దతుకు ప్రాప్యత, బాధితులకు కంపెనీలో ప్రత్యామ్నాయ పాత్రలను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్ఐటీఈఎస్ డిమాండ్ చేస్తోంది.👉 ఇదీ చదవండి: ఈ ఐటీ ఉద్యోగం.. రూ.కోటి జీతం -
హైదరాబాద్ కంపెనీ.. రూ.1,000 కోట్ల పెట్టుబడులు
గ్లాస్ కంటైనర్ల తయారీ సంస్థ ఏజీఐ గ్రీన్‌ప్యాక్ సంస్థ కొత్తగా అల్యూమినియం క్యాన్ల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్త ప్లాంటుపై రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. రెండు దశలుగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ సీఎండీ సందీప్ సోమానీ తెలిపారు.ఇది తొలుత 95 కోట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో 2028 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అందుబాటులోకి రాగలదని చెప్పారు. దీన్ని 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 160 కోట్లకు పెంచుకోనున్నట్లు సందీప్ తెలిపారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత క్యూ1తో పోలిస్తే 41%పెరిగి రూ. 63 కోట్ల నుంచి రూ. 89 కోట్లకు చేరింది.మెరిల్లో ఏడీఐఏ 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులుఅబుదాబీ ఇన్వెస్ట్మెంట్ ఆథారిటీ(ఏడీఐఏ), భారత్‌కు చెందిన మెడికల్ డివైజెస్ తయారీ సంస్థ మైక్రో లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్(మెరిల్)లో 200 మిలియన్ డాలర్ల(రూ.1,670 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడితో మెరిల్లో ఏడీఐఏకు 3% వాటా లభించనుంది.తద్వారా మెరిల్ మార్కెట్ విలువ 6.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.56,859 కోట్లు)చేరుతుందని అంచనా. పెట్టుబడి నిధులను వ్యాపార విస్తరణ, పరిశోధన–అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలకు వినియోగించుకుంటామని మెరిల్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భట్ తెలిపారు. గుజరాత్‌లోని వాపి కేంద్రంగా పనిచేసే మెరిల్ సంస్థ... గుండె సంబంధిత పరికరాలు, సర్జికల్ రోబోటిక్స్, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లు వంటి వైద్య పరికరాలు తయారు చేస్తుంది. -
ఐకియా ఇండియా కొత్త సీఈవోగా ప్యాట్రిక్ ఆంటోనీ
హోమ్ ఫర్నిషింగ్స్ దిగ్గజం ఐకియా ఇండియా కొత్త సీఈవోగా ప్యాట్రిక్ ఆంటోనీ నియమితులయ్యారు. ఆగస్టు నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. కంట్రీ రిటైల్ మేనేజర్, చీఫ్ సస్టైనబిలిటీ మేనేజర్‌గా (సీఎస్‌వో) కూడా ఆయన వ్యవహరిస్తారని కంపెనీ తెలిపింది.ప్రస్తుత కంట్రీ రిటైల్ మేనేజర్, సీఎస్‌వో సుసాన్ పల్వరర్ రాజీనామా చేయడంతో ఆంటోనీ నియమితులయ్యారు. ఐకియాలో సుసాన్ సుమారు 28 ఏళ్లు పనిచేశారు. అయిదేళ్ల పాటు డిప్యుటీ సీఈవోగా కూడా వ్యవహరించారు. 2018లో హైదరాబాద్‌లో తొలి స్టోర్ ప్రారంభించిన ఐకియా ప్రస్తుతం రెండో విడత విస్తరణపై దృష్టి పెడుతోంది. -
ఎంజీ ఎం9 ఈవీ లాంచ్.. 548 కి.మీ.రేంజ్
జెఎస్బ్ల్యు-ఎంజీ మోటార్ ఇండియా ఎం9 ఎలక్ట్రిక్ ఎంపీవీని అధికారికంగా లాంచ్ చేసింది. భారత్‌లో రూ .69.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. సింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో లభించే ఈ మోడల్‌ను రూ.1 లక్ష చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.ఎంజీ సెలెక్ట్ చైన్ ఆఫ్ డీలర్ షిప్ ల ద్వారా విక్రయించే కొత్త ఎం9 ఈవీ డెలివరీలు ఆగస్టు 10 న ప్రారంభం కానున్నాయి. కియా కార్నివాల్, టయోటా వెల్ ఫైర్ లకు పోటీగా వస్తున్న ఈ ఈవీలో 90 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ తో 241 బీహెచ్పీ, 350 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. 548 కిలోమీటర్ల (ఎంఐడిసి సైకిల్) రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.ఎంజీ ఎం9 ఈవీ ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే లెవల్ 2 ఏడీఏఎస్ సూట్, ఎలక్ట్రిక్ స్లైడింగ్ రియర్ డోర్లు, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లతో కూడిన 16-వే అడ్జస్టబుల్ సెకండ్-లైన్ సీట్లు, పవర్డ్ బాస్ మోడ్, డ్రైవర్, ప్యాసింజర్ కోసం వెల్ కమ్ సీట్ ఫంక్షన్, ఏడు ఎయిర్ బ్యాగులు, ఆటో హోల్డ్ తో కూడిన ఈపీబీ, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ యూనిట్, ఏడు అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే, 13-స్పీకర్ జేబీఎల్ మ్యూజిక్ సిస్టమ్ 360 డిగ్రీల కెమెరా, డ్రైవ్ మోడ్స్ (ఎకో, నార్మల్, స్పోర్ట్) వంటివి ఉన్నాయి. -
అవీవా కొత్త పాలసీ.. బాల వికాస్ యోజన
న్యూఢిల్లీ: అవీవా ఇండియా నూతనంగా అవీవా భారత్ బాల వికాస్ యోజన పేరుతో బీమా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఈక్విటీ మార్కెట్‌తో సంబంధం లేని, నాన్ పార్టిసిపేటింగ్ జీవిత బీమా ప్లాన్. తమ పిల్లల భవిష్యత్ భద్రతకు ఇది భరోసానిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రీమియం నెలకు రూ.1,000 నుంచి మొదలవుతుంది.జీవిత బీమా రక్షణకుతోడు హామీతో కూడిన మెచ్యూరిటీ ప్రయోజనం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. 3 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు పరిధిలోని వారు.. 12–30 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. గరిష్ట కాల వ్యవధి పాలసీదారుడికి 80 ఏళ్ల వరకు ఉంటుంది.నెలవారీ, త్రైమాసికం లేదా అర్ధ సంవత్సరం లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. గ్యారంటీడ్ సమ్ అష్యూర్డ్ పేరుతో కాల వ్యవధి ముగిసిన తర్వాత చెల్లించే ప్రయోజనం పిల్లల భవిష్యత్ అవసరాలకు ఆర్థిక భరోసానిస్తుందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వినీత్ కపాహి తెలిపారు. -
వారెన్ బఫెట్ ప్రకారం.. ఆ 5 తప్పులివే...
అమెరికాకు చెందిన వారెన్ బఫెట్, ప్రపంచంలోని అత్యాధునిక అత్యంత తెలివైన పెట్టుబడిదారుల్లో ఒకరు. ఆయన గురించి తెలియని విద్యావంతులు ఉంటారేమో కానీ ఆర్ధికవేత్తలు ఉండరు. ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో 5వ వ్యక్తి అయిన వారెన్ బఫెట్ 94 వయస్సులోనూ అత్యంత తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. సంపదను అర్జించడంతో పాటు దానిని రక్షించుకోవడం, దాని విలువను పెంచుకోవడం వంటి విషయాలపై ఆయన తరచుగా చెప్పే సూత్రాలు ఆర్ధిక నిరక్షరాస్యులకు ఓ రకంగా పాఠాల లాంటివే నని చెప్పాలి. సంపన్నులు కాలేకపోయిన మధ్య తరగతి జీవులు తరచుగా చేసే తప్పుల గురించి ఆయన చెప్పిన కొన్ని విషయాలివి...కొత్త కారు...పెద్ద వృధా..చాలా మంది తమ స్థాయి మెరుగుపరచడం కోసం కాకుండా మెరుగైందని చెప్పుకోవడం కోసం ఎక్కువ ఆరాట పడతారు. అలాంటి వారికి బఫెట్ చెబుతున్న సలహా ఏమిటంటే...కొత్త కారు షోరూం నుంచి బయటకి తీసుకొచ్చిన రెండో నిమిషం నుంచే విలువ తగ్గిపోవడం మొదలవుతుంది, ఐదు సంవత్సరాల్లో దాని విలువ 60% వరకు కోల్పోతుంది. వేల కోట్ల ఆస్తులున్న బఫెట్ 2014 మోడల్ క్యాడిల్లాక్ ఎక్స్‌టిఎస్ ను వినియోగిస్తుంటారు. అదీ జనరల్ మోటార్స్ వాళ్లు భారీ డిస్కౌంట్ ధరపై ఇస్తేనే కొనుగోలు చేశారు. ఆయనేమంటారంటే... ‘‘కారును ఒక విజయంలా కాదు, ఒక ప్రయాణ మార్గంగా మాత్రమే చూడాలి’’.క్రెడిట్ కార్డ్ ఓ వల...బహుశా భారతదేశంలో ఇప్పుడు క్రెడిట్ కార్డు గురించి తెలియని వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చేమో కానీ... క్రెడిట్ కార్డ్ వల్ల వచ్చే నష్టాలు మాత్రం లెక్కలేనన్ని అంటున్నారు బఫెట్.. దాని అప్పులపై అత్యధికంగా 30% వడ్డీ చెలించాల్సి వుంటుంది. ఉదాహరణకు రూ.1 లక్ష తీసుకుంటే రూ.30 వేల దాకా వార్షిక వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ‘‘మీరు తెలివిగా ఉంటే, అప్పు బాధ వదిలిపోవచ్చు’’ అంటారాయన. క్రెడిట్ కార్డ్‌ను అత్యవసర సమయాల్లో ఉపకరించేదిగా మాత్రమే చూడాలి తప్ప అత్యధిక వ్యయానికి అవకాశంగా చూడకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు.లాటరీ, జూదం రెండూ ప్రమాదమే..జూదం, లాటరీలను ‘‘మ్యాథ్ ట్యాక్స్’’ అని పేర్కొంటారు బఫెట్, అంటే మ్యాథమేటిక్స్, లాజిక్ తెలియని వారికి వడ్డించే అదనపు పన్ను అని అర్ధం. ఇవి వ్యక్తుల్ని వారి మేధా శక్తిని నిర్వీర్యం చేసి చివరకు అదృష్టం మీద ఆధారపడే దుస్థితికి చేరుస్తుందని ఆయన అంటున్నారు.ఇల్లు...అవసరమా? విజయమా?అవసరానికి ఇల్లు కొనవచ్చు. అయితే అవసరానికి మించి పెద్ద ఇల్లు ఉంటే అది నష్టమే అంటున్నారు బఫెట్. ఆయన తాను 1958లో కొనుక్కున్న పాత ఇంటిలోనే ఆయన ఇప్పటికీ జీవిస్తున్నారు. ఇల్లు జీవించడానికి రెండు పడకగదుల ఇల్లు సరిపోయేవారు 4 పడక గదుల ఇల్లు కొనడం అంటే రూ.లక్షలు ఏటా వృధా చేస్తున్నట్టే వారికి పన్నులు, నిర్వహణ, సిబ్బంది ఖర్చులు, మెయిన్టెనెన్స్ అన్నీ డబుల్ అవుతాయి. కాబట్టి ఇల్లు కొనుగోలులో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అని సూచిస్తున్నారాయన.అవగాహన లేని చోట ఎప్పుడూ పెట్టుబడి పెట్టవద్దుమనకు ఉన్న అదనపు సొమ్మును లాభాల కోసం రకరకాల మార్గాల్లో పెట్టుబడులుగా మార్చడం సరైనదే. అయితే మనం దేనిలో పెట్టుబడి పెడుతున్నాం? అనేది పూర్తి అవగాహన ఉండాలి. అలా కాకుండా ఏ మాత్రం తెలియని వ్యాపారం, రంగంలో పెట్టుబడి పెడితే... అది ఎప్పటికైనా నష్టాలే తెస్తుంది. ముందు పొదుపు చెయ్యి, ఆ తర్వాత ఖర్చు చెయ్యి తెలివిగా ఇన్వెస్ట్ చెయ్యి...అంటూ సూత్రీకరించే బఫెట్.. మనకు.వందల వేల కోట్ల ఆస్తులున్నా సరే.. ఆర్ధిక భధ్రత కోసం రెండే రూల్స్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అవి 1. ఎప్పుడూ డబ్బును నష్టపోవద్దు. 2.మొదటి రూల్‌ని ఎప్పటికీ మరచిపోవద్దు. -
మెడికల్.. ఇన్సూరెన్సూ.. సెక్షన్ 80 మినహాయింపులు
ఈ వారం సెక్షన్ 80లో పొందుపర్చిన అంశాలు... వైద్యానికి సంబంధించిన మినహాయింపులు గురించి తెలుసుకుందాం. ముఖ్య విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా కేవలం పాత పద్ధతిని అనుసరించిన వారికే మాత్రమే వర్తిస్తాయి.80డీ – మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఈ సెక్షన్ వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక వ్యక్తి తన కోసం, జీవిత భాగస్వామి కోసం తన మీద ఆధారపడ్డ పిల్లల కోసం చెల్లించే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంకి వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 పరిమితిని మించి మినహాయింపు ఇవ్వరు. తల్లిదండ్రులు 60 సంవత్సరాల లోపు వారయితే అదనంగా రూ.25,000 వారి నిమిత్తం చెల్లించే ప్రీమియంలపై, మొత్తం మీద రూ.50,000 మినహాయింపు ఇస్తారు. కుటుంబంలో ఏ వ్యక్తి చెల్లిస్తాడో... ఆ వ్యక్తి ఇన్కంలోంచి మినహాయింపు ఇస్తారు. ఇతరులకు ఇవ్వరు. నగదులో చెల్లించిన ప్రీమియంలకు మినహాయింపు దొరకదు. చెక్కు ద్వారా, డీడీ ద్వారా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.వ్యక్తి, అతని తల్లిదండ్రులు.. అందరూ 60 సంవత్సరాల్లోపు ఉంటే మొత్తం రూ.50వేలు, వ్యక్తి 60 సంవత్సరాల్లోపు ఉండి, తల్లిదండ్రులు అరవై ఏళ్లు దాటిన వారు అయితే రూ.25,000 కాకుండా అదనంగా రూ.50,000 దాకా మినహాయింపు ఇస్తారు. వ్యక్తి, తల్లిదండ్రులు 60 ఏళ్లు దాటితే రూ.50వేలు + 50వేలు = మొత్తం రూ. 1,00,000 ఇస్తారు. ఇవన్నీ కాకుండా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ నిమిత్తం రూ.50 వేలు ఖర్చు పెట్టొచ్చు. ఈ మేరకు నగదు చెల్లించవచ్చు. కానీ ఖర్చు మొత్తం గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది. రెండో అంశం 80డీడీ ఒక వ్యక్తి మీద ఆధారపడ్డ మనిషి దివ్యాంగుడైతే, అతని వైద్యం నిమిత్తం చేసిన ఖర్చులకు మినహాయింపు ఉంది. ఈ అంగవైకల్యాన్ని శాతాల్లో చెప్పాలంటే ... 40% లోపల ఉంటే రూ.75,000; 80 శాతానికిపైన ఉంటే రూ.1.25 లక్షల మినహాయింపు ఉంటుంది. వైద్య ఖర్చులే కాకుండా, ఈ వ్యక్తుల మీద చేసిన జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు కూడా వర్తిస్తుంది. వైద్య ఖర్చులు, నర్సింగ్, పునరావాస నిమిత్తం మొదలైనవి ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. మానసిక, చెవుడు, బుద్ధి మాంద్యం, మస్తిష్క పక్షవాతం, ఆటిజం, గుడ్డితనం, చూపుతక్కువ, లోకోమోటర్ వైకల్యం (అవయవాలు లేదా శరీరభాగాలు కదలికలకు సంబంధించింది) కుష్టు వ్యాధి మొదలైన వాటికి మినహాయింపు ఉంది. ఫారం 101ఏ జతపరచాలి. వైద్య అధికారులు సర్టిఫై చేయాలి.ఇది కాకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అంగవైకల్యం మారుతూ ఉంటుంది. తేడాలు వస్తాయి. సర్టిఫికెట్లలో ధృవీకరించిన శాతాన్ని బట్టే మినహాయింపు ఉంటుంది. దివ్యాంగుడు ముందుగా మరణిస్తే, స్కీమ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని, ఏ వ్యక్తి అకౌంటులోకి వస్తుందో, ఆ వ్యక్తి ఆదాయంలో కలుపుతారు. దివ్యాంగుడు జీవించి ఉన్నప్పుడు, 60 సంవత్సరాలు తర్వాత వచ్చే యాన్యుటీకి మినహాయింపు ఉంది. ఈ సెక్షన్లో మినహాయింపును తీసుకున్న వ్యక్తి, ఈ ప్రయోజనాన్ని సెక్షన్ 80యూ ప్రకారం పొందకూడదు. 80 డీడీబీదీని ప్రకారం వ్యక్తి తన కోసం లేదా తన మీద ఆధారపడిన వ్యక్తి నిర్దేశిత జబ్బుల చికిత్సకు అయిన ఖర్చు క్లెయిమ్ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి రూ.40 వేలు (60 ఏళ్ల లోపల) రూ.1,00,000 సీనియర్ సిటిజన్లకు తగ్గిస్తారు. 11 డీడీ రూల్ ప్రకారం క్లెయిమ్ చెయ్యాలి. న్యూరాలజిస్ట్, అంకాలజిస్ట్, యూరాలాజిస్ట్, హెమొటాలాజిస్ట్, ఇమ్యూనోలాజిస్ట్, మొదలైన స్పెషలిస్టులు ధృవీకరించాలి. పూర్తి వివరాలు ఇవ్వాలి. సంతకం కచ్చితంగా ఉండాలి. అసెస్సీతో సంబంధం లేకుండా పేషెంటు వయస్సుని బట్టి మినహాయింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు రూ.1 లక్ష దాకా, ఇతరులకు రూ.40,000 ఇస్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినట్లయితే ఆ విలువ మేరకు మినహాయిపు తగ్గుతుంది. చివరిగా మరొకటి.. 80యూదీని ప్రకారం మినహాయింపు. మెడికల్ ఆధారిటీతో సర్టిఫై చేయిస్తే అంగవైకల్యం 40% దాటి ఉంటే రూ.75 వేలు, 80% దాటి ఉంటే రూ.1.25 లక్షల మినహాయింపు ఇస్తారు. ఫారం 101ఏ ఫైల్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్‌లోని సివిల్ సర్జన్లు/ చీఫ్ మెడికల్ అధికారి సర్టిఫై చేయాలి. అంగవైకల్యం సర్టిఫికెట్ కొత్తది జతపర్చాలి. అంధత్వం, కుష్టు, చెవుడు, మానసిక వైకల్యం, మానసిక మాంద్యం... వీటి విషయంలోనే ఇస్తారు. డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు.చివరగా హెచ్చరిక ఏమిటంటే.. సరైన ధృవపత్రాలుండాలి. నకిలీ డాక్టర్లు, నకిలీ పత్రాలు వద్దు. అన్నింటికి రికార్డు స్పష్టంగా ఉండాలి. -
బంగారం ఇంకెంత పెరుగుతుంది?
బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తులం (10 గ్రాములు) పసిడి ధర రూ.లక్ష దాటేసింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 3,350 డాలర్ల వద్ద ఉంది. అయితే రాబోయే రోజుల్లో పుత్తడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బులియన్ ధరను నడిపించే అనేక అంశాలు రానున్న రోజుల్లో ఉన్నాయని చెబుతున్నారు.ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఏం మాట్లాడతారు.. అమెరికా, బ్రిటన్, యూరోజోన్ సహా ప్రధాన ఆర్థిక వ్యవస్థల గ్లోబల్ పీఎంఐ డేటా వంటి అంశాలను ట్రేడర్లు నిశితంగా పరిశీలించనున్నారు. బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయనేదానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటిలో ఏ అంశాలు బంగారం ధరకు అనుకూలంగా పనిచేసినా పసిడి రేటు పెరుగుతుంది.అమెరికా ప్రకటించినా ప్రతీకార సుంకాల అమలు తేదీ ఆగస్టు 1 డెడ్‌లైన్ సమీపిస్తుండటంతో వాణిజ్య చర్చలపై అనిశ్చితి బంగారం సేఫ్ హెవెన్ డిమాండ్‌కు ఊతమిచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు దేశీయ పండుగల డిమాండ్ కూడా బంగారం ధరల పెరుగుదలకు మరింత ఊతమిస్తుందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈబీజీ - కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ తెలిపారు.వెంచురా కమోడిటీ అండ్ సీఆర్ఎం హెడ్ ఎన్ఎస్ రామస్వామి ప్రకారం.. బలహీనమైన యూఎస్ డాలర్, భౌగోళిక రాజకీయ నష్టాలు, బలమైన పెట్టుబడిదారుల డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు కొనసాగడం వంటి సరైన ఉత్ప్రేరకాలు కార్యరూపం దాలిస్తే, 2025 ప్రథమార్ధంలో బలమైన 26 శాతం పెరుగుదల తర్వాత ద్వితీయార్ధంలోనూ బంగారం మరో 4-8 శాతం లాభపడవచ్చు. -
మహిళలకు అలర్ట్.. ఇవాళ తులం బంగారం ఎంతంటే..?
-
రోజూ 2జీబీ హైస్పీడ్ డేటాతో జియో కొత్త ప్లాన్
ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో రోజూ 2జీబీ హైస్పీడ్ డేటాతో రూ .1049 ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రోజువారీ హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ జియో ప్లాన్ మీకు సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్ ప్రయోజనాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..ప్లాన్ వాలిడిటీ.. ప్రధాన ప్రయోజనాలుఈ రూ .1049 జియో ప్లాన్ మొత్తం 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఇందులో ప్రతిరోజూ 2 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 84 రోజుల్లో మొత్తం 168 జిబి డేటా ఆనందించవచ్చు. దీంతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి.ఈ ప్లాన్ అతిపెద్ద ఫీచర్ ఇది అందించే ఉచిత ఓటీటీ యాక్సెస్. వినియోగదారులు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా అనేక ప్రసిద్ధ స్ట్రీమింగ్ సర్వీసులకు యాక్సెస్ పొందుతారు. వీటిలో అమెజాన్ ప్రైమ్ లైట్ (84 రోజులు చెల్లుబాటు అవుతుంది), సోనీలివ్, జీ5, జియోటీవీ, జియో హాట్‌స్టార్ (90 రోజులు, ఒకసారి చెల్లుబాటు అవుతుంది) వంటివి ఉన్నాయి.ఈ రీఛార్జ్ ప్లాన్ 50 జీబీ జియోఏఐక్లౌడ్ స్టోరేజ్, ఉచిత 5జీ డేటా (5జీ ఫోన్ అయి ఉండి 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటే మాత్రమే) వంటి జియో నుండి కొన్ని ఇతర ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. -
మీ పాన్‌కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారేమో..
కొందరికి అప్పు అంటే మహా చెడ్డ భయం. దాని జోలికి కూడా వెళ్లరు. మీరు తీసుకోరు సరే.. మరి ఎవరైనా మీ పేరుతో అదేనండి మీకు తెలియకుండా మీ పాన్ కార్డు వివరాలతో లోన్ తీసుకుని ఉంటే.. అమ్మో ఇది ఫ్రాడ్. అవును ఫ్రాడే మరి. డౌట్‌గా ఉందా? మీ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారేమో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎలాగో ఈ కథనంలో చదివేయండి వెంటనే..రుణ మోసాలు, సున్నితమైన, ఆర్థికపరమైన డాక్యుమెంట్ల దుర్విగియోగం వంటివి ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మీ కార్డులేమైనా దుర్వినియోగానికి గురయ్యాయా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ పాన్ కార్డు మీ క్రెడిట్ రిపోర్ట్ తో లింక్ అయి ఉంటుంది. దానిని ఉపయోగించి తీసుకున్న ఏదైనా రుణం (మీ సమ్మతితో లేదా సమ్మతి లేకుండా) మీ క్రెడిట్ రేటింగ్, మీ రుణ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందో లేదో తెలుసుకోండిలా..మీ క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా చెక్ చేయండిమీ పాన్ కార్డును ఉపయోగించి ఏదైనా రుణం తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి సులభమైన మార్గం మీ క్రెడిట్ రిపోర్ట్ చూడటం. సిబిల్, ఎక్స్ పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్ఐఎఫ్ హై మార్క్ వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పేరిట తీసుకున్న అన్ని రుణాలు, క్రెడిట్ కార్డుల రికార్డును నిర్వహిస్తాయి. ఆయా సైట్లకు వెళ్లి మీ పాన్, మొబైల్ నంబరు ఇచ్చి క్రెడిట్ రిపోర్ట్ తీసుకోవచ్చు. అది కూడా ఉచితంగా.మీ క్రెడిట్ రిపోర్టులో ఇవి గమనించండిమీరు క్రెడిట్ రిపోర్టును సమీక్షిస్తున్నప్పుడు, మీరు దరఖాస్తు చేయని రుణాలు లేదా క్రెడిట్ కార్డులు, తప్పు ఖాతా నంబర్లు, పరిచయం లేని రుణ సంస్థల పేర్లు లేదా మీరు ఆమోదించని కొత్త హార్డ్ ఎంక్వైరీలు ఏమైనా ఉన్నాయేమో చూడండి.మీ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారనడానికి ఇవి సంకేతాలు. మీరు ఇటువంటి అనేక ఎంట్రీలను చూసినట్లయితే, మీ క్రెడిట్ మరింత క్షీణించకుండా వెంటనే చర్యలు తీసుకోండి.👉 ఇది చదివారా? ఈపీఎఫ్‌వో రూల్స్‌లో మార్పులు.. ఆ కండీషన్లు ఇక ఉండవుఫేక్ లోన్ బయటపడితే ఏం చేయాలి?మీరు మోసపూరిత రుణాన్ని ఎదుర్కొన్నట్లయితే, దానిని రుణ సంస్థ దృష్టికి తీసుకురండి. అలాగే దానిని నివేదించిన క్రెడిట్ బ్యూరోతో చర్చించండి. చాలా వివాదాలను క్రెడిట్ బ్యూరోలు ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. ఐడీ ప్రూఫ్, లోన్‌కు సంబంధించిన వాస్తవాలు, సంతకం చేసిన అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా, మీ స్థానిక పోలీసు సైబర్ క్రైమ్ సెల్లో ఫిర్యాదు చేయండి. పాన్ దుర్వినియోగం అయినట్లు ఆధారాలను సమర్పించండి.భవిష్యత్తులో పాన్ దుర్వినియోగం కాకూడదంటే..అసురక్షిత సైట్లు, యాప్‌లు లేదా వాట్సాప్ ఫార్వార్డ్‌లలో మీ పాన్ కార్డు నంబర్‌ను ఎప్పుడూ పంచుకోవద్దు. బహిరంగంగా షేర్ చేయడం, అనవసరంగా ఎవరికైనా అప్పగించడం చేయొద్దు. మీ పాన్ కార్డు పోతే, రీప్రింట్ కోసం దరఖాస్తు చేయండి. ఆ సమయంలో కొన్ని నెలలు మీ క్రెడిట్ రిపోర్ట్‌ను సమీక్షించండి. ఫైనాన్షియల్ అకౌంట్ లకు బలమైన పాస్ వర్డ్ లను సెట్ చేసుకోండి. మీ పాన్ తో లింక్ చేసిన లోన్ లేదా క్రెడిట్ అప్లికేషన్ ల కోసం ఎస్ఎంఎస్/ఈమెయిల్ నోటిఫికేషన్ లను ఎనేబుల్ చేయండి. -
రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే..
సాక్షి, సిటీబ్యూరో: శ్రావణ మాసం వస్తుందంటే చాలు శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. వరుస పండగలతో సందడి నెలకొంటుంది. ఈ ఆనందాన్ని రంగులమయం చేస్తే ఇంటి అందం ద్విగుణీకృతమవుతుంది. అయితే ఇంటికి రంగులు వేయించడం అందరికీ కుదరక పోవచ్చు. మరెలా? రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే శుభ్రం చేయడం కోసం కొంత సమయాన్ని వెచ్చించాలి. ఇందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. హడావుడి లేకుండానే ఓ పద్ధతి ప్రకారం ఇంటిని అలంకరించుకోవాలి.ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అదనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరచూ నిర్వహణ ఉన్నప్పుడే.. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించాలి. దీని కోసం డోర్ మ్యాట్లు వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూస్ బయటేవిప్పి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక ఫ్లోరింగ్ మెరిసిపోతుంది.కార్పెట్లు: ఇవి దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. తరచూ వ్యాక్యుమ్ క్లీనర్‌తో శుభ్రంచేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్ కళావిహీనంగా కన్పించవచ్చు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్‌పై కొన్నిసార్లు టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావు కప్పు తేనె సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఫలితంగా ఆ మరకలు తొలగిపోతాయి. పేస్టును ఆరనిచ్చి వ్యాక్యుమ్ క్లీనర్‌తో మరక ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి.గోడలు: గోడలను తరచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. ఎక్కడైనా బూజు, సాలెగూడు వంటివి ఉంటే తొలగిపోతాయి. అనుకోకుండా గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటెర్జెంట్లతో శుభ్రం చేయాలి. అయితే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయవద్దు.మైక్రోఓవెన్: కొందరు మైక్రోఓవెన్‌ను అధికంగా వాడుతుంటారు. దీంతో ఇది ఎక్కువగా మురికి పడుతుంటుంది. దీనిని శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం సగం కప్పు నీళ్లు, సగం కప్పు తెల్ల వెనీర్‌ను మైక్రోప్రూఫ్ గిన్నెలో పోసి, మైక్రోఓవెన్లో వేడిచేయాలి. గట్టిగా ఉండే ఆహార పదార్థాలు, గ్రీజు మరకలు శుభ్రం చేయడానికి అనువుగా తేలికపడతాయి.వంటింట్లో: బాత్‌ఫిట్టింగ్‌ల దగ్గర నుంచి ఫర్నిచర్ల వరకు ఉక్కు ఎక్కువగా వాడుతుంటాం. స్టీల్‌కే పరిమితం కాకుండా పైన క్రోమ్‌పూతతో వస్తున్నాయిప్పుడు. స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు.. నీటిలోని ఉప్పు పేరుకుపోవడంతో చూడ్డానికి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసిపోవాలంటే ఆల్కాహాల్‌తో తుడవాలి. నల్లాపై ఏర్పడే మరకల్ని టూత్‌పేస్టుతో తుడవడం వల్ల తొలగించవచ్చు. వంటింట్లో సింక్ పరిశుభ్రంగా కనిపించాలంటే నాలుగు భాగాల ఉప్పుకు ఒక భాగం వెనిగర్‌ను కలిపి ప్రయత్నించండి. -
తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన లాభాలు
ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 ఏప్రిల్–జూన్ కాలానికి రూ.4,116 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2024 ఇదే కాలానికి ఆర్జించిన రూ.3,679 కోట్లతో పోలిస్తే ఇది 12% అధికం. మొత్తం ఆదాయం రూ.30,874 కోట్ల నుంచి రూ.31,791 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.26,364 కోట్ల నుంచి అధికమై రూ.27,296 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.9,412 కోట్ల నుంచి రూ.9,113 కోట్లకు దిగివచ్చింది. నిర్వహణ లాభం 11% క్షీణించి రూ.7,785 కోట్ల నుంచి రూ.6,909 కోట్లకు తగ్గింది.స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు) 4.54% నుంచి 3.52 శాతానికి, నికర ఎన్పీఏలు 0.90% నుంచి 0.62 శాతానికి తగ్గాయి. మొండి రుణాలకు ప్రొవిజన్ల కేటాయింపు రూ.1,651 కోట్ల నుంచి రూ.1,153 కోట్లకు తగ్గాయి. స్థూల అడ్వాన్సులు 6.83% పుంజుకొని 9,12,214 కోట్ల నుంచి రూ.9,74,489 కోట్లకు చేరుకున్నాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో(పీసీఆర్) 116 బేసిస్ పాయింట్లు పెరిగి 93.49 శాతం నుంచి 94.65 శాతానికి చేరింది. మొత్తం వ్యాపారం 5% వృద్ధి చెంది రూ.21,08,762 కోట్ల నుంచి రూ.22,14,422 కోట్లకు ఎగసింది.సెంట్రల్ బ్యాంక్ ఫలితాలు భేష్ప్రభుత్వరంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. ఆదా యం మెరుగవడం, మొండి రుణాలు (ఎన్పీఏలు) తగ్గడంతో ఏప్రిల్–జూన్‌లో రూ.1,169 కోట్ల నికర లాభా న్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2024– 25) ఇదే క్యూ1 నికర లాభం రూ.880 కోట్లతో పోలి స్తే ఇది 33% అధికం. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.9,500 కోట్ల నుంచి రూ.10,374 కోట్లకు ఎగసింది.బ్యాంకు వడ్డీ ఆదాయం రూ.8,335 కోట్ల నుంచి రూ.8,589 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం 19% పెరిగి రూ.2,304 కోట్లకు చేరింది. ఆస్తుల నాణ్యత మెరుగవడంతో స్థూల మొండి బకాయిలు 4.54% నుంచి 3.13 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 0.73% నుంచి 0.49 శాతానికి తగ్గాయి. స్థూల అడ్వాన్సులు 9.97% పుంజుకొని 2,50,615 కోట్ల నుంచి రూ.2,75,595 కోట్లకు చేరుకున్నాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 96.17 % నుంచి 97.02 శాతం పెరిగింది. కనీస మూలధన నిష్పత్తి 15.6% నుంచి 17.6 శాతానికి మెరుగైంది. మొత్తం వ్యాపారం 11% వృద్ధి చెంది రూ.6,35,564 కోట్ల నుంచి రూ.7,04,485 కోట్లకు ఎగసింది. -
48 గంటల్లో 2 లక్షలకుపైగా ఆర్డర్లు..
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన సెవెంత్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం భారత్‌లో లాంచ్ అయిన 48 గంటల్లోనే 2.1 లక్షల ప్రీ-ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. శాంసంగ్ ఏడో తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ స్మార్ట్ఫోన్లు జూలై 9న భారత్‌లో లాంచ్ అయ్యాయి.ఇంత భారీ సంఖ్యలో ప్రీ-ఆర్డర్లు రావడం "బ్రాండ్ ఏడవ తరం ఫోల్డబుల్ కోసం వినియోగదారుల్లో భారీ డిమాండ్, ఉత్సాహాన్ని" సూచిస్తున్నాయని శాంసంగ్ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో గెలాక్సీ ఎస్ 25 సిరీస్ కోసం వచ్చిన ప్రీ-ఆర్డర్లకు ఇది దాదాపు సమానం అని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది.శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 25 లాంచ్ అయిన మూడు వారాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 4.3 లక్షల ప్రీ-ఆర్డర్లను అందుకుంది. మొదటి 48 గంటల్లో, ఎస్ 25, ఫోల్డ్ 7 / ఫ్లిప్ 7 కోసం ప్రీ-ఆర్డర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల ధర రూ.89,000 నుంచి రూ.2.11 లక్షల మధ్యలో ఉంది.గెలాక్సీ జెడ్ ఫోల్డ్7 ధర రూ.1.75 లక్షల నుంచి ప్రారంభమై రూ.2.11 లక్షల వరకు ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ధర రూ.1.10 లక్షల నుంచి రూ.1.22 లక్షల మధ్యలో ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ ధర రూ.89,000 నుంచి రూ.95,999 వరకు ఉంది. భారత మార్కెట్లో శాంసంగ్ సూపర్ ప్రీమియం కేటగిరీలో అమెరికాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ తో పోటీ పడుతోంది.ఐడీసీ ప్రకారం, భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో ముందంజలో ఉంది. ఇది 2025 తొలి త్రైమాసికంలో 19.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత శాంసంగ్ 16.4 శాతం ఎగుమతులతో రెండో స్థానంలో ఉంది. -
అబ్బా.. ఇంటికి ఏముంది ఎలివేషన్!
గతంలో ఇల్లు అంటే నాలుగు గోడలుండే నిర్మాణం. కానీ, ఇప్పుడు ఇల్లంటే ఓ హోదా.. హుందా! ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు సొంతింటివాసులు. నిర్మాణ సంస్థలూ తక్కువేం కాదు.. సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో కనిపించే విభిన్న తరహా నిర్మాణాలను భాగ్యనగరంలో నిర్మించేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎలివేషన్స్ నుంచే సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టేస్తున్నారు. పడవ ఆకారంలో ఎలివేషన్, ఎలివేషన్‌లోనే వర్టికల్ గార్డెన్ ఏర్పాటు వంటివి ఈ జాబితాలోనివే మరి!! – సాక్షి, సిటీబ్యూరోపిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా నిర్మాణాలుండాలి. మూస ధోరణిలో నిర్మించే ప్రాజెక్ట్‌లను ప్రజలు ఆదరించట్లేదు. విదేశీ తరహాలో నిర్మాణం.. అన్ని రకాల వసతులు.. అదీ అందుబాటు ధరల్లో ఉండే ప్రాజెక్టులు అంటే కస్టమర్లు జై కొడుతున్నారు. దీంతో విదేశాల్లో కనిపించే విభిన్న నిర్మాణాలు ఇప్పుడు భాగ్యనగరంలోనూ కనిపిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించడం కోసం విభిన్న ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో సంస్థల మధ్య పోటీ పెరిగి భాగ్యనగరం హంగులు అద్దుకుంటోంది.ఎలివేషన్లలో వర్టికల్ గార్డెన్..రిసార్ట్, విల్లాల్లో విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది. అందుకే చుట్టూ పచ్చదనంతో ల్యాండ్ స్కేపింగ్ చేస్తారు. కానీ, అపార్ట్‌మెంట్స్‌లో.. అది కూడా స్థలాల లభ్యత తక్కువగా ఉండే మహానగరాల్లో కాసింత కష్టమే. దీనికి పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది నిలువైన ఉద్యానవనాలు(వర్టికల్ గార్డెన్స్).భవనాల ఎలివేషన్లలో నిలువుగా మొక్కలు పెంచడం వర్టికల్ గార్డెన్స్ ప్రత్యేకత. అయితే ఇవి ఎలివేషన్, బయటి గోడల మీదనే సాధ్యమవుతాయి. ఎండ పడని ప్రాంతంలో అంటే ఇంట్లో, హాల్లో, బెడ్ రూమ్‌లో వర్టికల్ గార్డెన్స్‌ను పెంచడం కుదరదు. ఇక్కడ పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు. సూర్యరశ్మి పడే ప్రాంతమైతే వర్టికల్ గార్డెన్స్‌లో కూరగాయలు, ఆకుకూరలు కూడా పెంచుకునే వీలు కూడా ఉంటుంది.ఖర్చు ఎక్కువే..సాధారణ భవనాలతో పోలిస్తే వరి్టకల్ గార్డెన్స్ భవనాల ధర చ.అ.కు రూ.100–200 అధికంగా ఖర్చవుతుంది. అయినా సరే బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నారు. కస్టమర్లకు ఏదో నాలుగు గోడలుండే ఇంటిని అందించాలని కాకుండా వారి ఇంటిని అందంగా.. ఆరోగ్యకరంగా బృందావనంగా తీర్చిదిద్దుతున్నారు. వర్టికల్ గార్డెన్స్ భవనాలు పర్యావరణహితంగా ఉంటాయి. శబ్ధ, వాయు కాలుష్యం తక్కువగా ఉండటంతో పాటు ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. భవనం గోడలు, పిల్లర్లను ఆధారం చేసుకొని బయోలాజికల్ ఎరువులతో పెంచడం వల్ల భవనం చల్లగా ఉంటుంది.పిల్లలే లక్ష్యంగా..ఇంటి కొనుగోళ్లలో పిల్లల అభిరుచులకు తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే పిల్లల అభిరుచులకు అనుగుణంగా విదేశీ ఆర్కిటెక్చర్లతో ప్రాజెక్ట్‌లను డిజైన్ చేయిస్తున్నారు బిల్డర్లు. ఇందుకోసం ప్రాజెక్ట్ ఎలివేషన్ దగ్గర నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విశాలమైన ఆట స్థలాలు, వినూత్నమైన ఎలివేషన్లతోనే పిల్లల్ని ఆకట్టుకుంటే.. ప్రాజెక్ట్‌లోనే పాఠశాలలు, ఆస్పత్రుల వంటి ఏర్పాటుతో తల్లిదండ్రులనూ కట్టిపడేస్తున్నారు.అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్‌కు తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.ప్రాజెక్ట్‌లో క్లబ్ హౌస్, స్విమ్మిగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలే కాకుండా ఇందులోనే పాఠశాల, ఆస్పత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని నిపుణులు అంటున్నారు. ప్రాజెక్ట్‌లో క్లబ్‌హౌజ్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి వసతులు కల్పించాలంటే కొంత స్థలాన్ని కేటాయిస్తారు. అలా కాకుండా ఎలివేషన్‌కు కేటాయించే స్థలంలో ఈ వసతులను కల్పిస్తే.. స్థలం వినియోగంతో పాటు ఫ్లాట్ల విస్తీర్ణమూ పెరుగుతుంది. -
‘బేబీ గ్రోక్’ వస్తుంది.. పిల్లల కోసం ప్రత్యేక ఏఐ యాప్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ఏఐ పిల్లల కోసం ప్రత్యేక ఏఐ చాట్‌బాట్ యాప్‌ను తీసుకురానుంది. తమ గ్రోక్ చాట్‌బాట్‌కు కిడ్-ఫ్రెండ్లీ వెర్షన్‌ను రూపొందించే పనిలో ఉన్నట్లు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) పోస్ట్ చేశారు.'ఎక్స్ఏఐలో బేబీ గ్రోక్ అనే యాప్‌ను రూపొందించబోతున్నాం' అని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. పిల్లలకే ప్రత్యేకమైన కంటెంట్‌తో ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త వెర్షన్ యువ వినియోగదారుల కోసం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు, అయితే మరిన్ని వివరాలను ఇంకా ప్రకటించలేదు.మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ స్పామ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ప్లాట్‌ఫామ్‌పై కొత్త గ్రోక్ ప్రస్తావనలను తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు వైరల్ వీడియోలను జనరేట్ చేయడానికి, దాని సృజనాత్మక సాధనాలను మరింత విస్తరించడానికి వీలు కల్పించే ‘ఇమాజిన్’ అనే కొత్త సామర్థ్యాన్ని ‘గ్రోక్’కు జోడించే పనిలో ఉన్నట్లు కూడా మస్క్ ఇటీవల వెల్లడించారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. 44 శాతం మంది పిల్లలు జనరేటివ్ ఏఐని చురుగ్గా ఉపయోగిస్తున్నారు. ఇందులో తమ స్కూల్ వర్క్ లేదా హోమ్ వర్క్ చేయడానికే 54 శాతం వినియోగం ఉంటోంది.We’re going to make Baby Grok @xAI, an app dedicated to kid-friendly content— Elon Musk (@elonmusk) July 20, 2025 -
ఎలక్ట్రిక్ కార్ల జోరు.. రానున్న రోజులు ఈవీలవే..
కొత్త మోడల్స్ ఎంట్రీతో పాటు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) సరఫరా సమస్యలు సకాలంలో పరిష్కారమైతే, దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు మరింతగా పెరుగుతాయని కేర్ఎడ్జ్ అడ్వైజరీ ఒక నివేదికలో తెలిపింది. 2028 నాటికి దేశీయంగా మొత్తం కార్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 7 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరగడమనేది, చార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై కూడా ఆధారపడి ఉంటుందని కేర్ఎడ్జ్ అడ్వైజరీ అండ్ రీసెర్చ్ సీనియర్ డైరెక్టర్ తన్వి షా తెలిపారు. ఈవీల వినియోగం పెరగడానికి ప్రధాన అవరోధంగా ఉంటున్న చార్జింగ్ మౌలిక సదుపాయాలు ఇటీవలి కాలంలో గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.దేశీయంగా 2022 క్యాలెండర్ ఇయర్లో 5,151గా ఉన్న పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలో 26,000కు చేరినట్లు నివేదిక తెలిపింది. మరోవైపు, 2021 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,000 యూనిట్ల స్థాయిలో నమోదైన ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 1.07 లక్షల యూనిట్లకు చేరాయి. సాధారణంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో ఫోర్ వీలర్ల వాటా చాలా తక్కువగానే ఉంటుంది. -
అంచనాలు మించిన ఐసీఐసీఐ బ్యాంక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయంగా రెండో అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం (స్టాండెలోన్) రూ. 12,768 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన రూ. 11,059 కోట్లతో పోలిస్తే సుమారు 15 శాతం పెరిగింది. ఇది సుమారు రూ. 11,747 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 10.6 శాతం పెరిగి రూ. 19,553 కోట్ల నుంచి రూ. 21,635 కోట్లకు చేరింది. ఇది సుమారు రూ. 20,923 కోట్లుగా ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి.ట్రెజరీ కార్యకలాపాలు మినహా, ఇతరత్రా ఆదాయం 13.7 శాతం పెరిగి రూ. 7,264 కోట్లకు ఎగిసింది. మరోవైపు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 15.9 శాతం వృద్ధితో రూ. 13,558 కోట్లకు చేరింది. క్రితం క్యూ1లో ఇది రూ. 11,696 కోట్లు. మొత్తం వడ్డీ ఆదాయం రూ. 38,996 కోట్ల నుంచి రూ. 42,947 కోట్లకు చేరింది. అసెట్స్ రూ.24,07,395 కోట్ల నుంచి రూ. 26,68,636 లక్షల కోట్లకు చేరాయి.తగ్గిన ఎన్పీఏలు..సమీక్షాకాలంలో బ్యాంక్ అసెట్ నాణ్యత మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (జీఎన్‌పీఏ) 2.15 శాతం నుంచి 1.67 శాతానికి దిగి వచి్చంది. నికర ఎన్పీఏ నిష్పత్తి 0.43 శాతం నుంచి 0.41 శాతానికి గ్గింది. నికర వడ్డీ మార్జిన్ 4.41 శాతం నుంచి 4.34 శాతానికి తగ్గింది. అయితే, ప్రొవిజనింగ్ భారీగా పెరిగింది. మార్చి త్రైమాసికంలో రూ. 1,332 కోట్లుగా ఉన్న ప్రొవిజనింగ్ రూ. 1,815 కోట్లకు ఎగిసింది. బ్యాంక్ షేరు ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 11 శాతం పెరిగి, దాదాపు రూ. 1,427 వద్ద ఉంది.డిపాజిట్లు 12.8% అప్సమీక్షా కాలం ఆఖరు నాటికి డిపాజిట్లు 12.8 శాతం పెరిగి రూ. 16,08,517 కోట్లకు చేరాయి. కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) నిష్పత్తి 38.7 శాతంగా ఉంది. కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 11.2 శాతం, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు 7.6 శాతం పెరిగాయి.దేశీయంగా రుణాల పోర్ట్‌ఫోలియో 12 శాతం పెరిగి రూ. 13,31,196 కోట్లకు చేరింది.నికర వడ్డీ మార్జిన్ 4.36 శాతం నుంచి 4.34 శాతానికి నెమ్మదించింది. వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ మినహాయించి) 13.7 శాతం వృద్ధితో రూ. 6,389 కోట్ల నుంచి రూ. 7,264 కోట్లకు చేరింది.ఫీజు ఆదాయం వార్షికంగా రూ. 5,490 కోట్ల నుంచి 7.5 శాతం వృద్ధితో రూ.5,900 కోట్లకు పెరిగింది.రిటైల్ రుణాలు వార్షికంగా 6.9 శాతం పెరిగాయి. మొత్తం లోన్ పోర్ట్‌ఫోలియోలో వీటి వాటా 52.2 శాతంగా ఉంది. కార్పొరేట్ పోర్ట్‌ఫోలియో 7.5 శాతం పెరిగింది.క్యూ1లో బ్యాంక్ కొత్తగా 83 శాఖలు ప్రారంభించింది. దీంతో మొత్తం శాఖల సంఖ్య 7,066కి, ఏటీఎంలు, క్యాష్ రీసైక్లింగ్ మెషిన్ల సంఖ్య 13,376కి చేరుకుంది. -
శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. బడ్జెట్లోనే హై ఎండ్ ఫీచర్స్
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుండి కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ విడుదలైంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్36 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌లో లాంచ్ అయింది. బడ్జెట్ ధర రూ .20,000 లోపే ఇది లభ్యమవుతుంది. ఎక్సినోస్ 1380 చిప్సెట్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తోపాటు గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్ సహా ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.శాంసంగ్ గెలాక్సీ ఎఫ్36 5జీ ధరగెలాక్సీ ఎఫ్36 5జీ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499గా ఉంది. శాంసంగ్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.18,999గా నిర్ణయించారు. శాంసంగ్ కొత్త ఎఫ్-సిరీస్ స్మార్ట్‌ఫోన్ జూలై 29 నుంచి ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కోరల్ రెడ్, లక్స్ వయొలెట్, ఓనిక్స్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మూడు కలర్ వేస్ లో లెదర్ ఫినిష్ రియర్ ప్యానెల్ ఉంది.స్పెసిఫికేషన్లుశాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 36 5జీ డ్యూయల్ సిమ్ హ్యాండ్ సెట్, ఇందులో 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, ఫుల్ హెచ్ డీ+ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.సెల్ఫీ కెమెరా కోసం డిస్ ప్లే పైభాగంలో వాటర్ డ్రాప్ నాచ్ ను అందించారు. ఆక్టాకోర్ ఎక్సినోస్ 1380 ఎస్ వోసీ, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూతో ఈ ఫోన్ పనిచేస్తుంది. థర్మల్ మేనేజ్ మెంట్ కోసం వేపర్ ఛాంబర్ కూడా ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 4కే వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేసే ప్రైమరీ 50 మెగాపిక్సెల్ ఎఫ్/ 1.8 సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇది 4కె వీడియో రికార్డింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.శాంసంగ్ లేటెస్ట్ ఎఫ్ సిరీస్ ఫోన్ ఆండ్రాయిడ్-15 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుది. ఆరు ఏళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్స్, ఏడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ క్లిప్పర్, ఏఐ ఎడిట్ వంటి ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.గెలాక్సీ ఎఫ్36 5జీలో 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం, ఫోన్ డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ + గ్లోనాస్ను అందిస్తుంది. -
మాల్స్‌లో ఆఫీసులు.. తక్కువ అద్దెలు
మాల్స్, స్టార్ హోటల్స్.. తినడానికో లేదా షాపింగ్ కేంద్రాలుగానే కాదు ఆఫీసు కేంద్రాలుగానూ మారుతున్నాయి. గతంలో ప్రత్యేకంగా ఒక వాణిజ్య భవనంలో కో–వర్కింగ్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీలు ఇప్పుడు షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లనూ కార్యాలయాలుగా కేటాయిస్తున్నాయి. పనిచేసే చోటే రిటైల్, ఫుడ్ వసతులూ ఉంటేనే కంపెనీలు స్వాగతిస్తుండటంతో కో–వర్కింగ్ సంస్థలు మాల్స్, హోటళ్ల వైపు దృష్టిసారించాయి. – సాక్షి, సిటీబ్యూరోదశాబ్దం కాలంగా దేశంలోని కార్యాలయాల్లో పని వాతావరణంలో మార్పు వచ్చింది. ఆఫీసు డిజైన్, వసతులు, రంగులు వంటివి ఉద్యోగి నైపుణ్యం, ఉత్పాదకత, పని సంస్కృతి వంటి వాటి మీద ప్రభావం చూపిస్తున్నాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. కార్యాలయాల్లో గ్రీనరీ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు, వాసన వంటి వాటితో ఉద్యోగిపై పని ఒత్తిడిని తగ్గిస్తుందని, దీంతో మరింత క్రియేటివిటీ బయటకొస్తుందని పరిశోధనల్లోనూ తేలింది. ఆయా వసతులను అందుబాటు ధరల్లో కో–వర్కింగ్ స్పేస్ భర్తీ చేస్తుండటంతో ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ మాత్రమే కాకుండా బహుళ జాతి సంస్థలూ కో–వర్కింగ్ స్పేస్‌లో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి.గంట, రోజు, నెల వారీగా చార్జీలు..ఒకే అంతస్తులో ఒక ఆఫీసు బదులు పలు రకాల చిన్న ఆఫీసులు ఉండటాన్ని కో–వర్కింగ్ స్పేస్ అంటారు. ఇక్కడ వ్యాపారం ఎవరిది వారిదే, ఎవరి ప్రమాణాలు వారివే. ప్రతి ఒక్కరికీ కావాల్సిన ప్రైవేట్ ఆఫీసు, ఫిక్స్డ్ డెస్క్‌లు, సమావేశ గది, క్యాబిన్లు వంటి సౌకర్యాలు ఉంటాయి. వీటితో పాటూ ప్రత్యేకంగా బహుళ జాతి కంపెనీలకు ఉండే కొరియర్ సర్వీస్, ఫుడ్, లాంజ్, ఎల్సీడీ, పార్కింగ్, ప్రింటర్, ప్రొజెక్టర్, వైఫై వంటి అన్ని రకాల ఆధునిక వసతుంటాయి. కో–వర్కింగ్ కార్యాలయాల అద్దెలు గంట, రోజులు, నెల వారీగా ఉంటాయి. నగరంలో నెలకు రూ.8 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్‌రాంగూడ, బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో కో–వర్కింగ్ ఆఫీసులున్నాయి.అద్దెలు 25 శాతం వరకు తక్కువఐటీ కారిడార్లు, అభివృద్ధి చెందిన వాణిజ్య ప్రాంతాల్లో స్థలాల ధరలు ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసే బదులు కో–వర్కింగ్లోనే స్పేస్‌ను అద్దె తీసుకోవటం కంపెనీలకు సులువవుతుంది. ఇదే కో–వర్కింగ్ డిమాండ్‌కు ప్రధాన కారణం. గ్రీడ్–ఏ ఆఫీస్ స్పేస్‌తో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌లో అద్దెలు 25 శాతం వరకు తక్కువ ఉంటాయి. సాధారణ ఆఫీసులో సీట్లతో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌లో ఒక్కో సీటుకు 5–15 శాతం స్థలం ఆదా అవుతుంది. పైగా ప్రతి కంపెనీ ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునే బదులు అన్ని కంపెనీలకు కలిపి ఒకటే పార్కింగ్, హౌస్ కీపింగ్, క్యాంటీన్, రిసెప్షన్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. దీంతో కంపెనీలకు మౌలిక వసతుల వ్యయం కూడా తగ్గుతుంది. -
ఈపీఎఫ్‌వో రూల్స్‌లో మార్పు.. ఆ కండీషన్లు ఇక ఉండవు
ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఈడీఎల్ఐ అంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ నిబంధనల్లో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ ఊరటనిచ్చింది. ఇప్పుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మునుపటిలా కఠినమైన షరతులు ఉండవు. దీని వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు, ముఖ్యంగా విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది.కనీసం రూ .50,000 బీమాతాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పుడు ఉద్యోగి పీఎఫ్ బ్యాలెన్స్ రూ .50,000 కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఆ ఉద్యోగి మరణించినప్పుడు వారి కుటుంబానికి కనీసం రూ .50,000 బీమా ప్రయోజనం లభిస్తుంది. ఇంతకు ముందు ఈ ప్రయోజనాన్ని పొందడానికి, ఉద్యోగి ఖాతాలో నిర్ణీత పరిమితి వరకు బ్యాలెన్స్ ఉండాలి. కానీ ఇప్పుడా షరతు తొలగించారు.మరో ముఖ్యమైన మార్పుకనీస పీఎఫ్ బ్యాలెన్స్ షరతును తొలగించడంతోపాటు ఈ పథకంలో మరో ముఖ్యమైన మార్పు చేశారు. ఈ పథకం కోసం 12 నెలల నిరంతర సర్వీసును లెక్కించేటప్పుడు, ఉద్యోగి కంపెనీలు మారిన సందర్భంలో రెండు ఉద్యోగాల మధ్య 60 రోజుల వరకు గ్యాప్ ఉంటే, దాన్ని ఇకపై విరామంగా పరిగణించరు. అంటే ఉద్యోగి రెండుమూడు ఉద్యోగాలు చేసి, వాటి మధ్య 2 నెలల కంటే తక్కువ విరామం ఉంటే, అప్పుడు అన్ని ఉద్యోగాలు ఒకే (నిరంతర) సర్వీసుగా పరిగణిస్తారుఅంతే కాకుండా పీఎఫ్ పథకంలో సభ్యుడైన ఉద్యోగి చివరి పీఎఫ్ కంట్రిబ్యూషన్ నుండి 6 నెలల్లోపు మరణించిప్పుడు కూడా వారి కుటుంబానికి ఈ పథకం కింద బీమా మొత్తాన్ని ఇస్తారు. అయితే ఆ సమయంలో ఉద్యోగి కంపెనీ రోల్స్‌లో నమోదై ఉండాలి. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ పథకం ప్రధాన ఉద్దేశం. -
ఇన్సూరెన్స్ కంపెనీలపై ప్యానెల్ ఏర్పాటు
బీమా సంస్థలు, మధ్యవర్తులు నిబంధనల ఉల్లంఘనలపై దృష్టి సారించేందుకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ప్యానెళ్లను ఏర్పాటు చేసింది. ఐఆర్డీఏఐ 132వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. బీమా చట్టం, నియంత్రణపరమైన మార్గదర్శకాలను బీమా కంపెనీలు సరిగ్గా పాటిస్తున్నాయా? ఎక్కడైన ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయా? అన్నది పరిశీలించేందుకు పూర్తికాల సభ్యులతో కూడిన ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఐఆర్డీఏఐ ప్రకటించింది.పాలసీలను తప్పుడు మార్గాల్లో విక్రయిస్తుండడం, డేటా లీకేజీ నివేదికల నేపథ్యంలో ఐఆర్డీఏఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కివి జనరల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి ఆర్1 దరఖాస్తుకు సైతం తాజా సమావేశంలో ఐఆర్డీఏఐ ఆమోదం తెలిపింది. దీని తర్వాత ఆర్2, ఆర్3 స్థాయిలోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. -
వీకెండ్ ఫామ్‌హౌస్.. ఫుల్ డిమాండ్
ఆఫీసులో పని ఒత్తిడి ఒక ఎత్తయితే.. ట్రాఫిక్ సంద్రాన్ని ఈదుకుంటూ వెళ్లడం మరొక ఎత్తు. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ప్రతిరోజూ ఛేదించుకుంటూ వెళ్లే నగరవాసి కనీసం వారాంతంలోనైనా కుటుంబం, స్నేహితులతో స్వచ్ఛమైన ఆహ్లాదకర వాతావరణంలో గడపాలని కోరుకుంటున్నాడు. వీరి అభిరుచులకు తగ్గట్టుగానే ఫామ్ హౌస్‌లు నిర్మితమవుతున్నాయి. గతంలో ఫామ్‌హౌస్‌ల కోసం కేవలం సంపన్న వర్గాలు మాత్రమే మొగ్గు చూపేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి సామాన్య, మధ్యతరగతి సైతం వ్యవసాయ క్షేత్రాలకు ఆసక్తి చూపిస్తున్నారు. -సాక్షి, సిటీబ్యూరోకొందరు 200 నుంచి వెయ్యి గజాల్లోపు భూమిని కొనుగోలు సాదాసీదాగా ఫామ్‌హౌస్‌లను నిర్మించుకుంటుంటే.. మరి కొందరు వెయ్యి నుంచి 4 వేల గజాలు, రెండు, మూడెకరాలంటూ భూమి కొనేసి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఫామ్ ల్యాండ్స్ పేరుతో కొన్న జాగాల్లో, డీటీసీపీ లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లే అవుట్లలో స్థలాలను కొని బంగ్లాలు కడుతున్నారు. శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులతో కలిసి కారులో వారాంతపు ఇంటికి వెళ్లి షికారు చేస్తున్నారు.ఔటర్ వెలుపలే..నగరం ఓఆర్ఆర్ వరకు విస్తరించింది. చేవెళ్ల, వికారాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్, శామీర్‌పేట, భువనగిరి, శంషాబాద్, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల్లోని వీకెండ్ హోమ్స్‌కు ఆదరణ ఎక్కువగా ఉంది. భూముల ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ.. వాతావరణం బాగుంటుందని, భవిష్యత్తులో ఆస్తిని విక్రయిస్తే మంచి ధర పలుకుతుందనే విశ్వాసంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటితో పాటు చుట్టూ పచ్చదనం, ఆకుకూరలు, పండ్ల చెట్లను పెంచుతూ వ్యవసాయం చేశామనే తృప్తిని పొందేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు.బిల్డర్లు కూడా..రియల్ ఎస్టేట్ సంస్థలు వేసిన వెంచర్లలో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. వారాంతాల్లో విడిది చేసేలా సకల సదుపాయాలు ఇక్కడ కల్పిస్తున్నారు. కొందరు తమ ఇళ్లను మిగతా సమయంలో కమ్యూనిటీ నిర్వహణ సంస్థలకే అద్దెకు ఇస్తున్నారు. కమ్యూనిటీల్లోని సభ్యులు చిన్న వేడుకలను ఇక్కడ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఇతర ఇళ్లను ఒకటి రెండు రోజులకు అద్దెకు తీసుకుంటున్నారు. ఈ రకంగా ఖాళీగా ఉండకుండా ఆదాయం వస్తుండటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. -
పోస్టాఫీసులు వరుసగా మూడు రోజులు బంద్
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పలు పోస్టాఫీసులు మూడు రోజులపాటు తాత్కాలికంగా మూతపడ్డాయి. డిజిటల్ ఎక్సలెన్స్, జాతి నిర్మాణం దిశగా నెక్ట్స్ జనరేషన్ ఏపీటీ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తపాలా శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా తిరుపతి డివిజన్ లోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ నెల 22న అప్ గ్రేడ్ విధానాన్ని అమలు చేయనున్నారు.ఈ అధునాతన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు అవాంతరాలు లేకుండా సురక్షితంగా మారడానికి వీలుగా జూలై 19 నుండి 21 వరకు ప్రణాళికాబద్ధమైన డౌన్‌టైమ్ అమలు చేస్తున్నారు. దీంతో ఆయా రోజుల్లో పోస్టాఫీసులలో ఎటువంటి ప్రజా లావాదేవీలు జరగవని పోస్టాఫీసుల సీనియర్ సూపరింటెండెంట్ మేజర్ సయిదా తన్వీర్ ఒక ప్రకటనలో తెలిపారు. డేటా మైగ్రేషన్, సిస్టమ్ ధృవీకరణలు, కాన్ఫిగరేషన్ ప్రక్రియలను సులభతరం చేయడానికి, కొత్త సిస్టమ్ సజావుగా, సమర్థవంతంగా లైవ్ లోకి వెళ్లేలా చూసుకోవడానికి సేవల తాత్కాలిక నిలిపివేత అవసరమని వివరించారు.మెరుగైన వినియోగదారు అనుభవం, వేగవంతమైన సర్వీస్ డెలివరీ, మరింత కస్టమర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ను అందించడానికి ఏపీటీ అప్లికేషన్‌ను రూపొందించారు. నెక్ట్స్ జనరేషన్ ఏపీటీ అప్లికేషన్ అమలులో భాగంగా జూలై 21న తెలంగాణలోని రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాలు మినహా అన్ని పోస్టాఫీసుల్లో ఎలాంటి లావాదేవీలు జరగవని అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్ జనరల్ (టెక్-ఆపరేషన్స్) నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. -
మ్యూచువల్ ఫండ్స్‌లోకి మరో కొత్త కంపెనీ.. సెబీ నుంచి లైసెన్స్
ద వెల్త్ కంపెనీ అస్సెట్ మేనేజ్మెంట్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ (పాంటోమ్యాథ్ గ్రూప్ సంస్థ) మ్యూచువల్ ఫండ్స్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా సెబీ నుంచి తుది ఆమోదం పొందినట్టు ప్రకటించింది. దీంతో రూ.74 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి ‘ద వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్’ పేరుతో అధికారికంగా ప్రవేశించడానికి మార్గం సుగమం అయినట్టు తెలిపింది.సెబీ నుంచి సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈ నెల 18న మంజూరైనట్టు పేర్కొంది. సాధారణంగా ప్రైవేటు ఈక్విటీ మార్కెట్లో కనిపించే డేటా ఆధారిత పరిశోధన, వినూత్నమైన బోటమ్ అప్ విధానాలను తమ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు అందించనున్నట్టు తెలిపింది.హెచ్డీఎఫ్సీ ఏఎంసీ లాభం జూమ్ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 24 శాతం ఎగసి రూ. 748 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 604 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 25 శాతం జంప్‌చేసి రూ. 968 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 775 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీ నిర్వహణలోని సగటు ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 6.71 లక్షల కోట్ల నుంచి రూ. 8.3 లక్షల కోట్లకు బలపడింది. -
కొత్తిల్లు కొందామా.. పాతిల్లు చూద్దామా?
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. అయితే గృహ కొనుగోలు నిర్ణయం అంత తేలికైందేమీ కాదు. ప్రాంతం ఎంపిక నుంచి మొదలు పెడితే బడ్జెట్, నిర్మాణ నాణ్యత, నిర్మాణ సంస్థ నేపథ్యం, కొనుగోలుదారుడి అవసరాల వరకూ ప్రతి ఒక్కటీ ప్రధానమైందే. సమాజంలో గుర్తింపు కోసం కొందరు ఇల్లు కొంటే.. మరికొందరేమో పెట్టుబడి కోసం, ట్యాక్స్ నుంచి మినహాయింపుల కోసం కొంటుంటారు. కారణాలేవైనా ఇల్లు కొనడమనేది ఓ నిరంతర ప్రక్రియ. మరి, ఎలాంటి ఇల్లు కొంటే సొంతింటి యోగం మరింత తేలికవుతుంది? అంటే కొత్త ఇల్లు కొనడమా? లేక సెకండ్ హ్యాండ్ ఇల్లు బెటరా? అని! – సాక్షి, సిటీబ్యూరోదేశంలో కొత్త గృహాలకు డిమాండ్ ఎంత ఉందో రీసేల్ లేక సెకండ్ హ్యాండ్ ఇళ్లకూ అంతే ఉంది. కొత్త ఇల్లు నేరుగా డెవలపర్ నుంచి కొనుగోలు చేస్తే.. రీసేల్ ప్రాపర్టీలను పాత యజమాని నుంచి కొనుగోలు చేస్తాం. కొత్త లేక పాత ప్రాపర్టీ ఏదైనా కానీ ఎంపికలో ప్రధానమైంది బడ్జెట్. దీంతో పాటూ మన జీవన శైలి, అవసరాలు, అభిరుచులు, ఇంటీరియర్, ఇంధన సామర్థ్యాలు వంటివి కూడా ప్రాపర్టీ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.ప్రధాన నగరంలో సెకండ్సే బెటర్..ఇల్లు కొనుగోలు చేసిన వారెవరైనా సరే ఎప్పటికీ ఒకే ఇంట్లో ఉండాలనుకుంటారు. ఫ్యామిలీ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు గానీ ఉద్యోగ రీత్యా, కుటుంబ అవసరాల రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గానీ ఆర్థిక అవసరాల కోసం ఇంటిని విక్రయించాలనుకుంటారు. విద్యా, వైద్యం, వినోదం ఇతర అవసరాలకు రోజూ ప్రధాన నగరంతో అనుబంధం ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొత్త గృహాలు దొరకడం కొంత కష్టం. ఒకవేళ దొరికినా ధర ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఏరియాల్లో సెకండ్ హ్యాండ్ ఇల్లును కొనుగోలు చేయడం బెటర్. అవసరమైతే దాన్ని కూల్చేసి మన అవసరాలు, బడ్జెట్‌కు తగ్గట్టు మళ్లీ కొత్త గృహాన్ని నిర్మించుకోవచ్చు. అయితే ఇది కొంత డబ్బు, సమయంతో ముడిపడి ఉన్న అంశం. అందుకే ప్రధాన నగరంలో, అభివృద్ధి చెందిన ప్రాంతంలో రీసెల్ ప్రాపర్టీలను ఎంచుకోవటమే ఉత్తమమనేది నిపుణుల సూచన.రీసేల్ కొనేముందు..రీసేల్ ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు పాత యజమాని నేపథ్యం, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, టైటిల్, అనుమతి పత్రాలు, గృహ రుణానికి సంబంధించిన పత్రాలు వంటి వాటిని స్వయంగా పరిశీలించుకోవాలి. ఏమాత్రం అవగాహన లేకపోయినా లేక తప్పిందం జరిగినా సరే మొదటికే మోసం వస్తుంది. అదే కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే ఈ ప్రక్రియంతా డెవలపరే పూర్తి చేసేస్తాడు.పాత ఇళ్లలో ఎలక్ట్రిక్ వైర్లు, ఉపకరణాలు, బాత్రూమ్ ఫిట్టింగ్స్ వంటి వాటిల్లో సమస్య వస్తుంటుంది. అదే కొత్త గృహాల్లో బ్రాండెండ్, నాణ్యమైన ఉత్పత్తుల వినియోగంతో ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. పైగా పాత ఇళ్లలో వాస్తు మార్పులు, గదుల్లో చిన్న చిన్న మార్పులు చేయాలంటే ఇబ్బందులుంటాయి. అదే కొత్త గృహాల్లో నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే డెవలపర్‌కు మన అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణంలో మార్పులు చేసుకునే వీలుంటుంది.శివారు ప్రాంతాల్లో కొత్త ఇళ్ల ధరలు తక్కువకొత్త గృహాలతో పోలిస్తే రీసేల్ ప్రాపర్టీలు కొంత తక్కువ ధరకే లభ్యమవుతాయి. కానీ, రిజి్రస్టేషన్ ఫీజు, ప్రాపర్టీ బదిలీ రుసుము, వినియోగ చార్జీలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. పైగా సెకండ్ హ్యాండ్ హోమ్స్ నిర్వహణ భారం ఎక్కువగా ఉంటుంది. పైగా మన అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఇంటిని రిపేర్ చేయించాల్సి ఉంటుంది. ఆయా ఖర్చులన్నింటినీ కలిపి చూస్తే మాత్రం రీసేల్ ప్రాపర్టీ కంటే అభివృద్ధి చెందే ప్రాంతంలో, శివారు ప్రాంతంలోని కొత్త గృహాల ధరలే తక్కువగా ఉంటాయి.పర్యావరణం స్పృహ, ఇంధన నిర్వహణ సామర్థ్యాలు, కరెంట్ బిల్లుల మీద అవగాహన ఉంటే మాత్రం కొత్త ఇల్లు కొనడమే ఉత్తమం. ఎందుకంటే కొత్త గృహాలు ఎనర్జీ ఎఫీషియన్సీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇంట్లోనే ఉపకరణాలతో పాటూ గోడలు, పైకప్పులు, కిటికీలు, తలుపులు కూడా ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. దీంతో విద్యుత్ బిల్లు తక్కువగా రావటంతో పాటూ నిర్వహణ వ్యయం కూడా తక్కువ అవుతుంది. రీసేల్ ప్రాపర్టీలను కూడా ఎనర్జీ ఎఫీషియన్సీ ప్రమాణాలకు అనుగుణంగా మార్చవచ్చు. కానీ, ఆయా పాత గృహాలు దశాబ్ధాల క్రితం నాటి ప్రమాణాలను అనుగుణంగా నిర్మితమైనవి. వాటిని ఇప్పటి ప్రమాణాలను అనుగుణంగా మార్చాలంటే ఖర్చు ఎక్కువవుతుంది. కొత్త ఇళ్లలో గాలి, వెలుతురు బాగా వస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. -
ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలా
ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 1,111 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 633 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,568 కోట్ల నుంచి రూ. 8,866 కోట్లకు బలపడింది.వడ్డీ ఆదాయం రూ. 6,535 కోట్ల నుంచి రూ. 7,386 కోట్లకు ఎగసింది. నిర్వహణ లాభం రూ. 1,676 కోట్ల నుంచి రూ. 2,358 కోట్లకు జంప్‌చేసింది. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 2.89 శాతం నుంచి 1.97 శాతానికి, నికర ఎన్పీఏలు 0.51 శాతం నుంచి 0.32 శాతానికి దిగివచ్చాయి. కనీస మూలధన నిష్పత్తి 17.82 శాతం నుంచి 18.82 శాతానికి మెరుగుపడింది. ఫలితాల నేపథ్యంలో ఐవోబీ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 40 వద్ద ముగిసింది.బంధన్ బ్యాంక్ లాభం క్షీణత ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 65 శాతం క్షీణించి రూ. 372 కోట్లను తాకింది. మొండి రుణాలు పెరగడం, వడ్డీ ఆదాయం తగ్గడం ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,063 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 6,082 కోట్ల నుంచి రూ. 6,201 కోట్లకు బలపడింది. అయితే వడ్డీ ఆదాయం రూ. 5,536 కోట్ల నుంచి రూ. 5,476 కోట్లకు నీరసించింది.నికర వడ్డీ ఆదాయం రూ. 2,987 కోట్ల నుంచి రూ. 2,757 కోట్లకు వెనకడుగు వేసింది. నిర్వహణ లాభం సైతం రూ. 1,941 కోట్ల నుంచి రూ. 1,668 కోట్లకు క్షీణించింది. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 4.23 శాతం నుంచి 4.96 శాతానికి, నికర ఎన్పీఏలు 1.15 శాతం నుంచి 1.36 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 523 కోట్ల నుంచి రూ. 1,147 కోట్లకు భారీగా పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బంధన్ బ్యాంక్ షేరు 1.1 శాతం పుంజుకుని రూ. 187 వద్ద ముగిసింది. -
ముగిసిన టీసీఎస్ బెంచ్ పాలసీ గడువు
దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 35 రోజుల బెంచ్ పాలసీని అమలు చేస్తుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. జూన్ 12న ప్రకటించిన ఈ పాలసీ మొదటి విడత జులై 17తో గడువు ముగిసింది. దాంతో ఈరోజు చాలా మంది ఉద్యోగులు సంస్థలో తమ భవిష్యత్తు ఏమిటనే దానిపై ఆందోళన చెందుతున్నారు.జూన్ 2025లో ప్రవేశపెట్టిన బెంచ్ పాలసీ విధానం ప్రకారం ప్రతి ఉద్యోగి సంవత్సరానికి కనీసం 225 బిల్లింగ్(యాక్టివ్ వర్క్) రోజులను లాగిన్ చేయాలి. ఉద్యోగులు ప్రాజెక్టుల్లో లేనప్పుడు బెంచ్ మీద గడిపే సమయాన్ని ఇది సంవత్సరానికి కేవలం 35 పని దినాలకు పరిమితం చేసింది. టీసీఎస్‌లోని సుమారు 6,00,000 మంది ఉద్యోగుల్లో సామర్థ్యాన్ని పెంపొందించడానికి, నైపుణ్యాలు పునరుద్ధరించుకోవడానికి ఈ చొరవ ఎంతో మేలు చేస్తుందని కంపెనీ నమ్ముతోంది. అయితే నిన్నటితో మొదటి విడత బెంచ్ గడువు ముగియడంతో తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయోనని బెంచ్‌పై ఉన్న కొందరు ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.ఇదీ చదవండి: 34 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చు!టీసీఎస్ సీఈఓ కె.కృతివాసన్ ఈ చర్యను కంపెనీలో సహజ పరిణామంగా అభివర్ణించారు. ‘మేము ఇప్పటికే కొన్ని పాలసీలను క్రమబద్ధీకరించాం. ఉద్యోగులు ప్రాజెక్ట్‌కు సిద్ధంగా ఉండాలి. బిల్లింగ్ డేస్ పెరిగేలా చూడాలి. ఈ మేరకు తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు కంపెనీ సహాయం చేస్తోంది’ అని ఆయన ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా మూడు త్రైమాసికాల నుంచి కంపెనీ ఆదాయం వరుసగా క్షీణిస్తోంది. పెరుగుతున్న ఉద్యోగుల వ్యయం కొంత భారంగా మారుతుందనే వాదనలున్నాయి. -
'సుకన్య సమృద్ధి' లాభదాయకమేనా?
దేశంలో అత్యంత ప్రజాదరణ పిల్లల పెట్టుబడి పథకం సుకన్య సమృద్ధి యోజన (SSY). ప్రత్యేకంగా బాలికల భవిష్యత్తుకు ఆర్థికంగా భద్రత కల్పించేందుకు భారత ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. అత్యధిక వడ్డీ రేటు అందించే ఈ పథకంలో చాలా మంది బాలికల తల్లిదండ్రులు పొదుపు చేస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది అంత లాభదాయకం కాదంటున్నారు గువాహటికి చెందిన ఒక ఫైనాన్షియల్ ప్లానర్.'సుకన్య సమృద్ధి మీ కూతురికి రూ.69 లక్షలు ఇవ్వదు.. 21 ఏళ్లకు ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత ఆమెకు వచ్చేది రూ.17 లక్షలే' అంటూ గౌరవ్ ముంద్రా అనే ఫైనాన్షియల్ ప్లానర్ ఇటీవల లింక్డ్ఇన్లో ఓ పోస్ట్ చేశారు. సుకన్య సమృద్ధి యోజన (SSY), ఎన్పీఎస్ వాత్సల్య వంటి దీర్ఘకాలిక పెట్టుబడుల వాస్తవ ప్రపంచ విలువను మ్యూచువల్ ఫండ్ ప్రత్యామ్నాయాలతో పోల్చారు.సుకన్య సమృద్ధి పథకంలో 15 ఏళ్ల పాటు సంవత్సరానికి రూ .1.5 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత సుమారు రూ .69 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ మొత్తం నేటి నిబంధనల ప్రకారం సుమారు రూ .17–18 లక్షలే అవుతుంది అంటున్నాయన.నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కు సంబంధించిన చైల్డ్-ఫోకస్డ్ వేరియంట్ ఎన్పీఎస్ వాత్సల్యకు కూడా అదే పోలికను వర్తింపజేసిన ముంద్రా ఇది రూ .1.4 కోట్ల మెచ్యూరిటీని చూపించినప్పటికీ, కేవలం రూ .35 లక్షలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇది 21 సంవత్సరాలలో 6% ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేస్తే నేడు కేవలం రూ .8.4 లక్షలకు సమానం."ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి: రెండు దశాబ్దాల తరువాత మీ పిల్లల చదువు లేదా వివాహానికి ఈ రూ.8 లక్షలు లేదా రూ.17 లక్షలు సరిపోతాయా?" అంటూ పిల్లల తల్లిదండ్రులను ఆయన ప్రశ్నించారు. దీనికి బదులుగా, పిల్లలపై దృష్టి సారించిన మ్యూచువల్ ఫండ్లు 12% వార్షిక రాబడితో పన్నుకు ముందు రూ .1.4 కోట్లు, పన్ను తర్వాత సుమారు రూ .1.2 కోట్లు లేదా నేటి విలువలో సుమారు రూ .34 లక్షలు ఇవ్వగలవని ముంద్రా సూచిస్తున్నారు.‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమం కింద 2015లో భారత ప్రభుత్వం ఈ స్కీమును ప్రారంభించింది. బాలికల విద్య, వివాహ ఖర్చులకు పొదుపు చేయడం దీని లక్ష్యం. 10 సంవత్సరాల లోపు వయసున్న బాలికల పేరుతో ఖాతా ప్రారంభించవచ్చు. పోస్టాఫీసులు లేదా అనుమతి పొందిన బ్యాంకులలో ప్రారంభించవచ్చు. కనీసం రూ.250 నుండి గరిష్టంగా సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ఈ పథకం వ్యవధి 21 సంవత్సరాలు లేదా బాలిక వివాహం జరిగే వరకు (18 సంవత్సరాల తర్వాత) ఉంటుంది. -
జియో ఫైనాన్స్ లాభం భళా
డైవర్సిఫైడ్ దిగ్గజం ఆర్ఐఎల్ నుంచి విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 325 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 313 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 418 కోట్ల నుంచి రూ. 619 కోట్లకు ఎగసింది.అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 79 కోట్ల నుంచి రూ. 261 కోట్లకు భారీగా పెరిగాయి. వడ్డీ ఆదాయం రూ. 162 కోట్ల నుంచి రెట్టింపై రూ. 363 కోట్లకు చేరింది. ఈ కాలంలో జియో పేమెంట్స్ బ్యాంక్(జేపీబీఎల్)లో 14.96 శాతం వాటాకు సమానమైన 7.9 కోట్ల ఈక్విటీ షేర్లను ఎస్బీఐ నుంచి సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 104.54 కోట్లు వెచ్చించింది. వెరసి 2025 జూన్ 18 నుంచి జేపీబీఎల్ పూర్తి అనుబంధ సంస్థగా అవతరించినట్లు వెల్లడించింది.సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం వృద్ధిప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 322 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 294 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,736 కోట్ల నుంచి రూ. 2,984 కోట్లకు బలపడింది.వడ్డీ ఆదాయం రూ. 2,314 కోట్ల నుంచి రూ. 2,362 కోట్లకు స్వల్పంగా పుంజుకుంది. నిర్వహణ లాభం రూ. 508 కోట్ల నుంచి రూ. 672 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.5 శాతం నుంచి 3.15 శాతానికి, నికర ఎన్పీఏలు 1.44 శాతం నుంచి 0.68 శాతానికి దిగివచ్చాయి. కనీస మూలధన నిష్పత్తి 18.11 శాతం నుంచి 19.48 శాతానికి మెరుగుపడింది. -
Q1 Results: లాభాల కంపెనీలు
టెక్నాలజీ కన్సల్టింగ్, డిజిటల్ సొల్యూషన్ల దేశీ దిగ్గజం ఎల్‌టీఐమైండ్‌ట్రీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 1,254 కోట్లను అధిగమించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,134 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం 8 శాతం పుంజుకుని రూ. 9,841 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 9,143 కోట్ల టర్నోవర్ నమోదైంది. జూన్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 83,889కు చేరింది. ఇసాప్‌లో భాగంగా ఉద్యోగుల సంక్షేమ నిధికి 67,252 షేర్లను కొత్తగా జారీ చేసేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. వీటిని తదుపరి దశలో అర్హతగల ఉద్యోగులకు బదిలీ చేయనుంది.ఇండియన్ హోటల్స్ లాభం జూమ్ఆతిథ్య రంగ టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ కంపెనీ(ఐహెచ్‌సీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 27 శాతం జంప్‌చేసి రూ. 329 కోట్లను అధిగమించింది.గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 260 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,596 కోట్ల నుంచి రూ. 2,102 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 1,268 కోట్ల నుంచి రూ. 1,662 కోట్లకు పెరిగాయి. వరుసగా 13వ క్వార్టర్లోనూ రికార్డ్ ఫలితాలు సాధించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ చత్వాల్ పేర్కొన్నారు.గైడెన్స్‌కు అనుగుణంగా ఆదాయంలో రెండంకెల వృద్ధి సాధించినట్లు తెలియజేశారు. హోటళ్ల విభాగం నుంచి 14 శాతం అధికంగా రూ. 1,814 కోట్లు లభించగా.. 31.4 శాతం ఇబిటా మార్జిన్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ కాలంలో 12 ఒప్పందాలు కుదుర్చుకోగా.. కొత్తగా 6 హోటళ్లను ప్రారంభించినట్లు తెలియజేశారు. హోటళ్ల పోర్ట్‌ఫోలియో 390కు చేరినట్లు వెల్లడించారు. -
కంపెనీలో కొత్త రూల్.. ఇల్లు కొనుక్కున్న సీఈవో
కొందరు ప్రపంచ కార్పొరేట్ లీడర్ల జీవన శైలి భిన్నంగా ఉంటుంది. ప్రముఖ కాఫీ చైన్ స్టార్ బక్స్ సీఈఓ బ్రియాన్ నికోల్ వ్యక్తిగత శైలి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన నివాసం కాలిఫోర్నియాలో ఉంటుంది. సియాటెల్‌లోని కంపెనీ కార్యాలయానికి నిత్యం దాదాపు 1,600 కిలోమీటర్లు ఆయన కార్పొరేట్ జెట్‌లో తిరిగేవారు. అయితే ఆయన ఇప్పుడు సియాటెల్ లో ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు ఫార్చ్యూన్ వార్తా కథనం తెలిపింది. దీనికి కారణం ఆ కంపెనీ తీసుకొచ్చిన కొత్త విధానమే.ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ కాఫీ చైన్ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు తీసుకురావడానికి కఠినమైన విధానాన్ని అమలు చేస్తోంది. "మనం కలిసి పనిచేస్తే దాన్ని ఉత్తమంగా చేయగలం. ఆలోచనలను మరింత సమర్థవంతంగా పంచుకోగలం. కఠినమైన సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించుకుని వేగంగా ముందుకు వెళ్లగలం. అందుకే మన ఇన్-ఆఫీస్ సంస్కృతిని పునరుద్ధరిస్తున్నాము" అని నికోల్ ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొన్నారు.గత ఏడాది ఆగస్టులో స్టార్ బక్స్ సీఈఓగా నికోల్ నియమితులైనప్పుడు, కంపెనీ ఆయన ప్రత్యేక ప్రయాణ ప్రణాళికకు అంగీకరించింది. సియాటెల్ కార్యాలయానికి వారానికి కనీసం మూడు రోజులు వచ్చేలా కాలిఫోర్నియా- సియాటెల్ మధ్య కార్పొరేట్ జెట్‌లో ప్రయాణించే వెసులుబాటును కంపెనీ కల్పించింది. ఇది ఆ సమయంలో కంపెనీ అనుసరిస్తున్న హైబ్రిడ్ వర్క్ పాలసీకి అనుగుణంగా కల్పించిన వెసులుబాటు. నికోల్ ఇలాంటి రొటీన్ ఫాలో అవడం ఇదే మొదటిసారి కాదు. 2018లో చిపోటిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇలాంటి సుదూర ప్రయాణ ఏర్పాట్లు చేశారు. తర్వాత తన లొకేషన్ కు దగ్గరయ్యేలా కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని కూడా డెన్వర్ నుంచి కాలిఫోర్నియాకు మార్చాడు.కానీ ఇప్పుడు స్టార్ బక్స్ లో పరిస్థితులు మారుతున్నాయి. అక్టోబర్ నుంచి కార్పొరేట్ ఉద్యోగులందరూ వారంలో కనీసం నాలుగు రోజులు ఆఫీసులో ఉండాలని నికోల్ సిబ్బందికి సూచించారు. కంపెనీ తిరిగి పుంజుకునేందుకు ప్రారంభించిన "బ్యాక్ టు స్టార్ బక్స్" ప్రణాళికలో ఇది భాగం. గత ఏడాదిలో, స్టార్ బక్స్ అమ్మకాలు పడిపోవడం, అంతర్గత మార్పులతోపాటు బ్రాండ్ కు సంబంధించిన నిరసనలను కూడా చూసింది. ఈ నేపథ్యంలో వర్క్ పాలసీని సవరించిన స్టార్ బక్స్ సపోర్ట్ సెంటర్ నుండి రిమోట్ గా పనిచేస్తున్న మేనేజర్లు, టీమ్ లీడర్లు సియాటెల్ లేదా టొరంటోకు మారడానికి 12 నెలల సమయం ఇచ్చింది. ఈ రెండు ప్రాంతాల్లో ఏదో చోటకు నివాసం మార్చుకోవాలని ఇదివరకే గత ఫిబ్రవరీలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్లను కోరింది.అయితే అందరూ మకాం మార్చేందుకు సిద్ధపడకపోవచ్చు అందుకే అలాంటి వారి కోసం కంపెనీ ఓ అవకాశం కల్పించింది. అదేమిటంటే కంపెనీ చెప్పినట్లు రీలొకేట్ కావడానికి సిద్ధంగా లేనివారు కంపెనీ నుంచి స్వచ్ఛందంగా వైదొలగవచ్చు. ఇందుకోసం వన్-టైమ్ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్‌ను ప్రకటించింది. దీని ప్రకారం కంపెనీ నుంచి వైదొలగేవారికి నగదు పరిహారం చెల్లిస్తారు. ఆయన వేతన పారితోషికం పరిమాణం కారణంగా నికోల్ నియామకం ఇప్పటికే వార్తల్లో నిలిచింది. స్టార్ బక్స్ ఆయనకు సుమారు 113 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఇది అతన్ని అత్యధిక పారితోషికం తీసుకునే కార్పొరేట్ లీడర్లలో ఒకరిగా చేసింది. మాజీ చైర్మన్, సీఈవో లక్ష్మణ్ నరసింహన్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.కాగా స్టాక్ బక్స్ సీఈవో నికోల్ జెట్ ప్రయాణాన్ని విడిచి సియాటెల్‌లో ఇల్లు కొనుక్కోవడం ఆయన్ను కంపెనీ ప్రధాన కార్యాలయానికి దగ్గర చేయడమే కాకుండా పర్యావరణానికి మేలు చేస్తుంది. అదెలా అంటే.. ఆయన జెట్ ప్రయాణం సుదీర్ఘమైనది మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా హాని చేస్తోంది. యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ ప్రకారం.. ఒక ప్రైవేట్ జెట్ ప్రయాణించిన ప్రతి కిలోమీటరుకు సుమారు 2.5 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుంది. కాలిఫోర్నియా- సియాటెల్ మధ్య 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే 8,000 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. నికోల్ వారానికి మూడుసార్లు తిరిగితే మొత్తం వార్షిక ఉద్గారాలు 1,152 మెట్రిక్ టన్నులుగా ఉంటాయి. వారంలో ఐదు రోజులు తిరిగే ఆ సంఖ్య 1,920 మెట్రిక్ టన్నులకు చేరుతుంది. -
ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టెస్లా కార్లు
-
ఐటీ కంపెనీ హెక్సావేర్ రూ.1,029 కోట్ల డీల్
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ 120 మిలియన్ డాలర్లతో (రూ.1,029 కోట్లు) ఎస్ఎంసీ స్వేర్డ్ను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) మార్కెట్లో విస్తరణకు ఈ డీల్ దోహదపడుతుందని పేర్కొంది. జీసీసీ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ, బదిలీ సేవల్లో ఎస్ఎంసీ స్వేర్డ్ సేవలు అందిస్తోంది.‘‘ఎస్ఎంసీ కొనుగోలుతో జీసీసీ నైపుణ్యాలు మరింత బలపడతాయి. ఎస్ఎంసీ నైపుణ్యాలు మధ్య స్థాయి జీసీసీ విభాగంలో మా మార్కెట్ విస్తరణకు దోహదపడతాయి. ఎస్ఎంసీ సేవలను మా విస్తృతమైన క్లయింట్లకు ఆఫర్ చేస్తాం’’అని హెక్సావేర్ టెక్నాలజీస్ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం ఇచి్చంది. జోహో నుంచి ఎల్ఎల్ఎందేశీ టెక్నాలజీ సంస్థ జోహో (Zoho) తమ స్వంత లార్జ్ ల్యాంగ్వేజ్ (ఎల్ఎల్ఎం) మోడల్‌ను ప్రవేశపెట్టింది. తమ ఉత్పత్తులను ఉపయోగించే సంస్థల కోసం దీన్ని డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఎన్విడియాకు చెందిన ఏఐ కంప్యూటింగ్ ప్లాట్‌ఫాంను ఉపయోగించి దీన్ని తాము అంతర్గతంగా తయారు చేసినట్లు పేర్కొంది. ఇంగ్లీష్, హిందీలో మాటలను ఆటోమేటిక్‌గా టెక్ట్స్ కింద మార్చే మోడల్స్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్లు వివరించింది. దీన్ని ఇతర భారతీయ, యూరోపియన్ భాషలకు కూడా విస్తరిస్తామని తెలిపింది. -
టాటా ఎల్రక్టానిక్స్, బోష్ జట్టు
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల విభాగాల్లో పరస్పరం సహకరించుకునే దిశగా జర్మన్ టెక్నాలజీ సంస్థ రాబర్ట్ బాష్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ ఎల్రక్టానిక్స్ దిగ్గజం టాటా ఎల్రక్టానిక్స్ వెల్లడించింది. దీని ప్రకారం టాటా ఎల్రక్టానిక్స్ అస్సాంలో ఏర్పాటు చేసే అసెంబ్లీ .. టెస్ట్ యూనిట్లో, గుజరాత్‌లోని ఫౌండ్రీలో చిప్‌ల ప్యాకేజింగ్, తయారీ కార్యకలాపాలపై ఇరు సంస్థలు కలిసి పని చేస్తాయి.అలాగే వాహనాల్లో వినియోగించే ఎల్రక్టానిక్స్ తయారీ సేవలను అందించే విధంగా స్థానిక ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టనున్నాయి. దేశీయంగా సమగ్రమైన సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను నెలకొల్పేందుకు తమ భాగస్వామ్యం దోహదపడుతుందని టాటా ఎలక్ట్రానిక్స్ సీఈవో రణ్‌ధీర్ ఠాకూర్ తెలిపారు. అధునాతన ఆటోమోటివ్ ఎల్రక్టానిక్స్‌కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సరఫరా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని రాబర్ట్ బాష్ ఈవీపీ డిర్క్ క్రెస్ చెప్పారు. -
ఈ–కార్ట్స్ వ్యాపారంలోకి కైనెటిక్ గ్రీన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ కార్ట్‌ల విభాగంలోకి ప్రవేశించడంపై కైనెటిక్ గ్రీన్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గోల్ఫ్, లైఫ్స్టయిల్స్ కార్టుల తయారీ కోసం ఇటలీకి చెందిన టొనినో లాంబోర్గినితో చేతులు కలిపింది. వచ్చే దశాబ్దకాలంలో 1 బిలియన్ డాలర్ల పైగా టర్నోవరును లక్ష్యంగా పెట్టుకుంది.ఇందుకోసం ఏర్పాటు చేసే కైనెటిక్ గ్రీన్ టొనినో లాంబోర్గిని (కేజీటీఎల్) జాయింట్ వెంచర్ సంస్థలో కైనెటిక్ గ్రీన్కి 70 శాతం, టొనినోకి 30 శాతం వాటాలు ఉంటాయి. వచ్చే పదేళ్లలో అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ కార్ట్ వ్యాపారంలో 10% వాటాను సాధించాలని నిర్దేశించుకున్నట్లు కైనెటిక్ గ్రీన్ సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వాని తెలిపారు. అమెరికా, యూరప్, ఆసియావ్యాప్తంగా 25–30 మార్కెట్లలో ప్రవేశించడం ద్వారా వచ్చే అయిదేళ్లలో 300 మిలియన్ డాలర్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.వచ్చే ఏడాది వ్యవధిలో జాయింట్ వెంచర్ సంస్థ వివిధ మార్గాల్లో 20 మిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు వివరించారు. గోల్ఫ్ కోర్సులు, రిసార్టులు, ఎయిర్‌పోర్టుల్లో ఎలక్ట్రిక్ కార్టులను వాడతారు. ఇవి 80–150 కి.మీ. రేంజితో, 10,000–14,000 డాలర్లకు లభిస్తాయి. దేశీయంగా ఏటా 1,500 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. -
పోస్టాఫీసుల్లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లన్నీ ఫ్రీజ్
చిన్న మొత్తాల పొదుపు పథకాల (ఎస్సీఎస్) ఖాతాలకు తపాలా శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. వీటికి అనుగుణంగా లేని ఖాతాలను మూసివేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మెచ్యూరిటీ పీరియడ్ ముగిసిన తర్వాత మూడేళ్లు దాటినా కూడా క్లోజ్ చేయని ఖాతాలను అధికారులు ఇప్పుడు స్తంభింపజేయనున్నారు.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (టీడీ), పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) వంటి చిన్న పొదుపు పథకాల ఖాతాలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.మూడేళ్ల మెచ్యూరిటీ తర్వాత కూడా క్లోజ్ చేయని స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలను స్తంభింపజేస్తూ తపాలా శాఖ జూలై 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్వెస్టర్ల సొమ్మును కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం, ఇన్ యాక్టివ్, మెచ్యూరిటీ తీరిపోయిన పొదుపు పథకాల అకౌంట్లను ఖాతాదారులు అధికారికంగా పొడిగించుకోకపోతే పోస్టాఫీస్ ఇప్పుడు సంవత్సరానికి రెండుసార్లు గుర్తించి స్తంభింపజేస్తుంది.డిపాజిటర్లు కష్టపడి సంపాదించి పొదుపు చేసుకున్న డబ్బుకు భద్రతను మరింత పెంచడానికి ఈ ఫ్రీజింగ్ యాక్టివిటీని సంవత్సరానికి రెండుసార్లు నిరంతర చక్రంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఏటా జనవరి 1, అలాగే జూలై 1న రెండు సార్లు ఈ ప్రక్రియ జరగనుంది. ఈ తేదీల నుంచి 15 రోజుల్లో ఇలాంటి ఖతాలను గుర్తించడం, స్తంభింపజేయడం పూర్తవుతుంది. ఏటా జూన్ 30, డిసెంబర్ 31 నాటికి మూడేళ్ల మెచ్యూరిటీ పూర్తి చేసుకున్న ఖాతాలను గుర్తించి స్తంభింపజేస్తామని తపాలా శాఖ తెలిపింది.మెచ్యూరిటీ తీరిన తమ పొదుపు పథకాల ఖాతాలు స్తంభింపజేయకుండా ఉండటానికి, ఖాతాదారులు డిపాజిట్ పథకాన్ని అధికారికంగా పొడిగించడానికి అభ్యర్థనలను సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ పొడిగింపు వద్దనుకుంటే ఖాతా మూసివేతకు దరఖాస్తు చేయాలి. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిబంధనలు వచ్చాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోనస్ బొనాంజా!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటాదారులకు బోనస్ షేర్ల జారీ సహా.. ప్రత్యేక మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు ప్రతిపాదించింది. ఈ నెల 19న(శనివారం) నిర్వహించనున్న సమావేశంలో బోర్డు ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లు బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక (ఏప్రిల్–జూన్) ఫలితాలను సైతం శనివారం సమావేశంలో బ్యాంక్ ప్రకటించనుంది. కాగా.. గతేడాది(2024–25)కి ప్రచురించిన వార్షిక నివేదికలో పరిశ్రమకు అనుగుణంగా ఈ ఏడాది రుణాల్లో వృద్ధి నమోదుకానున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ పేర్కొన్నారు.రుణ రేట్లను తగ్గించిన ఐవోబీ ప్రభుత్వరంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) మేర తగ్గించినట్టు ప్రకటించింది. అన్ని రకాల కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ రుణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.జూలై 15 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. సవరణ అనంతరం ఓవర్‌నైట్ కాల వ్యవధి ఎంసీఎల్ఆర్ 8.15 శాతం, ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.40%, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.55 శాతం, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.80 శాతం, ఏడాది ఎంసీఎల్ఆర్ 9 శాతానికి దిగొచ్చాయి. ఆటో, వ్యక్తిగత తదితర కన్జ్యూమర్ రుణాలకు ఎంసీఎల్ఆర్ను బ్యాంకులు అమలు చేస్తుంటాయి. -
ఈసారి రిఫండ్ త్వరగా రాకపోవచ్చు..
ఈసారి రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. ఇంచుమించు కోటి దాకా రిటర్నులు వేసినట్లు అంచనా. అందులో చాలా మంది వెరిఫై కూడా చేశారు. గతంలో రిటర్ను వేసిన ఒకటి, రెండు రోజుల్లో రిఫండ్ వచ్చేసిన కేసులున్నాయి. సాధారణంగా 20 నుంచి 45 రోజుల్లోపల మీ బ్యాంకు ఖాతాకి రిఫండ్ మొత్తం జమ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో జాప్యం జరగొచ్చు. ఏ కారణం వల్ల రిఫండ్ త్వరగా రాదంటే..చాలా మంది వెరిఫై చేయడం లేదు. ఇలా వెరిఫై చేయనంతవరకు రిటర్నులను ముట్టుకోరు. ప్రాసెస్ చెయ్యరు. అందుకని రిటర్నులను వేసిన వెంటనే వెరిఫై చేయడం మరిచిపోవద్దు. బ్యాంకు అకౌంట్ వివరాలు పూర్తిగా ఇవ్వకపోతే రిఫండు రాదు. బ్యాంకుల విలీనం వల్లో, అడ్రెస్సులు పోవడం వల్లో, కోడ్లలో వచ్చిన మార్పులను తెలియచేయకపోవడం వల్లో కూడా ఇలా జరగొచ్చు. బ్యాంకు అకౌంటు నంబరు ఇప్పుడు పొడుగ్గా ఉంటోంది. ఏ ఒక్క అంకె తప్పొచ్చినా, సమాచారం లోపం వల్ల జమ ఆగిపోతుంది. పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే .. మిస్‌మ్యాచింగ్. రిటర్నుల్లో దాఖలు చేసిన అంశాలు, అన్నీ పూర్తిగా 26 ఏఎస్, ఏ19తో సరిపోయి ఉండాలి. 26ఏఎస్, ఏఐఎస్, ఈ రెండూ ఆదాయపు పన్ను వెబ్సైట్లో దొరుకుతాయి. ఇవి చాలా స్పష్టంగా మీకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా క్రోడీకరించి చూపిస్తాయి. సర్వసాధారణంగా తప్పులు ఉండవు. చాలా మంది ఏం చేస్తుంటారంటే, వీటిలో సమాచారం బేస్‌గా రిటర్నులు వేసేస్తుంటారు. అ ప్పుడు మిస్‌మ్యాచ్ ఉండదు. ఇదొక సేఫ్ గేమ్. అలా అని మీరు 26ఏఎస్, ఏఐఎస్ అంశాలతో పూర్తిగా ఏకీభవించాలని లేదు. అందులోని అంశాలు తప్పని అనిపించినా, రెండు సార్లు కనిపించినా, మీవి కాకపోయినా, మీరు విభేదించవచ్చు. అప్పుడు, మిస్‌మ్యాచ్ తథ్యం. ఇలాంటప్పుడు రిఫండు ఆలస్యం అవుతుంది. కొంత మంది ఫారం ఎంచుకోవడంలో పొరపా టు చేస్తారు. అలాంటి పొరపాటు జరిగినా, రి ఫండు ఆలస్యం కావచ్చు. జాగ్రత్త వహించాలి. సాంకేతికపరమైన సమస్యలు ఉత్పన్నమవ్వొచ్చు. ఇవి తాత్కాలికం కావొచ్చు. తాత్కాలికం అయితే, గంటలోనో లేదా రోజులోపలో దానంతట అదే సాల్వ్ అయిపోతుంది. కొన్ని వారం, పది రోజులు పట్టొచ్చు. అధికార్లకు ఈ సమస్య తెలియకపోవచ్చు. సిస్టమ్ అధికార్లకు కూడా వెనువెంటనే తెలియదు. ఈ మేరకు ప్రాసెసింగ్ లేటు అవుతుంది. పన్నులు చెల్లింపుల మూడు రకాలు. టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్. ఈ చలాన్లలోని అంశాలు రాసేటప్పుడు ఏ పొరపాటు జరిగినా .. చెల్లింపులకు సంబంధించిన పద్దు, గవర్నమెంటు ఖాతాలో మీ పేరున జమ అవ్వదు. సస్పెన్స్‌లో పెడతారు. దాన్ని పట్టుకోవడం సులువైన పని కాదు. అలాగే టీడీఎస్ రికవరీలు, చెల్లింపులు, రిటర్నులు వేయడం – ఈ మూడు దశల్లో ఎక్కడ తప్పు జరిగినా, పెండింగ్‌లో పడిపోతుంది. అటు పక్క వ్యక్తి తప్పులు చేసినా మీరే సఫర్ అవుతారు. చెక్ చేసుకోండి. ఇలాంటి సమస్యల వల్ల రిఫండ్ ఆగిపోతుంది. పాత/ముందు సంవత్సరాల్లో చెల్లించాల్సిన బకాయిలుంటే వాటిని రికవరీ చేయడం వల్ల ప్రస్తుత సంవత్సరపు రిఫండ్ ఆగిపోవచ్చు. ఈ మధ్య ఓ కేసులో 18 ఏళ్ల క్రితం ఉన్న బకాయిల నిమిత్తం నోటీసులు ఇచ్చారు. కాగితాలు సకాలంలో దొరక్కపోవటం వల్ల జవాబు ఇవ్వలేదు. ఆ సంవత్సరం బకాయిల నిమిత్తం కరెంటు రిఫండును తొక్కి పెట్టేశారు. వాళ్లకి వాళ్లు పన్నులను రికవర్ చేసుకోవడానికి ఎంత వెనక్కయినా వెళ్తారు. మన కష్టాలు పట్టించుకోరు. అందుకనే అన్ని సంవత్సరాల రికార్డులూ భద్రంగా దాచిపెట్టుకోవాలి. అశ్రద్ధ వద్దు. రికవరీ చేసుకున్నామని మీకు చెప్పరు కూడా. ఇక అధికార్ల వద్ద మరో బ్రహ్మాస్త్రం ఉంటుంది. అదే స్క్రూటినీ ప్రొసీడింగ్స్. ఏదైనా కారణాల వల్ల మీ కేసు స్క్రూటినీకి ఎంపిక అయిందనుకోండి. అధికార్లు ఆరా తీస్తారు. ఆరాలో తొక్క తీస్తారు. తొక్క తీసి తోలు కడతారు. అలా అయ్యేవరకు రిఫండ్ రాదు. అలాగని స్క్రూటినీ అంటే భయపడక్కర్లేదు కానీ, జాప్యం ఎక్కువ జరగొచ్చు. అనిశ్చితి .. అయోమయం పరిస్థితి నెలకొనవచ్చు.ఈ సంవత్సరానికి గాను గతంలోలాగా వెనువెంటనే రిఫండులు జారీ చేయడం లేదు. ఒకటికి పది సార్లు చెక్ చేసి, గతానికి వెళ్లి, అన్ని చేక్ చేసి కానీ రిఫండులు ఇవ్వడం లేదు. అలా అని మీరేమీ గాభరాపడక్కర్లేదు. -
ఒక్క బిట్ కాయిన్.. రూ.కోటి నాలుగు లక్షలు
పర్సనల్ ఫైనాన్సింగ్ కేటగిరీలో బిట్‌కాయిన్ సరికొత్త పెట్టుబడి ఎంపికగా మారిపోయింది. దీంతో క్రిప్టో కాయిన్ రేటు తన సుదీర్ఘ ప్రయాణంలో 1లక్ష 20వేల డాలర్ల జీవితకాల గరిష్ఠాలకు చేరుకుంది. అయితే ఇన్వెస్టర్లలో వచ్చిన అవగాహన, క్రిప్టోల వైపు వారి అడుగులు పెద్ద మార్పుగా పరిగణిస్తున్నట్లు ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీ జియోటస్ సంస్థ పేర్కొంది.ఒకప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం క్రిప్టోల్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం దానిని ఒక వ్యూహాత్మక దీర్ఘకాలిక అసెట్ క్లాస్ కింద పరిగణిస్తున్నట్లు వాలెట్ చేరికల్లో పెరుగుదల సూచిస్తోందని క్రిప్టో ఎక్స్ఛేంజీ వెల్లడించింది. ప్రస్తుతం వచ్చిన మార్పులు బిట్‌కాయిన్ వేగంగా సంపద సృష్టికి పునాది స్తంభంగా మారుతుందనే లోతైన మార్కెట్ నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఇటీవల బిట్‌కాయిన్ తన టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్ లక్ష 10వేల డాలర్ల మార్కును అధిగమించటం మరింత ర్యాలీకి కారణంగా మారింది.దీనికి తోడు ఎథెరియం, సోలానా, కార్డానో, సుయి వంటి ఇతర కాయిన్స్ కూడా క్రిప్టో ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణను పొందుతున్నాయి. డేటా ప్రకారం ఈ ఏడాది బలమైన ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని ఊహించబడింది. ఈ క్రమంలో చిన్నచిన్న ఒడిదొడుకులు ఉన్నప్పటికీ క్రిప్టోల ప్రాభల్యం పెట్టుబడుల ప్రపంచంలో సుస్థిరంగా ముందుకు సాగుతుందని జియోటస్ భావిస్తోంది.ఈ క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లలో ఉండే అనుమానం బిట్‌కాయిన్ ర్యాలీ ఇంకెంత వరకు చేరుకుంటుంది అన్నదే. దీనికి జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అంచనాలను చూస్తే ఇకపై బిట్‌కాయిన్ ధర లక్షా 35వేల డాలర్ల రేటు వద్ద నిరోధాన్ని ఎదుర్కొంటుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో క్రిప్టో ఈటీఎఫ్ పెట్టుబడులు పెరిగితే ఒక్కో బిట్‌కాయిన్ రేటు ఏకంగా లక్షా 50వేల డాలర్ల వరకు చేరుకునే అవకాశం ఉందని విక్రమ్ చెబుతున్నారు. మార్కెట్లలో ఓలటాలిటీ, ఫ్రాఫిట్ బుక్కింగ్, ఇతర ఒడిదొడుకులు ఉన్నప్పటికీ చాలా మంది తమ పోర్ట్ ఫోలియోలో క్రిప్టోలకు కొంత సముచిన మెుత్తాన్ని కేటాయించి ముందుకు సాగటానికి ఇది సరైన సమయంగా జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అభిప్రాయపడుతున్నారు. -
జీతాల పెంపుపై టీసీఎస్ సీఎఫ్‌వో కీలక ప్రకటన
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తొలి త్రైమాసిక ఫలితాలను ఇటీవల ప్రకటించింది. వ్యాపార వృద్ధి, మార్జిన్లలో ప్రతికూలతను కంపెనీ చూసింది. ఈ క్రమంలో జీతాల పెంపు గురించి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సమీర్ సెక్సారియా తాజాగా ప్రకటన చేశారు.తమ 6 లక్షల మంది ఉద్యోగులకు వేతనాల పెంపు టీసీఎస్ ప్రాధాన్య అంశమని సీఎఫ్‌వో సమీర్ సెక్సారియా తెలిపారు. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన సెక్సారియా, టీసీఎస్ లాభదాయకతతో కూడిన వృద్ధిపై దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు. తోటి కంపెనీల మాదిరిగా కాకుండా టీసీఎస్ చాలా అరుదుగా వేతనాల పెంపును వాయిదా వేస్తోందన్న ఆయన గతంలో మాదిరి సకాలంలో వేతనాల పెంపు అమలు చేయడమే తన ప్రాధాన్యమని సెక్సారియా అన్నారు. అయితే ఈ పెంపును ఎప్పుడు అమలు చేస్తారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.సాధారణంగా వార్షిక వేతనాల పెంపు వల్ల నిర్వహణ లాభం మార్జిన్ 1.50 శాతానికి పైగా తగ్గుతుందని సెక్సారియా తెలిపారు. స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయ సమస్యల కారణంగా డిమాండ్ దెబ్బతినడంతో నాన్ కోర్ ఆదాయంపై నికరంగా 6 శాతం పెరుగుదలను కంపెనీ చూపించింది. సాధారణంగా ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే వార్షిక వేతన పెంపును వాయిదా వేసింది. జూన్ త్రైమాసికంలో ఈ సంఖ్య 0.20 శాతం క్షీణించి 24.5 శాతంగా నమోదైందని, అయితే మార్జిన్లను 26-28 శాతం ఆకాంక్షాత్మక పరిధిలోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని సెక్సారియా నొక్కి చెప్పారు.డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకునేందుకు ముందస్తు నియామకాల్లో పెట్టుబడులు పెట్టడం మార్జిన్లను దెబ్బతీసిందని, డిమాండ్ లేకపోవడం వినియోగ స్థాయిలను తగ్గించిందని సెక్సారియా వివరించారు. జూలై 11 నాటికి టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.11.81 లక్షల కోట్లుగా ఉంది. -
మెర్సిడెస్ బెంజ్ ధరల పెంపు
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా వాహన ధరలను పెంచనుంది. సెప్టెంబర్ నుంచి వివిధ మోడల్ కార్ల ధరలను 1–1.5 శాతం స్థాయిలో పెంచేందుకు చూస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ వెల్లడించారు. ప్రధానంగా యూరోతో మారకంలో రూపాయి బలహీనపడటంతో ధరల పెంపు యోచనకు తెరతీసినట్లు పేర్కొన్నారు.అయితే ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు వాహన ధరలను పెంచడం గమనార్హం! 2025 జనవరి, జులైలో కార్ల ధరలను హెచ్చించింది. కాగా.. యూరో ప్రభావాన్ని తట్టుకునే బాటలో మరోసారి సెప్టెంబర్ నుంచి ధరల పెంపు చేపట్టనున్నట్లు అయ్యర్ తెలియజేశారు. గత నెల రోజులుగా యూరోతో మారకంలో రూపాయి 100 మార్క్ వద్దే కదులుతున్నట్లు తెలియజేశారు.ఫలితంగా సెప్టెంబర్‌లో 1 నుంచి 1.5 శాతంవరకూ ధరల పెంపును చేపట్టనున్నట్లు తెలియజేశారు. ధరల పెంపు వల్ల ప్రభావం పడబోదని, మరోపక్క వడ్డీ రేట్లు దిగివస్తుండటంతో కొనుగోలుదారులకు ఈఎంఐ చెల్లింపులు బ్యాలన్స్ అవుతాయన్నారు. కంపెనీ కార్ల అమ్మకాలలో 80% ఫైనాన్స్ ద్వారానే నమోదవుతున్నట్లు చెప్పారు. -
పదేళ్లలో ఆరింతలైన ఐటీ రిఫండ్లు
ఆదాయపన్ను రిఫండ్లు, రిటర్నులు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ పాలనలో గణనీయంగా పెరిగాయి. యూపీఏ–2 పాలనలో చివరి ఆర్థిక సంవత్సరం 2013–14లో పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్ను శాఖ చేసిన చెల్లింపులు (రిఫండ్) రూ.83,008 కోట్లుగా ఉంటే.. 2024–25 సంవత్సరం (ఎన్డీఏ పాలనలో 11వ సంవత్సరం) నాటికి రిఫండ్లు రూ.4.77 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే 474 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు 2013–14 సంవత్సరంలో ఐటీ రిఫండ్లకు 93 రోజుల సగటు వ్యవధి తీసుకోగా, అది 2024–25 సంవత్సరానికి 17 రోజులకు తగ్గింది.ఇక ఈ పదేళ్లలో స్థూల పన్ను వసూళ్లు, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారిలోనూ మంచి వృద్ధి కనిపించింది. 2013–14 సంవత్సరానికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.22 లక్షల కోట్లుగా ఉంటే, 2024–25 సంవత్సరంలో ఈ మొత్తం రూ.27.03 లక్షల కోట్లకు పెరిగింది. ఐటీ రిటర్నుల దాఖలు 133 శాతం పెరిగింది. 2013లో 3.8 కోట్ల ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్‌లు) దాఖలు కాగా, 2024లో 8.89 కోట్ల ఐటీఆర్‌లు నమోదయ్యాయి. వ్యవస్థ మార్పు ఫలితమే పన్ను రిఫండ్లు గణనీయంగా పెరగడం, రిఫండ్ల కాలవ్యవధి కూడా 17 రోజులకు తగ్గడం అన్నది పన్ను యంత్రాంగంలో వచ్చిన మార్పు ఫలితమేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా డిజిటల్ వసతులు, పూర్తిగా ఆన్లైన్లోనే రిటర్నుల దాఖలు, ప్రత్యక్ష హాజరు అవసరం లేని పన్ను రిటర్నుల మదింపులు (ఫేస్‌లెస్) అన్నవి ఐటీఆర్‌లను మరింత కచ్చితత్వంతో ప్రాసెస్ చేసేందుకు వీలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నాయి.ముందుగానే భర్తీ అయిన పన్ను రిటర్నులు (టీడీఎస్, ఫామ్ 16, 26ఏఎస్ తదితర మార్గాల్లో వచ్చిన సమాచారంతో నిండినవి), రిఫండ్ ప్రాసెస్‌ను ఆటోమేట్ చేయడం, టీడీఎస్ సర్దుబాట్లు, ఆన్లైన్లో ఫిర్యాదుల పరిష్కారం అన్నవి కాల వ్యవధిని తగ్గించి, పన్ను చెల్లింపుదారులకు మెరుగైన అనుభవానికి తోడ్పడుతున్నట్టు తెలిపాయి. 2013–14లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రిఫండ్లు 11.5 శాతంగా ఉంటే, 2024–25లో 17.6 శాతానికి పెరగడం గమనార్హం. ‘‘పన్ను చెల్లింపుదారుల సంఖ్య విస్తరించడం, ముందస్తు పన్ను చెల్లింపులు, టీడీఎస్ యంత్రాంగం మరింత బలంగా మారినప్పుడు రిఫండ్లు సైతం పెరగడం సాధారణమే. వ్యవస్థలో పరిణతికి ఇది నిదర్శనం’’అని ఆ వర్గాలు తెలిపాయి. -
మారికో లక్ష్యం.. ఐదేళ్లలో రెట్టింపు ఆదాయం
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ మారికో వచ్చే ఐదేళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేసుకోనుంది. 2030 నాటికి రూ.20,000 కోట్లకు చేరుకోవాలన్నది తమ లక్ష్యమని మారికో చైర్మన్ హర్ష్ మరివాలా ప్రకటించారు. సఫోలా, పారాచ్యూట్, లివాన్ తదితర ప్రముఖ బ్రాండ్లను కలిగిన మారికో ఆదాయం 2024–25లో రూ.10,000 కోట్లుగా ఉండడం గమనార్హం.మారికో బ్రాండ్లు, ఆవిష్కరణల బలానికి ఇది నిద్శనమంటూ కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. కంపెనీ తదుపరి మార్పు దశలో ఉందన్నారు. భిన్న ప్రాంతాల ప్రజల మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తీసుకురానున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సౌగత్ గుప్తా తెలిపారు.అంతర్జాతీయంగా విశ్వసనీయమైన డిజిటల్ ఎఫ్ఎంసీజీ బ్రాండ్‌గా అవతరించడమే తమ లక్ష్యమన్నారు. మధ్య కాలాలానికి 25 శాతానికి పైనే వృద్ధిని నమోదు చేస్తామన్న విశ్వాసంతో ఉన్నట్టు చెప్పారు. 2019–20 అమ్మకాల నుంచి ఎనిమిది రెట్ల వృద్ధికి చేరుకుంటామన్నారు. తమ పోర్ట్‌ఫోలియోని దూకుడుగా విస్తరిస్తామని ప్రకటించారు. -
హోమ్ ఫైనాన్స్‌కు రూ.858 కోట్ల రుణం
ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) నుంచి రూ.858 కోట్ల (100 మిలియన్లు) రుణాన్ని పొందినట్లు ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ సంస్థ శనివారం తెలిపింది. ‘‘దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు సొంతింటి ఏర్పాటు అవకాశాలు మెరుగుపరిచే లక్ష్య సాధనలో ఏబీబీ నుంచి నిధులు అందడం ఒక కీలక ఘట్టం’’ అని ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్ సీఈవో మోను రాత్రా తెలిపారు.ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్ భాగస్వామ్యం ద్వారా భారత గృహ నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల భవనాలు (గ్రీన్ బిల్డింగ్) ప్రమాణాలు మరింత మెరుగుతాయని ఏఐఐబీ డైరెక్టర్ జనరల్ గ్రెగొరీ లియు తెలిపారు. ఏఐఐబీ నుంచి పొందిన నిధులు దేశ అఫర్డబుల్ హౌసింగ్ వ్యవస్థలో డిమాండ్‌తోపాటు సరఫరా సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయని ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ భావిస్తోంది.డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ ప్రధానంగా పట్టణ ప్రాంతాలలోని ఆర్థికంగా వెనుకబడిన, అల్పాదాయ వర్గాలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గృహ రుణ వితరణను మరింత పెంచనుంది. ఇక సప్లయిపరంగా అందుబాటు ధరల్లో గృహాలు అభివృద్ధి చేసే హౌసింగ్ డెవలపర్లకు ఫైనాన్స్ సాయం అందించనుంది. -
దేశీ ఫుట్‌వేర్ రంగంపై విదేశీ కన్ను
దేశీ నాన్‌లెదర్ ఫుట్‌వేర్ రంగంలో పెట్టుబడులు చేపట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు లెదర్ ఎగుమతుల మండలి(సీఎల్ఈ) చైర్మన్ ఆర్కే జలాన్ పేర్కొన్నారు. ప్రధానంగా తైవాన్, వియత్నాం కంపెనీలు ముందున్నట్లు తెలియజేశారు. అయితే ఇందుకు ప్రభుత్వ మద్దతు కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. తైవాన్, వియత్నాం దేశాల సంస్థలు చైనా తదితర దేశాల నుంచి షూ సోల్స్, మౌల్డ్స్, మెషీనరీ, ఫ్యాబ్రిక్స్ తదితర ప్రొడక్టులను దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు.వెరసి ఈ రెండు దేశాల కంపెనీలు భారత్‌లో పెట్టుబడులకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలియజేశారు. ఆయా సంస్థలకు మద్దతిస్తే తయారీకి అవసరమయ్యే నాన్‌లెదర్ సంబంధ ఫుట్‌వేర్ ప్రొడక్టులను సులభంగా దిగుమతి చేసుకోగలుగుతాయని వివరించారు. భారత్ నుంచి పటిష్టస్థాయిలో ఎగుమతులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో 7 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.గతేడాది(2024–25) 5.75 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదైనట్లు ప్రస్తావించారు. వీటిలో యూఎస్‌కు అత్యధికంగా 95.7 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని, వీటి వాటా 20 శాతమని తెలియజేశారు. తదుపరి 11 శాతం వాటాతో యూకే, జర్మనీ నిలిచినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 18 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తే ఎగుమతులు పుంజుకోవడంతోపాటు.. మరింత ఉద్యోగ కల్పనకు వీలుంటుందని వివరించారు. -
కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్.. 100 ఏళ్ల వరకూ బీమా రక్షణ
బంధన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వినూత్నమైన బీమా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 100 ఏళ్ల వయసు వరకు జీవిత బీమాను తీసుకోవచ్చు. పాలసీ కాలవ్యవధిలోపు పాలసీదారు మరణించినట్టయితే వారసులకు ఏక మొత్తం బీమా పరిహారాన్ని చెల్లిస్తుంది. అంతేకాదు అక్కడినుంచి క్రమం తప్పకుండా ఆదాయాన్ని చెల్లిస్తుంటుంది. గడువు తీరిన మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.కనీసం మూడు నెలల వయసు నుంచే ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇలా తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్న వయసు నుండే తమ పిల్లల కోసం ఆర్థిక రక్షణ కల్పించేందుకు వీలుంటుంది. విద్య, వివాహం లేదా ఇల్లు కొనుగోలు వంటి అవసరాలకు ఈ పాలసీ సహాయపడుతుంది. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ అనువైన చెల్లింపు ఎంపికలతోపాటు మహిళా పాలసీదారులకు అదనపు రాబడిని కూడా అందిస్తుంది.స్వల్ప, దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలను తీర్చేలా ఈ ప్లాన్‌ను రూపొందించారు. కస్టమర్లు తమకు సౌకర్యవంతమైన ఆదాయ చెల్లింపు ఎంపికలను ఎంచుకోవచ్చు లేదా తరువాతి దశలో ఆదాయాన్ని కూడబెట్టి ఉపసంహరించుకోవచ్చు. రోజువారీ ఖర్చులను నిర్వహించడం, అత్యవసర నిధిని నిర్మించడం లేదా భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేయడం, ప్రణాళిక వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. -
ఇంట్లో పవర్‌ట్రాక్.. వేలు పెట్టినా నో షాక్!
సాక్షి, సిటీబ్యూరో: పొరపాటున సాకెట్లో వేలు పెడితే ఏమవుతుంది? దిమ్మతిరిగి.. మైండ్ బ్లాక్ అవుతుందా లేదా! అదేనండి.. షాక్ కొడుతుంది కదా! వంటగదిలోని పవర్ సాకెట్ అదీ.. రెండు, మూడు ప్లగుల్ని పెడితే చిటపట మెరుపులు.. షార్టుసర్క్యూట్లు. ఇలాంటి సమస్యలన్నింటికీ ఓ చక్కటి పరిష్కారం పవర్ ట్రాక్. ఎక్స్టెన్షన్ బాక్స్‌కు సరికొత్త రూపమే ఈ పవర్ ట్రాక్. దీని సాయంతో 5 నుంచి 13 విద్యుత్తు ఉపకరణాల్ని ఒకేచోట ఏర్పాటు చేయవచ్చు. ఏకకాలంలో ఇన్నింటిని వాడినా షార్టుసర్క్యూట్ అవుతుందనే భయమే అక్కర్లేదు.వంటింట్లో అయినా, ఆఫీసులో అయినా.. కరెంటు తీగల నుంచి కంప్యూటర్ వైర్ల వరకూ పవర్ట్రాక్లో బిగించొచ్చు. పవర్‌ట్రాక్ అంటే ఇదేదో కొత్త పరికరం అనుకునేరు. రెండు, మూడు ప్లగ్గులు పెట్టాల్సి వస్తే ఎక్స్టెన్షన్ బాక్సులు, పవర్ర్స్టిప్ల వాడకం తెలిసిందే కదా! సరిగ్గా ఇది కూడా అలాంటిదే అన్నమాట. అయితే వాటితో పోలిస్తే రెండు, మూడు రెట్లు ఎక్కువ సంఖ్యలో విద్యుత్తు ఉపకరణాలు ఏర్పాటు చేసుకునే వీలు ఇక్కడుంటుంది. ఇదే ఈ పరికరం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బహుముఖ అవసరాల్ని తీర్చే పవర్‌ట్రాక్ రెండు రకాలు. గృహావసరాలకు ఉపయోగపడే కాంపాక్ట్ ట్రాక్, ఆఫీసుల్లో ఉపయోగించే డాటా ట్రాక్, పవర్ట్రాక్ను గోడకు బిగించడం వల్ల చూడటానికి చక్కటి లుక్కు వస్తుంది. వైర్ల గజిబిజి ఉండదు. పైగా పూర్తి సురక్షితం. అందుకే వీటికి గిరాకీ అధికం. వంటగది, స్టడీరూమ్, లివింగ్రూమ్లతో పాటు ఆఫీసుల్లోనూ వీటిని విరివిగా వాడొచ్చు. సైజును బట్టి ఒక పవర్‌ట్రాక్ ద్వారా ఐదు నుంచి పదమూడు విద్యుత్తు ఉపకరణాల్ని ఏకకాలంలో వాడుకోవచ్చు. 500 మిల్లీమీటర్లు, 600 మిల్లీ మీటర్లు, 1,300 మిల్లీమీటర్ల పొడవుతో దొరుకుతాయి. పైన అల్యూమినియం, లోపల థర్మోప్లాస్టిక్ రబ్బర్ మెటీరియల ఉపయోగించే పవర్ట్రాక్ల ధర రూ.5 వేల నుంచి రూ.7వేల వరకు ఉంది.ఎన్నెన్నో లాభాలు..సాకెట్లు.. ఎక్స్టెన్షన్ బాక్సుల్లో ఒక్కోసారి ప్లగ్గులు సరిగా దూరవు. ఫలితంగా ప్లగ్ పిన్నును పెట్టగానే సాకెట్ నుంచి చిటచిట మెరుపులు వస్తుంటాయి. ప్లగ్‌ని పైకి ఎత్తిపట్టుకుంటే కానీ మిక్సర్ తిరక్కపోవచ్చు. ఇలాంటి సమస్యలు పవర్ట్రాక్లో కన్పించవు. ఒక్కోసారి చిన్నపిల్లలు తెలీక ప్లగ్గుల్లో చెంచాలు, ఇనుపముక్కలు, వేళ్లు పెట్టి షాక్‌కు గురవుతుంటారు. పవర్ట్రాక్తో అలాంటి భయమే అక్కర్లేదు. లోపల వేళ్లు పెట్టినా ఇబ్బందే ఉండదు. 100 శాతం షాక్ప్రూఫ్ ఇది. స్విచ్‌బోర్డు అయితే సాకెట్ అమర్చిన చోటే ప్లగ్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవైపు అందకపోవడం, ఉపకరణాల్ని అటూఇటూ జరపడం వంటి ఇబ్బందులుంటాయి. ఇందులో అలాకాదు. ట్రాక్‌లో ఈ చివర నుంచి ఆ చివర వరకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రకం ఏదైనా పవర్ట్రాక్తో మూడు సాకెట్లు ఉచితంగా వస్తాయి. అదనంగా కావాలంటే, వాటిని ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. డాటాట్రాక్ను గృహావసరాలకు కూడా వాడుకోవచ్చు. కాంపాక్ట్ట్రాక్ను మాత్రం ఆఫీసుల్లో వాడలేం. -
ఈ క్రెడిట్ కార్డు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదు
ఈరోజుల్లో దాదాపు ప్రతిఒక్కరి దగ్గర ముఖ్యంగా ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరి దగ్గరా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కొందరి దగ్గరైతే రెండు, మూడుకు మించి కూడా క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. క్రెడిట్ సదుపాయంతోపాటు ఆకర్షణీయమైన ప్రయోజనాల కోసం చాలా మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డు గురించి తెలుసా? దీని కోసం ఎంత ఖర్చవుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..నేటి ప్రపంచంలో క్రెడిట్ కార్డులు రోజువారీ జీవితంలో భాగంగా మారాయి. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటారు. అసరమైనప్పుడు ఖర్చు చేసేందుకు మాత్రమే కాకుండా సినిమా టిక్కెట్లపై డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లుక,ఉచిత ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలను కూడా క్రెడిట్ కార్డులు. ఈ ప్రయోజనాలు పరోక్షంగా డబ్బు ఆదా చేయడానికి సహాయపడతాయి. అయితే క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా ఉపయోగించకపోతే మాత్రం ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది.భారత్‌లో 200 మంది దగ్గరే..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డు ఒకటి ఉంది. దీని పేరు అమెరికన్ ఎక్స్ ప్రెస్ సెంచూరియన్ కార్డ్. సింపుల్‌గా అమెక్స్ బ్లాక్ కార్డ్ అని పిలుస్తారు. దీనిని అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంక్ జారీ చేస్తుంది.ఈ కార్డు ఖరీదైనది మాత్రమే కాదు. చాలా ప్రత్యేకమైనది కూడా. ఇది అందరికీ అందుబాటులో ఉండదు. సాధారణ కార్డుల మాదిరిగా దీనికి దరఖాస్తు చేయలేము. నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కేవలం లక్ష మందికి మాత్రమే ఈ కార్డు ఉంది. భారత్ లో అయితే కేవలం 200 మంది దగ్గర మాత్రమే ఈ కార్డు ఉందని చెబుతున్నారు. ఇది 2013లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది.రూ.10 కోట్లు ఖర్చు చేసే సామర్థ్యం ఉండాలిఅమెక్స్ బ్లాక్ కార్డు ఆహ్వానం ద్వారా మాత్రమే ఇస్తారు. అది కూడా చాలా అధిక ఆదాయం, ఖర్చు అలవాట్లు ఉన్నవారికి. అర్హత సాధించాలంటే రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసే సామర్థ్యం ఉండాలి. దీన్నిబట్టి ఈ కార్డు కేవలం ధనవంతుల కోసమేనని స్పష్టమవుతోంది. అమెరికన్ ఎక్స్ ప్రెస్ సెంచూరియన్ కార్డ్‌తో ప్రపంచ స్థాయి హోటళ్లలో బస, ప్రైవేట్ జెట్ సేవలు, ఎయిర్‌పోర్ట్‌లలో వీఐపీ ట్రీట్మెంట్ వంటి అల్ట్రా లగ్జరీ సదుపాయాలు లభిస్తాయి.రూ.లక్షల్లో కార్డు ఫీజుఅమెక్స్ బ్లాక్ కార్డు ఖరీదు మామూలుగా ఉండదు. భారత్‌లో ఈ కార్డ్ ఇనీషియేషన్ ఫీజు రూ.7 లక్షలు, జాయినింగ్ ఫీజు రూ.2.75 లక్షలు ఉంటుంది. వీటికి జీఎస్టీ అదనం. అంటే ఈ క్రెడిట్ కార్డుకు మొదటి ఏడాది చెల్లించాల్సి మొత్తం రూ.11.5 లక్షలు దాటుతుంది. ఇక వార్షిక రుసుము రూ.2.75 లక్షలు జీఎస్టీతో కలుపుకొంటే రూ.3,24,500 అవుతుంది. -
ఇంటికే అందం.. ఇలాంటి ఫ్లోరింగ్..
సాక్షి, సిటీబ్యూరో: శుభ్రం చేయడమెంతో తేలిక. దీర్ఘకాలపు మన్నిక.. ఎలాంటి మరకలైనా తుడవగానే మాయం. నిర్వహణలో కన్పించని సమస్యలు. పైగా ఇంటికే సరికొత్త అందం. ఇలాంటి అనేకానేక ప్రత్యేకతల కారణంగా వెదురు గచ్చు(బ్యాంబూ ఫ్లోరింగ్)కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. భూతాపాన్ని తగ్గించడానికి ప్రపంచం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో.. పర్యావరణ ప్రియుల దృష్టి వెదురు గచ్చు మీద పడింది. ఇతర రకాల కలప కంటే దృఢంగా ఉండటం.. చూడ్డానికి చక్కగా కన్పించడం.. తదితర కారణాలతో వెదురు గచ్చుకి గిరాకీ పెరుగుతోంది. రెండు రకాలు.. వెదురు గచ్చులో ఎలిగెంట్, ఎలైట్ అనే రెండు రకాలు లభిస్తాయి. వీటి తయారీ ప్రక్రియల్లో చాలా తేడా ఉంటుంది. కత్తిరించిన చిన్నచిన్న బ్యాంబూని అతికించేది ఎలిగెంట్ అయితే.. దీనికి భిన్నంగా బ్యాంబూ ఫైబర్‌తో చేసేది ఎలైట్ రకం. ఇదెంతో దృఢంగా ఉంటుంది. మొత్తం మూడు వర్ణాల్లో ఈ కలప లభిస్తుంది. ఆరేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండటం కోసం గచ్చుకి ఆరు లేయర్ల పాలియురేథెన్ కోటింగ్ వేస్తారు. ధర ఎంత? ప్రస్తుతం ఈ తరహా కలపను చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. దీనితో ఇంటిని అలంకరించాలంటే.. చదరపు అడుగుకి రూ.200–350 దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఓ వంద చదరపు అడుగుల గదికి సుమారు రూ.20 వేలు అవుతుందన్నమాట. మార్కెట్లో లభించే ఇతర కలపతో తయారైన ఫ్లోరింగ్ కోసం చదరపు అడుగుకి రూ.300 దాకా అవుతుంది. వెదురు కలపను ఇంట్లో వేయడానికి విడిగా చార్జీలుంటాయి. చదరపు అడుగుకి రూ.15 దాకా తీసుకుంటారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. మీ ఇంట్లో ప్రస్తుతం ఎలాంటి గచ్చు ఉన్నా.. దానిపై బ్యాంబూ ఫ్లోరింగ్‌ను సులువుగా వేసుకోవచ్చు. పైగా ఒక్కరోజులో పని పూర్తవుతుంది. వెదురు గచ్చు ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. దీనిపై గీతలు కన్పించవు. కాలిపోవడమంటూ ఉండదు. కొన్నాళ్ల తర్వాత రంగు వెలిసిపోతుందన్న దిగులక్కర్లేదు. నిర్వహణలో శ్రమపడక్కర్లేదు.బుడతల గదికి ప్రత్యేకం.. సిరాను పీల్చుకునే గుణం వెదురు గచ్చుకి ఉండటం వల్ల.. చాలామంది తమ బుడతల గదుల్లో వాడుతున్నారు. చిన్నారులు కిందపడినా దెబ్బలు తగలవు. హోమ్ థియేటర్లు, పడక గదుల్లోనూ ఈ తరహా గచ్చును కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. సంపన్న గృహాల్లోని బయటి ప్రాంతాల్లోనూ ఈ రకం కలపతో అలంకరిస్తున్నారు. ఉద్యానవనాలు, బాల్కనీలు, స్విమ్మింగ్‌పూల్, పోర్టికోల వద్ద విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం చదరపు అడుగుకి రూ.400 వరకూ అవుతుంది. అన్నిరకాల వాతావరణానికి ఎదురొడ్డి నిలబడం వల్ల వెదురు గచ్చు మీద ప్రత్యేక మక్కువ పెరుగుతోంది. -
Mivi AI Buds: భాష ఏదైనా ‘హాయ్ మివి’ అంటే చాలు..
కన్జూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ మివి కొత్తగా కృత్రిమ మేథ ఆధారిత ఏఐ బడ్స్‌ను ప్రవేశపెట్టింది. సెటింగ్స్ ఏవీ మార్చకుండానే తెలుగు, హిందీ సహా ఎనిమిది భారతీయ భాషలను ఇది అర్థం చేసుకుని, ప్రతిస్పందిస్తుంది. యూజర్ల ప్రాధాన్యతలను గుర్తుపెట్టుకుని, సందర్భానుసారంగా వ్యవహరించేలా దీన్ని రూపొందించినట్లు సంస్థ కో–ఫౌండర్ మిధులా దేవభక్తుని తెలిపారు. 40 గంటల బ్యాటరీ లైఫ్, 3డీ సౌండ్‌స్టేజ్, స్పష్టత కోసం క్వాడ్ మైక్ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ. 6,999గా ఉంటుంది.ఏఐ బడ్స్ లో మివి ఏఐ అనే ప్రొప్రైటరీ వాయిస్ అసిస్టెంట్ ఉంది. "హాయ్ మివి" అంటే చాలు ఈ వాయిస్ అసిస్టెంట్ ప్రతిస్పందిస్తుంది. ఇది ఎనిమిది భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. అవి హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ, కన్నడ, మలయాళం, గుజరాతీ. లాంగ్వేజ్ సెట్టింగ్ ల మార్చుకునే పనిలేకుండానే వినియోగదారులు ఏ భాషలోనైనా ప్రశ్నలు అడగవచ్చు లేదా సహాయాన్ని అభ్యర్థించవచ్చు.అసిస్టెంట్ అవతార్ ల ద్వారా మివి ఏఐ బడ్స్ వివిధ పనులకు సహకారం అందిస్తుంది. ఇవి ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్.🔸జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు గురు అవతార్ సమాధానాలు చెబుతుంది.🔸ఇంటర్వ్యూవర్ అవతార్ మాక్ ఇంటర్వ్యూలు, ఫీడ్ బ్యాక్ అందిస్తుంది.🔸చెఫ్ అవతార్ వంట చేయడంలో మార్గనిర్దేశం చేస్తుంది.🔸వెల్ నెస్ కోచ్ అవతార్ సంభాషణల సమయంలో యూజర్ ఇన్ పుట్ లకు స్పందిస్తుంది.🔸న్యూస్ రిపోర్టర్ అవతార్ యూజర్ ఆసక్తుల ఆధారంగా న్యూస్ అప్ డేట్స్ అందిస్తుంది.🔸గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న మివి ఏఐ యాప్ ద్వారా యూజర్లు ఏఐ సెట్టింగ్స్, ఫీచర్లను మేనేజ్ చేసుకోవచ్చు. -
బంగారం ధరలు తగ్గనున్నాయా?
రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలతో కొనుగోలుదారులు బేజారవుతున్నారు. తులం (10 గ్రాములు) పసిడి ఇప్పటికే లక్ష రూపాయాలకు అటు ఇటుగా ధర పలుకుతోంది. ఈ క్రమంలో పసిడి ప్రియులకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చల్లని కబురు చెప్పింది. రానున్న నెలల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ, వాణిజ్య ప్రమాదాలు తగ్గితే బంగారం ధర మధ్యంతర బలహీనతను అనుభవించవచ్చు లేదా యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ పెరిగితే అధిక అవకాశాల వ్యయాలను అనుభవించవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోలు, రిటైల్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ మందగించడం కూడా మధ్యకాలిక బంగారం ధర సర్దుబాటుకు దారితీస్తుందని డబ్ల్యూజీసీ తెలిపింది.రూ.లక్షకు అంచున బంగారందేశంలో ప్రస్తుతం బంగారం 10 గ్రాముల ధర (24 క్యారెట్లు) రూ.99,860 వద్ద కొనసాగుతోంది. ఇటీవలి గోల్డ్ బుల్ రన్ విపరీతమైన దృష్టిని ఆకర్షించింది. 2022 నవంబర్ 3న పడిపోయిన తరువాత నుండి బంగారం ధర రెట్టింపు అయింది. ఔన్సుకు 1,429 డాలర్ల నుండి 3,287 డాలర్లకు ఎగిసింది. అంటే ఏడాదికి 30% చొప్పున పెరుగుతూ వచ్చింది. ఓ వైపు కేంద్ర బ్యాంకు కొనుగోళ్లతో పాటు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇటీవలి వాణిజ్య అనిశ్చితులు దీనికి కారణమవుతున్నాయి.బంగారం ధర ఎప్పకప్పుడు కొత్త గరిష్టాలను తాకుతుండటంతో ఇన్వెస్టర్లు రిస్క్ ల పట్ల అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో బంగారం ధరల్లో మునుపటి ఒడిదుడుకులను అధ్యయనం చేసిన మీదట మధ్య లేదా ధీర్ఘకాలిక క్షీణతకు దారితీసిన సందర్భాలు కనిపించాయి. అయితే "మేము వీటిని పరిగణనలోకి తీసుకోనప్పటికీ, దీర్ఘకాలిక ఉపసంహరణలు మరింత స్థిరమైన, నిర్మాణాత్మక డిమాండ్ మార్పుల నుండి రావచ్చు. ఇది సంస్థలు, రిటైల్ పెట్టుబడిదారుల నుండి బంగారం పెట్టుబడి డిమాండ్‌లో గణనీయమైన క్షీణతకు, సరఫరాలో వేగవంతమైన పెరుగుదలకు దారితీస్తుంది" అని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది. -
ఉద్యోగం చేసేందుకు ఈ కంపెనీ మంచి చోటు
ఉద్యోగం చేసేందుకు భారత్‌లో అత్యుత్తమ కంపెనీల్లో ఒకటిగా ఆర్థిక సేవల దిగ్గజం మెట్‌లైఫ్‌కు ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ ఇండియా గుర్తింపు లభించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం మీద 100 టాప్ కంపెనీల జాబితాలో ఆరో స్థానం, బీమా రంగంలో అగ్రస్థానాన్ని కంపెనీ దక్కించుకుంది.ప్రతి ఒక్కరు ఎదిగేందుకు, అత్యుత్తమంగా రాణించేందుకు తోడ్పాటునిచ్చే సంస్కృతిని తమ సంస్థలో అమలు చేస్తున్నామని, దానికి ఈ గుర్తింపు లభించడం సంతోషకరమైన విషయమని మెట్‌లైఫ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆశీష్ శ్రీవాస్తవ తెలిపారు. ఉద్యోగుల అభిప్రాయాలు, సిబ్బంది విషయంలో కంపెనీ పాటించే విధానాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఈ జాబితాను రూపొందిస్తుంది.ఫిలిం స్కూల్స్ విద్యార్థులకు స్క్రీన్ అకాడెమీ ఫెలోషిప్‌లు ఫిలిం ఇనిస్టిట్యూట్స్లోని ప్రతిభావంతులైన పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఫెలోషిప్లను అందించే దిశగా స్క్రీన్ అకాడెమీ ఏర్పాటైంది. లోధా ఫౌండేషన్‌కి చెందిన అభిషేక్ లోధా వితరణతో స్క్రీన్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ దీన్ని ఏర్పాటు చేశాయి.ఫిలిం ఇనిస్టిట్యూట్స్ నామినేట్ చేసిన, ఆర్థిక వనరులు అంతగాలేని విద్యార్థులకు స్క్రీన్ అకాడెమీ వార్షికంగా ఫెలోషిప్‌లు అందిస్తుంది. రసూల్ పోకుట్టి, గునీత్ మోంగా లాంటి ప్రముఖులు మెంటార్లుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం పుణెలోని ఎఫ్టీఐఐ, కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిలిం అండ్ టీవీ ఇనిస్టిట్యూట్, ముంబైలోని విజ్లింగ్ ఉడ్స్ ఇంటర్నేషనల్‌తో అకాడెమీ జట్టు కట్టగా, ఇతర ఇనిస్టిట్యూట్స్కి కూడా దీన్ని విస్తరించనున్నారు. -
ఇల్లు కొంటున్నారా?.. ఇలాంటి లొసుగులతో జాగ్రత్త!
మనకు నచ్చే ఫ్లాట్ దొరికేంత వరకూ నగరం నలుమూలలా తిరుగుతాం. రుణమెంత వస్తుందో ముందే బ్యాంకర్లతో చర్చించి, ఆర్థిక పరిమితులు దాటకుండా జాగ్రత్తపడతాం. కోరుకున్న ఫ్లాట్ దొరికితే చాలు.. అడ్వాన్స్ అందజేసి బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటాం. మరి ఈ పత్రంలో ఏముందో.. ఏయే అంశాల్ని పేర్కొన్నారో తెలుసుకోవాలి. లేదంటే సొంతింటి ఆనందనానికి దూరమైనట్లే. – సాక్షి, సిటీబ్యూరోస్థిరాస్తుల కొనుగోలులో అతి కీలకమైన విషయం అమ్మకందారుడితో కుదుర్చుకునే ఒప్పందమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇళ్ల విషయంలో బిల్డర్‌తో జాగ్రత్తగా ఉండాలి. జీవిత కాలపు కష్టార్జితానికి తోడు, బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మరీ సొమ్ము చెల్లిస్తాం. తీరా కొనుగోలు చేశాక, న్యాయపరమైన చిక్కులున్నాయనో, ఇంటిపై అప్పు ఉందనో తేలితే.. ఎంత నష్టం? ఇలాంటి లొసుగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అన్ని రకాలుగా పక్కగా ఉందని తేలాకే కొనుగోలుపై ముందడుగు వేయాలి. హక్కుల చిక్కులు, ఆర్థిక ఇబ్బందులను నివారించడానికి కొన్ని సూత్రాలివి..మొత్తం విలువెంత? ఇంటి విలువ ఎంతన్నది కేవలం భవనానికే పరిమితమైన అంశం కాదు. ఇందులో అనేక ఇతర ఖర్చులు కలుస్తాయి. విద్యుత్, తాగునీరు, పార్కింగ్, వివిధ రకాల పన్నులతో పాటు రిజిస్ట్రేషన్ వంటి ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ మొత్తం విలువలో కలిసి ఉండొచ్చు. లేదంటే విడిగా ఉండొచ్చు. కాబట్టి ఈ ఖర్చులన్నీ మొత్తం విలువలో ఉండేలా చూసుకోండి. ఏం చేయాలి? ఇతర రుసుములు ఏమైనా ఉన్నాయేమో అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ విషయంలో రియల్టీ లావాదేవీల్లో అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. అభ్యంతరాలుంటే.. బిల్డర్‌ను సంప్రదించడం ద్వారా ఆ విషయాల్ని సరిదిద్దుకోవచ్చు. వాస్తవ ప్లాన్‌కు భిన్నంగా మార్పులు చేయాల్సి వస్తే.. అదనపు రుసుములు చెల్లించారా? సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతి అవసరమా.. వంటి విషయాల్ని బిల్డర్‌తో చర్చించి ఒక నిర్ణయానికి రావాలి.నిర్మాణం జాప్యమైతే? నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు..? ఇంటిని అప్పగించేదెప్పుడు అనే విషయాలు ముందే స్పష్టంగా తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో మాంద్యం దెబ్బ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చాలా ప్రాజెక్టుల్లో నిర్మాణాలు ఆలస్యమయ్యాయి. ఇలా జరగడం వల్ల ఓవైపు ఈఎంఐలు కట్టలేక, మరోవైపు ఇంటి అద్దె చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి అవుతుంది, ఎప్పటిలోగా ఫ్లాటను అప్పగించే విషయంపై బిల్డర్‌తో పత్రంలో రాయించుకోండి.ఏం చేయాలి? పనులు మొదలయ్యాక నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆలస్యమవుతుంటే బిల్డర్‌ను కలిసి మాట్లాడండి. పనుల పురోగతికిది దోహదం చేయొచ్చు. అదే ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేసినవారితో ఓ సొసైటీని ఏర్పాటు చేయండి. ఫలితంగా బిల్డర్ వైపు నుంచి ఆలస్యం జరిగితే, గట్టిగా అడగడానికి వీలవుతుంది. -
స్టాక్మార్కెట్లో కొత్త ఇండెక్స్ ప్రారంభం
బీఎస్ఈ అనుబంధ సంస్థ అయిన ఏషియా ఇండెక్స్ తాజాగా బీఎస్ఈ ఇన్సూరెన్స్ పేరిట కొత్త సూచీని ప్రారంభించింది. బీఎస్ఈ 1000 ఇండెక్స్‌లోని బీమా రంగం కింద వర్గీకరించిన సంస్థలు ఈ సూచీలో ఉంటాయి. దీని బేస్ వేల్యూ 1000గా, తొలి వేల్యూ డేట్ 2018 జూన్ 18గా ఉంటుంది. వార్షికంగా రెండు సార్లు (జూన్, డిసెంబర్) ఈ సూచీలో మార్పులు, చేర్పులు చేస్తారు. ప్యాసివ్ వ్యూహాలను పాటించే ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్లకు ఇది ప్రామాణికంగా ఉంటుంది. ప్రాంతీయ భాషల్లో సీడీఎస్ఎల్ ఐపీఎఫ్ పోర్టల్ పెట్టుబడులపై ఇన్వెస్టర్లలో అవగాహన పెంపొందించేందుకు సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (సీడీఎస్ఎల్ ఐపీఎఫ్) తాజాగా ప్రాంతీయ భాషల్లో ఆన్లైన్ ప్లాట్‌ఫాంను ప్రా రంభించింది. ఇందులో తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ తదితర 12 భాషల్లో కంటెంట్ ఉంటుంది.తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్న వారితో పాటు పెట్టుబడులు పెట్టాలనే అలోచనతో ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని భావి ఇన్వెస్టర్లకు కూడా ఈ వెబ్సైట్ ఉపయోగకరంగా ఉంటుంది. సీడీఎస్ఎల్ఐపీఎఫ్డాట్కామ్లోని ఈ కంటెంట్‌ను ఉచితంగా పొందవచ్చని సంస్థ సెక్రటేరియట్ సుధీష్ పిళ్లై తెలిపారు. -
జియో మరో సంచలనం.. ఇక టీవీనే కంప్యూటర్!
ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం మరో సంచలనంతో ముందుకొచ్చింది. తక్కువ ధరలో డిజిటల్ ఉపకరణాలు కోరుకునే వినియోగదారులకు జియో ప్లాట్ఫాంస్ జియో పీసీ (JioPC) పేరుతో కొత్త ఆవిష్కరణను తెచ్చింది. ఇది ఒక క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ సర్వీసుగా పనిచేస్తూ మీ టీవీని పూర్తి స్థాయి కంప్యూటర్‌గా మార్చుతుంది.ఈ ఏఐ (AI) ఆధారిత వర్చువల్ కంప్యూటింగ్ సర్వీస్ జియో సెట్-టాప్ బాక్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు కీబోర్డ్, మౌస్‌ని ప్లగ్ఇన్ చేసి తమ టీవీలో డెస్క్‌టాప్ అనుభవాన్ని పొందవచ్చు. అయితే ప్రస్తుతానికి కెమెరాలు, ప్రింటర్లు వంటి పరికరాలకు ఇది సపోర్ట్ చేయదు.ధర, లభ్యతజియోపీసీ ప్రస్తుతానికి ఉచిత ట్రయల్ ద్వారా ఎంపిక చేసిన వినియోగదారులకు అందిస్తోంది. పూర్తిగా పొందాలంటే రూ.5,499 చెల్లించి జియో బ్రాడ్‌బ్యాండ్‌తో పొందవచ్చు. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలను లక్ష్యంగా తీసుకుంటూ, కంప్యూటింగ్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నారు. క్లౌడ్ ఆధారిత కంప్యూటర్ను తీసుకొస్తున్నట్లు జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ గత మార్చిలోనే వెల్లడించారు.ఫీచర్లు, వినియోగం ఇలా..జియో వెబ్సైట్లో పేర్కొన్నదాని ప్రకారం.. లైబ్రేఆఫీస్ (LibreOffice) అనే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లాంటి ఓపెన్-సోర్స్ ఆఫీస్ సూట్‌ను దీంట్లో ప్రీఇన్‌స్టాల్ చేసిఉంటారు. దీని ద్వారా బ్రౌజింగ్ చేసుకోవచ్చని, విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు, ఇతర అసవసరాలకు వినియోగించుకోవచ్చని వెబ్సైట్లో పేర్కొన్నారు. ఇక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్‌లను విడి బ్రౌజర్ ద్వరా ఉపయోగించవచ్చు. క్లౌడ్ ఆధారిత నిర్వహణ వల్ల మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఏమీ ఉండదు. -
ఇన్వెస్టర్లూ.. జాగ్రత్త! స్టాక్ ఎక్స్ఛేంజీల హెచ్చరికలు
ఆన్లైన్ బాండ్ ప్లాట్‌ఫామ్స్ ప్రొవైడర్లపట్ల అప్రమత్తత అవసరమని స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా ఇన్వెస్టర్లను హెచ్చరించాయి. ఇటీవల ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ వెలుగులో నిలుస్తున్న నేపథ్యంలో ఎక్స్ఛేంజీల హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీటి ద్వారా వివిధ రకాల నిర్ధారిత ఆదాయ బాండ్ల (ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్) కొనుగోలు సులభతరమవుతున్న కారణంగా జాగ్రత్త వహించమని తెలియజేశాయి.వీటి ద్వారా పెట్టుబడులు చేపట్టేముందు పలు కీలక అంశాలను పరిశీలించవలసి ఉన్నదంటూ రెండు ఎక్స్ఛేంజీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. బాండ్ల క్రెడిట్ రేటింగ్, తిరిగి చెల్లింపుల్లో బాండ్ల జారీదారుల ట్రాక్ రికార్డ్, బాండ్ల లిక్విడిటీ, సెటిల్మెంట్ గడువు, పన్ను ప్రభావం తదితర పలు అంశాలను పరిగణించమంటూ సూచించాయి.ప్రధానంగా బాండ్ పాల్ట్‌ఫామ్.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద రిజిస్టరైనదీ లేనిదీ తప్పనిసరిగా పరిశీలించవలసి ఉన్నట్లు తెలియజేశాయి. నిజానికి క్రెడిట్ రేటింగ్ ఆధారంగా బాండ్లలో పెట్టుబడులపై రిసు్కలు, రిటర్నులు నమోదవుతాయని వివరించాయి. -
బజాజ్ పల్సర్ ఎన్150 ఇక కనుమరుగు!
ఎంతో పాపులర్ అయిన బజాజ్ పల్సర్ ఎన్150 ఇక కనుమరుగు కానుంది. ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవల భారత మార్కెట్ కోసం పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ ను అప్ డేట్ చేసింది. అయితే ఈ బ్రాండ్ నిశ్శబ్దంగా పల్సర్ ఎన్ 150 ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. పల్సర్ ఎన్ 160 కింద ఉన్న ఈ బైక్ ను బ్రాండ్ అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించారు. దీన్ని వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారన్నది తెలియరాలేదు.అత్యంత ఆదరణ ఉన్న పల్సర్ లైనప్‌లో రెండు 150 సీసీ పల్సర్లు ఉండేవి. వీటిలో ఒకటి క్లాసిక్ పల్సర్ 150 కాగా మరొకటి పల్సర్ ఎన్ 150. క్లాసిక్ పల్సర్ 150కు అప్డేటెడ్ స్పోర్టీ లుక్‌తో పల్సర్ ఎన్ 150 బైక్‌ను తీసుకొచ్చారు. డిజైన్, లుక్ పల్సర్ ఎన్ 160 మాదిరిగానే ఉన్న ఈ బైక్ కొనుగోలుదారులలో ఆదరణ పొందిన ఎంపికగా కొనసాగుతోంది.పల్సర్ ఎన్ 150 స్పెక్స్ విషయానికి వస్తే.. సొగసైన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ దీనికి ఉంది. ఇది ప్రసిద్ధ పల్సర్ హెడ్ ల్యాంప్స్ అధునాతన వెర్షన్ ను సూచిస్తుంది. అంతేకాకుండా మస్కులార్ ఇంధన ట్యాంక్ దీనిస్పోర్టీ వెయిస్ట్లైన్కు భిన్నంగా ఉంటుంది. ఎన్ 160లో ఉన్నట్టుగానే డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్, ఫ్యూయల్ ట్యాంక్ పై యూఎస్బీ పోర్ట్, స్పీడోమీటర్ ఉన్నాయి.పల్సర్ ఎన్ 150 బైకులో 149.68 సీసీ, ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఉంది. ఇది 14.5బిహెచ్ పి పవర్, 13.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో వస్తున్న ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, సస్పెన్షన్ కోసం వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ను కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం, స్పోర్ట్ బైక్ ముందు భాగంలో సింగిల్-ఛానల్ ఎబిఎస్ తో కూడిన 240 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ ను అమర్చారు. -
ఒక్క ఏడాదిలో భారీగా పెరిగిన లీజులు
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరం(హెచ్1)లో 2.68 కోట్ల చ.అ. స్థలం లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంలో జరిగిన 1.90 కోట్ల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఏడాది కాలంలో ఏకంగా 40 శాతం లీజులు పెరిగాయి.అలాగే 2025 హెచ్1లో టాప్–7 నగరాలలో కొత్తగా 2.45 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. గతేడాది హెచ్1లో సప్లయి అయిన 1.96 కోట్ల చ.అ.తో పోలిస్తే ఏడాది కాలంలో 25 శాతం సరఫరా పెరిగిందని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో 2025 హెచ్1లో 42 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది.గతేడాది హెచ్1లో 31.2 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే 35 శాతం లావాదేవీలు పెరిగాయి. ఇక, ఇదే సమయంలో గ్రేటర్లో కొత్తగా 47 లక్షల చ.అ. ఆఫీసు స్థలం సరఫరా అయింది. 2024 హెచ్1లో సప్లయి అయిన 56.8 లక్షల చ.అ. స్పేస్‌తో పోలిస్తే ఏడాది కాలంలో సరఫరా 17 శాతం మేర తగ్గింది. -
ఎయిర్టెల్ రీచార్జ్‌పై 25% క్యాష్ బ్యాక్.. ఇలా చేస్తే..
దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన ఎయిర్టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సేవలతో పాటు, బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను కూడా అందిస్తోంది. మొబైల్ టారిఫ్‌లు పెరిగిన నేపథ్యంలో మీరు మొబైల్ రీఛార్జ్, బ్రాడ్ బ్యాండ్ బిల్లు లేదా డిటిహెచ్ రీఛార్జ్ పై ఆదా చేయాలనుకుంటే మీకో చక్కటి మార్గం ఉంది. దీని ద్వారా ప్రతి రీఛార్జ్ పైనా 25 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చని మీకు తెలుసా?యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. దీని సాయంతో రీఛార్జ్ వంటి యుటిలిటీ చెల్లింపులపై బంపర్ క్యాష్ బ్యాక్ పొందడం ఈ కార్డు ప్రత్యేకత. మీరు ఎయిర్టెల్ రీఛార్జ్‌లలో డబ్బులు ఆదా చేయాలనుకుంటే, ఈ కార్డు మీకు సరైన ఎంపిక. దీనితో ఇతర కంపెనీల రీఛార్జ్ లపై కూడా డిస్కౌంట్లు పొందవచ్చు.25 శాతం క్యాష్ బ్యాక్ పొందండిలా..ఈ క్యాష్ బ్యాక్ కోసం యూజర్లు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వరా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రీఛార్జ్ కోసం ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లించినట్లయితే ఫ్లాట్ 25 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అదే సమయంలో ఇతర రీఛార్జ్ లపై కూడా 10 శాతం క్యాష్ బ్యాక్ ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ 60 రోజుల్లో ప్రాసెస్ అయి నేరుగా క్రెడిట్ స్టేట్ మెంట్ లో ప్రతిబింబిస్తుంది. -
హైదరాబాద్‌లో సొంతింటి కోసం రాజీ పడాల్సిందేనా?
విషయం ఏదైనా సరే.. కోరుకున్నవన్నీ దొరక్కపోవచ్చు. ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు. ఇళ్ల కొనుగోలుకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. బడ్జెట్, చిక్కుల్లేని యాజమాన్య హక్కు, ప్రాంతం, వాస్తు, నీరు, విద్యుత్తు సరఫరా అంశాలు ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే వీటిలో కొన్ని అంశాలు మనం ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలంటే సొంతింటి స్వప్నం ఓ పెద్ద సవాలే అవుతుంది. అలాగనీ ముఖ్యమైన అంశాల్లోనూ రాజీపడాలని కాదు. ప్రాధాన్యత క్రమంలో ఒకటి, రెండు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏయే విషయాల్లో రాజీ పడొచ్చు. ఎక్కడ పడకూడదో స్పష్టత ఏర్పర్చుకోవాలి. - సాక్షి, సిటీబ్యూరోప్రాంతమెక్కడ? ఇల్లు కొనాలన్న ఆలోచనలో ఉన్నారా? అది కూడా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అనుకుంటున్నారా? ఇక్కడ వీలవ్వకపోతే మియాపూర్, మదీనాగూడ, మణికొండ, ఓయూ కాలనీ తదితర ప్రాంతాల్లో.. కొంచెం తక్కువ ధరలో దొరికే ప్రాంతాలపై దృష్టి పెడతారు అవునా? ప్రస్తుత రియల్టీ మార్కెట్లో సంపన్నులకే కాదు మధ్యతరగతి, సామాన్యులు.. ఇలా వివిధ వర్గాల వారికి స్తోమతకు తగ్గ బడ్జెట్లో నగరం చుట్టూ గృహసముదాయాలు వస్తున్నాయి. మీరు కొంచెం కసరత్తు చేసి, చుట్టుపక్కల ప్రాంతాల్ని అన్వేషిస్తే చాలు, మీకు అందుబాటు ధరలో ఇళ్లు ఎక్కడ దొరికేది ఇట్టే తెలిసిపోతుంది. సదుపాయాల సంగతేంటి? నిర్మాణాల విషయంలో డెవలపర్ల వ్యూహం మారింది. సకల సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇల్లు కొనాలన్న నిర్ణయానికొచ్చాక సదుపాయాల సంగతి కూడా ఆలోచించాలి. క్లబ్‌హౌజ్, జిమ్ అవసరమా? వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే ఈ సదుపాయాలు అక్కర్లేదా? అన్నది తేల్చుకోవాలి. జీవనశైలి, బడ్జెట్ తదితర అంశాలు మీ నిర్ణయంపై ప్రభావితం చేస్తాయి. కాబట్టి సదుపాయాల విషయంలో స్పష్టత ఉండాలి. బిల్డర్‌కు మంచి పేరుందా? స్థిరాస్తి కొనేటప్పుడు బిల్డర్ గురించి కూడా ఆరా తీయాలి. మార్కెట్లో పేరున్న బిల్డర్లు నిర్మించే ఇళ్లకే ప్రాధాన్యమివ్వాలి. గతంలో అతను నిర్మించిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యాయా? నిర్మాణమెలా ఉంది? ఒప్పందం మేరకు కొనుగోలుదారులకు సదుపాయాలు కల్పించాడా? కార్పస్ ఫండ్ బదిలీలో ఇబ్బందులేమైనా సృష్టించాడా? అన్న విషయాల్ని తెలుసుకోవాలి. నిర్మాణాల్లో మంచి చరిత్ర లేని బిల్డర్లకు దూరంగా ఉండటమే మేలు. అలాగనీ మార్కెట్లో పేరున్న బిల్డర్ల ప్రాజెక్టులకే పరిమితం కానక్కర్లేదు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఒప్పందానికి కట్టుబడి ఉండేవారిని ఎంచుకోవచ్చు. పరిసరాలెలా ఉన్నాయి? ఇంటి ముందు పచ్చటి తోటతో ఆహ్లాదభరిత వాతావరణం ఉండాలని కొందరు కోరుకుంటారు. మరికొందరేమో హంగులు లేకున్నా సర్దుకుపోతారు. బాల్కనీని పచ్చగా, అందంగా అలంకరించుకుంటే గార్డెన్‌కు ధీటుగా ఉంటుందని భావిస్తారు. కాబట్టి ఈ విషయంలో మీ దృక్పథం ఏమిటో నిర్ణయించుకోవాలి. -
హైదరాబాద్‌లో ‘ఉత్తరప్రదేశ్’ రోడ్‌షో
పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ‘ఉత్తర ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో’ (యూపీఐటీఎస్) 2025 కోసం హైదరాబాద్‌లో తాజాగా రోడ్ షో నిర్వహించింది. ఈ మెగా ఈవెంట్‌పై అవగాహన, ఆకర్షణ పెంచడానికి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో రోడ్ షో చేపట్టింది.తొలుత ఢిల్లీతో మొదలు పెట్టిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తర్వాత హైదరాబాద్‌లో ఈ రోడ్ షో నిర్వహించింది. నగరంలో జరిగిన కార్యక్రమంలో 150 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలు, ఎగుమతిదారులు, సోర్సింగ్ కన్సల్టెంట్లు, వాణిజ్య సంస్థలు పాల్గొన్నాయి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్ పో సెంటర్ అండ్ మార్ట్ లో సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు జరగనున్న యూపీఐటీఎస్ 2025కు ఊపును పెంచడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ఈ సందర్బంగా నగరంలోని టీసీసీఐలో జరిగిన కార్యక్రమంలో యూపీ ఎంఎస్ఎంఈ క్యాబినెట్ మంత్రి రాకేష్ సచన్, ఆ రాష్ట్ర పరిశ్రమల అడిషనల్ కమిషనర్ రాజ్ కమల్ యాదవ్, టీసీసీఐ అధ్యక్షుడు సురేష్ కుమార్ సింఘాల్, ఐఈఎంఎల్ సీఈవో సుదీప్ సర్కార్ తదితరులు ప్రసంగించారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన ఇండియా ఎక్స్పోజిషన్ మార్ట్ లిమిటెడ్ (ఐఈఎంఎల్) సహకారంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యూపీఐటీఎస్ 2025ను నిర్వహిస్తోంది. బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ లలో రోడ్ షోలు ప్లాన్ చేస్తున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏం చేసింది.. ఆర్బీఐ చర్యలెందుకు?
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు చేపట్టింది. రూ .4.88 లక్షలు జరిమానా విధించినట్లు ప్రకటించింది. తన క్లయింట్‌కు టర్మ్ లోన్ మంజూరు చేసేటప్పుడు 'మాస్టర్ డైరెక్షన్ - ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా' నిబంధనలను విస్మరించిందని, అందుకు గానూ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) సెక్షన్ 11 (3) నిబంధనల ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.నిబంధనల ఉల్లంఘనలపై నిఆర్బీఐ షోకాజ్ నోటీసు జారీ చేయగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చిందని, మౌఖిక సమర్పణలు కూడా చేసిందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కేసు వాస్తవాలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పందనను పరిగణనలోకి తీసుకుని జరిమానా విధించాలని ఆర్బీఐ నిర్ణయించింది.శ్రీరామ్ ఫైనాన్స్‌కూ జరిమానా డిజిటల్ లెండింగ్ సంబంధిత నిబంధనలను పాటించనందుకు బ్యాంకింగేతర ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్బీఎఫ్సీ) అయిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పైనా రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. ఆర్బీఐ జారీ చేసిన "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (డిజిటల్ లెండింగ్) ఆదేశాలు, 2025" లోని కొన్ని నిబంధనలను పాటించనందుకు ఆర్బీఐ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై రూ .2.70 లక్షల జరిమానా విధించింది.2024 మార్చి 31 నాటికి శ్రీరామ్ ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆర్బీఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం, సంబంధిత ఉత్తరప్రత్యుత్తరాల ఆధారంగా, ఆ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు బ్యాంక్ తెలిపింది.రుణగ్రహీతలు నేరుగా రుణ చెల్లింపులను కంపెనీ ఖాతాలో జమ చేయడానికి బదులుగా థర్డ్ పార్టీ ఖాతా ద్వారా రుణ చెల్లింపులను కంపెనీ మళ్లించిందని ఆర్బీఐ తన తనిఖీలో గుర్తించింది. దీంతో శ్రీరామ్ ఫైనాన్స్‌కు జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. -
అనంత్ అంబానీ-రాధికల పెళ్లి రోజు నేడు
-
అమెజాన్లోనే కొంటున్నారా? అమ్మో జాగ్రత్త!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో ప్రస్తుతం ప్రైమ్ డే సేల్ 2025 నడుస్తోంది. జూలై 12-14 వరకు అమ్మకాలు జరుగుతుండగా దీనికి సంబంధించిన హడావుడి నాలుగు రోజుల ముందు హడావుడి ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 కోసం ఓ వైపు కొనుగోలుదారులు సిద్ధమవుతుండగా, ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కూడా వినియోగదారులను మోసం చేసేపనిలో పడ్డారు.అమెజాన్ లానే 1000 సైట్లుమెరుపు డీల్స్, డిస్కౌంట్ల కోసం లక్షలాది మంది లాగిన్ అవుతారని భావిస్తున్న నేపథ్యంలో ఈ షాపింగ్ ఉత్సుకత ఆన్లైన్ మోసాలకు తెరలేపుతుందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెక్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, అమెజాన్‌ను పోలిన 1,000 కొత్త వెబ్సైట్లు 2025 జూన్‌లో నమోదయ్యాయి. వీటిలో 87% అనుమానాస్పదమైనవి లేదా పూర్తిగా హానికరమైనవిగా గుర్తించారు. ఈ సారూప్య డొమైన్లు చిన్న అక్షర తేడాలు లేదా ".టాప్" లేదా ".ఆన్వైన్" వంటి అసాధారణ ఎక్స్టెన్షన్లను కలిగి ఉంటాయి. ఇలా వినియోగదారులను నమ్మించి మోసగించడానికే వీటిని రూపొందించినట్లు కనిపిస్తోంది.వినియోగదారులను మోసగించడానికి స్కామర్లు సాధారణంగా రెండు ప్రధాన ట్రిక్స్పై ఆధారపడతారు. అవి ఒకటి నకిలీ వెబ్సైట్లు, రెండోది ఫిషింగ్ ఈమెయిల్స్. అమెజాన్ చెక్అవుట్ లేదా లాగిన్ పేజీలను అనుకరించడానికి నకిలీ డొమైన్లు సృష్టిస్తున్నారు. అవి మొదటి చూసినప్పుడు అసలైన వెబ్సైట్ల లాగానే అనిపిస్తాయి. దీంతో వీటి ద్వారా కొనగోళ్లకు ప్రయత్నిస్తే మొత్తానికి మోసం వస్తుంది. పాస్వర్డ్లు, ఇతర వివరాలు కూడా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది.ఇక మరో మార్గంలో "రీఫండ్ డ్యూ" లేదా "అకౌంట్ ప్రాబ్లమ్" వంటి విషయాలతో ఫిషింగ్ ఈమెయిల్స్ ఉన్నాయి. ఈ సందేశాలు మామూలుగా అమెజాన్ సపోర్ట్ టీమ్ నుండే వచ్చినట్లు అనిపిస్తాయి. అక్కడ కనిపించిన లింక్‌లను క్లిక్ చేస్తే స్కామ్ వెబ్సైట్లకు దారితీసే అవకాశం ఉంది. ప్రైమ్ డే సందర్భంగా కొనుగోలుదారులు హడావుడిగా ఉంటారని సైబర్ నేరగాళ్లకు తెలుసు. వారు మీ అత్యవసరతను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు.కొన్ని జాగ్రత్తలుసురక్షితంగా ఉండటానికి నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. ఇవి సాధారణమైనవే కానీ శక్తివంతమైనవి. అవి..అధికారిక అమెజాన్ యాప్ లేదా వెబ్సైట్లో మాత్రమే షాపింగ్ చేయండిమీ ఖాతాను అప్డేట్ చేయమని లేదా రీఫండ్ క్లెయిమ్ చేయమని కోరే ఈమెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.ఆకర్షణీయంగా అనిపించే ఫ్లాష్ డీల్స్ జోలికి పోవద్దు.టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి.మీ సాఫ్ట్వేర్, బ్రౌజర్లను అప్డేట్ చేసుకోండి. -
తెలంగాణ కోసం ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులు
హైదరాబాద్: తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల కోసం ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులను ప్రవేశపెట్టినట్లు ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎం/ఎన్ఎస్ ఇండియా) వెల్లడించింది. ఆప్టిగల్ ప్రైమ్, ఆప్టిగల్ పినకిల్ వీటిలో ఉన్నట్లు వివరించింది.తుప్పు నుంచి మూడు రెట్లు అధిక రక్షణ కల్పించేలా ఇవి ఆరు వేరియంట్స్‌లో ఉంటాయి. దేశీయంగా, ముఖ్యంగా దక్షిణాదిన కలర్ కోటెడ్ ఉక్కు ఉత్పత్తుల విభాగంలో గణనీయంగా మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ డైరెక్టర్ రంజన్ ధర్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ మార్కెట్ 3.4 మిలియన్ టన్నులుగా ఉండగా, దక్షిణాది మార్కెట్ వాటా సుమారు 0.6 మిలియన్ టన్నులుగా ఉంటుందని పేర్కొన్నారు.హైదరాబాద్ కంపెనీకి ఇన్నోవేషన్ లీడర్షిప్ అవార్డుహైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీప్‌టెక్ ఆవిష్కరణలతో పంటల సంరక్షణ ఉత్పత్తులపై కృషి చేస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మకమైన ఇన్నోవేషన్ లీడర్షిప్ అవార్డ్ పురస్కారం లభించినట్లు ఏటీజీసీ బయోటెక్ సంస్థ వెల్లడించింది. అగ్రికల్చర్ టుడే నిర్వహించిన 16వ అగ్రికల్చర్ లీడర్షిప్ సదస్సులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ దీన్ని ప్రదానం చేసినట్లు వివరించింది.తమ సంస్థకు 26 పేటెంట్లు, 50కి పైగా ఉత్పత్తులు ఉన్నట్లు కంపెనీ చైర్మన్ మార్కండేయ గోరంట్ల, ఈడీ వీబీ రెడ్డి తెలిపారు. బియ్యం, పత్తి తదితర పంటల్లో ఫెరోమోన్ టెక్నాలజీని విస్తరించడంలో తమ కంపెనీని కేస్ స్టడీగా పరిగణించవచ్చని 2024లో ప్రపంచ ఆర్థిక ఫోరం సైతం సూచించినట్లు పేర్కొన్నారు.ఎన్ఎండీసీ గనులకు 5 స్టార్ రేటింగ్మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీకి చెందిన గనులకు ప్రతిష్టాత్మక 5 స్టార్ రేటింగ్ లభించింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను చత్తీస్‌గఢ్‌లోని మూడు ఇనుప ఖనిజ గనులకు, కర్ణాటకలోని ఒక గనికి ఇది లభించినట్లు సంస్థ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు. పర్యావరణ అనుకూల విధంగా మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించడంలో తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని ముఖర్జీ చెప్పారు. కేంద్ర గనుల శాఖ, ఐబీఎం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ పురస్కారాన్ని అందించారు. -
ఐటీ రంగంలో అసాధారణ విజయాన్ని సాధించిన ఎన్వీడియా కంపెనీ
-
అమెరికాలో అపర కుబేరులు మనవాళ్లే..
విదేశాల్లో పుట్టి అమెరికాలో అపర కుబేరులుగా ఎదిగినవాళ్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ 2025 ర్యాంకింగ్స్‌లో 12 మంది భారత సంతతి బిలియనీర్లు చోటు దక్కించుకోవడంతో అత్యధిక మంది విదేశీ అమెరికన్ కుబేరులకు జన్మస్థానంగా భారత్ నిలిచింది. 2022లో కేవలం ఏడుగురు భారత సంతతి బిలియనీర్లు ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగారు.అమెరికాలో విదేశీ సంతతి సంపన్నుల తాజా జాబితాలో భారత్.. ఇజ్రాయెల్, తైవాన్లను అధిగమించింది. ఈ రెండు దేశాలకు చెందినవారు చెరో 11 మంది ఈ జాబితాలో ఉన్నారు. స్వయం కృషితో ఎదిగిన ఈ భారత సంతతి కుబేరులు.. విదేశాలలో జన్మించిన యూఎస్ బిలియనీర్ల మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల సంపదలో గణనీయ వాటాను అందిస్తున్నారు.ఆల్ఫాబెట్ అధినేత సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వంటి కొత్తవారు ఇటీవల ఈ జాబితాలో చేరినప్పటికీ అంతగా గుర్తింపు లేని దిగ్గజాలతో పోలిస్తే వారు ఆశ్చర్యకరంగా తక్కువ ర్యాంకులో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ దిగ్గజం జెడ్ స్కేలర్ వ్యవస్థాపకుడు జే చౌదరి 17.9 బిలియన్ డాలర్ల సంపదతో భారత సంతతి అమెరికన్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. విద్యుత్తు, నీరు లేని మారుమూల హిమాలయ గ్రామం పనోహ్ లో జన్మించిన చౌదరి గ్రాడ్యుయేట్ చదువుల కోసం 1980లో తొలిసారి అమెరికా వెళ్లారు.భారత సంతతి అపర కుబేరులు వీళ్లే..జే చౌదరి (17.9 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (జెడ్ స్కేలర్)వినోద్ ఖోస్లా (9.2 బిలియన్ డాలర్లు) - సన్ మైక్రో సిస్టమ్స్, వెంచర్ క్యాపిటల్రాకేష్ గంగ్వాల్ (6.6 బిలియన్ డాలర్లు) - ఎయిర్‌లైన్స్ (ఇండిగో సహ వ్యవస్థాపకుడు)రోమేష్ టి.వాధ్వానీ (5.0 బిలియన్ డాలర్లు) - సాఫ్ట్వేర్ - సింఫనీ టెక్నాలజీ గ్రూప్రాజీవ్ జైన్ (4.8 బిలియన్ డాలర్లు) - ఫైనాన్స్ (జీక్యూజీ పార్టనర్స్ చైర్మన్)కవితార్క్ రామ్ శ్రీరామ్ (3.0 బిలియన్ డాలర్లు) - గూగుల్, వెంచర్ క్యాపిటల్రాజ్ సర్దానా (2.0 బిలియన్ డాలర్లు) - టెక్నాలజీ సేవలు (ఐటీ సంస్థ టీసీజీఐ)డేవిడ్ పాల్ (1.5 బిలియన్ డాలర్లు) - వైద్య పరికరాలు (వెల్క్వెస్ట్ / న్యూరోసిగ్మా)నికేష్ అరోరా (1.4 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ)ఫోర్బ్స్ తాజా డేటా ఆధారంగా అమెరికాలోని అత్యంత ధనవంతులైన భారత సంతతి బిలియనీర్లు వీరే. టెక్ దిగ్గజాలు సుందర్ పిచాయ్ (1.1 బిలియన్ డాలర్లు), సత్య నాదెళ్ల (1.1 బిలియన్ డాలర్లు) 10, 11వ స్థానాల్లో నిలిచారు. -
యూపీఐతో చెల్లింపుల్లో మనమే సూపర్‌ఫాస్ట్
యూపీఐ దన్నుతో, మిగతా ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా భారత్‌లో చెల్లింపుల విధానం అత్యంత వేగవంతంగా ఉంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. 2016లో ప్రవేశపెట్టిన యూపీఐ విధానం చాలా వేగంగా వినియోగంలోకి వచ్చిందని ఫిన్‌టెక్ నోట్లో పేర్కొంది. అదే సమయంలో నగదుకు ప్రత్యామ్నాయాలైన డెబిట్, క్రెడిట్ కార్డుల్లాంటి ఇతరత్రా సాధనాల వినియోగం గణనీయంగా తగ్గిందని వివరించింది.ప్రస్తుతం యూపీఐ ప్రతి నెలా 1,800 కోట్ల లావాదేవీలు ప్రాసెస్ చేస్తోందని ఐఎంఎఫ్ పేర్కొంది. వివిధ పేమెంట్ ప్రొవైడర్స్ సేవలు ఉపయోగించుకునే యూజర్ల మధ్య నిరాటంకంగా చెల్లింపు లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు క్లోజ్డ్ లూప్ సిస్టమ్‌లతో పోలిస్తే యూపీఐలాంటి ఇంటర్ఆపరబుల్ పేమెంట్ సిస్టమ్‌లు సమర్ధవంతంగా ఉంటాయని తెలిపింది. అయితే, ఇది మరింత వినియోగంలోకి వచ్చే కొద్దీ ప్రైవేట్ రంగ సంస్థల గుత్తాధిపత్యానికి కూడా దారి తీయొచ్చని, అలాంటిది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
భారత్‌లో టెస్లా షోరూం ప్రారంభం ఈ వారంలోనే..
ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత్‌లో తన తొలి షోరూంను ఈ వారంలోనే ప్రారంభించనుంది. టెస్లా భారత్‌లో తన మొదటి "ఎక్స్పీరియన్స్ సెంటర్" ను జూలై 15న ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో ప్రారంభించనుందని, ఇది భారత మార్కెట్లోకి ప్రవేశించడంలో కీలక అడుగు అని రాయిటర్స్ నివేదించింది. ఇందుకోసం టెస్లా 4,000 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని మార్చిలో లీజుకు తీసుకుంది. ఈ ప్రాంతం యాపిల్ స్టోర్ కు సమీపంలో ఉంది.భారత్‌లో విస్తృత విస్తరణ వ్యూహంలో భాగంగా టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ లో ముంబైలోని కుర్లా వెస్ట్ లో ఒక వాణిజ్య స్థలాన్ని కంపెనీ లీజుకు తీసుకుంది. ఇది వాహన సర్వీస్ కేంద్రంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పుణెలో ఇంజనీరింగ్ హబ్, బెంగళూరులో రిజిస్టర్డ్ కార్యాలయం, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) సమీపంలో తాత్కాలిక కార్యాలయంతో సహా భారతదేశంలో టెస్లా మొత్తం వాణిజ్య ఆస్తులు నాలుగుకు చేరుకున్నాయి.కాగా కంపెనీ ఇండియా హెడ్ ప్రశాంత్ మీనన్ తొమ్మిదేళ్ల తర్వాత గత నెలలో రాజీనామా చేశారు. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ప్రకారం.. ప్రస్తుతానికి భారత కార్యకలాపాలను చైనాకు బృందం నిర్వహిస్తోంది. అయితే టెస్లా ప్రస్తుతం భారత్‌లో తయారీని స్థాపించడానికి ఆసక్తి చూపడం లేదని, కేవలం షోరూమ్‌లు తెరిచి దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించాలనుకుంటోందని కేంద్రమంత్రి కుమారస్వామి గత నెలలో చెప్పారు.షోరూం ప్రారంభానికి ముందు కంపెనీ దాదాపు 1 మిలియన్ డాలర్ల (రూ.8.58 కోట్లు) ఎలక్ట్రిక్ వాహనాలు, సంబంధిత వస్తువులను దిగుమతి చేసుకుంది. జనవరి - జూన్ మధ్య వాణిజ్య షిప్పింగ్ రికార్డుల డేటా ప్రకారం.. టెస్లా భారత్‌కు వాహనాలు, సూపర్ ఛార్జర్లు, ఇతర ఉపకరణాలను దిగుమతి చేసుకుంది. ఇందులో ప్రధానంగా చైనా, అమెరికాల నుండి దిగుమతి చేసుకున్న ఆరు కార్లలో మోడల్ వై కార్లు ఉన్నాయి. విదేశీ ఎలక్ట్రిక్ వాహనాలపై భారత్ సుమారు 70% దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ టెస్లా ఈ వాహనాలను తీసుకువస్తోంది. -
ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం అదుర్స్
ప్రముఖ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ జూన్‌లో రూ.5,313 కోట్లు ప్రీమియం ఆదాయాన్ని సమకూర్చుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఆదాయంతో పోల్చి చూస్తే 14.60 శాతం పెరిగింది. ప్రైవేటు జీవిత బీమా సంస్థలతో పోల్చి చూసినా 12 శాతం పెరిగినట్టు ఎల్ఐసీ ప్రకటించింది. జూన్‌లో 25 ప్రైవేటు జీవిత బీమా సంస్థలు సంయుక్తంగా వసూలు చేసిన ఇండివిడ్యువల్ పాలసీల ప్రీమియం ఆదాయం రూ.8,408 కోట్లుగా ఉంది.ఈ ఏడాది జూన్‌లో ఎల్ఐసీ 12.49 లక్షల కొత్త పాలసీలను జారీ చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఇలా జారీ చేసిన కొత్త పాలసీలు 14.65 లక్షలుగా ఉండడం గమనార్హం. ఇందులో వ్యక్తులకు సంబంధించిన పాలసీలు 12.48 లక్షలగా ఉంటే, గ్రూప్ పాలసీలు 1,290గా ఉన్నాయి. ఎల్ఐసీకి గ్రూప్ పాలసీల ప్రీమియం ఆదాయం జూన్ నెలలో రూ.22,087 కోట్లుగా ఉంది.గతేడాది జూన్ కంటే 7 శాతం తక్కువ. ప్రైవేటు జీవిత బీమా కంపెనీల గ్రూప్ ప్రీమియం ఆదాయం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గి రూ.5,315 కోట్లుగా ఉంది. ఎల్ఐసీ మొత్తం ప్రీమియం (ఇండివిడ్యువల్, గ్రూప్ కలసి) ఆదాయం జూన్ నెలలో 3.43 శాతం తక్కువగా రూ.27,395 కోట్లుగా నమోదైంది. ప్రైవేటు కంపెనీల మొత్తం ప్రీమియం ఆదాయం సైతం 2.45 శాతం తగ్గి రూ.13,722 కోట్లకు పరిమితమైంది. -
గోల్డ్ ఈటీఎఫ్‌లు.. జిగేల్! ఏకంగా రూ.2,081 కోట్లు
బంగారం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు జూన్‌లో బలమైన డిమాండ్ కనిపించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవలి కాలంలో స్థిరమైన ర్యాలీ చేస్తుండడం ఇన్వెస్టర్లను మరింతంగా ఆకర్షిస్తోంది. జూన్ నెలలో ఏకంగా రూ.2,081 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది.ఈ ఏడాది మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.292 కోట్లతో పోల్చి చూస్తే జూన్‌లో ఏడింతలైనట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి రూ.6 కోట్లు, మార్చిలో రూ.77 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ కాలాన్ని పరిశీలించి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.8,000 కోట్లుగా ఉన్నాయి.ఈ ఏడాది జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.3,751 కోట్లను ఆకర్షించగా, ఆ తర్వాత తిరిగి జూన్‌లోనే గరిష్ట స్థాయిలో పెట్టుబడులు రావడం గమనించొచ్చు. జూన్‌లో రెండు గోల్డ్ ఈటీఎఫ్‌లు మొదటిసారి మార్కెట్లోకి వచ్చి (ఎన్‌ఎఫ్‌వోలు) ఇన్వెస్టర్ల నుంచి రూ.41 కోట్లను సమీకరించాయి. జూన్ చివరికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తుల విలువ మే చివరితో పోల్చి చూసినప్పుడు 4%పెరిగి (మే చివరి నుంచి) రూ.64,777 కోట్లకు చేరింది.స్థిరమైన ధరలు, అనిశ్చిత పరిస్థితులు..‘‘జూన్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి బలమైన పెట్టుబడులు రావడం సెంటిమెంట్‌లో మార్పునకు నిదర్శనం. ధరలు స్థిరంగా ఉండడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఈక్విటీ, డెట్ సాధనాల్లో అస్థిరతలు ఇందుకు కారణమై ఉండొచ్చు’’అని మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ తెలిపారు. కొత్త పథకాల ద్వారా నిధుల సమీకరణ కూడా మెరుగ్గానే ఉన్నట్టు చెప్పారు.గోల్డ్ ఈటీఎఫ్‌ల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న ఆసక్తికి నిదర్శనంగా పేర్కొన్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌లకు సంబంధించి ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) జూన్‌లో 2.85 లక్షలు పెరిగాయి. మొత్తం ఫోలియోలు 76.54 లక్షలకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ధరలు బంగారం మార్కెట్ ధరలనే ప్రతిఫలిస్తుంటాయి. ఒక ఈటీఎఫ్ యూనిట్ గ్రాము బంగారంతో సమానం. కానీ, కొన్ని ఫండ్స్ సంస్థలు ఇంతకంటే తక్కువ పరిమాణంలోనూ పెట్టుబడులకు అనుమతిస్తున్నాయి. -
రూ.కోట్ల లగ్జరీ ప్రాపర్టీ.. రిజిస్టర్ చేసుకున్న జొమాటో అధినేత
జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ గురుగ్రామ్‌లో రూ.కోట్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.డీఎల్ఎఫ్కు చెందిన ది కామెలియాస్‌లో అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను మూడేళ్ల క్రితం రూ.52.3 కోట్లకు కొనుగోలు చేసినట్లు జాప్కీకి లభించిన డాక్యుమెంట్లు చెబుతున్నాయి.మార్చిలో కన్వెన్షన్ డీడ్ ను చేసుకున్నారని, స్టాంప్ డ్యూటీ కింద గోయల్ రూ.3.66 కోట్లు చెల్లించారని డాక్యుమెంట్లు చెబుతున్నాయి. 10,813 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్ మెంట్ లో ఐదు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. లిస్టెడ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ నుంచి 2022 ఆగస్టులో ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారని, 2025 మార్చి 17న కన్వెన్షన్ డీడ్ రిజిస్టర్ అయిందని డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.గురుగ్రామ్‌లో డీఎల్ఎఫ్ ఫేజ్ -5 లో ఉన్న కామెలియాస్‌లో అన్నీ అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లే. దీపిందర్ గోయల్ మూడేళ్ల క్రితం కొన్న లాంటి అపార్ట్ మెంట్ ఇప్పుడు కొనాలంటే రూ.140 కోట్లకు పైగా ఖర్చవుతుందని రియల్టీ బ్రోకర్లు చెబుతన్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో దీపిందర్ గోయల్‌కు మరో ప్రాపర్టీ కూడా ఉంది. 2024 ఫిబ్రవరిలో గోయల్ ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో రూ .50 కోట్లకు ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశారు. -
రూ.5.6 లక్షల కోట్ల కంపెనీకి కొత్త సీఈవో.. ఎవరీ ప్రియా నాయర్?
హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ప్రియా నాయర్ నియమితులయ్యారు. ఆగస్టు 1 నుండి బాధ్యతలు స్వీకరించనున్నట్లు హెచ్‌యూఎల్ ప్రకటించింది. ఐదేళ్ల కాలానికి ఆమె నియామకానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.ప్రస్తుతం యూనిలీవర్ లో బ్యూటీ అండ్ వెల్ బీయింగ్ విభాగానికి బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ సేవలందిస్తున్న నాయర్ ప్రపంచ మార్కెట్లలో 13 బిలియన్ యూరోల పోర్ట్ ఫోలియోను పర్యవేక్షిస్తున్నారు. జూలై 31న పదవి నుండి వైదొలగనున్న రోహిత్ జావా స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. 2023లో హెచ్‌యూఎల్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జావా.. యూనిలీవర్లో 37 ఏళ్ల విశిష్ట కెరీర్‌ను ముగించి బోర్డుతో పరస్పర ఒప్పందం తర్వాత వైదొలగుతున్నారు.ఎన్నో బ్రాండ్లు..దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రియా నాయర్ హెచ్‌యూఎల్ లో అనేక ప్రముఖ పదవులను నిర్వహించారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ హోమ్ కేర్ అలాగే బ్యూటీ & పర్సనల్ కేర్ కూడా ఉన్నాయి. అక్కడ ఆమె డవ్, రిన్, కంఫర్ట్ వంటి ఫ్లాగ్ షిప్ బ్రాండ్ల వృద్ధికి నాయకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ అండ్ బ్రాండ్ పరివర్తన వ్యూహాలను నడిపిస్తూ, బ్యూటీ & వెల్బీయింగ్ విభాగానికి గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.ఇక నాయర్ విద్యార్హతల విషయానికి వస్తే.. సిడెన్హామ్ కాలేజీ నుంచి కామర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె పుణెలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేశారు. హిందూస్తాన్ యూనిలీవర్ కంపెనీ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ.5.6 లక్షల కోట్లుగా ఉంది.హెచ్‌యూఎల్ గ్లోబల్ సీఎంఓగా నాయర్ సాధించిన విజయాలను ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. ఆమె సోషల్-ఫస్ట్ మార్కెటింగ్ విధానాలను రూపొందించిందని, ప్రభావశీల-ఆధారిత ఆవిష్కరణలను విస్తరించిందని చెప్పుకొచ్చింది. యువ, డిజిటల్ అవగాహన ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి యూనిలీవర్ బ్యూటీ బ్రాండ్లను పునర్నిర్మించే లక్ష్యంతో గ్లోబల్ ప్రచారాలను ప్రారంభించిందని పేర్కొంది. -
ఎయిర్టెల్ కొత్త ప్లాన్.. రూ.200 లోపే అన్లిమిటెడ్..
దేశంలో ప్రముఖ ప్రైవేట్ టెలికం ఆపరేటర్ ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు మరికొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. లాంచ్‌ను అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ ప్లాన్ ఇప్పటికే ఎయిర్టెల్ వెబ్సైట్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.రూ .200 లోపు బేసిక్, షార్ట్ టర్మ్ వాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులను, ముఖ్యంగా ఖరీదైన డేటా ప్యాక్‌లు కాకుండా మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంటే చాలనుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రూ.189 విలువైన ఈ ప్లాన్‌లో ఏయే ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.రూ.189 ప్లాన్ బెనిఫిట్స్ఎయిర్టెల్ రూ.189 ప్లాన్ వాలిడిటీ 21 రోజులు. ఈ వ్యవధిలో వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్లాన్ మొత్తానికి 1 జీబీ మొబైల్ డేటా లభిస్తుంది. అలాగే మొత్తం 300 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపుకోవచ్చు.ఈ ప్లాన్ భారీ డేటా వినియోగదారులు లేదా స్ట్రీమింగ్ ఆస్వాదించేవారి కోసం రూపొందింది కాదు. ఎక్కువగా కాలింగ్, అప్పుడప్పుడు ఎస్ఎంఎస్లు చేసుకునేవారికి ఇది అనువుగా ఉంటుంది.ఇదే ధర విభాగంలో రిలయన్స్ జియో వంటి ప్రత్యర్థి ఆపరేటర్లలోనూ రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. రూ .200 కంటే తక్కువ రీఛార్జ్ చేయాలనుకునేవారికి, ఎయిర్టెల్ ఇప్పుడు రెండు ప్రధాన ఎంపికలను అందిస్తుంది. అవి కొత్తగా ప్రారంభించిన రూ .189 ప్లాన్, అలాగే ఇప్పటికే ఉన్న రూ .199 ప్లాన్. ఇది 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఏదేమైనా రూ .199 ప్లాన్ కొంచెం ఎక్కువ వ్యవధితో ఇలాంటి ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా మరో రూ .10 ఖర్చు చేయడానికి ఇష్టపడే వినియోగదారులకు ఇది మంచి డీల్. -
టీసీఎస్ ఫలితాలు: అంచనాలకు అటూ ఇటు..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక (Q1FY26) ఫలితాలను వెల్లడించింది. నికర లాభం వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరిగి రూ.12,760 కోట్లకు చేరుకుంది. లాభం అంచనాలను మించి వచ్చింది. టీసీఎస్ ఏప్రిల్-జూన్ నికర లాభం వృద్ధి స్వల్పంగా 1.9 శాతంతో రూ.12,263 కోట్లకు పరిమితమతుందని విశ్లేషకుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది.ఇక ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 1.3 శాతం పెరిగి రూ.63,437 కోట్లకు చేరుకుందని భారత అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ తెలిపింది. ఇది బ్లూమ్‌బర్గ్ ఏకాభిప్రాయ అంచనా రూ.64,636 కోట్ల కంటే తక్కువ.డివిడెంట్ ప్రకటనరూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.11 మధ్యంతర డివిడెండ్ ను టీసీఎస్ ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్ ను 2025 ఆగస్టు 4వ తేదీ కంపెనీ ఈక్విటీ వాటాదారులకు చెల్లిస్తామని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. డివిడెండ్ చెల్లింపు కోసం లబ్ధిదారులను నోట్ చేసుకోవడానికి సంస్థ జూలై 16ను రికార్డు తేదీగా నిర్ణయించింది.కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్లు వరుసగా పెరిగాయి. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈబీఐటీ మార్జిన్ 30 బేసిస్ పాయింట్లు పెరిగి 24.5 శాతానికి చేరుకుంది. అంతర్జాతీయ స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు డిమాండ్ క్షీణతకు కారణమయ్యాయని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కె.కృతివాసన్ తెలిపారు.2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొత్తగా 6,071 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. దీంతో మొత్తం టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 2025 జూన్ 30 నాటికి 6,13,069కి చేరింది. కంపెనీ ఐటీ సేవల అట్రిషన్ రేటు (గత పన్నెండు నెలల ప్రాతిపదికన) తొలి త్రైమాసికంలో 13.8 శాతానికి పెరిగింది. 2024 డిసెంబర్ త్రైమాసికంలో అట్రిషన్ 13 శాతంగా ఉండేది. టీసీఎస్ కు టాలెంట్ డెవలప్ మెంట్ కీలకమని చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ అన్నారు. టీసీఎస్ ఇప్పుడు 1,14,000 మంది హై ఆర్డర్ ఏఐ స్కిల్స్ ఉన్నవారు ఉండటం సంతోషకరమన్నారు.ఆదాయ ప్రకటనకు ముందు టీసీఎస్ షేరు ధర 0.4 శాతం లాభంతో రూ.3,397.1 వద్ద ముగిసింది. -
వందేళ్లయినా AI ఈ పని చేయలేదు: బిల్‌గేట్స్
విస్తృతంగా విస్తరిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ (ఏఐ) మానవ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని, కోట్లాది ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్న అంచనాలు ఆందోళనలు పెంచుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రోగ్రామింగ్‌కు ఏఐ ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. మానవ సృజనాత్మకతతోనే ప్రోగ్రామింగ్ రూపుదిద్దుకుంటుందని వ్యాఖ్యానించిన ఆయన ప్రోగ్రామర్లను ఏఐ ఇప్పుడే కాదు.. వందేళ్లయినా భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.ఇటీవల ఎకనమిక్ టైమ్స్‌తోపాటు టునైట్ షో విత్ జిమ్మీ ఫాలన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బిల్ గేట్స్ దీని గురించి మాట్లాడారు. కోడింగ్ కు మానవ మేధస్సు అవసరమని గేట్స్ చెప్పారు. ప్రోగ్రామింగ్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడగలదు కానీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రోగ్రామింగ్‌లో నిజమైన సవాలు సంక్లిష్ట సమస్యను సృజనాత్మకతతో పరిష్కరించడమేనన్న ఆయన ఇది యంత్రాలు చేయలేవన్నారు.‘కోడ్ రాయడం అంటే కేవలం టైపింగ్ మాత్రమే కాదు. లోతుగా ఆలోచించడం’ అని బిల్ గేట్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా విభిన్న పరిశ్రమల్లో అనేక ఉద్యోగాలు రూపాంతరం చెందుతాయని, లేదా కనుమరుగవుతాయని భావిస్తున్నప్పటికీ, ప్రోగ్రామింగ్ మాత్రం మానవ ఉద్యోగంగానే ఉంటుందని గేట్స్ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దీనికి విచక్షణ, ఊహాశక్తి, అడాప్టబిలిటీ అవసరం. ఈ లక్షణాలు ఏఐకి ఉండవని అంటున్నారాయన.మరోవైపు 2030 నాటికి కృత్రిమ మేధ 8.5 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేసింది. ఈ ద్వంద్వ ప్రభావాన్ని గేట్స్ అంగీకరిస్తూ, కృత్రిమ మేధ పర్యవసానాల గురించి తాను కూడా భయపడుతున్నానని అంగీకరించారు. అయితే తెలివిగా ఉపయోగిస్తే కృత్రిమ మేధ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, సమయాన్ని ఆదా చేస్తుందని ఆయన నమ్ముతున్నారు.ఏఐ ప్రభావం గురించి కొన్ని నెలల క్రితమే బిల్‌గేట్స్ మాట్లాడారు. ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రభావం చూపినా, ఎన్ని మార్పులు తెచ్చినా, కోడింగ్ నిపుణులు, జీవ శాస్త్రవేత్తలు, ఇంధన రంగంలో పనిచేసేవారికి ఎలాంటి ఢోకా ఉండదని తన అభిప్రాయాన్ని చెప్పారు. -
శాంసంగ్ నుంచి 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు
శాంసంగ్ ఎల్రక్టానిక్స్ సంస్థ ప్రీమియం ఫోల్డబుల్ గెలాక్సీ సిరీస్‌లో మూడు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, ఫ్లిప్ 7, ఫ్లిప్7 ఎఫ్ఈ వీటిలో ఉన్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్‌లో ఇవి ఏడో జనరేషన్ ఫోన్లు. మరింత వెడల్పాటి స్క్రీన్, తక్కువ బరువు, 200 మెగాపిక్సెల్ వైడ్–యాంగిల్ కెమెరా, కృత్రిమ మేథపరంగా కొత్త ఫీచర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఫోన్‌ను బట్టి స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్లు, 8.5 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ మెయిన్ డిస్ప్లే, 16 జీబీ వరకు మెమరీ, 1 టీబీ స్టోరేజీ మొదలైన ప్రత్యేకతలు ఉంటాయి.శాంసంగ్ ఈసారి స్లిమ్ ఫోల్డబుల్ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇది ఫ్లాగ్షిప్ మార్కెట్లో ఎక్కువ దృష్టిని ఆకర్షించింది. జెమినీ లైవ్, నౌ బార్, నౌ బ్రీఫ్ వంటి మరెన్నో కొత్త ఏఐ సామర్థ్యాలను తీసుకువస్తున్నందున శాంసంగ్ ఈ ఫోన్లను "గెలాక్సీ ఏఐ ఫోన్లు" అని పిలుస్తోంది. వీటి ధరలను ప్రకటించిన కొరియన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ప్రీ బుకింగ్‌లను ప్రారంభించింది.శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 బ్లూ షాడో, సిల్వర్ షాడో, జెట్‌బ్లాక్, మింట్ (Samsung.com మాత్రమే) అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.12జీబీ+256జీబీ ధర రూ.1,74,99912జీబీ+512జీబీ ధర రూ.1,86,99916జీబీ+1టీబీ ధర రూ.2,10,999శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 బ్లూ షాడో, జెట్‌బ్లాక్, కోరల్ రెడ్, మింట్ (Samsung.comలో మాత్రమే) రంగుల్లో లభిస్తుంది.12జీబీ+256జీబీ ధర రూ.1,09,99912జీబీ+512జీబీ ధర రూ.1,21,999శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈగెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ బ్లాక్ లేదా వైట్ కలర్లలో లభిస్తుంది.8జీబీ+128జీబీ: రూ.89,9998జీబీ+256జీబీ: రూ.95,999ఈ స్మార్ట్ ఫోన్లు భారత్‌లో శాంసంగ్ (Samsung.com), అమెజాన్ (Amazon.in), ఫ్లిప్‌కార్ట్ (Flipkart.com)లలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ప్రీ ఆర్డర్లకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తున్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ప్రీ-ఆర్డర్ చేస్తే రూ.12,000 విలువైన ఉచిత స్టోరేజ్ అప్ గ్రేడ్ లభిస్తుంది. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ ప్రీ ఆర్డర్‌పై రూ.6,000 విలువైన స్టోరేజ్ అప్‌గ్రేడ్ ఉచితంగా అందిస్తోంది. అదనంగా, కొనుగోలుదారులు ఈ మూడు మోడళ్లపై 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఎంపికలను కూడా ఎంచుకోవచ్చు. కొత్త ఫోల్డబుల్ అధికారిక సేల్ జూలై 25న మొదలుకానుంది. -
రూల్స్ పాటించాల్సిందే.. ఈ-కామర్స్ సంస్థలకు హెచ్చరిక
ఆహార భద్రత ప్రొటోకాల్స్‌ను పాటించడంలో విఫలమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ఈ–కామర్స్ సంస్థలను నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. ఉల్లంఘనల విషయంలో కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలకు చెందిన 70 మందికి పైగా ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో జి.కమల వర్ధనరావు ఈ విషయాలు తెలిపారు.ఈ–కామర్స్ సంస్థలన్నీ వినియోగదారులకు ఇచ్చే ప్రతి రసీదు, ఇన్వాయిస్లలో తమ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు/రిజిస్ట్రేషన్ నంబర్లను స్పష్టంగా ముద్రించాలని ఆయన ఆదేశించారు. గిడ్డంగులు, స్టోరేజ్ కేంద్రాల్లో పరిశుభ్రత, ఆహార భద్రత ప్రొటోకాల్స్ పాటించాలని రావు సూచించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. -
ఎన్విడియా.. ఎన్ని వందల లక్షల కోట్లయ్యా!!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంటూ ఎన్విడియా కార్పొరేషన్ చరిత్ర సృష్టించింది. 4 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ .342 లక్షల కోట్లు) మార్కెట్ విలువను చేరుకున్న మొదటి పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా నిలిచింది. అత్యాధునిక ఏఐ ప్రాసెసర్లకు డిమాండ్ పెరగడంతో షేరు ధర 164 డాలర్లను దాటడంతో బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఈ మైలురాయిని సాధించింది.ఈ వాల్యుయేషన్ తో మైక్రోసాఫ్ట్ (3.75 ట్రిలియన్ డాలర్లు), యాపిల్ (3.19 ట్రిలియన్ డాలర్లు)లను అధిగమించి ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2023 జూన్‌లో తొలిసారి ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటిన ఈ చిప్ తయారీ కంపెనీ తర్వాత ఒక్క ఏడాదిలోనే తన మార్కెట్ వ్యాల్యూను ఏకంగా మూడు రెట్లు పెంచుకుంది. అలా 3 ట్రిలియన్ డాలర్ల కంపెనీల సరసన నిలిచిన ఎన్విడియా వేగంగా 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌నూ దాటేసి టాప్ కంపెనీగా నిలిచింది.తోడైన కృత్రిమ మేధ విప్లవంగ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ)ల్లో ఎన్విడియా ఆధిపత్యం ఏఐ మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా నిలిచింది. జనరేటివ్ ఏఐ మోడల్స్ నుంచి అటానమస్ వెహికల్స్, డీప్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్స్ వరకు అన్నింటికీ ఈ కంపెనీ తయారు చేసిన చిప్స్‌ను వినియోగిస్తున్నారు. 2025 మొదటి త్రైమాసికంలో ఎన్విడియా 70% ఆదాయ పెరుగుదలను నమోదు చేసింది. 44 బిలియన్ డాలర్లను దాటింది. ఇది విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ విపరీతంగా ఉందని, మనం కొత్త పారిశ్రామిక యుగ ఆవిర్భావాన్ని చూస్తున్నామని ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ చెబుతున్నారు.ప్రపంచ మార్కెట్లపై ప్రభావంఎన్విడియా ఇప్పుడు ఎస్ అండ్ పీ 500 లో 7.3% వాటాను కలిగి ఉంది. ఇది వారసత్వ టెక్ దిగ్గజాలను అధిగమించింది. దీని పెరుగుదల పెట్టుబడి పోర్ట్ఫక్షలియోలు, టెక్ రంగ డైనమిక్స్‌ను పునర్నిర్వచించింది.ఓ వైపు ఎగుమతి ఆంక్షలు, పెరుగుతున్న పోటీ ఉన్నప్పటికీ, ఎన్విడియా వృద్ధి "స్థితిస్థాపకంగా, అంతర్జాతీయంగా" ఉందని విశ్లేషకులు అంటున్నారు.ఇండియన్ బడ్డెట్‌కు 10 రెట్లుఎన్విడియా మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ .342.66 లక్షల కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి అగ్రశ్రేణి భారతీయ సంస్థల మార్కెట్ విలువను కలిపినా దీని కంటే తక్కువే. ఇది కేంద్ర బడ్జెట్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. -
లిస్టింగ్‌కి రెడీ.. ఆరు కంపెనీలకు సెబీ ఓకే
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఐదు కంపెనీల లిస్టింగ్ సన్నాహాలకు ఓకే చెప్పింది. జాబితాలో రైట్ వాటర్ ల్యూషన్స్(ఇండియా), వీడా క్లినికల్ రీసెర్చ్, ఎల్సీసీ ప్రాజెక్ట్స్, శ్రింగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర, సీడ్‌వర్క్స్ ఇంటర్నేషనల్ చేరాయి. ఈ ఐదు కంపెనీలు ఐపీవో చేపట్టేందుకు వీలుగా 2025 జనవరి–ఫిబ్రవరి మధ్య సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. మరోపక్క ఈ ఏడాది మార్చిలో వియ్ వర్క్ ఇండియా మేనేజ్మెంట్ ఇష్యూపై నిర్ణయాన్ని పక్కనపెట్టిన సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెరసి ఆరు కంపెనీల నిధుల సమీకరణకు లైన్ క్లియరైంది. వివరాలు చూద్దాం.. ఎంబసీ గ్రూప్ దన్ను ప్రీమియం, ఫ్లెక్సిబుల్ కార్యాలయాల నిర్వహణ సంస్థ వియ్ వర్క్ ఇండియా మేనేజ్మెంట్ పబ్లిక్ ఇష్యూకి అనుమతి లభించింది. ఎంబసీ గ్రూప్ ప్రమోట్ చేసిన కంపెనీ ఐపీవోలో భాగంగా 4.37 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. సంస్థలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నారు. క్లీన్ టెక్ కంపెనీ వాటర్ యాక్సెస్ యాక్సెలరేషన్ ఫండ్ ఎస్ఎల్పీకి పెట్టుబడులున్న క్లీన్ టెక్ సంస్థ రైట్ వాటర్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు రూ. 445 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ మొత్తం రూ. 745 కోట్లు సమీకరించాలని చూస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 225 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఆభరణాల తయారీ జ్యువెలరీ తయారీ కంపెనీ శ్రింగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర ఐపీవోకు సెబీ అనుమతించడంతో 2.43 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 250 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. ఈ బాటలో సీడ్‌వర్క్స్ ఇంటర్నేషనల్ సైతం లిస్టింగ్ సన్నాహాలు ప్రారంభించనుంది. దీనిలో భాగంగా కంపెనీలో ప్రస్తుత ఇన్వెస్టర్లు 5.19 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈ కంపెనీలన్నీ ఐపీవో ద్వారా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యే యోచనలో ఉన్నాయి.ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలు ఈపీసీ కంపెనీ ఎల్సీసీ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించడంతో లిస్టింగ్ ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు సైతం 2.29 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.క్లినికల్ రీసెర్చ్ సంస్థ ప్రధానంగా క్లినికల్ రీసెర్చ్ కార్యకలాపాలు సమకూర్చే గుజరాత్ కంపెనీ వీడా క్లినికల్ రీసెర్చ్ ఐపీవోకు రెడీ అవుతోంది. ఇందుకు వీలుగా రూ. 185 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.3 కోట్ల షేర్లను ప్రమోటర్, ఇతర వాటాదారులు ఆఫర్ చేస్తారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ కొనుగోలుతోపాటు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. -
ఈపీఎఫ్‌వో ఈఎల్ఐ స్కీమ్‌కు పటిష్ట వ్యవస్థ
ఉపాధి కల్పన లక్ష్యాల్లో భాగంగా ప్రకటించిన రూ.1.07 లక్షల కోట్ల ఉద్యోగాల ఆధారిత ప్రోత్సాహక (ఈఎల్ఐ) స్కీమ్ అమలు కోసం డిజిటల్ సాధనాలతో పటిష్టమైన వ్యవస్థను కార్మిక శాఖ రూపొందించింది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్‌వో నిర్వహించే సామాజిక భద్రత స్కీముల ద్వారా దీన్ని అమలు చేయనుంది. ఇటు ఉద్యోగులు, అటు సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈఎల్ఐ స్కీమును తీర్చిదిద్దినట్లు కార్మిక శాఖ మన్సుఖ్ మాండవీయ తెలిపారు.ప్రయోజనాలను నేరుగా ఖాతాలకు బదిలీ చేసే విధంగా ఇది ఉంటుందని వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్‌వై) అమల్లో అవినీతి, ఫేక్ క్లెయిమ్‌ల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, మళ్లీ అలాంటి ఉదంతాలు చోటు చేసుకోకుండా ఈ స్కీమును పటిష్టంగా తీర్చిదిద్దినట్లు మంత్రి పేర్కొన్నారు. తయారీ రంగంపై ప్రత్యేక దృష్టితో, వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగయోగ్యత, సామాజిక భద్రతను పెంపొందించడం ఈఎల్ఐ స్కీము ప్రధాన ఉద్దేశం. దీనితో వచ్చే రెండేళ్లలో 3.5 కోట్లకు ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల వేతనం (రూ.15,000 వరకు) ఈ స్కీము కింద లభిస్తుంది. అదనంగా ఉద్యోగాలను కల్పించనందుకు అటు వ్యాపార సంస్థలకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయి. తయారీ రంగానికి మరో రెండేళ్లు అదనంగా ప్రయోజనాలు అందుతాయి. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు కల్పించే ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది. -
ఈ ఐటీ ఉద్యోగం.. రూ.కోటి జీతం
పేరున్న కాలేజీలో పెద్ద పెద్ద డిగ్రీలు చదివితేనే మంచి ఉద్యోగాలు వస్తాయన్న భావనకు కాలం చెల్లిపోతోంది. ఏఐ టెక్నాలజీ విస్తృతమవుతున్న నేపథ్యంలో కాలేజీలు, డిగ్రీలతో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే చాలు రూ.లక్షల్లో జీతాలతో ఉద్యోగాలిస్తామంటూ ముందుకొస్తున్నాయి కొన్ని సంస్థలు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన ఓ స్టార్టప్ ఫౌండర్ సోషల్ మీడియాలో అసాధారణమైన జాబ్ లిస్టింగ్‌ను పోస్ట్ చేసి ఆన్లైన్లో విస్తృత చర్చను రేకెత్తించారు.‘స్మాల్ ఏఐ’ అనే ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ తన కంపెనీకి ఫుల్ స్టాక్ టెక్ లీడ్ కావాలంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ జాబ్‌కి ఆయన రూ .1 కోటి వార్షిక వేతన పరిహారాన్నిఆఫర్ చేశారు. ఈ ప్యాకేజీలో రూ.60 లక్షల ఫిక్స్డ్ వార్షిక వేతనం కాగా రూ.40 లక్షలు కంపెనీ యాజమాన్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనికి అభ్యర్థి కాలేజీ డిగ్రీలతో నిమిత్తం లేదని, రెజ్యూమ్ కూడా అక్కర్లేదని ప్రకటించడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.ఇంకా ఈ ఉద్యోగానికి ఏమేం కావాలన్నది కామత్ వివరించారు. ఆదర్శ అభ్యర్థికి "4-5 సంవత్సరాల అనుభవం" ఉండాలని, "నెక్ట్స్ జెఎస్, పైథాన్, రియాక్ట్ జెఎస్" గురించి బాగా తెలిసి ఉండాలని కామత్ పేర్కొన్నారు. అలాగే ఈ ఉద్యోగం బెంగళూరు కేంద్రంగా ఉంటుందని, ఎంపికైనవారు తక్షణమే ఉద్యోగంలో చేరాల్సి ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా జాబ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానంలో ఉంటుందని, వారానికి 5 రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాలని కూడా వివరించారు.ఈ జాబ్‌కు అప్లయి చేయడానికి రెజ్యూమె అవసరం లేదని, కేవలం 100 పదాలతో తమ గురించి తెలియజేస్తే చాలంటూ కంపెనీ ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చారు. కామత్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు భిన్న కామెంట్లతో ప్రతిస్పందిస్తున్నారు.Hiring a cracked full-stack lead at Smallest AISalary CTC - 1 CrSalary Base - 60 LPASalary ESOPs - 40 LPAJoining - ImmediateLocation - Bangalore (Indiranagar)Experience - 4-5 years minimumLanguages - Next JS, Python, React JSWork from Office - 5 days a week (slightly…— Sudarshan Kamath (@kamath_sutra) July 7, 2025 -
ఐఫోన్ 17: చైనా టెకీలు వెళ్లిపోయినా పర్లేదు..
యాపిల్ వెండార్ల ప్లాంట్లలో పని చేసే చైనా టెకీలు స్వదేశాలకు వెళ్లిపోయినా భారత్‌లో ఐఫోన్ 17 ఫోన్ల ఉత్పత్తి ప్రణాళికలు యథాతథంగానే కొనసాగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి, ఐఫోన్ల తయారీలో కీలకమైన యంత్రపరికరాల దిగుమతులు ఇటీవలి కాలంలో మెరుగుపడ్డట్లు వివరించాయి.భారత్‌లో ఫాక్స్‌కాన్, టాటా ఎల్రక్టానిక్స్ సంస్థలు యాపిల్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. గత రెండు నెలలుగా ఫాక్స్‌కాన్ ఇండియా యూనిట్లలో పని చేస్తున్న వందలకొద్దీ చైనా నిపుణులు స్వదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. వీరంతా అసెంబ్లీ లైన్స్, ఫ్యాక్టరీ డిజైన్, ఇతరత్రా సిబ్బందికి శిక్షణనిచ్చే విధులు నిర్వర్తించేవారు.దీనితో ఐఫోన్ల తయారీపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. కానీ, భారత్‌లో ఐఫోన్ల ఉత్పత్తిని 3.5–4 కోట్ల స్థాయి నుంచి ఈ ఏడాది 6 కోట్లకు పెంచుకోవాలన్న యాపిల్ టార్గెట్‌లో ఎలాంటి మార్పు లేదని సంబంధిత వర్గాలు వివరించాయి. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి.రేంజిబౌండ్ సెషన్ తర్వాత దిశా సంకేతాలు లేకపోవడంతో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 176.43 పాయింట్లు (0.21 శాతం) క్షీణించి 83,536.08 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 46.4 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 25,476.10 వద్ద ముగిశాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.13 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.59 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 1.49 శాతం, 1.4 శాతం, 1.25 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికాకు చెందిన వైస్రాయ్ రీసెర్చ్ తన మాతృసంస్థ రుణభారం తగ్గించుకోవడంతో మైనింగ్ దిగ్గజం వేదాంత షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 17 షేర్లు ప్రతికూలంగా ముగిశాయి. అదేసమయంలో హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు 2 శాతం వరకు నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.09 శాతం క్షీణించి 11.9 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
ఈపీఎఫ్ వడ్డీ జమ.. ఈవారమే
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యుల ఖాతాల్లో పొదుపు నిధిపై.. 2024–25 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ జమను ఈ వారంలోనే పూర్తి చేయనున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ‘33.56 కోట్ల సభ్యులకు సంబంధించిన 13.88 లక్షల సంస్థల వార్షిక అకౌంట్ అప్డేషన్ పూర్తయింది. జులై 8 నాటికి 13.86 లక్షల సంస్థలకు చెందిన 32.39 కోట్ల సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ చేయడం ముగిసింది. అంటే ఇప్పటికే 96.51 సభ్యుల ఖాతాలకు వడ్డీ జమైంది’ అని మంత్రి వివరించారు.గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సభ్యుల నిధిపై, అంతకుముందు ఆర్థిక సంవత్సరం మాదిరే 8.25% వడ్డీ రేటును ఇవ్వాలని ఈపీఎఫ్‌వో ఫిబ్రవరి 28న నిర్ణయించగా.. కేంద్ర ప్రభుత్వం మే 22న ఆమోదం తెలపడం గమనార్హం. దీంతో జూన్ 6 నుంచే వార్షిక ఖాతాల అప్డేషన్ మొదలైనట్టు తెలిపారు. 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆగస్ట్–డిసెంబర్లో వడ్డీ జమ జరిగింది.వడ్డీ జమయిందో లేదో చూసుకోండిలా..స్టెప్ 1: ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ( epfindia.gov.in )సందర్శించండిస్టెప్ 2: అవర్ సర్వీసెస్ > ఫర్ ఎంప్లాయీస్ > మెంబర్ పాస్బుక్కు వెళ్లండిలేదా నేరుగా ( passbook.epfindia.gov.in ) లింక్‌ను క్లిక్ చేయండి.స్టెప్ 3: యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి లాగిన్ అవ్వండి.స్టెప్ 4: ఇక్కడ మీ అన్ని మెంబర్ ఐడీలు (మునుపటి, ప్రస్తుత కంపెనీలతో లింక్ అయినవి)కనిపిస్తాయి.స్టెప్ 5: పాస్‌బుక్ చూడటానికి ప్రస్తుత మెంబర్ ఐడీపై క్లిక్ చేయండిపాస్బుక్లో ఉద్యోగి కంట్రిబ్యూషన్, కంపెనీ కంట్రిబ్యూషన్, జమ అయిన వడ్డీ కనిపిస్తాయి. దీన్ని పీడీఎఫ్ గా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. -
బాబోయ్.. రీచార్జ్ ప్లాన్లు మళ్లీ పెరుగుతాయా?
దేశంలో మొబైల్ రీచార్జ్ ప్లాన్ల ధరలు మళ్లీ పెరుగనున్నాయి. టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్‌లను పెంచవచ్చని తెలుస్తోంది. ధరల పెరుగుదల 10 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ఓ వార్తా నివేదిక తెలిపింది. 2024 జూలైలో బేస్ ధరలను 11 నుండి 23 శాతం పెంచిన భారతీయ టెలికాం కంపెనీలు ఈసారి కొత్త విధానాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, మే నెలలో బలమైన క్రియాశీలక యూజర్ల పెరుగుదలే ఈ పెంపునకు కారణమని చెబుతున్నారు.మళ్లీ మొబైల్ టారిఫ్‌ల పెంపుభారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాతో సహా భారతీయ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్‌లపై తాజా పెంపును విధించవచ్చని ఈటీ టెలికాం నివేదిక తెలిపింది. ఈ పెరుగుదల 10-12 శాతం మధ్య ఉంటుందని, మిడ్-టు-హై-ప్రైస్ రీఛార్జ్ ప్లాన్లను కొనుగోలు చేసే వినియోగదారులను కంపెనీలు లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపింది.టారిఫ్‌ల పెంపుతో యాక్టివ్ సబ్స్క్రైబర్లు వేరే టెలికాం నెట్వర్క్ ప్రొవైడర్‌కు మళ్లకుండా ఆపరేటర్లు టైర్డ్ విధానంపై దృష్టి సారించారు. మే నెలలో యాక్టివ్ సబ్స్క్రైబర్ల బలమైన వృద్ధి మరోసారి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ 31 రోజుల్లో భారతీయ టెలికాం రంగంలో 7.4 మిలియన్ల క్రియాశీల చందాదారులు పెరిగారు. 29 నెలల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం యాక్టివ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 1.08 బిలియన్లకు చేరింది. -
ఒక్క రూపాయి జీతం.. ఐటీ కంపెనీ ఫౌండర్ ఆనందం
జీవితంలో ఎవరైనా విజయం సాధించారనడానికి సంపాదించిన సంపద, బిరుదులు, పేరు ప్రఖ్యాతులతో కొలిచే ప్రపంచంలో, నిజమైన సంపద బ్యాంకు బ్యాలెన్స్‌లకు మించి ఉంటుందని గుర్తు చేశారు ప్రముఖ ఐటీ సంస్థ మైండ్ ట్రీ సహ వ్యవస్థాపకుడు సుబ్రతో బాగ్చి. తనకు వార్షిక జీతం ఒక్క రూపాయి వచ్చిందని, అది తన జీవితంలో వెలకట్టలేని సంపదంటూ ఆ చెక్కును సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) లో పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారాయన.ఈ చెక్కు ఆయన ఏదైనా కంపెనీకో.. స్టార్టప్ కు అందించిన సేవలకు వచ్చింది కాదు. ఇన్స్టిట్యూషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం ఒడిశా ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఇది ఆయన చివరి జీతం. ఈ పాత్రలో సుబ్రతో బాగ్చి ఎనిమిదేళ్లు పనిచేశారు. ఇందుకు ఆయన ఎటువంటి ఆర్థిక ప్రతిఫలాన్ని ఆశించలేదు. ఏడాదికి కేవలం ఒక్క రూపాయిని సింబాలిక్ వేతనంగా స్వీకరించారు."ఈ ఒక్క జన్మలో నేనెప్పుడూ వదులుకోలేని అతి పెద్ద సంపద ఏమిటంటే?" అంటూ తన సేవా ప్రయాణాన్ని బాగ్చి వివరించారు. "నేను ప్రభుత్వంతో చేసినందుకు నాకు ఏడాదికి రూ .1 జీతం. ఎనిమిదేళ్లకు 8 చెక్కులు వచ్చాయి. ఇదే నా చివరి జీతం" అంటూ తన ‘ఎక్స్’ పోస్ట్‌లో భావోద్వేగంతో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ఎంతో మందిని హత్తుకుంటోంది. అభినందనలు కురిపిస్తోంది.సేవతోనే సంతృప్తిప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐటీ, కన్సల్టింగ్ సంస్థ మైండ్ ట్రీ సహ వ్యవస్థాపకుడిగా బాగ్చీకి మంచి పేరుంది. ఆయన నాయకత్వం, దార్శనికత, దాతృత్వానికి ప్రశంసలు దక్కాయి. ఎన్ని వేల కోట్లు సంపాదించినా బాగ్చీ సామాజిక సేవలోనే సంతృప్తిని వెతుక్కున్నారు. సుబ్రతో బాగ్చీ తన సతీమణి సుస్మితతో కలిసి క్యాన్సర్ సంరక్షణ, నైపుణ్య అభివృద్ధి వంటి సేవా కార్యక్రమాల కోసం వందల కోట్ల రూపాయలను దానమిచ్చారు. ఇప్పుడాయన ఈ చిన్న చెక్కునే తన జీవితానికి అపురూపంగా భావిస్తున్నారంటే ఇదే సేవలో తనకున్న సంతృప్తికి నిదర్శనం.What is the biggest wealth in this one life that I would never ever part with? Well, for every year of the work I did with the government, the deal was, they pay me Rs 1. For the 8 years out there, I got 8 cheques & this one here was my last salary drawn 🙏 pic.twitter.com/nVx2EZWv7K— Subroto Bagchi (@skilledinodisha) July 5, 2025 -
‘కొత్త’గా ఇన్వెస్ట్ చేస్తారా.. ఇవిగో ఎన్‌ఎఫ్‌వోలు
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్.. ఇన్వెస్కో ఇండియా ఇన్కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌ను కొత్తగా తీసుకొచ్చింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ 2న ప్రారంభం కాగా.. 16వ తేదీ వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. యాక్టివ్‌గా నిర్వహించే డెట్ ఫండ్స్, ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది.సంప్రదాయ డెట్ పథకాలకు ప్రత్యామ్నాయంగా ఈ పథకాన్ని రూపొందించి తీసుకొచ్చినట్టు ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ తెలిపింది. తక్కువ రిస్క్‌తో కూడిన రాబడి, పన్ను పరంగా మెరుగైన ప్రయోజనం కోరుకునే దీర్ఘకాల పెట్టుబడులకు ఈ పథకం అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. మొత్తం పెట్టుబడుల్లో 60–65 శాతాన్ని ఇన్వెస్కో ఇండియా కార్పొరేట్ బాండ్ ఫండ్‌లో పెడుతుంది. 35–40 శాతం మధ్య ఇన్వెస్కో ఇండియా ఆర్బిట్రేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది.యాక్సిస్ సర్వీసెస్ ఆపర్చూనిటీస్ ఫండ్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా సర్వీసెస్ ఆపర్చూనిటీస్ ఫండ్ పేరిట ఓపెన్ ఎండెడ్ స్కీమును ప్రకటించింది. ఇది జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. బ్యాంకింగ్ నుంచి మొదలుకుని ఈ–కామర్స్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్ వరకు వివిధ రంగాల్లో అత్యుత్తమంగా రాణిస్తున్న సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది.భారీ స్థాయిలో వృద్ధి చెందగలిగి, పెట్టుబడులను సమర్థంగా వినియోగించుకుంటూ, పోటీ సంస్థలతో పోలిస్తే మెరుగ్గా ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి ప్రయోజనాలను కల్పించడం ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. సేవల రంగానికి అనుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక ప్రగతికి ఇది కీలకంగా ఉంటుందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ బి. గోపకుమార్ తెలిపారు. -
సొంతంగా ఫ్లైఓవర్ కట్టుకుంటున్న రియల్ఎస్టేట్ కంపెనీ
సాధారణంగా ఎక్కడైనా ఫ్లైఓవర్లు ప్రభుత్వాలు నిర్మిస్తాయి. కానీ బెంగళూరులో మాత్రం ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ సొంతంగా ప్రైవేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకుంది. ఇందుకు ప్రభుత్వమూ అనుమతిచ్చింది. అయితే ఒక్కటే షరతు...బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్ బెళ్లందూర్‌లో నిర్మాణంలో ఉన్న తమ టెక్ పార్క్‌ను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో అనుసంధానం చేయడానికి 1.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ను నిర్మించనుంది. ఈ ఫ్లైఓవర్ పబ్లిక్ రోడ్డు పక్కగా, వర్షపునీటి కాలువ మీదుగా వెళ్తుంది.ఈ ప్రాజెక్టుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఆమోదం తెలిపింది. అదే సమయంలో ప్రభుత్వ భూమిలో ఫ్లైఓవర్ నిర్మించుకుంటున్నందుకు గానూ దీనికి బదులుగా కరియమ్మన అగ్రహార రోడ్డు వెడెల్పునకు ప్రెస్టీజ్ గ్రూప్ ముందుకు వచ్చినట్లు తెలిసింది. అలాగే ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తామే సొంతంగా నిధులు సమకూర్చడానికి ఈ రియల్ ఎస్టేట్ సంస్థ కట్టుబడి ఉందని ‘హిందూస్థాన్ టైమ్స్’ వార్తా సంస్థ కథనం పేర్కొంది.ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రెస్టీజ్ గ్రూప్ మొదట 2022 ఆగస్టులో బెంగళూరు బెంగళూరు మహానగర పాలికెకు ప్రతిపాదనను సమర్పించింది. తరువాత 2023 నవంబర్ లో సవరించిన అభ్యర్థనను సమర్పించింది. తమ ప్రైవేట్ క్యాంపస్ కు ప్రత్యేక ఫ్లైఓవర్ అవసరాన్ని చెప్పేందుకు ఎమలూరు, కరియమ్మన అగ్రహార రోడ్డు మీదుగా ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని కంపెనీ కారణంగా పేర్కొంది.రాబోయే ప్రెస్టీజ్ బీటా టెక్ పార్క్ లో 5,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే వీరి రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించినట్లు సమాచారం.👉హైదరాబాద్ వెస్ట్ హవా.. జోరుగా విల్లా ప్రాజెక్ట్‌లు👈కొత్త ఫ్లైఓవర్‌పై కేవలం ప్రెస్టీజ్ ఉద్యోగులకే కాకుండా సాధారణ ప్రజల రాకపోకలకూ అవకాశం ఉండాలని బీబీఎంపీ అధికారులు షరతు విధించారు. అన్ని చట్టపరమైన ప్రమాణాలను చేరుకుంటే, రహదారి విస్తరణ కోసం అప్పగించిన భూమికి బదులుగా సంస్థ బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులకు (టీడీఆర్) కూడా అర్హత కలిగి ఉంటుంది. టెక్ పార్క్ బిల్డింగ్ ప్లాన్‌కు అనుమతులు వచ్చిన దాదాపు ఏడాది తర్వాత ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం లభించడం గమనార్హం. 70 ఎకరాలున్న ఈ స్థలానికి 2023 సెప్టెంబరులో బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) నుంచి ప్రాథమిక అనుమతి లభించింది.బెంగళూరు స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్ ఈ ప్రాజెక్టు ఆమోదాన్ని ధృవీకరించారు. ఫ్లైఓవర్‌తో పాటు 40 అడుగుల వెడల్పుతో కనెక్టింగ్ రోడ్‌కు కూడా ప్రెస్టీజ్ సంస్థ నిధులు సమకూర్చనుంది. ఈ రోడ్డుతో సక్రా హాస్పిటల్ రోడ్డుకు ప్రయాణ దూరం 2.5 కిలోమీటర్లు తగ్గుతుంది. మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం కోసం విస్తృత కృషిలో భాగంగానే ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. -
యువత కోసం కొత్త యులిప్ పథకం
యువతకు దీర్ఘకాలంలో సంపద సృష్టికి దోహదపడేలా ఐసీఐసీఐ ప్రూ స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ పేరిట మార్కెట్ ఆధారిత యులిప్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. దీన్ని నెలవారీగా రూ. 1,000 ప్రీమియంకే కొనుగోలు చేయొచ్చని సంస్థ తెలిపింది.ఇటు లైఫ్ కవరేజీతో పాటు అటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు కూడా ఇది ఉపయోగపడుతుందని కంపెనీ చీఫ్ ప్రోడక్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పల్టా తెలిపారు. వీలైనంత ముందుగా ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టి దీర్ఘకాలం కొనసాగించేలా యువతకు యులిప్ ప్లాన్లు ఉపయుక్తంగా ఉంటాయన్నారు.బజాజ్ అలియాంజ్ లైఫ్ కొత్త ఫండ్జీవిత బీమా సంస్థ బజాజ్ అలియాంజ్ లైఫ్ తాజాగా నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ 50 ఇండెక్స్ ఫండ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్‌ను (ఎన్ఎఫ్వో) ప్రకటించింది. దీన్ని తమ యులిప్ పాలసీల కింద అందిస్తుంది. ఇది నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ MQVLV 50 ఇండెక్స్‌ను ట్రాక్ చేసే విధంగా ఉంటుంది. పాలసీదారులకు ఇటు లైఫ్ కవరేజీతో పాటు అటు మల్టీఫ్యాక్టర్ ఆధారిత ఈక్విటీ ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఎన్ఎఫ్వో జూలై 14తో ముగుస్తుంది. -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రంప్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోని దేశాలకు ఆగస్టు 1 నుంచి సుంకాలు అమలు చేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 9.61 పాయింట్లు (0.01 శాతం) స్వల్పంగా లాభపడి 83,442.50 వద్ద ముగియగా, నిఫ్టీ 50 25,461.3 స్థాయిలో ముగిసింది. విస్తృత మార్కెట్లలో ఎన్ఎస్ఈ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.27 శాతం, ఎన్ఎస్ఈ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.44 శాతం నష్టపోయాయి.నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.68 శాతం లాభపడగా, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, ఇమామీ, బ్రిటానియా, వరుణ్ బేవరేజెస్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ ఎనర్జీ కూడా గ్రీన్‌లో స్థిరపడ్డాయి. నిఫ్టీ ఐటీ, మెటల్, బ్యాంక్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి.భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్, హెచ్‌సీఎల్ టెక్, మారుతి, ఇన్ఫోసిస్, ఎస్బీఐ 2.4 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు హెచ్‌యూఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, అదానీ పోర్ట్స్ 3 శాతం వరకు లాభపడ్డాయి. -
ఇక ఈ బ్యాంక్‌లోనూ మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు..
పేదలు, సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక్కొక్కటిగా ముందుకువస్తున్నాయి. ఇందులో భాగంగా బ్యాంక్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే విధించే చార్జీలను రద్దు చేస్తున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ జాబితాలో చేరింది. ప్రామాణిక పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఛార్జీలను తొలగించింది.బ్యాంక్ ఆఫ్ బరోడాలో మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల తొలగింపు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మార్పు ప్రీమియం ఉత్పత్తులు మినహా అన్ని సాధారణ పొదుపు ఖాతాలకు వర్తిస్తుంది.కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లు ఇటీవలే పొదుపు ఖతాలకు కనీస బ్యాలెన్స్ ఛార్జీలు తొలగించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అనుసరించింది. ఇక అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ ఆవశ్యకతలను ఎత్తివేస్తూ ఈ దిశగా చర్యలు తీసుకుంది.మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాలపై విధిస్తున్న జరిమానాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య చర్చలు కొనసాగుతున్న క్రమంలో ఈ మార్పు చోటు చేసుకుంది. చౌక కరెంట్, పొదుపు ఖాతాల డిపాజిట్ల వాటాలో తగ్గుదలను బ్యాంకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అంశం దృష్టిని ఆకర్షించింది. -
జియో కొత్త ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఏడాది వ్యాలిడిటీ
కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్లతో చౌకగా రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ట్రాయ్ కొద్ది రోజుల క్రితం అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జియో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోనాలతో రెండు చౌక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. తన అధికారిక వెబ్సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది. వీటిలో వినియోగదారులు 365 రోజుల వరకు సుదీర్ఘ వాలిడిటీని పొందుతారు. డేటా అవసరం లేని యూజర్లకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది.కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే వాడే యూజర్లకు, డేటా అవసరం లేని వారికి ఈ జియో ప్లాన్లు ప్రత్యేకం. వీటిలో ఒక దాని ధర రూ .458 కాగా మరొకటి రూ .1958. ఇవి వరసగా 84 రోజులు, 365 రోజుల వాలిడిటీతో వస్తాయి. ఇంకా ఈ రెండు జియో ప్లాన్లలో వినియోగదారులు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.84 రోజుల ప్లాన్జియో కొత్త రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీంతోపాటు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్స్‌కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ముఖ్యంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే వాడే యూజర్ల కోసం జియో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో దేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయం లభిస్తుంది.365 రోజుల ప్లాన్జియో కొత్త రూ .1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు దేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. వీటితో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్లు, ఉచిత నేషనల్ రోమింగ్ ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. -
హైదరాబాద్‌లోనే విదేశీ మేలిమి గ్రానైట్..
ఇంటి అందం ద్విగుణీకృతం చేయడానికి.. కొందరు గృహ యజమానులు ఖర్చుకు వెనకాడట్లేదు. ఇంటి అలంకరణలో తమదైన ప్రత్యేక ముద్ర ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారికోసమే ప్రపంచంలో అరుదుగా దొరికే గ్రానైట్లు బోలెడు ఉన్నాయి. వీటిని ఎంచుకోవడానికి ఏ అమెరికాకో ఆఫ్రికాకో వెళ్లక్కర్లేదు. ఎంచక్కా మన నగరంలోనే ఇవి లభిస్తున్నాయి. చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన చిత్రంలా దర్శనమిచ్చే గ్రానైట్ రకాలకు ప్రపంచ మార్కెట్లో ఎక్కడ్లేని గిరాకీ పెరుగుతోంది. వీటికోసం చదరపు అడుగుకి రూ.2,500 దాకా పెట్టాల్సి ఉంటుంది. వీటిని గోడలకు అమరిస్తే.. అచ్చం చిత్రకారుడు వేసిన బొమ్మల మాదిరిగానే కనిపిస్తాయి. – సాక్షి, సిటీబ్యూరోయూరప్, అమెరికా, సౌదీ అరేబియా, ఆఫ్రికా, అంగోలా, నమీబియా, మడగాస్కర్, నార్వే, ఫ్లిన్లాండ్, బ్రెజిల్, ఐస్‌ల్యాండ్ వంటి దేశాలకు చెందిన గ్రానైట్‌కు ప్రపంచ మార్కెట్లో ఎక్కడ్లేని గిరాకీ ఉంది. మరి ఇవి విదేశాల నుంచి ఇక్కడికి ఎలా చేరుకుంటాయనేది మీ సందేహమా? ఆయా దేశాల నుంచి ఇవన్నీ నౌకలో ముంబైకి దిగుమతి అవుతాయి. అక్కడి నుంచి రైలు మార్గంలో నగరానికి.. లారీల ద్వారా సిటీ చుట్టుపక్కల ఉన్న గ్రానైట్ పరిశ్రమలకు చేరుకుంటాయి.ఒక్కో గ్రానైట్.. ఒక్కో గ్రానైట్ బ్లాకు 25 నుంచి 35 టన్నుల దాకా ఉంటుంది. మొదట్లో కాస్త ఎత్తుపల్లాలుగా ఉన్న గ్రానైట్‌ను.. బడా యంత్రాల సాయంతో డ్రెస్సింగ్ చేస్తారు. పాలిష్ చేసి ఎగుడుదిగుడు లేకుండా చేస్తారన్నమాట. ఆ తర్వాత స్టీల్ గ్రిట్ బ్లేడ్లతో కత్తిరించి డైమండ్ బ్రిక్సతో పాలిష్ చేస్తారు. బ్రెడ్డును ముక్కలుగా కోసినట్లే.. భారీ ఆకారం గల గ్రానైట్ బ్లాకును కోస్తారన్నమాట. ఈ ప్రక్రియ తర్వాత ఒక్కో ముక్కను వేడి చేసే ఓవెన్లో పెడతారు. ఫలితంగా గ్రానైట్‌లో ఉన్న నీరంతా ఆవిరవుతుంది. ఆ తర్వాత రెసిన్ పెడతారు. దీని వల్ల భవిష్యత్తులో గ్రానైట్ నీరు పీల్చుకోకుండా ఉంటుంది. తర్వాత ప్రక్రియ క్యూరింగే.. ఇదయ్యాక పాలిష్ అవ్వగానే గ్రానైట్ తళతళ మెరుస్తుంది. మొత్తం ఏడు రోజులు జరిగే ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. గ్రానైట్ ప్రపంచ దేశాలకు ఎగుమతికి సిద్ధమవుతుంది. ఇంటికే ప్రత్యేకం.. దాదాపు ఎనభై రంగులు గల గ్రానైట్.. వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు దిగుమతి అవుతోంది. సౌదీ అరేబియాకు చెందిన ‘ట్రాపిక్ బ్రౌన్’ ధర చ.అ.కు 300 దాకా ఉంటుంది. అదే నార్వే ‘బ్లూ పెరల్’ రేటు రూ.500 వరకూ పలుకుతుంది. ఇక ఫిన్లాండ్ ‘బాల్టిక్ బ్రౌన్’ ధర కూడా ఇంచుమించు రూ.300లు ఉంటుంది. ఇవి కాకుండా ఖరీదైన రకాలు బోలెడున్నాయి. మేలిమి గ్రానైట్.. యూరప్ ఐస్లాండ్ల మధ్య.. అక్కడక్కడా విసిరేసినట్లు కనిపించే చిన్న చిన్న దీవుల్లో మేలిమి రకమైన గ్రానైట్ లభిస్తోంది. యూరప్ నుంచి అక్కడికి వెళ్లడానికే కనీసం మూడు రోజులైనా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ‘బ్లాక్ బ్యూటీ’ గ్రానైట్ కోసం చదరపు అడుగుకి రూ.2 వేల దాకా పెట్టాల్సి ఉంటుంది. బ్రెజిల్లో దొరికే ‘అమెజాన్’ రకం ధర.. చదరపు అడుగుకి రూ.1,600 ఉంటుంది. ఇదే రకాన్ని మీ ఇంట్లో వేయాలనుకుంటే మీకయ్యేది సుమారు వెయ్యి రూపాయలే. అదెలా అంటారా? మీకేం కావాలో గ్రానైట్ సంస్థలకు చెబితే వాటిని చిన్నచిన్న బ్లాకులుగా తీసుకొచ్చి అందజేస్తారు. కాకపోతే ఆర్డర్ ఇచ్చిన మూడు నెలల తర్వాతే ఇవి ఇంటికి చేరుతాయి. కాబట్టి, ఇంటి నిర్మాణం నాటి నుంచే గ్రానైట్‌కు సంబంధించి అవగాహనకు రావడం ఉత్తమం. -
ఒక్క ఏడాదిలో రూ.8,500 కోట్లు తీసుకొచ్చా..
ప్రముఖ బాలివుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పక్కా బిజినెస్‌మ్యాన్‌గా మారిపోయారు. సినీ పరిశ్రమపై తనకు విరక్తి పెరిగిందని, అందుకే తన వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టానని ఆయన చెబుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ లో క్రియాశీలకంగా పనిచేసిన ఈ నటుడు ఇప్పుడు తన ప్రధాన జీవనాధారాన్ని పూర్తిగా బిజినెస్ వైపు మళ్లించారు.తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12 కంపెనీలకు ఒక్క ఏడాదిలోనే 1 బిలియన్ డాలర్లు (రూ.8,500 కోట్లు) సమీకరించినట్లు తెలిపారు. వీటిలో రెండు కంపెనీలు ఐపీవోకి కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయని వివేక్ ఓ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన నెట్‌వర్త్ రూ.1,200 కోట్లు ఉంటుందని అంచనా.భూమి మొదటి వ్యాపారంఇటీవల సీఎన్‌బీసీ టీవీ-18 ఇంటర్వ్యూలో మాట్లాడిన వివేక్ తన వ్యాపార సంగతులను పంచుకున్నారు. తన తండ్రి సురేష్ ఒబెరాయ్ వ్యాపారవేత్త కావడంతో తాను కూడా చిన్న వయసు నుంచే వ్యాపారం వైపు మొగ్గు చూపానని చెప్పారు. ‘ఇన్వెస్టర్ అయిన ఆయన (తండ్రి) ఎప్పుడూ భూములు కూడబెడుతూ కొనడం, అమ్మడం చేసేవారు. అలా డబ్బు సంపాదించేవారు. భూమి నాకు పరిచయమైన మొదటి వ్యాపారం. నాకు తొమ్మిది పదేళ్ల వయసున్నప్పుడు అకస్మాత్తుగా ఇన్వెంటరీతో వచ్చేవాడు. ఒక సంవత్సరం పెర్ ఫ్యూమ్స్, మరో ఏడాది ఎలక్ట్రానిక్స్... వాటిని నా బ్యాక్ ప్యాక్ లో నింపుకుని ఇంటింటికీ వెళ్లేవాన్ని. చివరిలో నా 'లెక్కలు' అడుగేవారు. లాభం మాత్రం నాకిచ్చి మిగిలింది తీసుకునేవారు' అని వివేక్ గుర్తు చేసుకున్నారు.సినిమాల్లో లోపించిందదే..కొన్నేళ్ల పాటు చిత్ర పరిశ్రమలో గడిపిన వికేక్ ఒబెరాయ్ ఇంకా తాను మొదలుపెట్టిన చోటే ఉన్నానని గ్రహించారు. "అది (సినీ పరిశ్రమలో ఉండటం) నాకు నచ్చలేదు. అది ఎదుగుదల కాదు. నేను అక్కడ ఉండటం, కొంతమంది వ్యక్తులతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. కానీ ఇది ఎదుగుదలకు తోడ్పడాలి. ఎవరైనా ప్రతిభ ఉన్నవారిని దగ్గరకు తీసి వారి ఎదుగుదలకు సహకారం అందించాలి. అక్కడ లోపించిందదే" అని చెప్పుకొచ్చిన వివేక్ నిరాశగా తల కొట్టుకుంటూ అక్కడే ఉండటం కన్నా వ్యాపారం వైపు రావాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.పెట్టుబడుల విషయంలో ఎంత క్లిష్టమైన పరిస్థితులకూ తాను వెనుకాడనని చెప్పిన వికేక్ ఒబెరాయ్.. ‘గత ఏడాదిలోనే నా కంపెనీలకు 1 బిలియన్ డాలర్లకు పైగా సమీకరించగలిగాం. ఇది గణనీయమైన మొత్తం. అయినా అదేం సమస్య కాదు. అయితే ఆ నిధులను ఎక్కడ పెట్టాలి.. ఎలా ఆ వృద్ధి చేయాలన్నది తెలియాలి. అందుకు మార్వాడీ మనస్తత్వం అలవర్చుకోవాలి" అంటూ సూచించారు. బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు అంతర్జాతీయ చిత్రాలను 'కాపీ' చేసినా వాటికి 'దేశీ మసాలా' తగిలిస్తున్నామంటూ చెబుతుంటారు. "మరి దీన్ని వ్యాపారంలో ఎందుకు చేయకూడదు?" అంటూ ప్రశ్నిస్తున్నారు. -
స్టూడియో అపార్ట్మెంట్లకు తగ్గుతున్న గిరాకీ
సాక్షి, సిటీబ్యూరో: కరోనా కంటే ముందు ఇల్లు అంటే నాలుగు గోడల భవనం. సంపాదన బిజీలో పడిన సగటు జీవికి కాసేపు సేద తీరాలనుకునే గూడు. కానీ, కోవిడ్ తర్వాత నుంచి ఇల్లే ప్రపంచమైపోయింది. తినడం, పడుకోవడం మాత్రమే కాదు.. ఆఫీసు, స్కూల్, వ్యాయామం, వినోదం అన్నీ.. ఇంటి నుంచే! ఫలితంగా కోవిడ్ కంటే ముందు హాట్ కేకుల్లాంటి స్టూడియో అపార్ట్మెంట్లకు.. క్రమంగా డిమాండ్ పడిపోయింది. వీటి స్థానంలో విస్తీర్ణమైన గృహాలకు గిరాకీ పెరిగింది.బెడ్ కం లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటిని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. కరోనా మొదలైన ఏడాది(2020) నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ తరహా అపార్ట్మెంట్ల సరఫరా క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ ఏడాది తొలి అర్ధ వార్షికం(జనవరి–జూన్)లో 1,063 ప్రాజెక్ట్‌లు లాంచింగ్ కాగా.. ఇందులో కేవలం 9 శాతం(91 ప్రాజెక్ట్‌లు) మాత్రమే స్టూడియో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని అనరాక్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది 1,207 ప్రాజెక్ట్‌లు లాంచింగ్ కాగా.. ఇందులో 145 ప్రాజెక్ట్‌లు స్టూడియో పార్ట్మెంట్లున్నాయి. 2020లో 884 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఇందులో 15 శాతం వాటాతో 130 ప్రాజెక్ట్‌లు ఈ తరహా అపార్ట్మెంట్లున్నాయి. అలాగే 2019లో 1,921 ప్రాజెక్ట్‌లు లాంచింగ్ అయ్యాయి. 368 ప్రాజెక్ట్‌లు(19 శాతం) ఈ స్టూడియో ఇళ్లే..లొకేషన్ ముఖ్యం.. స్టూడియో అపార్ట్మెంట్లను బ్యాచిలర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. విస్తీర్ణంతో కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. తరచూ ఇవి ఉపాధి, వ్యాపార కేంద్రాలు చుట్టూ, ఖరీదైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయని అనరాక్ గ్రూప్ సంస్థ తెలిపింది. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి మొదలైంది. దీంతో 2020 నుంచి పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ పెరిగినట్లు చెప్పింది. మన దగ్గర తక్కువే.. స్టూడియో అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాలలో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణే నగరాలో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ నడుస్తోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాలలో లాంచింగ్ అయిన స్టూడియో అపార్ట్మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణేలదే.. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో కేవలం 34 స్టూడియో ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది హెచ్–1లో 7 నగరాలలో ప్రారంభమైన 91 స్టూడియో ప్రాజెక్ట్‌లలో.. 71 ప్రాజెక్ట్‌లు ముంబైలోనే ఉన్నాయి. ఆ తర్వాత పుణేలో 18, బెంగళూరులో రెండు ప్రాజెక్ట్‌లు లాంచింగ్ అయ్యాయి. -
బజాజ్ కొత్త బైక్‌లు.. నాలుగు రైడింగ్ మోడ్లతో..
బజాజ్ ఆటో డామినార్ 400, డామినార్ 250 అప్ డేటెడ్ వెర్షన్ బైకులను లాంచ్ చేసింది. రెండింటిలో డామినార్ 250 ప్రారంభ ధర రూ .1.92 లక్షలు (ఎక్స్-షోరూమ్), డామినార్ 400 ప్రారంభ ధర రూ .2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). వీటికి సంబంధించిన వివరాలను బజాజ్ ఆటో ఇటీవల టీజ్ చేసింది. అప్డేట్లలో భాగంగా ఫీచర్లలో బజాబ్ సంస్థ మార్పులు చేసింది. మరిన్ని టూరింగ్ పరికరాలను జోడించింది. డిజైన్‌లో పెద్దగా మార్పులేమీ లేకుండా రైడర్ సౌకర్యం కోసం కొన్ని స్వల్ప సర్దుబాట్లు మాత్రం చేసింది.కొత్త ఫీచర్లురెండు డామినార్ బైక్‌లూ ఇప్పుడు నాలుగు రైడింగ్ మోడ్లతో వస్తాయి. అవి రెయిన్, రోడ్, స్పోర్ట్, ఆఫ్-రోడ్. అవసరాన్ని బట్టి థ్రోటిల్ రెస్పాన్స్, ఏబీఎస్ ఇంటర్వెన్షన్ స్థాయిలను మార్చడం ద్వారా రైడర్‌కు ఈ మోడ్లు సహాయపడతాయి. ఇక డామినార్ 400 బైక్‌లో ప్రత్యేకంగా రైడ్-బై-వైర్ ఫీచర్ ఇచ్చారు. డామినార్ 250లో మాత్రం మెకానికల్ థ్రోటిల్ సెటప్, నాలుగు ఏబీఎస్ మోడ్స్ ఉన్నాయి.మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్‌లో లాంటి డిజిటల్ డిస్ప్లేను ఈ రెండు డామినార్ బైక్‌లలో ఇచ్చారు. ఇది కొత్త స్విచ్ గేర్ తో పనిచేసే కలర్ ఎల్సీడీ బాండెడ్ గ్లాస్ స్పీడోమీటర్. ఎక్కువ దూరం బైక్ నడిపే రైడర్లకు మరింత సౌలభ్యం కోసం హ్యాండిల్ బార్లను కూడా మార్చినట్లు బజాజ్ పేర్కొంది. రైడర్లు తమ జీపీఎస్ పరికరాలు లేదా స్మార్ట్ఫోన్లను కనెక్ట్ చేసుకునేందుకు జీపీఎస్ మౌంట్‌ను చేర్చింది.ఇక మెకానిక్స్ పరంగా చూస్తే ఎటువంటి మార్పులు లేవు. డామినార్ 400 బైకులో 373 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 8,800 ఆర్పీఎం వద్ద 39 బీహెచ్నపీ పవర్, 6,500 ఆర్పీఎం వద్ద 35 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. అదేవిధంగా డొమినార్ 250 విషయానికి వస్తే 248 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 8,500 ఆర్పీఎం వద్ద 26 బీహెచ్పీ పవర్, 6,500 ఆర్పీఎం వద్ద 23 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఈ ఇంజన్ కూడా 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో జతై ఉంటుంది. -
సిటీ రియల్ ఎస్టేట్‌కి ‘ఐటీ’ బూస్ట్..
రియల్ ఎస్టేట్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగం కీలకమైంది. మన సిటీ స్థిరాస్తికి ఐటీ బూస్ట్‌లాగా మారింది. ఐటీ ఉద్యోగులపై ఆధారపడి గృహ విక్రయాలు ఎంత జరుగుతాయో.. అంతకు రెట్టింపు స్థాయిలో ఐటీ సంస్థల లావాదేవీలు జరుగుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమాది ప్రాంతాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఆఫీస్ స్పేస్.. గ్రోత్ ఇన్ డిస్పర్షన్ (గ్రిడ్) పాలసీతో నగరం నలువైపులా విస్తరించింది. – సాక్షి, సిటీబ్యూరోఈ పాలసీలో భాగంగా ప్రభుత్వం ఔటర్ వెంబడి ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఉన్న 11 పారిశ్రామిక పార్క్‌లను ఐటీ పార్క్‌లుగా మార్చింది. దీంతో పాటు కొంపల్లిలో ఐటీ టవర్, కొల్లూరులో ఐటీ పార్క్‌లను నిర్మిస్తోంది. ఫలితంగా పశ్చిమం వైపున కాకుండా ఇతర ప్రాంతాలలో కొత్తగా 3.5–4 కోట్ల చ.అ. ఐటీ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుందని జేఎల్ఎల్ తెలిపింది. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో హైదరాబాద్ దూసుకెళుతోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే గణనీయమైన వృద్ధి రేటు నమోదు చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం 9.04 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ ఉన్న మన సిటీ.. ఈ ఏడాది ముగింపు నాటికి 10 కోట్ల చ.అ. మైలురాయిని దాటనుందని జేఎల్ఎల్ సర్వేలో తేలింది.ఆఫీస్ స్పేస్ మార్కెట్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ తర్వాత హైదరాబాద్ నాల్గో స్థానంలో నిలిచింది. కొంత కాలంగా కొంపల్లి, బాచుపల్లి, మేడ్చల్ వంటి ఉత్తరాది ప్రాంతాలు, ఎల్బీనగర్, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలలో నివాస క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఆయా ప్రాంతాలలోని అందుబాటు గృహాలను ఐటీ ఉద్యోగులు కొనుగోలు చేస్తున్నారు.81 శాతం వృద్ధి రేటు..కొన్నేళ్లుగా గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ నగరం మెరుగైన స్థానాన్ని నమోదు చేస్తుంది. హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఉన్న బెంగళూరు గత ఆరేళ్లలో 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ విభాగంలో హైదరాబాద్ నగర భాగస్వామ్యం ఇటీవలి వరకు 12.7 శాతంగా ఉండగా.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్పేస్‌తో 25 శాతానికి పెరిగింది. గ్రిడ్ పాలసీ అమలుతో.. గ్రిడ్ పాలసీతో నగరం నలువైపులా ఐటీ విస్తరించింది. డెవలపర్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అమలు చేస్తోంది. మూడు సంవత్సరాల వ్యవధిలో 500 లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లకు యాంకర్ యూనిట్ ప్రోత్సాహకాలను అందిస్తోంది.ఇందులో సంబంధిత భూమిని 50 శాతం ఐటీ, ఐటీఈఎస్ ప్రయోజనాల కోసం వినియోగించగా.. మిగిలిన సగంలో నివాస, వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించవచ్చనే వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ అనేది కేవలం రెండు ప్రధాన కారిడార్లలోనే కేంద్రీకృతమై ఉంది. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఇంజిన్లుగా పనిచేస్తున్నాయి. 96 శాతం స్పేస్ ఈ ప్రాంతాల నుంచే ఉంటుంది. -
టూ వీలర్స్ పెరుగుతాయ్.. ప్యాసింజర్ వాహనాలు తగ్గుతాయ్!
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహన హోల్‌సేల్(టోకు) అమ్మకాల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో 1–4 శాతంగా ఉండొచ్చని ఇక్రా రేటింగ్ సంస్థ అంచనా వేసింది. అధిక ఇన్వెంటరీ, ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే ‘రేర్ ఎర్త్ మాగ్నెట్’ వంటి కీలక ఉపకరణాల కొరత విక్రయాలపై ప్రభావాన్ని చూపొచ్చని పేర్కొంది.అంతకు ముందు.. ఇదే ఎఫ్వై 26లో అమ్మకాల వృద్ధి 4–7% ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చర్లు(ఓఈఎం)నుంచి స్థిరమైన మోడళ్ల ఆవిష్కరణలు పరిశ్రమ అమ్మకాలకు పాక్షిక మద్దతునిస్తాయని వివరించింది.మే అమ్మకాలు డిమాండ్ క్షీణతకు సంకేతాలు భారత్ – పాకిస్థాన్ యుద్ధంతో ఉత్తర భారతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు కస్టమర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా ఈ ఏడాది మే నెలలో 3,02,214 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే ఏడాది ఏప్రిల్ అమ్ముడైన 3,49,939 యూనిట్లతో పోలిస్తే ఇవి 13.6% తక్కువ. ఈ అమ్మకాలు డిమాండ్ క్షీణతకు సంకేతాలని ఇక్రా తెలిపింది. టూ వీలర్స్‌కు ‘గ్రామీణం’ దన్ను ఇదే ఎఫ్వై 26లో ద్విచక్రవాహన అమ్మకాల వృద్ధి 6–9 శాతంగా ఉండొచ్చని తెలిపింది. స్థిరమైన గ్రామీణ ఆదాయాలు, సాధారణ వర్షపాత నమోదు, పట్టణ మార్కెట్ పెరగడం తదితర అంశాలు టూ వీలర్స్‌కు డిమాండ్‌ను పెంచుతాయి. గ్రామీణ డిమాండ్, మెరుగైన సాగుతో ద్విచక్రవాహన రిటైల్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదిన 7% వృద్ధి సాధించాయి. -
బ్యాంకులకు ఆర్బీఐ కీలక సూచనలు
ఆన్లైన్ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టే దిశగా టెలికం శాఖ (డాట్)రూపొందించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఆర్ఐ) ప్లాట్‌ఫాంను ఉపయోగించుకోవాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది. మధ్యస్థ, అధిక, అత్యధిక ఆర్థిక మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను ఇది రియల్ టైమ్‌లో వర్గీకరిస్తుందని పేర్కొంది.ఆర్బీఐ ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు డాట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం చెల్లింపులకు యూపీఐ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా కోట్ల మందిని ఈ సాంకేతికత కాపాడగలదని వివరించింది.డాట్లో భాగమైన డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) ఈ ఏడాది మే నెలలో ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్ఐని ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫోన్‌పే, పేటీఎ మొదలైన దిగ్గజ సంస్థలు ఉపయోగిస్తున్నాయి.ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్, డాట్‌కు చెందిన చక్షు ప్లాట్‌ఫాంలతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే డేటా ఆధారంగా ఎఫ్ఆర్ఐ పని చేస్తుంది. బ్యాంకుల మెరుగైన పనితీరుతో పరపతి మెరుగుగడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌లు మెరుగైన పనితీరు నమోదు చేయడం వాటి పరపతి ప్రొఫైల్‌కు, భవిష్యత్ వృద్ధికి అనుకూలమని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. నాలుగేళ్లలో తక్కువ రుణ వృద్ధి నమోదు అయినప్పటికీ.. మెరుగైన ఆస్తుల నాణ్యత, పటిష్టమైన నగదు నిల్వలు, స్థిరమైన లాభాలను చూపించినట్టు పేర్కొంది.‘‘ఇక ముందూ స్థిరమైన పనితీరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడం, మిగులు నిల్వలతో నష్టాలను సర్దుబాటు చేసుకోగల సామర్థ్యం ఉండడం, గత సైకిల్‌తో పోల్చితే ఆర్థిక షాక్‌లను తట్టుకుని నిలబడే సామర్థ్యం.. ఇవన్నీ రేటెడ్ బ్యాంకుల స్టాండలోన్ రుణ పరపతికి సానుకూలం’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది.2025–26లో రుణ పరపతి పరంగా బ్యాంక్‌లు స్థిరమైన పనితీరు చూపిస్తాయని పేర్కొంది. 2024–25లో ప్రభుత్వ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.1.41 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 26 శాతం ఎక్కువ. -
రోబో ఇసుక.. ఇప్పుడిదే ప్రత్యామ్నాయం
సాక్షి, సిటీబ్యూరో: నది ఇసుక కొరత, అధిక ధరల కారణంగా గ్రేటర్ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇసుక రవాణా దారులు రేట్లు పెంచడం నిర్మాణ రంగానికి మరింత భారంగా పరిణమించింది. మహానగరంలో ఇసుక దొరకడం గగనమవడంతో బిల్డర్లు ప్రత్యామ్నాయంగా రోబో ఇసుక వినియోగాన్ని పెంచారు.ధర తక్కువే.. ఇప్పటికే కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్లలో రోబో ఇసుక (క్రష్డ్ రాక్ సాండ్)ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక రేట్లతో పోలిస్తే దీని ధర ఎంతో తక్కువ. అయితే రోబో ఇసుక విరివిరిగా దొరక్కపోవడం.. ప్రత్యేకంగా కొన్ని క్రషర్లలోనే ఇలాంటి ఇసుకను ఉత్పత్తి చేస్తుండటంతో సాధారణ గృహ నిర్మాణాల్లో దీని వినియోగం తక్కువగా ఉంది. అలాగే రోబో ఇసులాగే మెటల్ క్రషింగ్ స్టోన్ డస్ట్ కూడా ఉండటం వీటిలో నాణ్యమైన ఇసుకను గుర్తించడం కష్టంగా మారుతోంది.రోబో తయారీ ఈజీ.. నగర శివార్లలో విరివిగా లభ్యమయ్యే గ్రనైట్ శిలలతో రోబోశాండ్‌ను ఉత్పత్తి చేయవచ్చు. మెటల్ క్రషర్స్‌లో మిగిలిన వ్యర్థ శిలలను 2ఎంఎం, 1ఎంఎం పరిమాణంలో క్రష్ చేసి జల్లెడ పడితే ఈ ఇసుక తయారవుతుంది. తక్కువ సమయంలో నాణ్యత కలిగిన ఇసుకను తయారు చేయవచ్చన్నది నిపుణుల మాట. ఈ ఇసుకను నగరంలో రెడీమిక్స్ యూనిట్ల ద్వారా భారీ నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. -
హైదరాబాద్ వెస్ట్ హవా.. జోరుగా విల్లా ప్రాజెక్ట్‌లు
కోవిడ్ తర్వాత విల్లాలపై ఆసక్తి మరింత పెరిగింది. సామాన్య, మధ్యతరగతితో పోలిస్తే కరోనా లగ్జరీ గృహ కొనుగోలుదారుల మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ఫలితంగా ఈ విభాగం గృహ విక్రయాలలో వృద్ధి నమోదవుతోంది. ఎక్స్ఛేంజ్ రేటు తక్కువగా ఉండటం కారణంగా ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. - సాక్షి, సిటీబ్యూరోపశ్చిమంలో హవా.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో పశ్చిమ ప్రాంతాల హవా కొనసాగుతోంది. మూడు త్రైమాసికాల నుంచి కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ పశ్చిమ హైదరాబాద్‌లో 57 శాతం జరిగాయి. ఉత్తరాదిలో 18 శాతం, తూర్పులో 15 శాతం, సెంట్రల్లో 8 శాతం, సౌత్ హైదరాబాద్‌లో 2 శాతం లాంచింగ్స్ జరిగాయి.వెస్ట్ హైదరాబాద్‌లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్‌లో అత్తాపూర్‌లు రియల్టీ హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందన్న సూత్రం ప్రకారమే.. డెవలపర్లు కూడా ప్రాజెక్ట్ లాంచింగ్‌లలో లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. -
ఆట బొమ్మల ఉత్పత్తికి ప్రోత్సాహం.. త్వరలో కొత్త పథకం
పరిశ్రమతో సంప్రదింపుల అనంతరం దేశంలో ఆట బొమ్మల ఉత్పత్తిని (టాయ్స్) పెంచేందుకు త్వరలోనే ఓ పథకాన్ని ఖరారు చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టాయ్స్ తయారీకి, ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఏఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు.ప్రభుత్వం తీసుకొచ్చే పథకం ఎగుమతులకు ప్రోత్సాహకాల రూపంలో ఉండదని.. దేశీయంగా తయారీని పెంచేందుకు, ఉపాధి కల్పనకు ఊతమిస్తుందన్నారు. డిజైన్ సామర్థ్యాలు, నాణ్యతతో కూడిన తయారీ, బ్రాండ్ నిర్మాణానికి మద్దతు రూపంలో ఈ పథకం ఉంటుందని చెప్పారు. ఒకప్పుడు ఆట బొమ్మల కోసం దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడగా.. ప్రస్తుతం దేశీయంగానే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడంతోపాటు, 153 దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. విధానపరమైన మద్దతు చర్యలు, నాణ్యతా ప్రమాణాల అమలు, స్థానిక తయారీ క్లస్టర్లను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యమైనట్టు వివరించారు.140 కోట్ల జనాభా కలిగిన దేశం కావడంతో తయారీ కార్యకలాపాల విస్తరణతో సహజ ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆట బొమ్మల ఎగుమతులను పెంచుకునేందుకు చక్కని బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్, బలమైన డిజైన్‌పై దృష్టి సారించాలని పరిశ్రమకు గోయల్ సూచించారు. వినూత్నమైన ఆట»ొమ్మల నమనాలను అభివృద్ధి చేసిన స్టార్టప్‌లకు పీఎం ముద్రాయోజన కింద పెద్ద ఎత్తున నిధుల మద్దతు అందించినట్టు చెప్పారు. -
పూర్తిగా మహిళా ఉద్యోగులతో ఇన్సూరెన్స్ బ్రాంచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా సంస్థ ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్ఎల్ఐ) తాజాగా హైదరాబాద్‌లో పూర్తిగా మహిళా సిబ్బందితో బ్రాంచీని ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలో ఈ తరహా ఆల్–ఉమెన్ బ్రాంచీని ప్రారంభించగా, ఇది రెండోదని వివరించింది.దీనితో హైదరాబాద్‌లో తమ శాఖల సంఖ్య 7కు, దేశవ్యాప్తంగా 433కి చేరిందని కంపెనీ ఎండీ కమలేష్ రావు తెలిపారు. మహిళా అడ్వైజర్లకు సహాయకరంగా ఉండేలా ఈ శాఖలో కిడ్స్ రూమ్లాంటి సదుపాయాలు కూడా ఉంటాయని వివరించారు.ఆదిత్య బిర్లా గ్రూప్ (ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ ద్వారా), కెనడా ఆర్థిక సేవల దిగ్గజం సన్ లైఫ్ ఫైనాన్షియల్ మధ్య జాయింట్ వెంచర్‌గా 2000 ఆగస్టులో ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ ఏర్పాటైంది. 2001 జనవరిలో కార్యకలాపాలను ప్రారంభించిన ఈ సంస్థ దేశంలోని టాప్ ప్రైవేట్ జీవిత బీమా కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. -
‘టాటా పవర్’ ఇక చూపిస్తాం..!
టాటా పవర్ అచ్చమైన సోలార్, పవన విద్యుత్ సంస్థ నుంచి పూర్తిస్థాయి హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన రంగ శక్తిగా అవతరిస్తుందని సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. అణు విద్యుత్ అభివృద్ధిని సైతం భవిష్యత్తులో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. టాటా పవర్ 106వ వార్షిక వాటాదారుల సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. విద్యుదుత్పాదన, అమలు దశలో కలిపి మొత్తం 25 గిగావాట్ల సామర్థ్యాన్ని కంపెనీ 2024–25లో అధిగమించినట్టు చెప్పారు. ఇందులో 65 శాతం శుద్ధ, పర్యావరణ అనుకూల ఇంధనాల నుంచే ఉన్నట్టు తెలిపారు. ఇటీవలి ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ దశను మలుపు తిప్పిన దివంగత గౌరవ చైర్మన్ రతన్ టాటా సేవలను సైతం ఈ సందర్భంగా స్మరించుకున్నారు.గత ఆర్థిక సంవత్సరంలో టాటా పవర్ పునరుత్పాదక, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి భూటాన్ డ్రక్తో వ్యూహాత్మక ఒప్పందం చేసుకోవడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలోనే తమిళనాడులోని తిరునల్వేలిలో ఏర్పాటు చేసిన 4.3 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ ప్లాంట్‌ను సంస్థ ప్రారంభించింది. రూ.4,800 కోట్ల విలువ చేసే విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులను సైతం దక్కించుకుంది. -
కొత్త రకం బ్యాంక్.. ఏటీఎం.. క్రెడిట్ కార్డ్
ఫిన్‌టెక్ కంపెనీ ‘స్లైస్’ దేశంలో మొట్టమొదటి యూపీఐ ఆధారిత ఫిజికల్ బ్యాంక్ బ్రాంచ్ ఏటీఎంతో పాటు స్లైస్ యూపీఐ క్రెడిట్ కార్డు అనే పేరుతో తన ఫ్లాగ్షిప్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. ఈ స్లైస్ యూపీఐ క్రెడిట్ కార్డుకు ఎటువంటి జాయినింగ్ లేదా వార్షిక రుసుము ఉండదు వినియోగదారులు తమ క్రెడిట్ లైన్ నుండి డ్రాయింగ్ ద్వారా యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చు.ఇతర ప్రయోజనాలుస్లైస్ యూపీఐ క్రెడిట్ కార్డుతో పలు ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి. అన్ని లావాదేవీలపై కార్డుదారులకు 3 శాతం వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇందులో "స్లైస్ ఇన్ 3" ఫీచర్ కూడా ఉంది. అంటే వినియోగదారులు కొనుగోలును మూడు వడ్డీ లేని వాయిదాలుగా విభజించుకోవచ్చు. "స్లైస్ తో వినియోగదారులు తమ క్రెడిట్ కార్డును నేరుగా యూపీఐకి లింక్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాను ఉపయోగించినట్లే దీనిని ఉపయోగించవచ్చు. క్యూఆర్ లను స్కాన్ చేయడం, స్టోర్లలో చెల్లించడం, బిల్ స్ల్పిట్, ఆన్లైన్ లో ఆర్డర్ వంటివి చేసుకోవచ్చు" అని స్లైస్ తెలిపింది.యూపీఐ బ్యాంక్.. ఏటీఎంక్రెడిట్ కార్డుతో పాటు స్లైస్ బెంగళూరులోని కోరమంగళలో యూపీఐ ఆధారిత బ్యాంక్ శాఖను స్లైస్ ప్రారంభించింది. ఈ శాఖలో యూపీఐ ఏటీఎం ఉంది. ఇక్కడ వినియోగదారులు క్యాష్ విత్‌డ్రాలు, డిపాజిట్లు చేయవచ్చు. ఖాతాలను తెరవడం వంటి ఇతర సేవలను వినియోగించుకోవచ్చు. స్లైస్ అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ బ్రాంచ్ అన్ని కస్టమర్ ఇంటరాక్షన్ లలో మొత్తం యూపీఐ ఇంటిగ్రేషన్ ను అందిస్తుంది. ఎటువంటి సుదీర్ఘ ప్రక్రియలు లేకుండా తక్షణ కస్టమర్ ఆన్‌బోర్డింగ్ చేస్తుంది. -
హైదరాబాద్‌లో అపార్ట్మెంట్ల ధరలు ఆకాశానికి..
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే మన నగరంలోనే అపార్ట్మెంట్ల ధరలు తక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. దేశంలో ముంబై తర్వాత ఖరీదైన సిటీగా మన నగరం అభివృద్ధి చెందింది. రెండో అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయింది.వార్షిక ప్రాతిపదికన హైదరాబాద్‌లో ప్రాపర్టీల విలువ 6 శాతం వృద్ధి చెంది.. చ.అ. ధర సగటున రూ.5,800 నుంచి రూ.6 వేలకు పెరిగింది. ముంబైలో ఏడాదిలో 3 శాతం పెరిగి.. రూ.9,600 నుంచి రూ.9,800లకు చేరిందని ప్రాప్‌టైగర్.కామ్ నివేదిక వెల్లడించింది.దాదాపు పదేళ్ల కాలంలో అతి తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు ఉండటం, స్టాంప్ డ్యూటీలను తగ్గించడం, సర్కిల్ ధరలలో సవరణలతో పాటు గృహ కొనుగోళ్లలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో అందుబాటు ధరలలోని ఇళ్ల విక్రయాలలో అత్యధిక వృద్ధి నమోదైంది.ఒకవైపు సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులకు రాయితీలను అందిస్తున్నాయి. లేదంటే ఆయా నగరాలలో ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదముంది. -
అమెరికా సీఈవో ఫోరంపై నాస్కామ్ కసరత్తు
భారత్, అమెరికా టెక్ దిగ్గజాలు కలిసి పని చేసేలా ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. జూలై 9న అమెరికా న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో యూఎస్ సీఈవో ఫోరంను ప్రారంభించనున్నట్లు వివరించింది.కొత్త ఆవిష్కరణలు, పాలసీలు, నిపుణులను తయారు చేసుకోవడం వంటి అంశాలపై అత్యున్నత స్థాయి లో సంప్రదింపులు నిర్వహించేందుకు ఇది తోడ్పడుతుందని నాస్కామ్ పేర్కొంది. ప్రవాస భారతీయులు, ప్రభుత్వం, పరిశ్రమ, ఇన్వెస్ట్మెంట్, మేధావులు, విద్యావేత్తలు మొదలైన వర్గాలను సమన్వయపర్చడం ద్వారా భారత్–అమెరికా టెక్ భాగస్వామ్యాన్ని పటిష్టపర్చేందుకు సహాయకరంగా ఉంటుందని తెలిపింది.భారతీయ టెక్నాలజీ కంపెనీలు అమెరికా అంతటా డిజిటల్ పరివర్తనను శక్తివంతం చేయడమే కాకుండా, ఉద్యోగాలను సృష్టించడం, స్థానిక కమ్యూనిటీలలో పెట్టుబడులు పెట్టడం, నిజమైన ప్రభావాన్ని అందించే ఆవిష్కరణలను నడిపిస్తున్నాయని నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్ అన్నారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ సీఈఓ అమిత్ చద్దా, విప్రోలో అమెరికాస్ వన్ సీఈఓ మలయ్ జోషితో పాటు నంబియార్ ఈ ఫోరం ప్రారంభ సమావేశంలో పాల్గొంటారని నాస్కామ్ తెలిపింది. -
తగ్గినట్టే తగ్గి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
దేశంలో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. వరుసగా పెరుగుతూ హ్యాట్రిక్ కొట్టిన పసిడి ధరలు క్రితం రోజున దిగివచ్చి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. అయితే ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
జీఎస్టీ మూడు శ్లాబులకు తగ్గాలి
దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.4–6.7 శాతం మేర వృద్ధి చెందుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ అనిశి్చతుల రిస్క్ నెలకొన్పప్పటికీ, బలమైన దేశీ డిమండ్ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమాని అభిప్రాయపడ్డారు. సీఐఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మెమానీ మీడియాతో మాట్లాడారు.రుతుపవనాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు, వ్యవస్థలో నగదు లభ్యత పెంచే దిశగా ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని చెప్పారు. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని ఒక శాతం, రెపో రేటును అరశాతం తగ్గిస్తూ ఆర్బీఐ జూన్ మొదట్లో నిర్ణయం ప్రకటించడం తెలిసిందే. సీఆర్ఆర్ తగ్గించడం వల్ల వ్యవస్థలోకి రూ.2.5 లక్షల కోట్ల నిధుల లభ్యత పెరగనుంది. విదేశీ వాణిజ్యపరమైన రిస్క్లున్నాయంటూ.. అవి తటస్థం చెందుతాయని అంచనా వేస్తున్నట్టు మెమానీ చెప్పారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వృద్ధికి ప్రతికూలంగా మారినా దేశీ డిమాండ్ ఆదుకుంటుందన్నారు. జీఎస్టీ మరింత సరళం.. మూడు సులభతర శ్లాబులతో జీఎస్టీని మరింత సులభంగా మార్చాలని మెమానీ కోరారు. నిత్యావసరాలను 5 శాతం రేటు కింద, విలాసవంతమైన, హానికర వస్తువులను 28 శాతం రేటులో, మిగిలిన వస్తువులన్నింటినీ 12–18 శాతం మధ్య ఒక రేటు కిందకు తీసుకురావాలని సూచించారు. 28 శాతం రేటు అమలవుతున్న సిమెంట్ తదితర కొన్నింటిని తక్కువ రేటు కిందకు తీసుకురావాలన్నారు. అలా చేయడం ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్రోల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఆల్కహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్త ఏకాభిప్రాయం అవసరమన్నారు. -
మెట్రోల్లోనే క్విక్ కామర్స్ జోరు..
క్విక్‌కామర్స్ రంగం శరవేగంగా వృద్ధి సాధిస్తున్నప్పటికీ.. మెట్రోలకు వెలుపల పట్టణాల్లో లాభదాయకమైన విస్తరణ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని మార్కెట్ పరిశోధనా సంస్థ రెడ్‌సీర్ తెలిపింది. క్విక్‌కామర్స్ సంస్థల స్థూల వస్తు విక్రయ విలువ (జీఎంవీ)లో నాన్ మెట్రోలు 20 శాతం వాటానే భర్తీ చేస్తున్నట్టు పేర్కొంది. తక్కువ డిమాండ్, డిజిటల్ పరిణతి తక్కువగా ఉండడం, స్థానిక షాపింగ్ అలవాట్లను రెడ్‌సీర్ నివేదిక ప్రస్తావించింది.2025 మొదటి ఐదు నెలల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు క్విక్ కామర్స్ సంస్థల ఆదాయం 150 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. డార్క్ స్టోర్లను పెద్ద ఎత్తున ప్రారంభించడం, వివిధ విభాగాల్లోకి దూకుడుగా ఎంట్రీ ఇవ్వడం, తీవ్రమైన పోటీ ఈ వృద్ధికి నేపథ్యాలుగా వివరించింది. టాప్–10–15 పట్టణాల వెలుపల ఒక్కో డార్క్స్టోర్కు వచ్చే రోజువారీ ఆర్డర్ల తగ్గుదల వేగంగా ఉందని వెల్లడించింది. 1,000 దిగువకు ఆర్డర్లు తగ్గాయని.. టాప్15కు తదుపరి టాప్ 20 పట్టణాల్లో డార్క్ స్టోర్ వారీ ఆర్డర్లు 700 దిగువకు తగ్గినట్టు తెలిపింది.ఇది డిమాండ్ బలహీనతను తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఆన్లైన్ సంస్థల పట్ల నమ్మకం తక్కువగా ఉండడం, డిజిటల్ టెక్నాలజీల పట్ల అవగాహన తక్కువగా ఉండడం ఆర్డర్లు పరిమితంగా ఉండడానికి కారణంగా పేర్కొంది. జనాభా కూడా తక్కువగా ఉండడాన్ని గుర్తు చేసింది. క్విక్‌కామర్స్ సంస్థలు ఆఫర్ చేసే వస్తు శ్రేణి స్థానికుల అభిరుచులకు అనుగుణంగా ఉండకపోవడాన్ని పేర్కొంది.దీనికితోడు ఈ ప్రాంతాల్లో స్థానిక రిటైల్ స్టోర్లకు, ప్రజలకు మధ్య ఉండే బలమైన సంబంధాలను ప్రస్తావించింది. దీంతో మెట్రోలతో పోల్చితే నాన్ మెట్రోల్లో ఒక్కో డార్క్‌స్టోర్ లాభం–నష్టాల్లేని స్థితి రావడానికి రెట్టింపు సమయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది. -
ఎల్ఐసీ కొత్త పాలసీలు..
ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా నవ జీవన్ శ్రీ, నవ జీవన్ శ్రీ - సింగిల్ ప్రీమియం పేరుతో రెండు కొత్త సేవింగ్ పాలసీలను ప్రారంభించింది. ఇవి నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, లైఫ్ కవరేజ్ కలిగిన వ్యక్తిగత సేవింగ్ ప్లాన్లు. బీమా రక్షణతో పాటు పెట్టుబడికి భద్రత, వడ్డీ రాబడి కోరుకునేవారికి ఇవి అనువుగా ఉంటాయి. ఈ పాలసీలు 2025 జూలై 4 నుంచి 2026 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఎల్ఐసీ తెలిపింది. నవ జీవన్ శ్రీ - రెగ్యులర్ ప్రీమియం (ప్లాన్ నెం.912) ఇది ఒకేసారి కాకుండా విడతల వారీగా ప్రీమియం చెల్లించే వారికి అనువైన ప్లాన్. కనీస సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు, గరిష్ఠ పరిమితి లేదు. వయస్సు పరిమితి 30 రోజుల నుంచి 75 ఏళ్ల వరకు. మెచ్యూరిటీ నాటికి కనిష్ట వయసు 18 సంవత్సరాలు కాగా గరిష్ట వయసు 75 ఏళ్లు. 6, 8, 10 లేదా 12 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధులను ఎంచుకోవచ్చు. పాలసీ టర్మ్ కనీసం 10 సంవత్సరాలు. 15, 16, 20 ఏళ్ల వ్యవధిని కూడా ఎంచుకోవచ్చు. గ్యారెంటీడ్ అడిషన్లు: 10-13 ఏళ్ల పాలసీకి - 8.50 శాతం, 14-17 సంవత్సరాలకు 9 శాతం, 18-20 ఏళ్ల కాలానికి 9.50 శాతం చొప్పున గ్యారెంటీడ్ అడిషన్లు లభిస్తాయి.డెత్ బెనిఫిట్: ఆప్షన్ 1 కింద - కనీస సమ్ అష్యూర్డ్‌తోపాటు వార్షిక ప్రీమియానికి 7 రెట్లు, ఆప్షన్ 2 కింద - వార్షిక ప్రీమియానికి 10 రెట్లు + బేసిక్ సమ్ అష్యూర్డ్ చెల్లిస్తారు.దీనికి కూడా యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్ వంటి వాటిని జోడించుకునే వెసులుబాటు ఉంది. మెచ్యూరిటీ తర్వాత లేదా రిస్క్ జరిగినప్పుడు చెల్లింపు: మొత్తం డబ్బును ఒకేసారి లేదా నెలవారీ/త్రైమాసిక/అర్ధవార్షిక/వార్షిక ప్రాతిపదికన పొందవచ్చు. ప్రీమియం చెల్లింపును కూడా ఇదే విధంగా ఎంపిక చేసుకోవచ్చు.నెలకు రూ.10 వేలతో రూ.26 లక్షలుఒక వ్యక్తి రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకుంటే.. ఆప్షన్ 2 కింద 10 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకుంటే వార్షిక ప్రీమియం రూ.1,10,900 కట్టాలి. అదే నెలవారీ అయితే రూ.10,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పదేళ్లకూ చెల్లించే మొత్తం సొమ్ము: రూ.11,09,000 అవుతుంది. పాలసీ వ్యవధి 20 సంవత్సరాలు పూర్తయ్యాక రూ.16,58,786 గ్యారెంటీడ్ అడిషన్ రూపంలో లభిస్తాయి. మొత్తం కలుపుకొంటే మెచ్యూరిటీ తర్వాత రూ.26,58,786 లభిస్తుంది.నవ జీవన్ శ్రీ- సింగిల్ ప్రీమియం (ప్లాన్ నం.911) ఈ పాలసీ ఒకేసారి ఏకమొత్తం పెట్టుబడి పెట్టదలచుకున్న వారికి అనువుగా ఉంటుంది. ఈ పాలసీని 30 రోజుల నుండి 60 ఏళ్ల వయస్సు వరకూ ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ఆప్షన్ 2 కింద మాత్రం గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు మాత్రమే. మెచ్యూరిటీ సమయానికి కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠంగా 75 ఏళ్లు (ఆప్షన్ 2లో 60) ఉండాలి. పాలసీ వ్యవధి కనీసం 5 సంవత్సరాలు, గరిష్ఠంగా 20 సంవత్సరాలు. కనీస హామీ మొత్తం (Sum Assured) రూ.1 లక్ష. గరిష్ఠ పరిమితి లేదు. డెత్ బెనిఫిట్: ఆప్షన్ 1 కింద - సింగిల్ ప్రీమియానికి 1.25 లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. ఆప్షన్ 2 కింద - సింగిల్ ప్రీమియానికి 10 రెట్లు రిస్క్ కవరేజీ లభిస్తుంది.గ్యారెంటీడ్ అడిషన్: ప్రతి వెయ్యి రూపాయల బేసిక్ సమ్ అష్యూర్డ్‌పై రూ.85 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది. యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ వంటి అదనపు రైడర్లను కూడా జోడించుకోవచ్చు.రిస్క్ లేదా మెచ్యూరిటీ సమయంలో చెల్లింపు: మొత్తాన్ని ఒకేసారి లేదా నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షిక పద్ధతిలో పొందే అవకాశముంది. రూ.5 లక్షలకు రూ.7.12 లక్షలు18 ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల వ్యవధికి రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకుంటే.. సింగిల్ ప్రీమియం రూ.5,39,325 చెల్లించాలి. దీనికి ప్రతి ఏడాది గ్యారెంటీడ్ అడిషన్‌గా రూ.42,500 వస్తుంది.(మొత్తం రూ.2,12,500). ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మొత్తంగా రూ.7,12,500 లభిస్తుంది. ఒకవేళ చివరి సంవత్సరంలో రిస్క్ జరిగితే గరిష్టంగా రూ.9.17 లక్షలు ఎల్ఐసీ నుంచి లభిస్తాయి. -
ఏఐ డ్రోన్లకు భారీగా ఆర్డర్లు
ఏఐ ఆధారిత డ్రోన్ సొల్యూషన్స్ కోసం గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ విభాగాల నుంచి పలు కాంట్రాక్టులు లభించినట్లు డ్రోన్ టెక్నాలజీ సంస్థ గరుడా ఏరోస్పేస్ తెలిపింది. ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్‌తో ఒప్పందం ప్రకారం వార్షిక సర్వేల నిర్వహణ, గనుల మూసివేత ప్రణాళికల కోసం డిజిటల్ డేటాబేస్లను, సర్వే మ్యాప్‌లు మొదలైన వాటిని తయారు చేయాల్సి ఉంటుంది.అలాగే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తమిళనాడుకు చెందిన జియాలజీ, మేనింగ్ డిపార్ట్మెంట్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ టెండర్లను కూడా గరుడ ఏరోస్పేస్ దక్కించుకుంది. అటు ఝార్ఖండ్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ నుంచి కూడా కాంట్రాక్టు లభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు అగ్నీశ్వర్ జయప్రకాష్ చెప్పారు.తమ డ్రోన్ యాజ్ ఏ సర్వీస్(డాస్) మోడల్ వినియోగం పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని, తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ఈ కాంట్రాక్టులు తోడ్పడతాయని వివరించారు. -
రూ.7.5 కోట్ల కారు.. బడా బిజినెస్‌మ్యాన్ కక్కుర్తి..
రోడ్ ట్యాక్స్ చెల్లించకుండా బెంగళూరు వీధుల్లో తిరుగుతున్న ఫెరారీ లగ్జరీ సూపర్ కారును ప్రాంతీయ రవాణా కార్యాలయ అధికారులు పట్టుకున్నారు. ట్యాక్స్ కడతావా.. సీజ్ చేయమంటావా అని అధికారులు పట్టుబట్టడంతో కారు యజమాని రూ.1.42 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.రూ.7.5 కోట్ల విలువైన బ్రైట్ రెడ్ ఫెరారీ ఎస్ఎఫ్ 90 స్ట్రాడేల్ కారు కొన్ని నెలలుగా బెంగళూరు వీధుల్లో షికారు చేస్తోంది. ఈ లగ్జరీ కారు మహారాష్ట్రలో రిజిస్టర్ అయిందని, అలాంటి వాహనాలపై అక్కడ లైఫ్‌టైమ్ ట్యాక్స్ రూ.20 లక్షలు ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. ‘మహారాష్ట్రలో ఇలాంటి కార్లపై పన్ను రూ.20 లక్షలు కాగా, కర్ణాటకలో ఇది దాదాపు రూ.1.5 కోట్లు. ఈ వాహనం రెండేళ్ల క్రితం మహారాష్ట్రలో రిజిస్టర్ అయింది’ అని రవాణా అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది.జయనగర్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) అధికారులు నగరంలో తరచూ కనిపిస్తున్న ఫెరారీ కారుపై నిఘా పెట్టి పట్టుకున్నారు. డాక్యుమెంట్లు ఇంట్లో ఉన్నాయని డ్రైవర్ తొలుత చెప్పాడు. కారు రిజిస్ట్రేషన్‌ను పరిశీలించిన అధికారులు కర్ణాటక పన్ను చెల్లించకుండా 18 నెలలకు పైగా బెంగళూరులో ఈ వాహనం తిరుగుతున్నట్లు గుర్తించారు. ఏం చేయాలని అధికారులు తమ ఉన్నతాధికారులను సంప్రదించగా బకాయిలు చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఫెరారీ కారు యజమాని అదే రోజు పన్నులు, జరిమానాల రూపంలో రూ.1.4 కోట్లు చెల్లించాడు.కాగా ఈ ఖరీదైన ఫెరారీ కారు యజమాని ఓ బడా వ్యాపారవేత్త. దేశంలోని 55 నగరాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్త తక్కువ పన్ను రేటు కారణంగా మహారాష్ట్రలో తన ఫెరారీ కారును రిజిస్టర్ చేయించుకుని బెంగళూరులో తిప్పుతున్నన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కర్ణాటక నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రంలో ఏడాదికి పైగా బయటి రాష్ట్రాల వాహనాలను ఉపయోగించే వారు ఇక్కడ లైఫ్‌టైమ్ రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.పన్ను ఎగవేతకు పాల్పడిన లగ్జరీ కార్ల యజమానులపై బెంగళూరు ఆర్టీవో అధికారులు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత మార్చిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో కర్ణాటక వెలుపల రిజిస్టర్ అయిన హై ఎండ్ వాహనాల నుంచి రూ.40 కోట్ల బకాయిలు వసూలు చేశారు. -
‘ఆర్‌కామ్’తో సంబంధం లేదు: అంబానీ కంపెనీలు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ఖాతాను ఫ్రాడ్ అకౌంటుగా ఎస్బీఐ వర్గీకరించడమనేది తమ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావమూ చూపదని అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్‌లో (అడాగ్) భాగమైన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ స్పష్టం చేశాయి. ఆర్‌కామ్‌తో తమకెలాంటి వ్యాపార, ఆర్థిక సంబంధాలు లేవని, తమ రెండు సంస్థలు వేర్వేరుగా లిస్టెడ్ కంపెనీలుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని స్టాక్ ఎక్స్ఛేంజీలకు విడివిడిగా తెలిపాయి.ఈ నేపథ్యంలో ఆర్కామ్పై ఎలాంటి చర్యలు తీసుకున్నా తమ గవర్నెన్స్, మేనేజ్మెంట్, కార్యకలాపాలు, ఉద్యోగులు, షేర్హోల్డర్లపై ఎలాంటి ప్రభావమూ ఉండదని వివరించాయి. రుణాల మళ్లింపు ఆరోపణలతో ఆర్‌కామ్ ఖాతాను ఫ్రాడ్ అకౌంటుగా వర్గీకరించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఎస్బీఐ స్టాక్ ఎక్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కి ఇచ్చిన రుణాల్లో నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం వంటి అంశాలు కనిపించాయని పేర్కొంది. మొత్తం రూ.31,580 కోట్ల రుణాల్లో సుమారు రూ.13,667 కోట్లు ఇతర రుణాల చెల్లింపులకు, రూ.12,692 కోట్లు సంబంధిత సంస్థలకు మళ్లించారని తెలిపింది. -
హోమ్ లోన్ కస్టమర్లు మరింత హ్యాపీ..
హోమ్ లోన్ గ్రహీతలకు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా మరోసారి శుభవార్త చెప్పింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 7.45 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం ఇది 7.50 శాతంగా ఉంది. అలాగే కొత్త రుణ గ్రహీతలకు ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రెపో రేటును తగ్గించిన తరువాత గత జూన్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే గృహ రుణ రేట్లను 8.00 శాతం నుండి 7.50 శాతానికి తగ్గించింది. ఇప్పుడు వడ్డీ రేటును ఇంకాస్త తగ్గించడంతో హోమ్‌లోన్ కస్టమర్లకు మరింత ఉపశమనం కలగనుంది. ఈ తాజా తగ్గింపు గృహ యాజమాన్యం మరింత చౌకగా మారుతుందని, దేశంలోని గృహ రంగంలో డిమాండ్‌ను ఉత్తేజపరిచే ప్రభుత్వ విస్తృత ఆర్థిక లక్ష్యానికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.జీరో ప్రాసెసింగ్ ఫీజుగృహ రుణాలను మరింత చేరువ చేయడంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగా హోమ్ లోన్‌కు దరఖాస్తు చేసుకునేవారికి ప్రాసెసింగ్ ఫీజును కూడా రద్దు చేసింది. ఇంతవరకూ ఈ బ్యాంక్ లోన్ మొత్తంలో అర శాతం వరకూ ప్రాసెసింగ్ రుసుముగా తీసుకొనేది. ఇది గరిష్టంగా రూ.15 వేల వరకూ ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనం. కస్టమర్లు లోన్ కోసం బ్యాంక్ బ్రాంచిల్లోనే కాకుండా పూర్తిగా డిజిటల్ విధానంలో బ్యాంక్ వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. -
రియల్ ఎస్టేట్‌లో ఆ పెట్టుబడులు తగ్గాయ్..
భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు (ఇనిస్టిట్యూషన్స్) నీరసించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్–జూన్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 33 శాతం తగ్గిపోయి 1.69 బిలియన్ డాలర్లు (14,365 కోట్లు)గా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా వెల్లడించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు ఇందుకు దారితీసినట్టు తెలిపింది.క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇనిస్టిట్యూషన్స్ 2.53 బిలియన్ డాలర్లను (రూ.21,505 కోట్లు) రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే సగానికి తగ్గి 1,048 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం 643 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 486 మిలియన్ డాలర్ల పెట్టుబడుల కంటే 32 శాతం అధికమయ్యాయి. దేశీ పెట్టుబడుల అండ.. ‘దేశీ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు కీలక చోదకంగా మారాయి. భారత రియల్ ఎస్టేట్‌లో దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 2021లో 16 శాతంగా ఉంటే, అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ 2024 నాటికి 34 శాతానికి చేరింది’ అని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాజ్ఞిక్ తెలిపారు. ఇక 2025 మొదటి ఆరు నెలల కాలంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో దేశీ పెట్టుబడుల వాటా 48 శాతంగా ఉన్నట్టు చెప్పారు. దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడం.. అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సాయపడ్డాయని, మొదటి ఆరు నెలల్లో మొత్తం పెట్టుబడులు 3 బిలియన్ డాలర్లకు దూసుకువెళ్లాయని తెలిపారు.ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులు 15 శాతం తగ్గి 2,998 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మొదటి ఆరు నెలల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 2,594 మిలియన్ డాలర్ల నుంచి 1,571 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 53 శాతం ఎగసి 1,427 మిలియన్ డాలర్లకు చేరాయి. ఫ్యామిలీ ఆఫీసులు, విదేశీ కార్పొరేట్ గ్రూప్‌లు, విదేశీ బ్యాంక్‌లు, ప్రొప్రయిటరీ బుక్‌లు, పెన్షన్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు, ఎన్బీఎఫ్సీలు, లిస్టెడ్ రీట్లు సంస్థాగత పెట్టుబడిదారుల కిందకు వస్తాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 193.42 పాయింట్లు లేదా 0.23 శాతం పెరిగి 83,432.89 వద్ద ముగియగా, నిఫ్టీ 55.7 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 25,461 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 20 షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ప్రతికూల దిశలో ఫ్లాట్ గా స్థిరపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.03 శాతం పెరిగింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో, మెటల్ మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. భారత్ పెట్రోలియం, ఐజీఎల్, ఇండియన్ ఆయిల్, మహానగర్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం షేర్లు లాభపడటంతో నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.05 శాతం లాభపడింది.నిఫ్టీ రియల్టీ, ఫార్మా, ఐటీ, బ్యాంక్, మీడియా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1 శాతం వరకు లాభపడ్డాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.57 శాతం క్షీణించి 12.32 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
వైజాగ్‌లో వొడాఫోన్ ఐడియా 5జీ.. మరిన్ని నగరాల్లోనూ..
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా తమ 5జీ సర్వీసులను మరో 23 నగరాలకు విస్తరించింది. వీటిలో వైజాగ్‌తో పాటు జైపూర్, కోల్‌కతా, లక్నో తదితర సిటీలు ఉన్నట్లు సంస్థ తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద రూ.299 నుంచి డేటా ప్లాన్లను అందిస్తున్నట్లు వివరించింది.కంపెనీ ఇప్పటికే ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, చండీగఢ్, పట్నాలాంటి అయిదు నగరాల్లో 5జీ సేవలు అందిస్తోంది. 22 టెలికం సర్కిళ్లకు గాను 17 సర్కిళ్లలో 5జీ స్పెక్ట్రమ్‌ను వొడా–ఐడియా కొనుగోలు చేసింది.4జీ సేవలకు సంబంధించి సుమారు 65,000 సైట్లలో నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకున్నామని, కవరేజీని మెరుగుపర్చామని కంపెనీ పేర్కొంది. వచ్చే ఆరు నెలల్లో కొత్తగా 1 లక్ష టవర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది. -
లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఆర్బీఐ కొత్త రూల్
వ్యక్తిగత, గృహ, వ్యాపార రుణాల గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని ఫ్లోటింగ్-రేట్ రుణాలకు వర్తించే ప్రీ-పేమెంట్ ఛార్జీలను రద్దు చేసింది. గృహ రుణాలు, వ్యాపార అవసరాల కోసం తీసుకున్నవి, వ్యక్తులు, ఎంఎస్ఈలు పొందిన రుణాలన్నింటికీ ఆర్బీఐ కొత్త నిబంధన వర్తిస్తుంది. 2026 జనవరి 1 లేదా ఆ తర్వాత మంజూరు చేసే లేదా పునరుద్ధరించే రుణాలు, అడ్వాన్సులకు ఈ నిబంధన వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.ఈ మేరకు బ్యాంకులు, ఇతర రుణ సంస్థలకు (కో-ఆపరేటివ్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ, అఖిల భారత ఆర్థిక సంస్థలు) ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వ్యాపారం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వ్యక్తిగత రుణగ్రహీతలకు మంజూరు చేసిన ఏదైనా ఫ్లోటింగ్ రేటు టర్మ్-లోన్‌పై జప్తు ఛార్జీలు / ప్రీ-పేమెంట్ పెనాల్టీలను విధించడానికి వీల్లేదని ఆర్బీఐ సర్క్యులర్ తెలిపింది. ఎంఎస్ఈలకు సులభమైన, సరసమైన ఫైనాన్సింగ్ లభ్యత అత్యంత ముఖ్యమైనదని తెలిపింది.ఎంఎస్ఈలకు మంజూరు చేసిన రుణాల విషయంలో ముందస్తు చెల్లింపు ఛార్జీల విధింపునకు సంబంధించి నియంత్రిత సంస్థల (ఆర్ఈ) మధ్య భిన్నమైన పద్ధతులను ఆర్బీఐ పర్యవేక్షక సమీక్షల్లో గుర్తించింది. దీనిపై ఫిర్యాదులు, వివాదాలు కూడా వెల్లువెత్తాయి. ముసాయిదా సర్క్యులర్‌పై వచ్చిన స్పందన, ప్రజల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆర్బీఐ ఇప్పుడు ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. -
ముందు లైఫ్ ఇన్సూరెన్స్.. రూ.450 కోట్లతో ప్రచారం
ముంబై: బీమాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే దిశగా జీవిత బీమా కంపెనీలు చేతులు కలిపాయి. రూ.450 కోట్లతో మూడేళ్ల పాటు పలు మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. సబ్సే పెహలే లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రచారాన్ని ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ ప్రారంభించింది.అన్ని జీవిత బీమా కంపెనీలు తమ ప్రీమియం ఆదాయానికి అనుగుణంగా ఈ ప్రచారం కోసం నిధులు అందించనున్నాయి. ‘ఏటా రూ.150–160 కోట్ల వరకు ఖర్చు చేస్తాం. మూడేళ్ల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సరిపడా ఖర్చును సమకూర్చేందుకు ఇప్పటికే హామీ లభించింది’ అని ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ చైర్మన్ కమలేష్ రావు తెలిపారు.గత కొన్ని సంవత్సరాల్లో బీమా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. 2022–23లో జీవిత బీమా విస్తరణ జీడీపీలో 4% కాగా, 2023–24లో 3.7%కి, గత ఆర్థిక సంవత్సరంలో 3.2%కి తగ్గుతూ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా బీమా విస్తరణలో భారత్ 10వ స్థానంలో ఉంది. -
హెచ్ఎంఏ అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నూతన అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2025-26 సంవత్సరానికి హెచ్ఎంఏ తన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. కార్యవర్గ సమావేశంలో అల్వాల దేవేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈయన ఈరైడ్ విద్యుత్ వాహనాల సంస్థ వ్యవస్థాపకుడు.శరత్ చంద్ర మారోజును ఉపాధ్యక్షుడిగా, వాసుదేవన్‌ను కార్యదర్శిగా కార్యవర్గం ఎన్నుకుంది. కొత్త మేనేజ్మెంట్ కమిటీలో ఇంకా సిండిక్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శరత్ చంద్ర మారోజు, ఈక్విటాస్ బ్యాంక్ జాతీయ అధిపతి వాసుదేవన్, ధ్రుమతారు కన్సల్టెంట్స్ వ్యవస్థపకులు, సీఈఓ చేతనా జైన్, స్టెల్త్ స్టార్టప్ వ్యవస్థాపకులు వి.శ్రీనివాసరావు, సిటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకర వెంకట కృష్ణ ప్రసాద్ ఉన్నారు.ఈ సందర్భంగా హెచ్ఎంఏ నూతనాధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, “వివిధ పరిశ్రమల్లో యాజమాన్య విధానాలను మరింత బలోపేతం చేయడంపై మేం ప్రధానంగా దృష్టిపెడతాం. అదే సమయంలో విద్యార్థుల సామర్థ్యాలను కూడా పెంపొందిస్తాం. వాళ్లను ఆంత్రప్రెన్యూర్లుగా లేదా కార్పొరేట్ ఉద్యోగాలకు సరిపోయేలా తీర్చిదిద్దుతాం” అని తెలిపారు. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) 1964 నుంచి నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ. సరికొత్త యాజమాన్య విధానాలపై యువ మేనేజర్లు, వృత్తినిపుణులు, విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతుంది. -
రాబోతోంది పెను మార్పు.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్
ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద మార్పు రాబోతోందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచియిత రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. "కృత్రిమ మేధ (AI ) చాలా మంది 'స్మార్ట్ విద్యార్థులు' తమ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తుంది.. భారీ నిరుద్యోగం కలిగిస్తుంది.. విద్యా రుణాలు పెరగిపోతాయి.." అని అప్రమత్తం చేస్తూ తాజాగా ఆయన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కలగనున్న పరిణామాలపై కియోసాకి విద్యార్థులను అప్రమత్తం చేశారు. చాలా మంది తెలివైన విద్యార్థులు కూడా ఉద్యోగాలు కోల్పోక తప్పదన్నారు. ఒకప్పుడు డోకా లేదనుకున్న ఉద్యోగాలను కూడా ఏఐ ఆటోమేట్ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు. రుణ సాయంతో విద్యను పూర్తి చేసి ఉద్యోగాల కోసం వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లేక రుణ భారం తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "నాకు ఉద్యోగం లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నన్ను తొలగించలేదు" అంటూ ఉద్యోగం కంటే వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్లే నయమని చెప్పే ప్రయత్నం చేశారు.సాంప్రదాయిక విద్య, ఉద్యోగ మార్గాన్ని కియోసాకి ఇప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బడికి వెళ్లడం, మంచి గ్రేడ్లు సాధించడం, ఉద్యోగం సంపాదించడం, డబ్బు ఆదా చేయడం వంటి విధానాలు ఇకపై ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వవని ఆయన వాదిస్తున్నారు. శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో, ఆయన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తన "రిచ్ డాడ్" మనస్తత్వానికి అనుకూలంగా తన "పూర్ డాడ్" సలహాను ఎలా విస్మరించిందీ వివరించారు. సంప్రదాయ మార్గానికి విరుద్ధంగా ఎంట్రెప్రెన్యూర్ అయ్యానని, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టానని, బంగారం, వెండి, ప్రస్తుతం బిట్కాయిన్లలో పొదుపు చేస్తున్నానని పేర్కొన్నారు.ఈ ఆర్థిక పరివర్తన కాలంలో నిష్క్రియాత్మక పరిశీలనకు గురికావద్దని కియోసాకి తన ఫాలోవర్లకు సూచించారు. "దయచేసి చరిత్రలో ఈ కాలానికి బలైపోవద్దు" అని హెచ్చరించారు. స్వతంత్రంగా ఆలోచించాలని, వ్యక్తిగత ఎదుగుదలకు పెట్టుబడులు, సాంప్రదాయ వ్యవస్థలకు వెలుపల ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలను అన్వేషించాలని హితవు పలికారు. BIGGEST CHANGE in MODERN HISTORYAI will cause many “smart students” to lose their jobs.AI will cause massive unemployment.Many still have student loan debt.AI cannot fire me because I do not have a job.If you are in this category please take proactive action. Please do…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 1, 2025 -
లిస్టింగ్ సూపర్‌హిట్.. ఇన్వెస్టర్లకు వరుస లాభాలు
హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిస్టింగులు సూపర్‌హిట్టయ్యాయి. మార్కెట్ అనిశ్చితుల్లోనూ అదిరిపోయే అరంగేట్రం చేసి ఇన్వెస్టర్లకు తొలిరోజే లాభాలు పంచాయి. హెచ్డీబీ ఫైనాన్స్ షేరు ఇష్యూ ధర(రూ.740)తో పోలిస్తే బీఎస్ఈలో 13% ప్రీమియంతో రూ.835 వద్ద లిస్టయ్యింది.ఇంట్రాడేలో 15% ఎగసి రూ.850 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 14% లాభంతో రూ.841 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.69,758 కోట్లుగా నమోదైంది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు రెండో రోజూ గురువారం లాభాలను కొనసాగించింది. రూ.890 వరకూ పెరిగి రూ.865 వద్ద ముగిసింది.సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిస్టింగూ సక్సెస్ అయ్యింది. ఇష్యూ ధర(రూ.82)తో పోలిస్తే బీఎస్ఈలో 34% ప్రీమియంతో రూ.110 వద్ద లిస్టయ్యిది. ట్రేడింగ్‌లో 35% పెరిగి రూ.111 వద్ద గరిష్టాన్ని తాకింది. గరిష్టాల వద్ద స్వల్ప లాభాలు చోటు చేసుకున్నప్పటికీ.., చివరికి 19% లాభంతో రూ.98 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,875 కోట్లుగా నమోదైంది. -
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు ఎత్తేసిన మరో బ్యాంక్..
అన్ని సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కనీస బ్యాలెన్స్ నిర్వహణ చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. జూలై 7 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. దీనివల్ల మరింత మందికి బ్యాంకింగ్ సేవలు చౌకగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.మరోవైపు ఇండియన్ బ్యాంక్ ఏడాది కాల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) 5 బేసిస్ పాయింట్లు (0.05శాతం) తగ్గించి 9 శాతానికి సవరించినట్టు ప్రకటించింది. 3వ తేదీ నుంచి ఈ రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది. దీనివల్ల రుణగ్రహీతలకు ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాల రేట్లకు ఏడాది కాల ఎంసీఎల్ఆర్ బెంచ్‌మార్క్‌గా ఉంటుంది.పొదుపు ఖాతాలలో కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించకపోతే విధించే జరిమానా ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా ఇదివేరకే ప్రకటించింది. అంతకు ముందు కెనరా బ్యాంక్ కూడా అన్ని పొదుపు ఖాతాల్లో కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించనందుకు విధించే పెనాల్టీ ఛార్జీలను తొలగించింది. ఎంఏబీ అనేది ఒక నిర్దిష్ట కాలంలో (సాధారణంగా నెల) మీ పొదుపు ఖాతాలో నిర్వహించాల్సిన సగటు మొత్తం. -
రూ.84 లక్షల బెంజ్ కారు.. రూ.2.5 లక్షలకే..
ఢిల్లీలో కొత్తగా అమల్లోకి వచ్చిన కఠినమైన ఇంధన నిషేధం ఖరీదైన కార్ల యజమానులకు శాపంగా మారింది. చాలా మంది తమ ఖరీదైన పాత ప్రీమియం కార్లను కారు చౌకగా అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం పోయకూడదు. రాజధానిలో నెలకొన్న తీవ్రమైన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాల మేరకు నిషేధాన్ని అమలు చేస్తున్నారు.మనీ కంట్రోల్ కథనం ప్రకారం.. వరుణ్ విజ్ అనే వ్యక్తి తన లగ్జరీ ఎస్యూవీ 2015 మెర్సిడెస్ బెంజ్ ఎంఎల్ 350ని తప్పని పరిస్థతిలో చాలా చౌకగా అమ్ముకోవాల్సి వచ్చింది. పదేళ్ల కిందట ఈ వాహనాన్ని ఆయన రూ.84 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ ఢిల్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పాత వాహనాలకు ఇంధన నిషేధం కారణంగా కేవలం రూ.2.5 లక్షలకే అమ్ముడుపోయింది.దశాబ్ద కాలంగా తమ కుటుంబ జీవితంలో అంతర్భాగంగా ఉన్న కారును ఇప్పుడు వదిలించుకోవాల్సి రావడం వల్ల కలిగే భావోద్వేగాన్ని విజ్ వివరించారు. తన కుమారుడిని హాస్టల్ నుండి తీసుకురావడానికి వారానికి కేవలం 7-8 గంటల ప్రయాణానికి మాత్రమే ఈ కారును వినియోగించానని ఆయన గుర్తు చేసుకున్నారు. మొత్తంగా 1.35 లక్షల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిన ఈ కారుకు రొటీన్ సర్వీసింగ్, టైర్ రీప్లేస్మెంట్లకు మించి మరే ఖర్చులు చేయాల్సిన అవసరం లేదని, కానీ ఇంత చౌకగా అమ్ముడుపోయిందని విజ్ ఆవేదన వ్యక్తం చేశారు.భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూ.62 లక్షలతో ఎలక్ట్రిక్ వాహనం కొన్నట్లు విజ్ తెలిపారు. ప్రభుత్వం ఇలా మరోసారి విధానం మార్చుకోకపోతే 20 ఏళ్ల పాటు దీన్ని వాడుకోవాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు.రితేష్ గండోత్రా అనే వ్యక్తి కూడా తాను రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారును చౌకగా అమ్మాల్సి వస్తోందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇది డీజిల్ వేరియంట్. చాలా జాగ్రత్తగా ఉపయోగించాను. ఇప్పటివరకు కారులో కేవలం 74,000 కిలోమీటర్లే తిరిగాను. కొవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా రెండేళ్ల పాటు ఏమీ వాడలేదు. ఇంట్లో పార్క్ చేసే ఉంచాను. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా కారుకు లైఫ్ ఉంది. ఎన్సీఆర్లో 10 సంవత్సరాల డీజిల్ వాహనాల నిషేధ నియమాల కారణంగా నా కారును విక్రయించవలసి వస్తోంది. అది కూడా ఎన్సీఆర్ వెలుపల కొనుగోలుదారులకు తక్కువ రేటుకే. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేస్తే 45 శాతం జీఎస్టీ+ సెస్ విధిస్తారు. ఇది మంచి విధానం కాదు. బాధ్యతాయుతమైన యాజమాన్యానికి విధించే శిక్ష’ అని రాసుకొచ్చారు. -
ఆదుకున్న ఆర్బీఐ భారీ డివిడెండ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సం తొలి రెండు నెలల్లో ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 0.8 శాతంగా (రూ.13,163 కోట్లు) ఉన్నట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ప్రకటించింది. ఆర్బీఐ నుంచి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ రావడం ఇందుకు అనుకూలించింది. డివిడెండ్, ప్రాఫిట్స్ కింద ప్రభుత్వం రూ.2.78 లక్షల కోట్లను అందుకున్నట్టు సీజీఏ తెలిపింది.2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతం (రూ.15.69 లక్షల కోట్లు)గా ఉంటుందని బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 3.1 శాతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ చివరి వరకే చూస్తే ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 11.9 శాతం (రూ.1.86 లక్షల కోట్లు)గా ఉండడం గమనించొచ్చు.ఏప్రిల్, మే నెలలకు కలిపి రూ.3.5 లక్షల కోట్ల పన్నుల రూపంలో, రూ.3.56 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం రూపంలో సమకూరింది. నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ రూపంలో రూ.25,224 కోట్లు వచ్చింది. వ్యయాలు రూ.7.46 లక్షల కోట్లుగా ఉన్నాయి. -
అపోలో ఫార్మసీ వ్యాపారంలో విభజన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమ్నీచానల్ ఫార్మసీ, డిజిటల్ హెల్త్ వ్యాపారాలను విడదీసి, లిస్ట్ చేసే ప్రతిపాదనకు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ (ఏహెచ్ఈఎల్) బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన స్కీము ప్రకారం లిస్టింగ్‌కు 18–21 నెలల వ్యవధి పట్టనుంది. ఇందులో భాగంగా తొలి దశలో ఆమ్నీచానల్ ఫార్మా, డిజిటల్ హెల్త్ వ్యాపారాన్ని కొత్త సంస్థగా విడగొడతారు. తర్వాత హెల్త్‌కేర్ విభాగం అపోలో హెల్త్‌కో (ఏహెచ్ఎల్), హోల్‌సేల్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ కీమెడ్ను కొత్త సంస్థలో విలీనం చేస్తారు. ఈ ప్రక్రియతో దేశీయంగా దిగ్గజ ఆమ్నీచానల్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫాం ఏర్పడుతుందని అపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఇది 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 25,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని పేర్కొంది. స్కీము ప్రకారం కొత్త సంస్థ, స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్‌కు దరఖాస్తు చేసుకుంటుంది. ఏహెచ్ఈల్ షేర్‌హోల్డర్ల వద్ద ఉన్న ప్రతి 100 షేర్లకు గాను కొత్త కంపెనీకి చెందిన 195.2 షేర్లు లభిస్తాయి. అత్యంత నాణ్యమైన హెల్త్‌కేర్ సేవలను కోట్ల మందికి అందుబాటులోకి తెచ్చేందుకు ఈ మోడల్ ఉపయోగపడుతుందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో ఆచితూచి ఆశావహ దృక్పథంతో భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం సానుకూల ధోరణితో ఫ్లాట్ గా ముగిశాయి. ఇంట్రాడేలో 83,874.29 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 90.83 పాయింట్లు (0.11 శాతం) లాభపడి 83,697.29 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 24.75 పాయింట్లు లేదా 0.1 శాతం స్వల్ప లాభంతో 25,541.8 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు ఫ్లాట్ గా స్థిరపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 0.10 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో, ఐటీ, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియల్టీ షేర్లు నష్టపోయాయి.ఎన్ఎస్ఈలో 3,020 షేర్లలో 1,491 షేర్లు లాభాల్లో, 1,452 షేర్లు నష్టాల్లో ముగియగా, 77 షేర్లలో ఎలాంటి మార్పులేదు. 96 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా, 24 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. అప్పర్ సర్క్యూట్ ను తాకిన స్టాక్స్ సంఖ్య 119కి పెరగ్గా, లోయర్ సర్క్యూట్ పరిమితులకు 43 పడిపోయాయి.ఎన్ఎస్ఈలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.36 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.01 శాతం క్షీణించి 12.5 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
రూ.లక్షల్లో క్రెడిట్‌కార్డు బాకీ ఇలా తీరిపోయింది..
ఉపయోగించుకోవాలే గానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యక్తిగత జీవితానికి ఎంత ప్రభావంతవంతంగా ఉపయోగపడుతుందో తెలిపే ఉదాహరణ ఇది. అమెరికాలో ఓ మహిళ పర్సనల్ ఫైనాన్స్‌లో మార్గదర్శకత్వం కోసం ఏఐ సాధనం చాట్‌జీపీటీ ఆశ్రయించి 23,000 డాలర్లకు పైగా (సుమారు రూ . 19.69 లక్షలు) మేర ఉన్న తన క్రెడిట్ కార్డు బాకీలో సగానికి పైగా సులువుగా తీర్చేసింది.డెలావేర్కు చెందిన 35 ఏళ్ల జెన్నిఫర్ అలెన్ తన ఆర్థిక నిర్వహణకు చాట్‌జీపీటీ ఎలా ఉపయోగపడిందో వివరించారు. రియల్టర్, కంటెంట్ క్రియేటర్ అయిన ఆమె న్యూస్‌వీక్ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. తాను బాగా సంపాదించినప్పటికీ, ఆర్థిక నిర్వహణ విషయంలో చాలా కాలం కష్టపడ్డానని చెప్పారు. "నేను తగినంతగా సంపాదించకపోవడం వల్ల కాదు, ఆర్థిక అక్షరాస్యత పెంచుకోకపోవడమే దీనికి కారణం" అని ఆమె చెప్పారు.కుమార్తె పుట్టిన తరువాత అలన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. వైద్య అత్యవసర పరిస్థితులు, పాప ఆలనాపాలన ఖర్చులు ఆమె ఎక్కువగా క్రెడిట్ కార్డులపై ఆధారపడటానికి కారణమయ్యాయి. "మేమేం విలాసవంతంగా జీవించలేదు. సాధారణ జీవనమే గడిపాం. కానీ చూడకుండానే అప్పులు పేరుకుపోయాయి' అని ఆమె వివరించారు.పరిస్థితి నుంచి బయటపడేందుకు అలెన్ 30 రోజుల పర్సనల్ ఫైనాన్స్ ఛాలెంజ్ కోసం చాట్ జీపీటీని ఆశ్రయించింది. ప్రతిరోజూ ఆమె ఈ ఏఐ సాధనాన్ని ఉపయోగించి నిరుపయోగ సబ్స్క్రిప్షన్లను తొలగించడం, మరచిపోయిన ఖాతాలలో ఉపయోగించని నిధులను గుర్తించడం వంటి చేసేవారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూచనలు సరళమైనవే కానీ ప్రభావవంతమైనవి. ఈ క్రమంలో చాట్‌జీపీటీ ఆమెను ఓ పని చేయాలని సూచించింది. అదేంటంటే ఫైనాన్స్ యాప్‌లను, బ్యాంకు ఖాతాలను ఓసారి చెక్ చేసుకోవాలని చెప్పింది. చాలా కాలం ఉపయోగంలో లేని బ్రోకరేజీ ఖాతాతో సహా పలు అకౌంట్లలో అన్‌క్లెయిమ్ సొమ్ము 10,000 డాలర్లు (రూ .8.5 లక్షలు) బయటపడ్డాయి.అలాగే ప్యాంట్రీ-ఓన్లీ అంటే వంట గదిలో ఉన్నవాటితోనే వండుకోవడం ప్రణాళికను అవలంభించింది. దీంతో ఆమె నెలవారీ కిరాణా బిల్లు దాదాపు రూ .50,000 తగ్గింది. అలా ఛాలెంజ్ ముగిసే సమయానికి అలెన్ మొత్తంగా 12,078.93 డాలర్లు (సుమారు రూ.10.3 లక్షలు) పొదుపు చేసి తన క్రెడిట్ కార్డు బాకీలో సగానికిపైగా తీర్చేసింది. -
అమెజాన్‌లో అసలేం జరుగుతుందో చూస్తారా?
ఆన్లైన్లో కొనుగోలు చేసిన ఏ ఉత్పత్తయినా, విక్రేత దగ్గర్నుంచి మన ఇంటి వరకు చేరడం వెనుక బోలెడంత తతంగం ఉంటుంది. ఆ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, భారత్‌లోని తమ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను (ఎఫ్‌సీ) సందర్శించే అవకాశాన్ని కల్పించనుంది.ఈ ఏడాది నాలుగో త్రైమాసికం (క్యూ4) నుంచి ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరులోని తమ ఎఫ్‌సీల్లో ఉచిత టూర్లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. నిత్యం లక్షల సంఖ్యలో ఉత్పత్తులను నిల్వ చేయడం, కస్టమర్ల ఆర్డర్ల ప్రాసెసింగ్, రవాణా మొదలైన ప్రక్రియలను ఈ సందర్భంగా ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఈ గైడెడ్ టూర్లు వారానికి మూడు సార్లు చొప్పున, ఒక్కోటి 45–60 నిమిషాల పాటు ఉంటాయి. ఒక్కో టూర్లో 20 మంది పాల్గొనవచ్చు.టోక్యోలో జరిగిన ’డెలివరింగ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో అమెజాన్ ఈ విషయాలు తెలిపింది. ఈ టూర్లపై ఆసక్తి గల వారు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు త్వరలో వీలు కల్పించనున్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఇండియా–ఆ్రస్టేలియా ఆపరేషన్స్) అభినవ్ సింగ్ చెప్పారు. దేశీయంగా అమెజాన్‌కు బెంగళూరులో 20 లక్షల ఘనపుటడుగుల స్టోరేజ్ స్పేస్‌తో అతి పెద్ద ఎఫ్‌సీ ఉంది.ఇక ఉత్తరాదిలోనే అతి పెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్, ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంది. ఇది 4,50,000 చ.అ.ల్లో, సుమారు ఎనిమిది ఫుట్‌బాల్ మైదానాలంత పెద్దగా ఉంటుంది. 2014 నుంచి అంతర్జాతీయంగా అమెరికా, కెనడా, తదితర దేశాల్లోని 35 లొకేషన్లలో ఇరవై లక్షల మంది పైగా సందర్శకులు అమెజాన్ ఎఫ్‌సీలను సందర్శించారు. -
అనిల్ అంబానీ మరో భారీ అడుగు..
సుమారు రూ. 20,000 కోట్ల భారతీయ డిఫెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్ఓ) మార్కెట్లో విస్తరణపై రిలయన్స్ డిఫెన్స్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన కోస్టల్ మెకానిక్స్‌తో చేతులు కలిపింది. భారతీయ సాయుధ బలగాలకు అవసరమైన ఎంఆర్వో, అప్‌గ్రేడ్, లైఫ్‌సైకిల్ సపోర్ట్ సొల్యూషన్స్‌ను అందించడంపై ఫోకస్ చేయనున్నట్లు రిలయన్స్ డిఫెన్స్ మాతృ సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రా ఒక ప్రకటనలో తెలిపింది.100కు పైగా జాగ్వార్ ఫైటర్ విమానాలు, 100 పైచిలుకు మిగ్–29 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, అపాచీ ఎటాక్ హెలికాప్టర్లు, ఎల్–70 ఎయిర్ డిఫెన్స్ గన్లు మొదలైన వాటి ఆధునీకరణకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని వివరించింది. డీల్ ప్రకారం భారత్‌తో పాటు ఎగుమతి మార్కెట్లలోని క్లయింట్లకు సేవలు అందించేందుకు రిలయన్స్ డిఫెన్స్, కోస్టల్ మెకానిక్స్ కలిసి మహారాష్ట్రలో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తాయి.దీనితో సాయుధ బలగాలు ఉపయోగించే గగనతల, భూతల డిఫెన్స్ ప్లాట్‌ఫాంల నిర్వహణ, అప్‌గ్రేడ్ సర్వీసులను అందించనున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా పేర్కొంది. 1975లో ఏర్పాటైన కోస్టల్ మెకానిక్స్‌కు అమెరికా ఎయిర్‌ఫోర్స్, ఆరీ్మకి కీలక పరికరాలను సరఫరా చేస్తోంది. -
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ .58.50 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,665కు దిగొచ్చింది.అంతకుముందు జూన్‌లోనూ చమురు సంస్థలు వాణిజ్య సిలిండర్లపై రూ .24 తగ్గింపును ప్రకటించాయి. దాంతో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ .1,723.50 గా ఉండేది. ఏప్రిల్‌లో దీని ధర రూ.1,762గా ఉంది. ఫిబ్రవరిలో స్వల్పంగా రూ.7 తగ్గగా, మార్చిలో రూ.6 పెరిగింది.19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ.58.50 తగ్గించడం చిన్న వ్యాపారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య వినియోగదారులు తమ రోజువారీ కార్యకలాపాలకు ఈ గ్యాస్ సిలిండర్లపై ఎక్కువగా ఆధారపడతారు.అయితే, గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. సమీక్షకు పిలుపునిచ్చినప్పటికీ 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఉంది. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని కంపెనీలు ధృవీకరించాయి.నగరంకొత్త ధర (రూ.)మునుపటి ధర (రూ.)ఢిల్లీ1,6651,723.50ముంబై1,6161,674.50కోల్ కతా1,7691,826చెన్నై1,823.501,881బెంగళూరు1,796—నోయిడా1,747.50—హైదరాబాదు1,798.501,857 -
ఈ బ్యాంకుల్లో ఎల్ఐసీ పాలసీలు
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఏయూ ఎస్ఎఫ్బీ) తెలిపింది. దీని ప్రకారం ఎల్ఐసీ టర్మ్ పాలసీలు, ఎండోమెంట్ ప్లాన్లు, హోల్ లైఫ్ పాలసీలు మొదలైన వాటిని తమ శాఖల్లో విక్రయించనున్నట్లు పేర్కొంది.21 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో తమకు 2,456 పైగా బ్యాంకింగ్ టచ్పాయింట్లు ఉన్నట్లు బ్యాంక్ ఈడీ ఉత్తమ్ టిబ్రెవాల్ తెలిపారు. ఈ ఒప్పందంతో ఓవైపు బ్యాంకింగ్, బీమా, దీర్ఘకాలిక ఆర్థిక ప్లానింగ్ సొల్యూషన్స్ అన్నింటినీ ఒకే దగ్గర అందించే సంస్థగా తమ బ్యాంక్ స్థానం పటిష్టమవుతుందని మరోవైపు గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లో ఎల్ఐసీ పాలసీల విస్తృతి మరింతగా పెరుగుతుందని వివరించారు. బ్యాంకింగ్, భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను ఒకే ప్లాట్‌ఫామ్ కింద సమీకృతం చేస్తూ, పూర్తి-స్పెక్ట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా మారడానికి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాగిస్తున్న ప్రయాణంలో ఈ సహకారం ఒక మైలురాయిని సూచిస్తుంది. ఎల్ఐసీకి కూడా ఈ భాగస్వామ్యం విశ్వసనీయమైన, కస్టమర్-సెంట్రిక్ బ్యాంకింగ్ భాగస్వామి ద్వారా విస్తృత పరిధిని అందిస్తుంది.సంజయ్ అగర్వాల్ 1996లో స్థాపించిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుగా పనిచేస్తుంది. 2025 మార్చి 31 నాటికి బ్యాంక్ 1.13 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలు అందించింది. బ్యాలెన్స్ షీట్ పరిమాణం రూ .1.57 లక్షల కోట్లు. 'ఎఎ /స్టేబుల్' క్రెడిట్ రేటింగ్ ఈ బ్యాంకుకు ఉంది. -
ఒక్కసారిగా షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఏకంగా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతోన్న బంగారం ధర నేడు (Today Gold Rate) భారీగా ఎగిసింది. బంగారం ధరలు దిగొస్తున్నాయని ఆశించిన కొనుదారులకు నేడు ఊచించని విధంగా షాకిచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పెరిగిన రైలు ఛార్జీలు..
దేశవ్యాప్తంగా రైలు ఛార్జీలు జూలై 1 నుంచి పెరుగుతున్నాయి. ఈ మేరకు సుదూర రైళ్లలో జూలై 1 నుంచి రైలు ఛార్జీలు పెంచనున్నట్లు భారతీయ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే బోర్డు నోటిఫికేషన్ ప్రకారం కిలోమీటర్‌కు గరిష్టంగా 2 పైసలు చొప్పున ఛార్జీల పెంపు ఉంటుంది. నాన్ ఏసీ బోగీల్లో కిలోమీటర్‌కు ఒక పైసా, ఏసీ బోగీల్లో కిలోమీటర్‌కు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి. సబర్బన్ రైళ్లు, 500 కిలోమీటర్ల వరకు సాధారణ సెకండ్ క్లాస్ ప్రయాణాలపై ఎలాంటి ప్రభావం ఉండదు.రైలు ఛార్జీలు ఎంత పెరుగుతాయంటే..రైలు రకం ఛార్జీల పెంపు..సెకండ్ క్లాస్ ఆర్డినరీ501-1500 కిలోమీటర్లకు రూ.5 పెంపుసెకండ్ క్లాస్ ఆర్డినరీ1501-2500 కిలోమీటర్లకు రూ.10 పెంపుసెకండ్ క్లాస్ ఆర్డినరీ2501-3000 కిలోమీటర్లకు రూ.15 పెంపుస్లీపర్ క్లాస్ జనరల్కిలో మీటరుకు అర పైసాఫస్ట్ క్లాస్ ఆర్డినరీకిలో మీటరుకు అర పైసాసెకండ్ క్లాస్ (మెయిల్/ఎక్స్‌ప్రెస్)కిలో మీటరుకు ఒక పైసాస్లీపర్ క్లాస్ (మెయిల్/ఎక్స్‌ప్రెస్)కిలో మీటరుకు ఒక పైసాఫస్ట్ క్లాస్ (మెయిల్/ఎక్స్‌ప్రెస్)కిలో మీటరుకు ఒక పైసాఎసి చైర్ కారుకిలో మీటరుకు రెండు పైసలుఎసి-3 టైర్/3ఈకిలో మీటరుకు రెండు పైసలుఏసీ-2 టైర్కిలో మీటరుకు రెండు పైసలుఏసీ ఫస్ట్ క్లాస్/ఈసీ/ఈఏకిలో మీటరుకు రెండు పైసలురాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, ఏసీ విస్టాడోమ్ కోచ్, తదితర రైళ్లకు కూడా పైన పేర్కొన్న ప్రకారం ఛార్జీల పెంపు వర్తిస్తుంది. భారతీయ రైల్వే రైలు ఛార్జీలను పెంచడం 2022 తర్వాత ఇదే తొలిసారి. రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్ఛార్జ్ వంటి ఇతర ఛార్జీలు యథాతథంగా కొనసాగుతాయని భారతీయ రైల్వే తెలిపింది. మంత్లీ సీజన్ టికెట్స్ , సబర్బన్ రైలు ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవు.రిజర్వేషన్ చార్టుల్లో మార్పులు..రైలు ఛార్జీలను పెంచడంతో పాటు, సుదూర రైళ్ల రిజర్వేషన్ చార్ట్‌లను బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు సిద్ధం చేస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. గతంలో రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు రిజర్వేషన్ చార్టులు తయారు చేసేవారు.తత్కాల్ బుకింగ్స్ లో మార్పులు?తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్‌ను రైల్వే శాఖ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఆధార్ ధృవీకరణ పూర్తి చేసిన ప్రయాణికులు మాత్రమే జూలై 1 నుండి ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా జూలై నెలాఖరు నుంచి తత్కాల్ బుకింగ్స్ కోసం ఓటీపీ ఆధారిత అథెంటికేషన్‌ను కూడా అమలు చేయనున్నారు. -
పోస్టాఫీసు స్కీములు.. వడ్డీ రేట్ల ప్రకటన
పోస్టాఫీసుల ద్వారా నిర్వహిస్తున్న పలు పొదుపు స్కీములకు సంబంధించిన వడ్డీ రేట్లపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోని ప్రసిద్ధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎసీఎస్ఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) వంటి సాధనాలపై ఆధారపడిన పొదుపుదారులకు ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వారి రాబడిలో ఎలాంటి మార్పులు కనిపించవు.పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక పొదుపు సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ మద్దతు పథకం పీపీఎఫ్ గత త్రైమాసికంలో మాదిరిగానే వడ్డీ రేటును కొనసాగిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎసీఎస్ఎస్), సుకన్య సమృద్ధి సమృద్ధి స్కీమ్‌లకు ఆకర్షణీయమైన వార్షిక రేటును 8.2% కొనసాగుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో ఇన్వెస్టర్లు 7.7 శాతం, పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (పీవోఎంఐఎస్) 7.4 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) కూడా మారలేదు. ఇది 115 నెలల మెచ్యూరిటీ వ్యవధితో 7.5% రేటును అందిస్తుంది.ఇక పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ లభిస్తుంది. క్రమం తప్పకుండా నెలవారీ పొదుపునకు అవకాశం ఉండే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) పథకం 6.7% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలు గ్యారంటీ రాబడులను అందిస్తాయి, ఎంచుకున్న పథకం ఆధారంగా నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన వడ్డీని జతచేస్తాయి.ప్రధానంగా పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా నిర్వహిస్తున్న ఈ చిన్న పొదుపు పథకాలు సురక్షితమైన, స్థిర-ఆదాయ రాబడిని కోరుకునే లక్షల మంది భారతీయులకు కీలక పెట్టుబడి సాధనాలు. శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫారసు చేసిన విధంగా ప్రభుత్వ సెక్యూరిటీలపై రాబడులకు సంబంధించిన ఫార్ములాను ఉపయోగించి ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి వాటి రేట్లను సమీక్షిస్తుంది. అయితే మార్కెట్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఈ రేట్లను స్థిరంగా ఉంచాలని కేంద్రం నిర్ణయించింది.పథకంవడ్డీ రేటుపోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్4%పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్6.7%పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్7.4%పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (1 సంవత్సరం)6.9%ప్రస్థితి పోస్ట్ టైమ్ డిపాజిట్ (2 సంవత్సరాలు)7%పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (3 సంవత్సరాలు)7.1%పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (5 సంవత్సరాలు)7.5%కిసాన్ వికాస్ పత్ర (కేవీయపీ)7.5%పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్)7.1%సుకన్య సమృద్ధి యోజన8.2%నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్7.7%సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)8.2% -
గ్రీన్‌కోలో వాటా కొనుగోలు చేసిన ఏఎం గ్రీన్
హైదరాబాద్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ ఏఎం గ్రీన్ బీవీ (ఏఎంజీ) తన అనుబంధ సంస్థ ఏఎంజీ పవర్ బీవీ ద్వారా ఓరిక్స్ కార్పొరేషన్ నుంచి గ్రీన్కో ఎనర్జీ హోల్డింగ్స్‌లో 17.5 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసింది. 2025 జూలై ముగింపు తరువాత గ్రీన్‌కోలో ఏఎం గ్రీన్ సుమారు 25% వాటా కలిగి ఉంటుంది. 10 గిగావాట్ల కార్యాచరణ ఆస్తులున్న పునరుత్పాదక ఇంధన అగ్రగామి అయిన గ్రీన్కో 2030 నాటికి 100 గిగావాట్ల నిల్వ సామర్థ్యాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా, ఎస్ఏఎఫ్, ఇతర సుస్థిర సాంకేతిక పరిజ్ఞానానికి దీర్ఘకాలిక బహిర్గతం కోసం ఏఎంజీ లక్స్ జారీ చేసిన కన్వర్టబుల్ నోట్స్‌లో ఓరిక్స్ కూడా పెట్టుబడులు పెట్టనుంది. కాకినాడలో ఏర్పాటు చేస్తున్న 1 ఎంటీపీఏ గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రం, యూనిపర్, యారా, చెంపోలిస్ టెక్నాలజీ ఆధారిత బయో2ఎక్స్ ప్లాట్‌ఫామ్ వంటి సంస్థలతో భాగస్వామ్యం డీకార్బనైజేషన్, గ్రీన్ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్‌కు గ్రీన్కో కట్టుబడి ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. ఏఎం గ్రీన్, గ్రీన్కో కలిసి ప్రపంచంలోని అత్యంత ఇంటిగ్రేటెడ్ పవర్-టు-ఎక్స్ వ్యవస్థలలో ఒకదానికి మార్గదర్శకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది ప్రపంచ ఇంధన పరివర్తనను వేగవంతం చేస్తుంది. -
BSNL ఫ్లాష్ ఆఫర్.. మరికొన్ని గంటలే అవకాశం
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5జీ నెట్వర్క్ కింద వాణిజ్య 5జీ సేవలను త్వరలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇవి తాజాగా 90,000 లను దాటాయి. ఈ మైలురాయిని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం పరిమిత కాల ప్రమోషనల్ "ఫ్లాష్ సేల్"ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ "ఫ్లాష్ సేల్"లో భాగంగా 400 జీబీ హైస్పీడ్ 4జీ డేటాను రూ.400లకే అందిస్తోంది. అంటే ఒక జీబీకి ఒక రూపాయి మాత్రమే అన్నమాట. దీనికి 40 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ.400 ప్రత్యేక డేటా రీఛార్జ్ ప్యాక్ జూన్ 28 నుంచి అందుబాటులోకి వచ్చింది. జూలై 1 వరకు కొనసాగుతుంది. ఇది డేటా రీచార్జ్ కాబట్టి యూజర్లు ఇప్పటికే ఉన్న ప్లాన్‌తో కలిపి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. కేవలం 400 జీబీ డేటా మాత్రమే లభిస్తుందని, 400 జీబీ తర్వాత స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గుతుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.BSNL celebrates the milestone of 90,000 towers with a limited-time Flash Sale.Get 400GB for just ₹400, with 40 days validity.Tomorrow is the last day to benefit from this offer.Experience trusted, nationwide connectivity with BSNL.Recharge Now - https://t.co/yDeFrwK5vt… pic.twitter.com/lz7Kv4iKlm— BSNL India (@BSNLCorporate) June 30, 2025